6, నవంబర్ 2013, బుధవారం

ఉన్నదీ పోయె, ఉంచుకున్నదీ పోయే అంటే ఇదేనేమో ...




హతవిధీ... ఫేసుబుక్ ఎకౌంట్ ప్రొఫైల్ ను హారం తెలుగు నుంచి హారం గా మార్చ్హలని ఉన్నదాన్ని అటకా ఎక్కించాను. ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రెండూ ఫిల్ చెయ్యాలంటా. అప్పుడేమో అది హారం హారం అని కనిపిస్తుంది. పోనీలే అని సర్దుకుందామంటే ఇది వేరే ఎవరో తీసేసుకున్నారు. మళ్ళీ పాతదే దిక్కు.


ఐనా ఈ మధ్య ఇంకేం పనులు లేనట్టు, కొత్త బిచ్చగడు పొద్దెరడగన్నట్టు పోలో మని ఫేస్ బుక్ మీద గడిపేస్తున్నా కదా. పైసా ఆదాయం లేదు దమ్మిడీ పనిలేదన్నట్టుంది ఈ ఫేసుబుక్. ఐనా ఎక్కడి అనుభవాలు అక్కడివే. అదో తృప్తి :). Lot of pending work.



12, అక్టోబర్ 2013, శనివారం

ఫేస్ బుక్ మేలా బ్లాగు మేలా?


రెండూ రెండు వ్యతిరేక దిక్కులు. దేనికదే. కానీ బ్లాగులకు అంత త్వరగా ఆకర్షితులు కారు కానీ ఒకసారి ఫేసు బుక్కు అలావాటైందంటే దానిలోనుండి బయటపడటం కష్టమేమో. 

బ్లాగుల్లో కొద్దో గొప్పో ఆలోచించి తమ భావాలన్నింటిని ఒక వ్యాసంగా వ్రాసేవాళ్ళే ఎక్కువ. అదే ఫేసు బుక్కు లో ఏక్షణం ఆక్షణమే. ఇప్పుడు వ్రాసింది మరో నిమిషంలో పాతబడిపోతుంది. కానీ బ్లాగుల్లో వ్రాసే వ్యాసాలకు సాధారణంగా జీవితకాలం చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి. 

ఇదిగో ఈ మధ్యకాలంలో ఫేసుబుక్ వాడి తెలుగు టైపు చేయాలంటే టచ్ కూడా పోయినట్టుంది. 

ఫేస్ బుక్ ప్రచారానికి బాగా పనికి వస్తుంది. బ్లాగు మన సొంతం.అంటే మన జీవన పరిణామక్రమంలో మన ఆలోచనల డైరీ ఈ బ్లాగు. 

ఫేసుబుక్ లో ఫేకులెక్కువ. బ్లాగుల్లో కొద్దో గొప్పో ఫేకులకంటే ఫేసులకు, వారి వారి రచనలకు విలువ.

ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ యుర్ మైండ్ అంటారు కానీ ఫేసుబుక్ లో మైండ్ తక్కువ ఇండెక్స్ ఎక్కువ :-)

సాధారణంగా ఫేసు బుక్ చూస్తూ 24X7 లో గడిపేస్తుంటాము. బ్లాగులు చదువుతూ మనమేమి వ్రాయాలా అని 24X7 గడిపేస్తుంటాము. బహుశా వీటిరెండింటికీ పెద్ద తేడా ఇదేనేమో!

9, సెప్టెంబర్ 2013, సోమవారం

ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళ తరువాత డాష్ డాష్ ఐపోవడానికి సిద్ధంగా వుంది.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ తీసుకోకపోయినా డాష్ డాష్ ఐపోవడానికి సిద్ధంగా వుంది. రాజకీయ చైతన్యంలేని ప్రజలూ, మాయమాటలతో మభ్యపెట్టే పార్టీలూ, దేశ సమగ్రత పై కానీ, స్వేచ్ఛా స్వాతంత్ర్యా ల పై ఏమాత్రమూ అవగాహన లేని రాజకీయనాయకులూ, స్వప్రయోజనాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏమిటో తెలియని నేతలూ, వారి వంది మాధిగలూ రాజదర్పంతో  పదవులను అనుభవించడం తప్ప కనీసం వారి బాధ్యతలు కూడా తెలియని సామంత రాజులూ ఐకమత్యంగా ఆంధ్రప్రదేశ్ ను కుడిపించేసారు.

పోయిన సారి ఇండియా వెళ్ళినప్పుడు మరో విషయాన్ని కూడా గమనించాను. పొరపాటున ఎవరైనా ఏదైనా సహాయం చేయడానికి సోంత డబ్బుతో చేతి చమురు వదిలించుకుంటున్నాడనుకోండి, ప్రక్కన ఓ నలుగురు వీడిపై ఓకన్నేసి వుంచుతారన్నమాట. వీడికి దీనివల్ల ఎలాంటి లాభం లేకుండా ఈ మంచి పనులు ఎందుకు చేస్తున్నాడని!!!.అలావున్నాయి ఈ నాటి ఆంధ్రప్రదేశ్  సగటు ప్రజల మనస్తత్వాలు.

మన తెలుగువారికి వాడూ వీడూ అని లేకుండా ఓ దుర్గుణం కూడా వుందండోయ్.... అదేంటంటే నేను **** బీప్*** ఐపోయినా పర్లేదు కానీ నా ప్రక్కనోడు మాత్రం నాకంటే గొప్పవాడవడానికి వీల్లేదు. వాడు కష్టపడి ఎలాగో ప్రయత్నించినా నేను మాత్రం నా శాయశక్తులా ప్రయత్నించి వాడు మట్టికొట్టుకు పోయేదాకా నిద్రపోను. అవసరమైతే పరాయివాడి సహాయాన్నైనా తీసుకొని వాడిని దరిద్రుడిని చేసేదాకా నిద్రపోను. మన తెలుగువారికి మన సామాజిక బాధ్యతకంటే మన స్వప్రయోజనాలే ముఖ్యం. 


మన దేశంలో ఏనాడైతే ఓ అభ్యర్థి వారి నాయకుల భజనలు మాని, కేవలం తాను చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ అభివృద్ధిద్వారా తనకాళ్ళపై తాను నిలబడి గెలవగలడో ఆరోజే నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లు. ఆ రోజే ఒక ఎం.యల్.ఏ గా ముఖ్యమంత్రి ముందు గానీ ప్రధాన మంత్రి ముందుగానీ, రాజ్యాంగేతర నేతల ముందు కానీ తల ఎత్తుకొని మాట్లాడగలడు. అవసరమైతే ఈనాడు తీసుకొన్న నిర్ణయాలవంటివి తీసుకున్నప్పుడు తనకున్న సవాలక్ష వెంట్రుకల్లో ఓ వెంట్రుకను పీకి మొఖాన కొట్టి రాగల ధైర్యమూ వుంటుంది. అంత వరకూ ఒంగి ఒంగి నమస్కారాలు చేయక తప్పదు.

 ఈనాడు ప్రజల్లో మొదలైన ఈ అలజడి అలాంటి చైతన్యానికి దారితీస్తుందేమో చూడాలి!!!

6, ఆగస్టు 2013, మంగళవారం

మా దేశం మాకు కావాల్సిందే...... ఉద్యమబాట !!!

మా కల్చర్ వేరు. మా రంగు వేరు. మా నామధేయాలు వేరు. మా భాషవేరు. మేము మాట్లాడేభాషంటే కొన్ని ప్రాంతాల వారికి చాలా వెటకారంగా వుంటుంది.

స్వాతంత్ర్యం వచ్చిన నాటినప్పటినుండి ఈ నాటి వరకు భారతదేశ ప్రధానులుగా పనిచేసిన వాళ్ళలో ఎంతమంది దక్షిణభారతీయులున్నారు? ఎంతమంది పశ్చిమ భారతీయులున్నారు? ఎంతమంది తూర్పుభారతీయులున్నారు? వీళ్ళ వీళ్ళ జీవనవిధానం వేరు, పండుగలు వేరు, తలసరి ఆదాయం వేరు, ఇంకా చాలా చాలా వేరు.

ఒకప్రాతం అభివృద్ధి జరిగినట్లుగా మరోప్రాతం అభివృద్ధి జరుగలేదు. ఒక ప్రాంతానికి కేటాయించిన నిధులతోపోలిస్తే మరోప్రాంతానికి కేటాయించే నిధులను అసలు పోల్చలేము. కేంద్రము ఇలా ఒక ప్రాంతంపై తల్లిప్రేమనూ, మరోప్రాంతంపై సవతిప్రేమనూ చూపిస్తుంటే మేము ఎన్నిరోజులు ఇలా కలిసి వుండాలి? మా ప్రాంతాలు మీలా సమానంగా అభివృద్ధి జరగాలంటే మీనుంచి మేము విడిపోవాలనుకుంటున్నాము కాబట్టి భారతదేశాన్ని ఉత్తర,దక్షిణ,పశ్చిమ,తూర్పు దేశాలుగా విభజించాలని, దీనివల్ల అన్ని దేశాలు బాగా అభివృద్ధి చెందుతాయనీ, మా నిధి నిక్షేపాలనూ మేమే వాడుకోవటానికి అవకాశం వుంటుందనీ, ఒక ప్రధాని కి బదులు నలుగురు ప్రధానులు, అలాగే లెక్కలేనన్ని మంత్రిపదవులతో దేశంలో పూర్తిగా రాజకీయ నిరుద్యోగం తగ్గి అన్ని ప్రాంతపు దేశాలు సర్వతోముఖాభివృద్ధిని సాధించగలవనీ మీరు గుర్తెరిగి మీమీ ప్రాంతపు దేశాలకై ఉద్యమబాటను పట్టినట్లైతే ఎలా వుంటుందో ఆలోచించ వలసినదిగా ఓ సగటు భారతీయుని ఆలోచన !!!!

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఇంతకీ తెలుగుదేశం పార్టీ దేన్ని సమర్ధిస్తున్నట్లు?

