రోజూ హాయిగా బాక్స్ పెడితే మధ్యాహ్నము ఆఫీసుకెళ్ళి బాక్స్ తీసేదాకా అందులో ఏముందో తెలిసేది కాదు. రోజుకొక వంటకంతో ఫుల్లుగా లాగించేసి మీటింగులు గట్రా వుంటే కాసేపు కునుకు కూడా తీసేవాడిని. కానీ ఈ మధ్య హోం మినిష్టర్ గారూ ఏదో పనుల్లో పడటం వల్ల ప్రొద్దున్నే బాక్స్ లో ఏదో కుక్కేస్తుంటే నేనేమో పొట్టలో కుక్కేసేవాడిని
ఉదాహరణకు
చపాతి
పూరి
పాస్టా
ఇడ్లీ
ఏదో ఇలాంటివయితే లొట్టలేసుకుంటూ తినేసి " అసలు రుచి పచి లేకుండా ఏంటా చెయ్యడమని " కాసింత బెట్టుకూడా చూపించొచ్చు
కానీ ఈ రోజు నాకు ఏదైతే నచ్చదో అదే బాక్సులో పెట్టింది. అదేనండీ గోధుమరవ్వ ఉప్మా ! .. బాక్స్ లో ఉన్నది ఉప్మా అని తెలియగానే చెత్తకుండీలో వేసి చెయ్యి కడిగేసుకొని హాయిగా హోటల్ కెళ్ళి ఫుల్లుగా లాగించేసా.
అన్నట్టు చాలా మంది ఋషులకున్నట్టు ఈ ఉప్మా కొక పూర్వాశ్రమ చరిత్ర కూడా వుందట కానీ అసలు నాకు నచ్చని ఒకే ఒక టిపినీ ఉప్మా అయ్యాక ఇక మళ్ళీ చరిత్ర అవసరమా?
28, ఫిబ్రవరి 2012, మంగళవారం
22, ఫిబ్రవరి 2012, బుధవారం
విరితేనియ జడివానలో....శాంతి విహంగమై
విరితేనియ జడివానలో
ఎదనిండుగ తడవాలని
శాంతి రాగ పరిమళాలు
వెల్లువలై సాగాలని
బాధల గాధల ఎదలో
మధుర తాకిడవ్వాలని
ఎదబరువే తరగాలని
పల్లవించే విపంచికై
సంధ్యాగీతి పలుకై
మునుముందుకు సాగ
సుగుణాల పరిమళాలు
సమానతా సరాగాలు
గ్రామ-పల్లె-వాడల
శాంతి విహంగమై
నిరంతరం పైపైకి
Author : unknown
ఎదనిండుగ తడవాలని
శాంతి రాగ పరిమళాలు
వెల్లువలై సాగాలని
బాధల గాధల ఎదలో
మధుర తాకిడవ్వాలని
ఎదబరువే తరగాలని
పల్లవించే విపంచికై
సంధ్యాగీతి పలుకై
మునుముందుకు సాగ
సుగుణాల పరిమళాలు
సమానతా సరాగాలు
గ్రామ-పల్లె-వాడల
శాంతి విహంగమై
నిరంతరం పైపైకి
Author : unknown
21, ఫిబ్రవరి 2012, మంగళవారం
సరాగ శివోహం విడుదలయ్యింది.
ఈ శివరాత్రి కి హారం నుంచి "శివోహం" పత్ర్రిక శివరాత్రికి విడుదలయ్యింది. ఈ సంచికలో ఈ క్రింది వారి రచనలను చదువవచ్చు
1) కవి హృదయము - ములుమూడి ఆదిశేషాద్రి రెడ్డి
2) దురాశ - బాల కథ - విద్యార్థి
3) నే ప్రయోజకుడనౌతా!! - ఉమాభారతి కోసూరి
4) మహాభారత రచనా విధానము. ఆ ఇతిహాసాన్ని ఎవరెవరు రచించారు? - పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి
5) మానవత్వమా...నీవెక్కడ - కొంపెళ్ళ సరస్వతి
6) శివరాత్రి రహస్యము - భాస్కర రామిరెడ్డి
ఇక సరాగ ఉగాది రచనలకై రచయితనుండి రచనలను ఆహ్వానిస్తున్నది. మీ రచనలను patrika@haaram.com కు మైల్ చేయవచ్చు.
1) కవి హృదయము - ములుమూడి ఆదిశేషాద్రి రెడ్డి
2) దురాశ - బాల కథ - విద్యార్థి
3) నే ప్రయోజకుడనౌతా!! - ఉమాభారతి కోసూరి
4) మహాభారత రచనా విధానము. ఆ ఇతిహాసాన్ని ఎవరెవరు రచించారు? - పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి
5) మానవత్వమా...నీవెక్కడ - కొంపెళ్ళ సరస్వతి
6) శివరాత్రి రహస్యము - భాస్కర రామిరెడ్డి
ఇక సరాగ ఉగాది రచనలకై రచయితనుండి రచనలను ఆహ్వానిస్తున్నది. మీ రచనలను patrika@haaram.com కు మైల్ చేయవచ్చు.
14, ఫిబ్రవరి 2012, మంగళవారం
అరవిచ్చిన ప్రభాత వేళలో....చెలి వెచ్చని పలుకులు
అరవిచ్చిన ప్రభాత వేళలో
చెలి వెచ్చని పలుకులు
పరువాల పసిడి కొమ్మనోట
మురిపాల ముద్దు పలుకులు
పలుకుపలుకొక శిశిర గానం
నవవసంత రసరాగ మధురం
వెలుగునీడల జీవన వనవాసం
ప్రణయ కలహ సామ్రాజ్యం
కాంతిరేఖల పార్శ్వాన దాగిన
అజరామర ప్రేమ కవితా ఝరి
నీ భావజ్యోతిలోన కలసి
నే కరిగి చిరుదీపమవ్వనా?