ఇంతకీ తెలుగుదేశం పార్టీ దేన్ని సమర్ధిస్తున్నట్లు? తెలంగాణానా లేక ఆంధ్రప్రదేశ్ నా ? కొంతమంది MP లు రాష్ట్రం కలిసి వుండాలని రాజీనామాలు చేస్తారు. కొంతమంది తెలంగాణా కు మద్దత్తు ప్రకటిస్తారు. అసలు నాయకుడు అసలు మాట్లాడడు. ఎవరి పార్టీ వాళ్ళకు ముఖ్యం కాబట్టి ఇప్పుడు పార్టీ లు రెండు వర్గాలను సృశ్టించి కొంతమంది సమైక్యంగా వుండటానికి మద్దత్తిస్తే మరికొంతమంది తెలంగాణా కు మద్దత్తు ఇస్తారు కాబట్టి రెండు ప్రాంతాల్లో తమ పార్టీ మనుగడకు ఎలాంటి ఇబ్బందులుండవ ని కోడి లెక్కలు వేసుకోవచ్చు. దీనిలో భాగమే ఇప్పుడు జరుగుతున్న రాజీనామాలు. కేవలం రాజీనామాలైతే పరవాలేదు, దానికి విరుద్ధంగా మళ్ళీ తెలంగాణా కు సపోర్టు. 
ఇది రెండు పడవలపై ప్రయాణం లాంటిది. కాబట్టి మునిగిపోక తప్పదు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే అటు తెలంగాణాలో ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లో పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనిపిస్తుంది.

వైయస్సార్ పార్టీ, వీరి MLA లు అందరూ రాజీనామాలు సమర్పించినా పార్టీ పరంగా మాత్రం స్పష్టంగా మేము ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడానికి వ్యతిరేకమని చెప్పలేకపోతున్నారు. ఇలా ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ఈ పార్టీకి రెండు ప్రాంతాల్లో మనుగడ వుంటుంది. కారణం తెలంగాణాలో  కూడా సమైక్య వాదులు కనీసం 30-40 శాతం వుంటారు.

రాష్ట్రం ఎందుకు సమైక్యంగా వుండాలి? ఇది చాలా చిన్న ప్రశ్నైనా సమాధానం చెప్పాలంటే కనీసం మూడు నాలుగు పేజీలైనా రాయాలికాబట్టి మరోసారి చూద్దాం.

26, జులై 2013, శుక్రవారం

ఫేసు బుక్కు తో విడాకులకు ఫైలు చేస్తున్నా :-) వామ్మో ఫేసు బుక్కు - 2

ఫేసు బుక్కు వాడికి నా ఫ్రెండ్స్ లిస్టు చూసి కన్ను కుట్టింది. అప్పుడేమో మరీ ఇంత స్పీడు పనికిరాదు బాబూ అంటే సరేనని ఏదో ఒకటి అర Friends Request పంపుతున్నానా!! తీరా ఈ రోజు ఒక రెండు రోజులదాకా అసలు నువ్వు Requests పంపడానికి వీల్లేదని హుకుంజారీ చేశాడు. సరే ఇంక చేసేపనేముందిగనక మళ్ళీ బ్లాగుల్లోకొచ్చి ఇలా టపా వ్రాసుకుంటున్నాను.

ఫేసుబుక్ ఎకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసానో గుర్తులేదు.అలాగే ఈ ఫేసుబుక్ కి నేను కనీసం మామూలు పంకాను కూడా కాదు. దానికి తోడు మన బ్లాగర్లలో బహుశా ఎవరైనా ఫేసుబుక్ లో పనిచేసేవాళ్ళున్నారేమో, గత నెల వరకూ అప్పుడప్పుడు నా అకౌంట్ నూ వాడేసి కొన్నట్లున్నారు. ఐనా దేనికి security వుంది కనుక. మొన్నటికి మొన్న Apple  సంస్థ గంపగుత్తగా వారి దగ్గర నమోదు చేసుకున్న credit cards లను సైతం ఎవరికో దాసోహం చేసేసింది. ఇక ఫేసు బుక్కు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం పెట్టుకున్న Privacy settings వాటంతట అవే మాయమైపోతుంటాయి. మాయమైపోవడానికి Software లోపమైనా కావచ్చు లేదా అక్కడ పనిచేసేవారి నిర్వాకమైనా కావచ్చు లేదా అకౌంట్ లోకి వేరే ఎవరైనా చొరబడి కూడా వీటిని మార్చ వచ్చు.

సరే  గత పది రోజులగా haaram ను కొద్దిగా market చేసుకుందామని ఫేసుబుక్కులోకి లాగిన్ అయి రాచకార్యాలను చక్కపెట్టెడం మొదలు పెట్టాను. ఈ పదిరోజుల్లో నేను గమనించిన విషయాలు ఇక్కడ కొన్నింటిని మాత్రమే వ్రాస్తాను.ఈ ఫేసుబుక్కులో నాకు నచ్చిన వ్యాసాలు ఏ ఒక్కశాతమో కనిపించాయి. తాను మెచ్చిందే రంభ అన్నట్లు, నచ్చడమనేది ఆ సమయంలో వారి వారి మానసిక స్థితి బట్టి వుంటుంది కాబట్టి ఎవరిష్టం వారిదనుకోండి. ఇంతకీ మీరు నచ్చే వ్యాసాలు వ్రాశారా అని నన్ను నిలదీయకండి. అక్కడ నా ఏకైక ఎజెండా ప్రచారమే. ఐతే ఈ ఫేసుబుక్కు నిండా నాలాంటి ప్రచారగాళ్ళే అని తెలిసి ఔరా అని ముక్కుమీద వేలేసి గోక్కున్నా :-). ఏదైతేనేమీ ఏ విషయాన్నైనా వేలమందికి క్షణాల్లో చేరేవేసే సాధనం ఈ ఫేసు బుక్కు.

ఇక అక్కడ ఛాట్స్ చూస్తే భలే భలే అనిపిస్తుంది :-)

వున్నట్లుండి "Hi" అని మెసేజ్ వస్తుంది. తిరిగి "Hello" అంటే రిప్లై వుండదు. మరికొంతమందేమో కాసేపు మాట్లాడి ఈ పప్పుసుద్దగాడితో లాభంలేదనుకొని మాయమైపోయే రకాలు. ఇంకొంతమందేమో మరో టైపు... ఐనా ఇలా టై వేస్టు చేసుకొనే బదులు కావాలంటే నేరుగా పార్కులకెళ్ళాలి గానీ ఇలా ఫేసుబుక్కు ల్లో పగలూ రాత్రులు ఒకర్నొకరు గీక్కుంటే ఏమొస్తుంది చెప్పండి :-). అయ్యా/అమ్మా ఇక్కడెవర్నీ విమర్శించడంలేదు...కాకపోతే ఇలా గోక్కోడం బదులు మీకు తెలిసిన వాళ్ళతో ఈ మాత్రం ప్రేమ ఒలకపోస్తే workout అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నానంతే :))

కారు నలుపుపైన గలిగెప్రేమ - సమస్యా పూరణ కు నా పూరణ :-)



24, జులై 2013, బుధవారం

గుర్తు కోసం మరో టపా.... ఈ సారి యం.ఎల్.ఎ ఎలక్షన్లు జరిగినప్పుడు దీనిపై వ్యాసం వ్రాసుకోవచ్చు.


పంచాయితీ ఎలక్షన్లపై వార్తాపత్రికల కథనాలు ఇవి. పంచాయితీ ఎలక్షన్లు జరిగినప్పుడు పార్టీల గుర్తులపై పోటీ చేయరు కానీ అప్పటికే పల్లెటూర్లలో వుండే గ్రూపుల మూలంగా అధికారికంగా పార్టీలు పోటీ చేయకున్నా అంతర్గతంగా ఓట్లు మాత్రం ఆయా గ్రూపు రాజకీయాలను బట్టే వేస్తారు. యం.ఎల్ ఏ. ఎన్నికల్లోనైతే వేరే ఊళ్ళలో వున్న ఓటర్లను పెద్దగా పట్టించుకోరు కానీ పంచాయితీలల్లో మాత్రం వాళ్ళ చార్జీలకు సైతం డబ్బులు ఇచ్చి పిలిపించి మరీ ఓట్లు వేయిస్తారు కాబట్టి ఈ ఎలక్షన్లు రాబోయే ఎన్నికల ముఖచిత్రం ఎలా వుండబోతుందో ప్రతిబింబిస్తుంది.


ఈనాడు పత్రిక కథనం 




ఆంధ్రజ్యోతి పత్రిక కథనం



సాక్షి పత్రిక కథనం


22, జులై 2013, సోమవారం

యం.బి.బి.యస్......సీటు చాలా సులువు గురూ....

ఈ రోజు సాక్షి నుంచి ఈ వ్యాసం...

 మెడికల్ కాలేజీల కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: ప్రతిభను బట్టే సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎలాంటి మార్గదర్శకాలు విధించినా.. ఆ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తూ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే పన్నాగాలు మెడికల్ కాలేజీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను పాటిస్తున్నట్లు నటిస్తూ దర్జాగా కోట్లు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ ఉండి డబ్బులు లేని విద్యార్థులు ఎప్పటిలాగానే అన్యాయమైపోతున్నారు. యాజమాన్య కోటా సీట్లను ప్రతిభను బట్టే కేటాయించాలంటూ ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను ఉల్లంఘించటానికి ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు సరికొత్త దొంగదారి కనిపెట్టాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం వైద్య విద్య కోసం అర్హత ఉండి, ఎంతైనా ఖర్చు పెట్టగలవారితో పాటు.. అసలు ఆ సీట్లలో చేరటానికి అర్హత లేనివారికి గాలం వేసి ఇద్దరితోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారితో పాటు, అర్హతలేని డమ్మీ అభ్యర్థులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఇంకేముంది.. ఆ జాబితాలో భారీగా సొమ్ము చెల్లించిన అభ్యర్థులే మెరిట్ అభ్యర్థులుగా అధికారికంగా నిర్ణయించి వారికి సీట్లు కేటాయిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు ఇచ్చామంటూ ఆ దరఖాస్తుల జాబితాను చూపిస్తున్నాయి. ఈ రెండు రకాల విద్యార్థులను సమీకరించటానికి ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థిని తీసుకొచ్చినందుకు సదరు దళారీకి రూ. 10 వేల వరకూ ముట్టజెపుతున్నాయి.

పేరుకే నిబంధనల అమలు...
రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించటంతో పాటు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రావాలి. కన్వీనర్ కోటాలో సీటు సంపాదించలేని విద్యార్థులు.. వారి ఆర్థిక స్తోమతును బట్టి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.

చాలా ఏళ్లుగా వైద్య విద్య కళాశాలలకు ఈ కోటా కిందే భారీగా సొమ్ము లభిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు విధించింది. దాంతోపాటు ఈ సీట్ల భర్తీని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని హైకోర్టు సైతం ఆదేశించింది. వీటన్నిటికీ విరుగుడు మంత్రంగా ప్రైవేటు కళాశాలలు దళారీల సాయంతో డమ్మీ అభ్యర్థులతో కనికట్టు చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నాయి.

‘మెరిట్’నూ సృష్టించటమే...
మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాలనే నిబంధనలను ఉల్లంఘించేందుకు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఓ వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. ప్రతిభ కలిగిన సాధారణ విద్యార్థులకు దరఖాస్తులు ఇవ్వరు. దళారుల సహాయంతో.. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో 50 వేలలోపు ర్యాంకు సాధించి.. కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చే అభ్యర్థులతో మొదట బేరం కుదుర్చుకుంటారు. వారితో మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాలో వారికన్నా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన, అర్హతలేని అభ్యర్థుల కోసం దళారులు వేట మొదలెడతారు. ఇంటర్‌లో నామమాత్రపు మార్కులొచ్చి, ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవటం వల్లో, ఎంబీబీఎస్‌పై అనాసక్తి వల్లో సాధారణ డిగ్రీలో చేరిన విద్యార్థులకు గాలం వేస్తారు. గత ఏడాది డిగ్రీలో చేరి ఈ ఏడాది ఎంసెట్ రాసిన వారినీ కలుస్తారు.

వారికి రెండు మూడు వేలు ఇస్తామంటూ ఆశ చూపి.. సదరు వైద్య విద్య కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేయిస్తారు. చివరగా కాలేజీల యాజమాన్యాలు డబ్బిచ్చిన విద్యార్థులు, అర్హత లేని విద్యార్థులతో ఒకే జాబితా రూపొందిస్తాయి. పకడ్బందీగా రూపొందించిన ఈ జాబితాను ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. ఇంకేముంది కళాశాలకు వచ్చిన దరఖాస్తులు, భర్తీ ప్రక్రియ అన్నీ ‘నిబంధనల ప్రకారం’ ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ వైద్య విద్య కళాశాలలకు విద్యార్థులను సమీకరించే దళారులకు.. ఒక్కో అభ్యర్థిని తీసుకువచ్చినందుకు రూ. 10 వేల వరకూ ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలివీ...
- యాజమాన్య కోటా సీట్ల భర్తీ 2004 జూలై 23న ఇచ్చిన జీవో 217 ప్రకారం జరగాలి.
- జీవో ప్రకారం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పాసవటంతో పాటు ఎంసెట్‌లో అర్హత సాధించాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.
- ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించాలి.
- ప్రతి కళాశాల భర్తీ ప్రక్రియకు ముందే ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి.
- అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు మెరిట్ ప్రకారం జాబితా తయారు చేయాలి.
- నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ వరకూ నిర్ణయించిన తేదీలోగా పూర్తి కావాలి.
- అడ్మిషన్ల ప్రక్రియ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రభుత్వానికి, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవ్వాలి.
- ఈ జాబితా పరిశీలన అనంతరం యూనివర్సిటీ అనుమతి ఇచ్చిన తర్వాతే భర్తీ జరగాలి.

ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాలు
మొత్తం ప్రైవేటు వైద్య కళాశాలలు 28
ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,400
యాజమాన్య కోటా సీట్లు 850
ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లు 510

- మెడికల్ కాలేజీల కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: ప్రతిభను బట్టే సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎలాంటి మార్గదర్శకాలు విధించినా.. ఆ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తూ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే పన్నాగాలు మెడికల్ కాలేజీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను పాటిస్తున్నట్లు నటిస్తూ దర్జాగా కోట్లు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ ఉండి డబ్బులు లేని విద్యార్థులు ఎప్పటిలాగానే అన్యాయమైపోతున్నారు. యాజమాన్య కోటా సీట్లను ప్రతిభను బట్టే కేటాయించాలంటూ ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను ఉల్లంఘించటానికి ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు సరికొత్త దొంగదారి కనిపెట్టాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం వైద్య విద్య కోసం అర్హత ఉండి, ఎంతైనా ఖర్చు పెట్టగలవారితో పాటు.. అసలు ఆ సీట్లలో చేరటానికి అర్హత లేనివారికి గాలం వేసి ఇద్దరితోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారితో పాటు, అర్హతలేని డమ్మీ అభ్యర్థులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఇంకేముంది.. ఆ జాబితాలో భారీగా సొమ్ము చెల్లించిన అభ్యర్థులే మెరిట్ అభ్యర్థులుగా అధికారికంగా నిర్ణయించి వారికి సీట్లు కేటాయిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు ఇచ్చామంటూ ఆ దరఖాస్తుల జాబితాను చూపిస్తున్నాయి. ఈ రెండు రకాల విద్యార్థులను సమీకరించటానికి ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థిని తీసుకొచ్చినందుకు సదరు దళారీకి రూ. 10 వేల వరకూ ముట్టజెపుతున్నాయి.

పేరుకే నిబంధనల అమలు...
రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించటంతో పాటు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రావాలి. కన్వీనర్ కోటాలో సీటు సంపాదించలేని విద్యార్థులు.. వారి ఆర్థిక స్తోమతును బట్టి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.

చాలా ఏళ్లుగా వైద్య విద్య కళాశాలలకు ఈ కోటా కిందే భారీగా సొమ్ము లభిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు విధించింది. దాంతోపాటు ఈ సీట్ల భర్తీని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని హైకోర్టు సైతం ఆదేశించింది. వీటన్నిటికీ విరుగుడు మంత్రంగా ప్రైవేటు కళాశాలలు దళారీల సాయంతో డమ్మీ అభ్యర్థులతో కనికట్టు చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నాయి.

‘మెరిట్’నూ సృష్టించటమే...
మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాలనే నిబంధనలను ఉల్లంఘించేందుకు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఓ వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. ప్రతిభ కలిగిన సాధారణ విద్యార్థులకు దరఖాస్తులు ఇవ్వరు. దళారుల సహాయంతో.. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో 50 వేలలోపు ర్యాంకు సాధించి.. కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చే అభ్యర్థులతో మొదట బేరం కుదుర్చుకుంటారు. వారితో మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాలో వారికన్నా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన, అర్హతలేని అభ్యర్థుల కోసం దళారులు వేట మొదలెడతారు. ఇంటర్‌లో నామమాత్రపు మార్కులొచ్చి, ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవటం వల్లో, ఎంబీబీఎస్‌పై అనాసక్తి వల్లో సాధారణ డిగ్రీలో చేరిన విద్యార్థులకు గాలం వేస్తారు. గత ఏడాది డిగ్రీలో చేరి ఈ ఏడాది ఎంసెట్ రాసిన వారినీ కలుస్తారు.

వారికి రెండు మూడు వేలు ఇస్తామంటూ ఆశ చూపి.. సదరు వైద్య విద్య కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేయిస్తారు. చివరగా కాలేజీల యాజమాన్యాలు డబ్బిచ్చిన విద్యార్థులు, అర్హత లేని విద్యార్థులతో ఒకే జాబితా రూపొందిస్తాయి. పకడ్బందీగా రూపొందించిన ఈ జాబితాను ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. ఇంకేముంది కళాశాలకు వచ్చిన దరఖాస్తులు, భర్తీ ప్రక్రియ అన్నీ ‘నిబంధనల ప్రకారం’ ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ వైద్య విద్య కళాశాలలకు విద్యార్థులను సమీకరించే దళారులకు.. ఒక్కో అభ్యర్థిని తీసుకువచ్చినందుకు రూ. 10 వేల వరకూ ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలివీ...
- యాజమాన్య కోటా సీట్ల భర్తీ 2004 జూలై 23న ఇచ్చిన జీవో 217 ప్రకారం జరగాలి.
- జీవో ప్రకారం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పాసవటంతో పాటు ఎంసెట్‌లో అర్హత సాధించాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.
- ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించాలి.
- ప్రతి కళాశాల భర్తీ ప్రక్రియకు ముందే ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి.
- అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు మెరిట్ ప్రకారం జాబితా తయారు చేయాలి.
- నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ వరకూ నిర్ణయించిన తేదీలోగా పూర్తి కావాలి.
- అడ్మిషన్ల ప్రక్రియ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రభుత్వానికి, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవ్వాలి.
- ఈ జాబితా పరిశీలన అనంతరం యూనివర్సిటీ అనుమతి ఇచ్చిన తర్వాతే భర్తీ జరగాలి.

ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాలు
మొత్తం ప్రైవేటు వైద్య కళాశాలలు 28
ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,400
యాజమాన్య కోటా సీట్లు 850
ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లు 510 - See more at: http://sakshi.com/Main/Fullstory.aspx?catid=639410&Categoryid=1&subcatid=33#sthash.bBSYWx8Q.dpuf

19, జులై 2013, శుక్రవారం

యాదృచ్చికమా లేదా పూర్తిగా మూఢనమ్మకమా.... only god knows about it...

 ఒక చిన్న ఖద్దరు సంచీలో పుస్తకాలను, మూడరల టిపిన్ కేరేజీలో సంగటి, పెరుగు, పచ్చడి కుక్కి ఎడమభుజానికి సంచీ, కుడి చేతీలో కేరేజీ పట్టుకోని ఒకటిన్నర మైలు నడిచినాక సవాసగాళ్ళమందరమూ వాగొడ్డున కూర్చోని తెచ్చుకున్న సంగటిలో సగం లాగించేసి  అరిగేదాకా నాటకాల్లో పద్యాలను దీర్ఘాలను తీస్తూ మిగిలిన సగ దూరాన్ని  నడిచేసి  హైస్కూల్  చేరేవాళ్ళము. ఇలా ఆటపాటలతో కాలం దొర్లిపోతుండగా నేను పదో తరగతి కొచ్చాను. ఇప్పటిపిల్లలకు పదో తరగతంటే పెద్దలేకలేదోమో కానీ మారోజుల్లో మా ఊర్లలో పదోతరగతి పాసయ్యాడంటే వాడు పెద్దహీరో. ఆ హీరోకి వచ్చే గుర్తింపు ముందు ఏ సినిమా హీరోకూడా పనికిరాడు మరి.  అదిగో అలాంటి పదోతరగతిని నేనూ చదవాల్సి వచ్చింది.