మందస్మిత బృందావనిలో
హరిత రేణువునై నిను చేరనా?
ప్రియా
సుమరాగ రంజితా
సుమన: సుమనమా
దీప్తకిరణ మయూఖ
అభినందన మాలయిదే!
13, ఫిబ్రవరి 2012, సోమవారం
పురుషుని నెచటికి బోవంగనీయక....సీసము
పురుషుని నెచటికి బోవంగనీయక
వింతచేతల గురివేయవలయు
నవనవసురతతాండవసౌఖ్యవార్థిలో
ముంచి యింపుల బొదలించవలయు
గలసినయప్పుడు వలచినయట్లుండి
యెనసి వేడుక జిత్త మెఱుగవలయు
మందుమంత్రంబులు మాయలు ప్రతివన్ని
తెగువమై నవలీల దిరుగవలయు
గలసినప్పుడు చనవిచ్చి కలయవలయు
పాయునప్పుడు నిచ్చయు సేయవలయు
నయము బ్రియము దప్పకనడవవలయు
నమ్మికలుగాగ దగవులు నడపవలయు.
- శృంగార మల్హణ చరిత్ర
వింతచేతల గురివేయవలయు
నవనవసురతతాండవసౌఖ్యవార్థిలో
ముంచి యింపుల బొదలించవలయు
గలసినయప్పుడు వలచినయట్లుండి
యెనసి వేడుక జిత్త మెఱుగవలయు
మందుమంత్రంబులు మాయలు ప్రతివన్ని
తెగువమై నవలీల దిరుగవలయు
గలసినప్పుడు చనవిచ్చి కలయవలయు
పాయునప్పుడు నిచ్చయు సేయవలయు
నయము బ్రియము దప్పకనడవవలయు
నమ్మికలుగాగ దగవులు నడపవలయు.
- శృంగార మల్హణ చరిత్ర
11, ఫిబ్రవరి 2012, శనివారం
రెండు చాటు పద్యాలు
1) కూడు తలప జోళ్ళు కూరకారామళ్ళు
చెవులంత వ్రేలాళ్ళు చేలుమళ్ళు
దుత్తెడునాగళ్ళు దున్నపోతుల యేళ్ళు
కలవు మాపటివేళ గంజినీళ్ళు
మాటమాటకు మళ్ళు మరిదొంగదేవుళ్ళు
చేదైన పచ్చళ్ళు చెరకునీళ్ళు
వంట పిడ్కలదాళు వాడనీతుల నీళ్ళు
విన విరుద్ధపుబేళ్ళు వెడదనోళ్ళు
దళమయినట్టి కంబళ్ళ తలలు బోళ్ళు
పయిడికిని జూడ బియిడెత్తు ప్రత్తివిళ్ళు
చలముకొని వెదికినను లేవు చల్లనీళ్ళు
చూడ వలసెను ద్రావిళ్ళ కీడుమేళ్ళు.
2)
మీగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళు
తీరున మడి చీర దీర్చి కట్టి
బిగువు గుబ్బల మీద నిగనిగల్ధళుకొత్తు
నోర పయ్యెద కొంగు జారవైచి
వలపుల కొకవింత గలుగగా గొప్పవౌ
కురులు నున్నగ దువ్వు కొప్పు వెట్టి
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
తిదుచూర్ణమా మీద దీర్పు జేసి
ఓరచూపుల విటులదా నూరడించి
గిల్‌కు మెట్టెల రవరవల్ గుల్కరింప
జికిలి చేసిన తామ్రంపు చెంబుబూని
వీధినేతెంచె సాతాని వేడ్కలాడి
చెవులంత వ్రేలాళ్ళు చేలుమళ్ళు
దుత్తెడునాగళ్ళు దున్నపోతుల యేళ్ళు
కలవు మాపటివేళ గంజినీళ్ళు
మాటమాటకు మళ్ళు మరిదొంగదేవుళ్ళు
చేదైన పచ్చళ్ళు చెరకునీళ్ళు
వంట పిడ్కలదాళు వాడనీతుల నీళ్ళు
విన విరుద్ధపుబేళ్ళు వెడదనోళ్ళు
దళమయినట్టి కంబళ్ళ తలలు బోళ్ళు
పయిడికిని జూడ బియిడెత్తు ప్రత్తివిళ్ళు
చలముకొని వెదికినను లేవు చల్లనీళ్ళు
చూడ వలసెను ద్రావిళ్ళ కీడుమేళ్ళు.
2)
మీగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళు
తీరున మడి చీర దీర్చి కట్టి
బిగువు గుబ్బల మీద నిగనిగల్ధళుకొత్తు
నోర పయ్యెద కొంగు జారవైచి
వలపుల కొకవింత గలుగగా గొప్పవౌ
కురులు నున్నగ దువ్వు కొప్పు వెట్టి
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
తిదుచూర్ణమా మీద దీర్పు జేసి
ఓరచూపుల విటులదా నూరడించి
గిల్‌కు మెట్టెల రవరవల్ గుల్కరింప
జికిలి చేసిన తామ్రంపు చెంబుబూని
వీధినేతెంచె సాతాని వేడ్కలాడి