ఆటపాటలతోనడిచిన బాల్యాం.ఒక్కసారిగా హైస్కూల్ లో పదవతరగతి అనేటప్పటికి తెచ్చిపెట్టుకున్న పెద్దరికం. అలా పదవతరగతి వార్షిక పరిక్షలు మరో నెలన్నరలోపుకి వచ్చేసాయి. ఈత రాని వాడిని ఒక్కసారిగా నడి సముద్రంలోకి తీసుకువెళ్ళి నెట్టివేస్తే ఎలా వుంటుందో అలాగయ్యింది నా పరిస్థితి. దానికి తోడు పదవతరగతి పరీక్షలను మా బడ్లో వ్రాయటానికి వీల్లేదు. వెలిగండ్ల చెప్పుకోవడానికి మండల కేంద్రమే కానీ పరీక్షల నిర్వహణా సెంటర్ కాదు. ఊరి పొలిమేరల్లోనున్న పోలేరమ్మకు చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ మ్రొక్కు కున్నారు. ఏమని? తల్లీ మా స్కూల్ పిల్లలకు కనిగిరి గర్ల్స్ హైస్కూల్ సెంటర్ మాత్రం రాకుండా చూడమ్మా అని. అదేంటి ఆ మ్రొక్కు అని ఆశ్చర్యపోకండి. అప్పట్లో కనిగిరి  గర్ల్స్ హైస్కూల్ సెంటర్ అంటే ఆ తాలూకా మొత్తానికి ఒణుకు. కారణం చాలా స్ట్రిక్ట్ సెంటర్ అనీ, కాపీలు కొట్టడానికి అస్సలు వీలుకాదనీ, ఈ సెంటర్ లో పరీక్షలు వ్రాసిన వాళ్ళలో పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవాళ్ళు చాలా తక్కువనీ ... ఇలా చాలా చెడ్డ ( మంచి? ) పేరే వుంది. దానికి తగ్గట్టుగా అక్కడ పరీక్ష వ్రాసిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతమూ అలాగే వుండేది. అంటే వ్రాసిన వాళ్ళలో ఏ పది శాతమో పాస్ అయ్యేవాళ్ళు.

అదుగో అలాంటి పరిస్థితుల మధ్య చదవాల్సి వచ్చింది. ఇక్కడ కొద్దిగా సొంత డబ్బా.... నాకు కలల్లో అప్పుడప్పుడూ జరగబోయే విషయాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మీకు అతిశయోక్తిగానో లేక నమ్మశక్యంగానో లేకపోవచ్చు కానీ ఇది నిజం.  అందులో అతి ముఖ్యంగా ఏవైనా కొట్లాటలు, మృత్యువు లతోపాటు Question papers కూడా చాలా అస్పష్టంగా కనిపిస్తాయి. అవి ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు కానీ నాకు కలవొచ్చిన ఓ పది పది హేను రోజుల లోపు జరిగిపోతాయి. వాటిని ఆపే శక్తీ కానీ, నష్టం జరగకుండా తప్పించడంకానీ వీలుకాదు. అది ప్రకృతి ధర్మం. భగవంతుని శాసనం. చూస్తూ వుండిపోవాల్సిందే!!

అలా Girls high school లో పరీక్షను వ్రాసిన విద్యార్థులలో మా బడినుంచి నేనొక్కడిని పాస్ అయ్యాను. మా చెల్లిని పోగొట్టుకున్నాక ఇక మృత్యువు కలలోకి వచ్చిందంటే ఆరోజు నుంచి ఎవరి దగ్గరనుంచి ఫోను వస్తుందో నని ఎదురు చూడడం అలవాటయిపోయింది. ఇలాగే కొట్లాటల మూలంగా కొద్దిరోజులు కోర్టుల చుట్టూరూ తిరగడమూ అలవాటయిపోయింది.

అదిసరే నయ్యా ఇప్పుడు ఈ సుత్తి ఎందుకంటే .... వస్తున్నా వస్తున్నా .....

మొన్నకరోజు ఇలాగే ఒక Accident కలలోకి వచ్చింది. నిన్న నా కళ్ళముందే నట్ట నడిరోడ్డులో అమెరికాలో రోడ్డుకి కంకర వేసే లారీ బోల్తా కొట్టింది. అదృష్టము కొద్దీ ప్రక్క లేన్ లో ఏ కారూ లేదు కానీ వుండి వుంటే నుజ్జునుజ్జై పోయుండేది. ఆ లారి వెనుక ఒక కారు, ఆ కారు వెనుక నాకారు. లారీ డ్రైవర్ కు కాళ్ళు వత్తుకుపోయి బాగా దెబ్బలు తగిలాయి. బహుశా ఇది నాకొచ్చిన కల పరిణామమేమో అనుకొని నిన్నంతా అలా అలా ఆఫీస్ లో కాలం వెళ్ళబుచ్చి ఆ విషయాన్ని అక్కడతో వదిలేశాను...... కానీ ఇక్కడ నేనో విషయం మర్చి పోయాను...

ఈ రోజు ప్రొద్దునే ఆఫీసుకు బయలు దేరి కేరీ బ్యాగ్ ను కార్ లో పెడుతుంటే అకాలమైన తుమ్ములు వచ్చాయి. మనసులో కాసేపు ఆగి వెళదామనుకోని కూడా ఛ..ఇంతా చదువుకొని ఇలాంటి చచ్చు పుచ్చు మూఢనమ్మకాలను నమ్మడమేమిటిని కారు పార్కింగ్ లాట్ నుంచి బయటకు తీసి ఓ రెండొందల మీటర్లు పోనిచ్చానేమో.... ఉన్నట్లుండి  ధడ్ మన్న సౌండ్.... ఫలితం... ఇది....






అదృష్టం కొద్దీ ఎవ్వరికీ దెబ్బలు తగలలేదు. collision ఐన తరువాత  చైనీస్ లేడీ దిగి సారీ చెప్పి నాలుగు నెలల పాపను తీసుకొని ఇంటికెళ్ళిపోయింది. నేను విషయాన్ని నా ఆఫీసువారికి తెలియచేసి పోలీసులొచ్చేదాకా నేనూ ఆమె భర్తా కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళం చేరాము.

ఇంతకీ ఇందుకు ముందు పేరాలో "...... కానీ ఇక్కడ నేనో విషయం మర్చి పోయాను....." అని వ్రాశాను కదా!! ఆ మర్చిపోయింది ఏమిటంటే నాకొచ్చే కలల సన్నివేశాల్లో జరగబోయే వ్యక్తులు నేను కానీ నాకు తెలిసిన వ్యక్తులు కానీ   తప్పక అయి వుంటారు.... ఆ లారీ డ్రైవర్ నాకు తెలియదు. ఇంతటితో ఈ కల ప్రభావం ఐపోయినట్లేనా? ఏమో అది తెలిస్తే మనం మనుషులమెందుకవుతాము.... ఇలాంటివి నమ్మాలా లేదా యాదృచ్చికమనుకోవాలా???

16, జులై 2013, మంగళవారం

వామ్మో ఫేస్ బుక్.....( Face book )......

హారం యొక్క ఫేస్ బుక్ పేజి ని తెరిచి అర్థ సంవత్సరం దాటిన సందర్భంగా మొన్నొక రోజు login అయ్యాను. మరీ బొత్తిగా సోషల్ సెన్స్ లేదనుకుంటారని ఈ మధ్య గత రెండు రోజులుగా suggest చేసిన పేర్లన్నింటికీ Add friend requests పంపిస్తున్నా. అంతవరకూ బాగానే వుంది. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ నాకీ ఫేస్ బుక్ ని ఎలా వాడాలో తెలిసి చావడం లేదు. నేను add చేసిన ఫ్రెండ్స్ వే కాకుండా ఎవరెవరివో ఏమిటేమిటో అలా వచ్చేస్తున్నాయి. చదివేలోపే ఎక్కడో అడుక్కి వెళ్ళిపోయె. ఇంతా చేసినా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో దరిదాపు నాలుగొందల మంది మాత్రమే. 400 మంది ఫ్రెండ్సా అని అడక్కండి. ఇందులో నాకు ముఖపరిచయమున్న స్నేహితులు ఒక్కరు కూడా వుండి వుండరని నా గట్టి నమ్మకం.

ఇక అందులో వచ్చే మెసేజెస్ చూస్తే..... అసలు జనాలదగ్గర ఎంత ఎనర్జీ వుందో అర్థమవుతుంది. రకరకాల విశ్లేషణలు, సినిమాలు, లవ్వులు, లౌగీతాలు, ఇంగ్లీష్ కాని టెంగ్లీష్, అబ్బో చాలా చాలా చదవ వచ్చు. కానీ అన్ని మెసేజస్ లో కూడా కనిపించే కామనాలిటీ ఒకటుంది. ఎవరో ఏదో రుబ్బురోట్లో యేసి బాగా రుద్ది దానికి కాస్తంత మసాలా కలిపి  పొడిపొడి అచ్చరాలతో అలా విదిలించి పొగడేరు కొట్టుకోటానికి అద్దం ముందుకు పొయ్యొచ్చేటప్పటికి లైక్ మీద లైకు..లైకు మీద లైకు ..అబ్బా..ఏమి ఎనర్జీ చదువుతుంటే ఎలర్జీ రావాల్సిందే ..... అదే ఆ రాసేది అమ్మాయైతే చుట్టూరా హచ్ నెట్ వర్కే....


ఎవరైనా నాకు  ఈ ఫేస్ బుక్కు ను ఎలా వాడాలో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ..వచ్చే మెసేజీ లను ఎంత సీల్ చేద్దామన్నా లీకైతానే వుండాయి. అసలు నాకో డౌటు, ఇక్కడ అందరూ అందరికీ తెలిసిన వాళ్ళేనా లేకా నాలాగే కనిపిస్తే add చేసుకుంటారా? నేనంటే ఏదో పదిమందికి website link తెలుస్తుందని ఆశ పడ్డాననుకోండి, మరి మిగిలిన వారూ...????

13, జులై 2013, శనివారం

మేరా మహాన్ ఆంధ్రప్రదేశ్....రాజరికపు వాసనలు

Worth reading today's article from Eenadu. Forum for good governance released cases and the nature of crime against MLAs in Andhrapradesh. ఈ గణాంకాలను చూసిన తరువాత మనకింకా రాజరికపు వాసనలు పోలేదనిపించడంలేదూ? రాజరికంలో ఇలాంటి చర్యలను సహజంగా వీరోచిత చర్యలుగా చేసిన వర్ణనలను చెయ్యకుండా కథలు కథలు గా చెప్పుకుంటాము కదా. ఆ కాలంలో వాళ్ళ వాళ్ళ దేశాలను వారి పదవులను కాపాడుకోవటానికి ఇలా ప్రవర్తించేవారు. ఆ పద్ధతే కొంచెం మారిందంతే....తేడా ఏమీ లేదు. ఆసక్తి కలవారు పూర్తి MLA, MLC, MP ల పట్టికను వారిపై ఎలాంటి కేసులు ఏఏ సెక్షన్ల క్రింద ఏఏ సంవత్సరాలలో నమోదయ్యాయో తెలిపే వివరాలను ఈనాడు నుంచి Download చేసుకోవచ్చు. ఈ గణాంకాలను Forum for good governance  రాష్ట్ర కార్యదర్శి పద్మనాభరెడ్డి సమాచార హక్కుల చట్టం క్రింద ప్రతిపోలీసు స్టేషన్ నుంచి సేకరించారట. I believe democracy is still surviving because of such people in India.

http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=5 















12, జులై 2013, శుక్రవారం

ఎలక్షన్ కమిషన్ & సుప్ర్రీం కోర్టు చరిత్రలో బహుశా ఇదొక మైలు రాయేమో...

 A person, who is in jail or in police custody, cannot contest election to legislative bodies, the Supreme Court has held, bringing to an end an era of under trial politicians fighting polls from behind bars.
In another path breaking verdict to prevent criminal elements from entering Parliament and state assemblies, the apex court ruled that only an ‘elector’ can contest the polls and he/she ceases the right to cast vote due to confinement in prison or being in custody of police.
The court, however, made it clear that disqualification would not be applicable to person subjected to preventive detention under any law.
Referring to the Representation of Peoples' Act, a bench of justices A.K. Patnaik and S.J. Mukhopadhayay said that the Act (Section 4 & 5) lays down the qualifications for membership of the House of the People and Legislative Assembly and one of the qualifications laid down is that he must be an elector.
The bench said Section 62(5) of the Act says that no person shall vote at any election if he is confined in a prison, whether under a sentence of imprisonment or transportation or otherwise, or is in the lawful custody of the police.
Reading Sections 4, 5 and 62(5) together, the apex court came to the conclusion that a person in jail or police custody cannot contest election.
The court passed the order on an appeal filed by the Chief Election Commissioner and others challenging a Patna High Court order barring people in police custody to contest polls.
"We do not find any infirmity in the findings of the High Court in the impugned common order that a person who has no right to vote by virtue of the provisions of sub-section (5) of Section 62 of the 1951 Act is not an elector and is therefore not qualified to contest the election to the House of the People or the Legislative Assembly of a State," the apex court said.
In a landmark judgement on Wednesday, the same bench had struck down a provision in the the Representation of Peoples Act that protects a convicted lawmaker from disqualification on the ground of dependency of appeal in higher courts. The bench had also made it clear that MPs, MLAs and MLCs would stand disqualified on the date of conviction.

11, జులై 2013, గురువారం

ఎల్లో గ్యాంగ్ ‘కిలాడీ’ రాతలు!...

Read Yesterday's news from leading Telugu news papers, and now read this news....... 




Article from sakshi.


7/11/2013 2:00:00 AM
- వైఎస్సార్ సీపీ నేతలు అంబటి, జోగి రమేశ్, శోభా నాగిరెడ్డి ధ్వజం
- పచ్చ పత్రికల కథనాలపై వైఎస్సార్‌సీపీ ధ్వజం
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ‘పచ్చ’ పన్నాగాలు
- కాంగ్రెస్, టీడీపీలతో కలిసి చౌకబారు ఎత్తుగడలు
- వైఎస్సార్‌సీపీలో నేరగాళ్లున్నారంటూ అభూతకల్పనలు
- అంబటి, శోభా నాగిరెడ్డి, జోగి రమేశ్ మండిపాటు

‘‘కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టిన రెండు పత్రికలు వైఎస్సార్‌సీపీపై సందు దొరికినప్పుడల్లా చౌకబారు విమర్శలు చేస్తున్నాయి. వైట్ కాలర్ క్రిమినల్, పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే చంద్రబాబేనని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు’’
- అంబటి రాంబాబు
‘‘అత్యాచారం కేసులో ఉన్న ఓ ఎమ్మెల్యే, దొంగనోట్ల చలామణి కేసులో అరెస్టయిన టీడీపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. బాబు మాటిమాటికీ చెప్పే ‘పిల్ల కాంగ్రెస్’ నిజానికి టీడీపీనే’’
- శోభా నాగిరెడ్డి
‘‘కత్తి, కర్ర, తుపాకీ వంటివేమీ అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు. సీఎంగానే గాక విపక్ష నేతగా కూడా అడ్డంగా దోచుకుంటున్న ఘనుడు’’
- జోగి రమేశ్

సాక్షి, హైదరాబాద్/గుంటూరు/ఆళ్లగడ్డ: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు తమ అనుబంధ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో అసత్యాలను ప్రచారం చేయిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. రాజమండ్రిలో సెక్యూరిటీ ఇన్‌చార్జిని చంపి కోట్లు కొల్లగొట్టిన కేసులో ముద్దాయి వైఎస్సార్‌సీపీలో కీలక నేత అంటూ అభూతకల్పనతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయంటూ మండిపడింది. కాంగ్రెస్, టీడీపీలతో జత కట్టిన రెండు పత్రికలు, రెండు చానళ్లు వైఎస్సార్‌సీపీపై సందు దొరికినప్పుడల్లా చౌకబారు విమర్శలు చేయడం హేయమని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

ఆ రెండు పత్రికలూ ప్రజా సమస్యలను విస్మరించి అసత్యాలను వండివార్చడం... మర్నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు వాటినే వల్లెవేయడం అందరికీ తెలిసిందేనని పార్టీ శాసనసభాపక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ నంబర్‌వన్‌గా ఉన్నందుకే పచ్చ పత్రికలు ఇలా పచ్చ రాతలతో బురద జల్లుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ధ్వజమెత్తారు. బుధవారం అంబటి గుంటూరులో, శోభ ఆళ్లగడ్డలో, రమేశ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రి ఏటీఎం డబ్బు దోపిడీ కేసు ముద్దాయి శ్రీధర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడని, పార్టీలో ప్రధాన నాయకుడని ఎల్లో మీడియా చిత్రించిన తీరును అంబటి ఖండించారు. చౌకబారు ఎత్తుగడలతో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేరన్నారు. ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు వారివైపే చూపిస్తాయని కాంగ్రెస్, టీడీపీ చెంబు బృందం గుర్తుంచుకోవాలన్నారు.

టీడీపీ వారు అద్దంలో చూసుకోవాలి: వైఎస్సార్‌సీపీపై పలు చానళ్లలో ఇష్టానికి విషప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి వంటి బాబు తాబేదార్లు ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని అంబటి సూచించారు. ‘యూరో లాటరీ అంటూ మోసగించిన కోలా కృష్ణమోహన్‌తో బాబు ఫొటోలు దిగలేదా? అతని నుంచి బాబు రూ.50 లక్షలు తీసుకుని, మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వజూడలేదా? బాబు మంత్రివర్గంలో ఉన్న కృష్ణా యాదవ్ నకిలీ స్టాంపుల కుంభకోణంలో జైలు జీవితం గడపడం రేవంత్ మరిచారేమో. ఇలాంటి బాబును దొంగలకే గజదొంగ అనాలా?’’ అని ప్రశ్నించారు.

చంద్రబాబు పేరిట రిజిస్టరయిన కారులో 2010లో కదిరిలో రూ.7 కోట్లు పట్టుబడ్డాయని గుర్తుచేశారు. ఆ సొమ్మంతా బాబుదేనని, కావాలంటే ఆయనతో ఫోన్లో మాట్లాడాలని టీడీపీ నేత పేరం హరిబాబు నేరుగా పోలీసులకే చెప్పడాన్ని అంబటి గుర్తు చేశారు. ‘కిరణ్‌తో బాబు లాలూచీ పడితే ఆ కేసు ఏమైంది? కేసు వివరాలను బయటపెట్టండి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బాబు చేసిన ఘోర తప్పిదాలను ప్రజలు మరవలేదు. వైట్ కాలర్ క్రిమినల్, పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే చంద్రబాబేనని పసి పిల్లాడిని అడిగినా చెబుతాడు. బాబును ప్రజలు మూడోసారి కూడా తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ విషయం మాకంటే బాబుకే ఎక్కువ తెలుసు’’ అన్నారు. దివంగత వైఎస్‌పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఒకసారి తన చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘‘గతంలో ఉస్మానియా వర్సిటీలో డ్రైవర్‌గా పని చేసిన వీహెచ్, ఆయిల్ దొంగతనం, టైర్ల దొంగతనం చేసినందుకు సస్పెండయ్యారు. కాబట్టి కాంగ్రెస్‌ను ఆయిల్ దొంగలు, టైర్ల దొంగల పార్టీ అనాలా?’’ అని ప్రశ్నించారు. బాబు పాదయాత్రకు కోటానుకోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చని, కానీ వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటున్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఆకాశంపై ఉమ్మితే తిరిగి తమ మీదే పడుతుందని కాంగ్రెస్, టీడీపీలకు హితవు పలికారు.

టీడీపీ నేతలపై ఉన్న కేసుల మాటేమిటి: శోభ
చంద్రబాబు మాటిమాటికీ చెప్పే ‘పిల్ల కాంగ్రెస్’ నిజానికి టీడీపీయేనని శోభ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారన్నారు. కోలా కృష్ణమోహన్ నుంచి డబ్బు తీసుకోవడమే గాక, అతను మోసగాడని ముందుగా ఎలా తెలుస్తుందంటూ బాబు దబాయించారని గుర్తు చేశారు. ‘‘అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే, దొంగ నోట్ల చలామణి కేసులో అరెస్టయిన టీడీపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. కడప ఉప ఎన్నికల్లో రూ.7 కోట్లు, కొవ్వూరు ఉప ఎన్నికల్లో రూ.కోటి టీడీపీ నేతల వద్ద పట్టుబడలేదా? డీజిల్ అమ్మి సస్పెండైన వ్యక్తి కాంగ్రెస్‌లో చేరి నేడు జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం.

కడప, కొవ్వూరు, అనంతరం 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ ఎన్ని అసత్యాలను ప్రచారం చేసినా ప్రజలు జగన్‌కే అండగా నిలిచిన విషయాన్ని మర్చిపోయినట్టున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అవిశ్వాసంలో పాల్గొనకుండా కాంగ్రెస్‌కు మద్దతివ్వడం బాబుకే చెల్లింది! జగన్ ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదనే చంద్రబాబు, సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి సోనియా కాళ్లు పట్టుకుని అడ్డుకుంటున్నారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. సర్పంచ్ సహా ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు వైఎస్సార్‌సీపీకే అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

విపక్ష నేతగానూ బాబు దోపిడీ: రమేశ్
ఆ రెండు పత్రికల తీరు పచ్చ కామెర్ల రోగి చందంగా ఉందని రమేశ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతాన్ని వైఎస్సార్‌సీపీయే గెల్చుకునేలా కన్పిస్తుండటం వల్లే ఇలాంటి అభాండాలు వేస్తున్నారన్నారు. ‘‘వైఎస్సార్‌సీపీకి కోట్లాది కార్యకర్తలున్నారు. వారిలో ఎవరో తప్పు చేస్తే దాన్ని నాయకత్వానికి ఆపాదిస్తూ రాస్తారా? ఇది జర్నలిజం విలువలను మంటగలపడం కాదా?’’ అని ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర ముఠా దొంగల భుజాలపై చంద్రబాబు చేతులు వేసి తీయించుకున్న ఫొటోలను విలేకరులకు రమేశ్ ప్రదర్శించారు. ‘‘వీరంతా చిత్తూరుకు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తులు.

కాబట్టి చంద్రబాబును అంతర్రాష్ట్రీయ దొంగ అనుకోవాలా?’’ అని ప్రశ్నించారు. ‘‘రాజకీయాల్లో హత్యలు చేసిన వ్యక్తి బాబు. ఎన్టీఆర్‌ను ఆయన హత్య చేయలేదా? మానసిక క్షోభ పెట్టి హత్య చేశారు. కత్తి, కర్ర, తుపాకీ వంటివేమీ అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు. సీఎంగా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకున్నాడో అందరికీ తెలుసు. విపక్ష నేత హోదాలో కూడా దోచుకుంటున్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు సహకరించి విదేశీ సంస్థల నుంచి వేల కోట్ల రుణం, కేంద్రం నుంచి లంచం పొందారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సమయంలో దొడ్డిదారిన పారిపోయి కాంగ్రెస్ నుంచి వేల కోట్లు లంచం తీసుకున్నారు. టీడీపీ మహానాడుకు కోట్లాది రూపాయల వసూలు చేశారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే చంద్రబాబు అమెరికా వెళ్లారు. రాజకీయాల్లో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడమా?’’ అంటూ దుమ్మెత్తిపోశారు.

కోలాకు యూరో లాటరీ వచ్చిందని నమ్మి, ఆ సొమ్మును భారత్‌కు తీసుకురావడానికి ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతూ సీఎం హోదాలో కేంద్రానికి బాబు లేఖ రాయలేదా? ఆయన మంత్రివర్గంలోని కృష్ణాయాదవ్ స్టాంపుల కుంభకోణంలో జైలుపాలు కాలేదా? అప్పట్లో నలుగురు మంత్రులు, పదిమంది ఎమ్మెల్యేలను తప్పించారు’’ అని గుర్తు చేశారు. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో చిల్లరగాళ్లంటూ దుయ్యబట్టారు. ‘నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పుట్టు పూర్వోత్తరాలేమిటి?’ అని ఒక పత్రికా యజమానిని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఇలా వార్తలు రాసిన పత్రికా యజమానుల్లో ఒకరు గతంలో గేదెలు కాచేవారు. మరొకరు సైకిల్‌పై పాలమ్ముకుని బతికారు. అవేమీ నామోషీ కాదు. ఒకప్పుడు అలా ఉన్నవాళ్లు శరవేగంగా వేల కోట్లెలా సంపాదించారు? ఒకరిపై బురదజల్లే ముందు తమ వెనక ఉన్నదేమిటో చూసుకోవాలి. ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు వీరికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అని హెచ్చరించారు.



What do you think?


10, జులై 2013, బుధవారం

రండి బాబూ రండి.... జిల్లాలు లేదా ప్రాంతాల వారీగా. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మనస్తత్వాలు

ఇప్పుడు మీరందరూ మనస్తత్త్వశాస్త్రవేత్తలే... మీరు ప్రాంతాల వారీగా ఎప్పుడైనా ప్రజల మనస్తత్వాలను గమనించారా? అదేంటి ఒక్కొక్కడు ఒక్కో టైపు కదా అని చెప్పకండి. ఒక్కొక్కడు ఒక్కో టైపైనా సహజంగా ఆ ప్రాంత సంస్కృతిని బట్టి మెజారిటీ ప్రజల మనస్తత్వాలు వుంటాయి కదా. అలా మీరు పరిశీలించిన అభిప్రాయాలను ఇక్కడ వ్యాఖ్యల్లో వ్రాయవచ్చు. దేశం వదిలి కొన్ని ఏండ్లయింది కాబట్టి అప్పటి నా అభిప్రాయాలు ఇప్పుడు కూడా వర్తిస్తాయో లేదో తెలియదు కానీ మీ మీ అభిప్రాయాలు చదివాక నా అభిప్రాయాలు వ్రాస్తాను.

Short and sweet post. Isn't it?

7, జులై 2013, ఆదివారం

భావగీతమంటే బావగీతమే......

పాత సినిమా సీతామహాలక్ష్మి సినిమాలో చంద్రమోహన్ చెప్పినట్లు "భావ గీతాలను"  బావగీతాలు అన్నా సరైనదే. ఈ గీతాలు బావలు పాడవచ్చు లేదా బావలమీద పాడవచ్చు. ఈ భావగీతాల అందమే వేరు. ఓ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరితోనైనా ప్రేమలో పడితే వాళ్ళు సంచరించే లోకమే వేరు. ఆ లోకంలో వాళ్ళ వాళ్ళ భావాలన్నీ బావ/మరదుల చుట్టూరా తిరుగుతూ వుంటాయి. అసలు బావా మరదళ్ళ సరసాలే వేరు. ఇప్పుడు బావా లేడు, మరదలు లేదు..ఆ స్థానంలో వున్నది జీన్సుపాంటే కాబట్టి బావ ఏమంటాడో మరదలు తెలియదు. మరదలు సమాధానమూ బావకు తెలియదు.

ఇద్దో అచ్చం అలాంటిదే కాకపోతే ఇది పద్యరూపంలో. ఇంతకు ముందు టపాలో ప్రభాత వర్ణనంలో తిక్కన ద్రౌపది ఆక్రోషాన్ని ఓ సరస్సుకు అన్వయించి ఆ కొలనులో అప్పుడే విచ్చిన తామర పూల పరిమళం అక్కడనుండి ఎలా వెలువడుతుందో చెప్పాడు కదా. ఇప్పుడు ఈ పద్యంలో స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి.

నిజానికి సైరంధ్రి, కీచకునికి కనిపించిన తీరిది. కావ్యంలో కీచకుడైనా, సైరంధ్రైనా తిక్కన గారే కాబట్టి ద్రౌపది ని తిక్కన ఎలా ఊహించాడో చూడండి. అసలు అమ్మాయిని వర్ణించమంటే ఏవో పూలు, చంద్రుడు, సంపెంగ మొక్కలు ఇలా ఏవో ఏవో చెప్పాలని ఆలోచన వస్తుంది కానీ, పూలు తెచ్చి సాదుపట్టడం, చందమామను క్రిందకు దించి చంద్రునిలో నున్న మచ్చను తేర్చడం, నల్లని నారుపోసి ఆ నారు తో స్త్రీ జుట్టును పోల్చడం... ఎవరికి వస్తాయండీ ఇలాంటి ఆలోచనలు?

ఇక పద్యము. 

నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టినట్లంద మొంది
చక్రవాకంబుల చందంబు గొని వచ్చి, కుప్పలు సేసినట్లొప్పు మెఱసి
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి
యళికులంబులకప్పు గలయంతయును దెచ్చి, నారు వోసిన భంగి నవక మెక్కి

యంఘ్రితలములుఁ గుచములు నాననంబుఁ
గచభరంబును నిట్లున్నరుచిరమూర్తి
యనుపమానభోగములకు నాస్పదంబు
కాదె యీత్రిప్పు లేటికిఁ గమలవదన

కొన్ని పదాలకు అర్థాలు :

నెత్తమ్మిరేకులు = తామర రేకులు




అచ్చున బెట్టు = అచ్చు పోయు
అళి= తుమ్మెద
అళి కులంబుల కప్పు = తుమ్మెదల నలుపు
నవకము = మృదుత్వము
అంఘ్రి= కాలు; అంఘ్రి తలములు = కాళ్ళు
కందువ = నల్ల మచ్చ
కొమరు=మనోహరము,మనోజ్ఞము,చక్కనిది
కుచములు = చన్నులు
ఆననము = మొఖము
కచము = తల వెండ్రుకలు; కచభరము = తల వెండ్రుకల బారువ
ఆస్పదము = చోటు
కమలవదన = కమలము వంటి మొగము కలది.


మామూలుగా ఈ కాలంలో అమ్మాయి వర్ణన చెప్పేటప్పుడు నేను విన్నంత వరకూ, చూసినంతవరకూ పై భాగాల నుంచి క్రిందిభాగాలకు వస్తారు. కానీ తిక్కన కాళ్ళనుంచి మొదలు పెట్టి జుట్టు దాకా వెళ్ళాడు. సీస పద్యంలో వర్ణనలు చేసి ఆ క్రిందనుండే ఎత్తుగీతిలో ఏ వరుసలో ఆ వర్ణనలు చేసాడో చెప్పాడు. అలా చెప్పి, ఇంతటి అందగత్తెలు వున్నదే భోగాలు అనుభవించటంకోసమంటూ ఓ బో త్రిప్పుకుంటున్నావే అని ఓ చమత్కారాన్ని విసిరాడు. ఆ తరువాత ద్రౌపదికి మండిందనుకోండి అది వేరే విషయం. ఇక సీస పద్య పాదాల్లోకి వస్తే

నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టినట్లంద మొంది -- యంఘ్రితలములు

అంఘ్రితలములు అంటే కాళ్ళు. ఈ ద్రౌపది కాళ్ళు ఎలా వున్నాయయ్యా అంటే  తామర పూరేకుల నుంచి ఆ పూల పైపొరను విడిగా తెచ్చి అచ్చులు పోస్తే ( పాదము రూపంలో అచ్చుపోయటం)  ఎలా వుంటుందో అలా వున్నాయట. అంటే తామరపూలు లేత ఎరుపురంగులో వుంటాయి. అలాగే అసలు ఏపూవైనా చాలా మెత్తగా వుంటుంది.తామర పూల మెత్తదనం ఎక్కడ వుంటుంది? ఆ పూల పై పొరల్లో వుంటుంది. అలాగే దాని రంగు లేత ఎరుపురంగు. అంటే ఆ మెత్తటి లేత ఎరుపురంగు ను విడదీసి తెచ్చి కాళ్ళ రూపంలో  అచ్చుపోస్తే ఎలా వుంటుందో అలా వున్నాయట ద్రౌపది కాళ్ళు.

ఇక రెండవపాదం
చక్రవాకంబుల చందంబు గొని వచ్చి, కుప్పలు సేసినట్లొప్పు మెఱసి -- కుచములు 



ఇక ద్రౌపది స్థనములు ఎలా వున్నాయంటే చక్రవాక పక్షుల అందాన్ని తెచ్చి  కుప్పలుగా పోస్తే  ఎలా వుంటుందో అలా వున్నాయట. చక్రవాక పక్షుల ఉబ్బెత్తుగా అర్థచంద్రాకార ఆకారంలో  వుంటాయి. అలాంటి చక్రవాకపక్షుల అందాన్ని  తెచ్చి రెండుచోట్ల కుప్పలుగా  పోస్తే ఎలా వుంటాయో అలా వున్నాయట.

మూడవపాదం
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి - ఆననము

ఇది చూడండి. ఎంతటి భావుకత కలవారైనా పడిపోవాల్సిందే... అమ్మాయి మోము ను మామూలుగా పూర్ణ చంద్ర బింబంతో పోలుస్తారు. ఎందుకంటే పౌర్ణమి నాటి చంద్రబింబం రంగు వేరు.దాని రూపు వేరు. ఆ కాంతి వేరు కాబట్టి. కానీ తిక్కన ఏమి చేసాడో చూడండి. ఆ చంద్రకాంతిని క్రిందకు తీసుకొచ్చేసాడు. కానీ ఓ సందేహం కూడా వచ్చేసింది. చంద్రుడిలో మచ్చ వుంటుంది కదా మరి మచ్చ వున్న చంద్రుని నుంచి వచ్చే కాంతి కూడా మచ్చగలదియై వుంటుంది కదా? అందుకని ఈ మచ్చను వేరు చేయడానికి ఆ కాంతిని తేర్పార పట్టాడు. తేర్పారపట్టడం అంటే విభజించటం. మీరు ఎప్పుడైనా రైతులు కల్లం చేసేటప్పుడు చూసివుంటే  ధాన్యాన్ని పొట్టునుంచి వాళ్ళు ఎలా వేరుచేస్తారో చూసే వుంటారు. అలా, ఇక్కడ చంద్రకాంతిని చాటలతో అలా జాలువార్చి ఆ మచ్చను వేరుచేసి చూస్తే ఎలా వుంటుందో అంతకన్నా సుందరంగా మనోజ్ఞంగా వుందట ద్రౌపది మోము. ఏమి వర్ణన!!!

ఇక నాలుగోపాదం

యళికులంబులకప్పు గలయంతయును దెచ్చి, నారు వోసిన భంగి నవక మెక్కి - కచభరంబు



ఇక్కడ ద్రౌపది జుట్టును నారుకయ్యలోని నారుతో పోలుస్తున్నాడు చూడండి. ఇదేమి వర్ణనండీ అని అనుమానం రావచ్చు.అంత సుందరి జుట్టును  ఏ నల్ల త్రాచుతోనో పోల్చకుండా అని అనుమానం రావచ్చు. కానీ ద్రౌపది వస్త్రాపహరణమైనప్పుడు ఓ పంతం పట్టింది గుర్తుందా? తనని జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చిన దుశ్శాశనుడి రక్తాన్ని నాజుట్టుకు పూసుకొనే దాకా ఈ జుట్టును జడవేసుకోను పొమ్మని!! అదుగో అందుకే కాబోలు తిక్కన గారు నారు కయ్యను ఎంచుకున్నారు. మరి నారు కయ్యలో మొక్కలు ఆకుపచ్చగా వుంటాయి కదా. జుట్టేమో నలుపు రంగు కదా? అందుకని ఏమి చేశాడంటే తుమ్మెదల కులము యొక్క నల్ల రంగును తీసుకొచ్చి నారుపోస్తే ఆ నారు నుంచి పెరిగే మొక్కలు నల్లగానే వుంటాయి కదా? ఆ నారు కయ్యలో నారు మొలచి కొంచెంపెద్దదయ్యాక మీరెప్పుడైనా ఆ మొక్కల స్పర్శను ఆస్వాదిస్తే ఆ మెత్తదనం తెలుస్తుంది. ఆ నారు కూడా గాలి వీచినప్పుడు అటూ ఇటూ వూగుతూ చూడ్డానికి ఆహ్లాదంగా కూడా వుంటుంది. మరి ద్రౌపది జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకొని వుంటుంది కదా. ఆ జుట్టు అదుగో ఆ పైన నారు కయ్యలో నారు ఎలా వుందో అలా వుందట. అంటే అంత మృదువుగా అలా గాలికి ఊగుతూ వుందని అర్థము.


ఇలా వర్ణించి ఊరుకుంటే వాడు కీచకుడెందుకవుతాడు. అంతా చెప్పి చివరిగా ఏమంటున్నాడో చూడండి. ఇంత అందగత్తె లుండేది అనుభవించడానికని నీకు తెలియడంటే త్ర్రిప్పులాడీ అంటాడు. ఇలా అంటే ఏ అమ్మాయైనా ఊరుకుంటుందటండీ :-).

5, జులై 2013, శుక్రవారం

ద్రౌపది కి ఎలా తెల్లవారింది.....?

తే|| ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేడినిట్టూర్పులోయన వెడలెఁ గ్రొత్త
తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల


ఇది కవిత్రయ మహాభారతములోని తిక్కన రచించిన విరాటపర్వము ద్వితీయాశ్వాసములోని ప్రభాత కాల వర్ణనములోని మొదటి పద్యము.  పద్యము మొదటి సారి చదివితే సగం మాత్రమే అర్థమయింది. స్థూలంగా పద్య భావం కూడా అర్థంకాలేదు.  అ, ఆ లు మాత్రమే తెలిసిన నాలాంటి వాడికి  పద్యము అందులోని అంతరార్థం మొదటిసారి చదివినప్పుడు అర్థం కాకపోవడంలో వింతేమీలేదు. కానీ మళ్ళీ మళ్ళీ చదివితే చదివిన ప్రతిసారీ ఏదో క్రొత్త అర్థం స్ఫురిస్తుంటుంది. అందునా మహాకవుల గంటంనుంచి పద్యం తాళపత్రమెక్కిందంటే అందులో అంతరార్థాలు లేకపోతే ఆశ్చర్యపోవాలి.

పై పద్య సందర్భమేమిటంటే  పాండవుల అజ్ఞాతవాస సందర్భంగా ద్రౌపది మారుపేరుతో సైరంధ్రిగా విరాటుని కొలువులో విరాటుని భార్యయైన సుదేష్ణ దగ్గర పరిచారికగా కాలాన్ని వెళ్ళతీస్తూ వుంటుంది. ఒకరోజు మత్సదేశానికి సర్వసైన్యాధ్యక్షుడు, విరాట రాజునకు బావమరిది ఐనటువంటి కీచకుడు సైరంధ్రి అందచందాలకు ముగ్ధుడై  సైరంధ్రి పొందు కోరుకుంటాడు. వినని సైరంధ్రిని సైన్యాధ్యక్షుడనన్న అహంకారంతో వెంటపడి తరుముకుంటూ  రాజసభలో క్రిందపడదోసి తన్నడం వలన ఆమెకు నోటి నుంచి రక్తం కారుతుంది.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అదే రాజసభలో వేరు వేరు నామాలతో ధర్మరాజు, భీమసేనుడు కూడా వుంటారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కనీసము నోరెత్తి ఇది తప్పు అనికూడా అనలేదు. తన భార్యను నిండుసభలో తనముందే  అవమానిస్తుంటే అన్నీ మూసుకు కూర్చోవలసిన దౌర్భాగ్య పరిస్థితిలో వున్నారంటే వాళ్ళ మానసిక వేదన ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించండి? ఇక ద్రౌపది పరిస్థితి చెప్పాలా? అటువంటి భర్తలు వుంటే ఏమి లేకుంటేనేమి?

ఇదిగో ఆ సందర్భంలో ఆరోజు రాత్రి  రహస్యంగా కలుసుకొంటుంది. నిజానికి ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడల్లా కాపాడిన వాడు భీముడే. బహుశా అందుకే తన వ్యధను అర్థంచేసుకొని తనకు న్యాయం చేయగల్లవాడు భీముడేనన్న తలంపుతో భీముని కలిసిందే లేక వేరే ఏదైనా వుద్దేశ్యమో కానీ మొత్తానికి ఇద్దరూ కలిసి కీచకుని చంపడానికి స్కెచ్ గీస్తారు. అద్దో అప్పుడు రాత్రి గడిచి తెల్లవారే సందర్భంలో వ్రాసిన పద్యమిది

పద్యానికి స్థూలంగా అర్థాన్ని చెప్పాలంటే, ద్రుపదుని కూతురైన ద్రౌపదికి భర్తలు ఎదురుగా వుండి కూడా అనాదరణకు లోనైనందువల్ల ఆ సరోవరము  దుఃఖముతో పరితపిస్తుంటుంది. ఆ పరితాపము వల్ల సరస్సులోపల అప్పుడే క్రొత్తగా వికసిస్తున్న తామరపూల పరిమళం వేడి నిట్టూర్పుల వలే వుందట.

 ..... కానీ ఇప్పుడు ప్రతి పదార్థములను వ్రాసి సందర్భాన్ని బట్టి అర్థం ఎలా మారుతుందో చూద్దాము. ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి. పద్యానికి ఎన్నిరకాల అర్థాలైనా చెప్పుకోవచ్చు. చదివేకొద్దీ, ఆలోచించే క్రొద్దీ రకరకాల భావాలు గోచరిస్తుంటాయి.

ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేడినిట్టూర్పులోయన వెడలెఁ గ్రొత్త
తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల


ప్రతి పదార్థము : ద్రుపద నందన = ద్రుపదుని కూతురు
పరిభవము = అనాదారము, తిరస్కారము, ఓటమి
ఉల్లము = హృదయము
దురపిల్లు = శోకించు; పరితపించు
సరసి = స్త్రీ, సరస్సు
తావి= సువాసన, పరిమళము ; పండ్లపాచి
నెత్తమ్మి = నెఱ+తమ్మి = విరిసిన తామర
విరి= వికసించినది.


పదాలకు వున్న అర్థాలను దృష్టిలో నుంచుకొని చూస్తే : సరసి అంటే రెండర్థాలు ఒకటి స్త్రీ, రెండవది సరోవరము అని. అలాగే దురపిల్లు అంటే శోకించడము ఒక అర్థము. మరొకటి పరితాపము. ఇక్కడ తాపము అంటే వేడి, పరితాపము అంటే అత్యుష్ణత లేదా మిక్కిలి వేడి అని అర్థంగా చెప్పుకోవచ్చు.

ఇక్కడ క్షోభను అనుభవించింది ద్రౌపది కాబట్టి ద్రౌపది క్షోభను సరస్సు నకు అన్వయించి ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా కథా వస్తువు ద్రౌపది కాబట్టి ద్రౌపదికి ఎలా తెల్లవారిందో కూడా చెప్పుకోవచ్చు.  ద్రౌపది సుందరి కాబట్టి అలంకారికంగా స్త్రీ పెదవులను తామర పూ రేకులతో పోల్చి కూడా చూడవచ్చు. అంటే తామర పూరేకుల వంటి మెత్తని ఎర్రని పెదవులు గలదని అర్థం. ఈ రకంగా చూస్తే

ఆ రాత్రి మంతనాలయ్యాక ద్రుపదనందన వెళ్ళి పడుకొంది కానీ అంతమంది ముందు అంతటి అవమానం జరిగిన తరువాత నిద్ర ఎలా పడుతుంది? అందునా స్త్రీ.   కాబట్టి ఆ రాత్రంతా సైరంధ్రి, ద్రుపదనందనకు జరిగిన అవమానానికి  హృదయంలో ఏడుస్తూనే వున్నది. హృదయంలో ఏడవడమంటే తనబాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి కుమిలి ఏడవడం. ఇప్పుడు ద్రౌపది పరిస్థితి అంతే మరి. ఈ రకంగా రాత్రంతా ఏడ్చి ఏడ్చి  తెల్లవారుతుందనగా లేస్తుంది. రాత్రంతా నిద్రలేక కోపంతో రగిలిపోతూ తన నిస్సహాయతకు దుఃఖిస్తూ వుంటే లేచిన తరువాత శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల సహజంగానే వేడి నిట్టూర్పులు వస్తాయి కదా.
ఆ వేడి నిట్టూర్పుల వల్ల తామర పూలవంటి పెదవులు కలిగిన సైరంధ్రి విచ్చిన పెదవులనుంచి ఓ రకమైన వాసన వ్యాప్తిచెందింది అని చెప్పుకోవచ్చు.

మరో విశేషం : తామరపూలనుంచి ఎప్పుడూ సువాసనే వస్తుంది. అలాగే సుందరాంగి ఐనటువంటి ద్రౌపది తామరపూ రేకులవంటి పెదవులనుంచి ఎప్పుడూ పరిమళమే వచ్చుగాక....కానీ....ఇక్కడ పరిమళము రాదు..రాకూడదు. కారణం జరిగిన జరగబోయే సన్నివేశం ఏమాత్రమూ మంగళకరమైనది కాదు కాబట్టి. ఈ భావం నాకు స్ఫురించింది మాత్రమే... కవి తిక్కన వుద్దేశ్యము ఇది ఐ వుండవ్వచు లేదా కాకపోయీ వుండవచ్చు. అలాగే ఈ పద్యాన్ని చదివిన వారుకూడా ఈ భావంతో ఏకీభవించకపోనూ వచ్చు.


ఇక సహజమైన పద్య అర్థం పైన చెప్పుకున్నట్లే.... ద్రౌపదికి జరిగిన పరాభవం వల్ల దు:ఖముతో సరోవరము లో అప్పుడే క్రొత్తగా విచ్చుకుంటున్న తామర పూల పరిమళం  వేడి నిట్టూర్పుల వలే వుందని అర్థం.

3, జులై 2013, బుధవారం

ఇండియాతో పోలిస్తే USA లో డబ్బులు ఎక్కడున్నాయి బాబూ?

స్టేట్ ఎప్పుడు విడిపోతుందో ఏమన్నా న్యూస్ వ్రాశారేమో నని ఈ రోజు దక్కన్ క్రానికల్  పత్రిక చదువుతుంటే Business & Technology విభాగంలో  ఒక కారు బొమ్మ కనిపించింది. ఓ ఇదేదో బాగుందని దానిక్రింద నూస్ చదివాను. నమ్మలేక మళ్ళీ చదివాను. వూహూ, నాకళ్ళు ఏమన్నా మోసం చేస్తున్నాయేమోనని మళ్ళీ మళ్ళీ చదివి నిర్థారించుకొన వలసి వచ్చింది. కాసేపు అనవసరంగా అమెరికాకు వచ్చేశాము అనిపించినా మరుక్షణమే..."ఆ... ఇక్కడకు రాకపోతే ఈ మాత్రం  బ్రతుకు కూడా అక్కడ మనలాంటోళ్ళకు ఎక్కడదొరుకుతుందని" సమాధానపెట్టుకున్నాను. నిజమే..ఇవన్నీ వుద్యోగాలు చేసుకుంటూ నీతీ నిజాయితీగా అక్కడెప్పుడు కొనాలి? అంటే అన్నామనుకుంటాము కానీ ఈ కారు కొనాలంటే ఇండియా లో వాడెలాంటి వాడయి వుండాలి?

విషయమేమిటంటే "ఆడి" క్రొత్త మోడల్ RS 5 ను మార్కెట్లో విడుదల చేసింది. ముంబాయి లో దాని షోరూమ్ ధర అక్షరాల తొంభై ఐదులక్షల ఇరవై ఎనిమిది వేలే నట... అంటే మన చేతికి అందేటప్పటికి కోటి పది లక్షల రూపాయల పైమాటే . ఇప్పుడు చెప్పండి ఈ కారు ఇండియాలో ఎవరు కొనగలరు :-)

http://www.deccanchronicle.com/130702/news-businesstech/article/audi-rolls-out-rs-5-coupe-hike-prices-2-3-cent-soon



అదే మోడల్  అమెరికాలో RS 5 Coupe  వెల  $68,900. అంటే ఇప్పటి ప్రకారం డాలర్లలోకి మారిస్తే నలభై ఒక్క లక్ష పదివేల రూపాయలు ( డాలరుకు అరవై రూపాయలు వేసుకున్నా సరే )... ఎక్కడి కోటి ఎక్కడి నలభైఒక్కలక్ష?



సరే!! ప్రజలదో, ప్రక్కనోడి రక్తాన్నో లేదా ప్రజల అమాయకత్త్వాన్నో  ధారలుగా పోయించి ఆ కోటి పెట్టి కారు కొన్నామనుకో.... మొదటి రోజు ప్రక్కసీట్లో కత్తిలాంటి ఫిగర్ ను కూర్చో పెట్టుకొని రోడ్డుమీదకు వెళతామో.... ఏ ఆటో వాడో వచ్చి కారుకు పచ్చరంగు గీతలు పులిమేసి చక్కా వెళ్ళిపోతాడు. ప్చ్.... అసలు ఇండియా రోడ్లకు ఇంతటి ఖరీదైన కార్లు అవసరమా? అన్నట్లు ఇక్కడ నలభై లక్షల కారు అక్కడ కోటి రూపాయలంటే ఇదంతా గవర్నమెంట్ కు ఆదాయమే..ఓమ్మో ఓమ్మో ఎంత ఆదాయము, ఏమి సంగతీ....ఎన్నెన్ని పనులు చెయ్యొచ్చు?

ఐనా ఇదంతా చూస్తుంటే పేద దేశం ఇండియా కాదు ...అమెరికానే...కాదంటారా? డబ్బు సంపాయించే నేర్పు కలవాళ్ళకు ఇండియా స్వర్గ ధామం..అది చేతకాని నాలాంటోళ్ళకు అమెరికానే గతి.

1, జులై 2013, సోమవారం

కొమ్మ కొమ్మనూ మురిపించి మదిని మైమరపించే రంగు రంగుల పూబాలలు


ప్రకృతి పరవశించెలే నా మనసు పరిమళించెలే
అందాల తోటలోన అణువణువు పులకరించెలే || ప్ర ||
..........

ప్చ్ మిగతాది దారిలోనే మర్చిపోయా :(... అందుకే ఇప్పటికి ఒకే ఒక పల్లవి చర్విత చరణం
.

26, జూన్ 2013, బుధవారం

Daddy .... you should thank your teachers.... నిజమే కదా !!!


Daddy do you know Absolute value functions?

"No"

do you know Quadratic functions?

"No"

Daddy, atleast do you know Complex numbers?

"No... " చాలా ఏండ్లయింది కదమ్మా...మర్చిపోయాను.

 Then suddenly she jumped to chemistry and asked me ... Do you know even  basics of Chemistry?

 హ్మ్...ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే !!! " Ohh...you failed in chemistry  and you claim you are a chemical engineer !!!"   I can't believe it daddy..... by the way who gave you the seat in chemical engineering looking at your marks?


 దానికి వాళ్ళమ్మ కూడా వంత పాట ....:-) ఇంకేముంది ఊరుకున్నంత వుత్తమం లేదని అర్థమయిపోయింది. అసలే పదో తరగతి, ఇంటర్మీడియేట్ లో మనకన్నా ఎక్కువమార్కులు వచ్చాయి. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో దానికి నాకెమిష్ట్రీ పరీక్ష గూర్చి పొరపాటున చెప్పాను. అది పట్టుకోని పిల్లలకు కూడా ఈ రోజు దాకా కథలు కథలుగా చెప్పి నన్ను ఆడేసుకోవడం బాగా అలవాటైపోయింది వీళ్ళకు :))

మళ్ళీ కాసేపేయ్యాక  daddy .... you don't know any thing and you asked me to skip Honors Algebra2 in the summer. what should I do now?

హ్మ్... హమ్మయ్యా... విషయం ఇప్పటికి అర్థమయింది. మొత్తానికి ఏవో లెక్కలు రాక ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక ఈ తంటాలన్నమాట.  న్యూజెర్సీ లో మా పిల్లల పాఠశాలలకు ఈ నెల 21 వ తేదీనుంచి ఎండాకాలం శెలవులను ప్రకటించారు. మళ్ళీ స్కూల్స్ తెరిచేలోపు ఆగష్టు లో వీళ్ళకు ఈ పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణత సాధించినట్లైతే వెళ్ళబోయే తరగతిలో Honors Pre Calculus తీసుకొనే అవకాశం వుంటుంది.

 టీ త్రాగడం పూర్తయింది.ఓ ఐదు నిమిషాలయ్యాక, ఓ చిత్తు కాగితంపైన నాలుగు లెక్కలేసుకోని డాడీ ... డాడీ అంటూ చల్లగా పిల్లిలాగా దగ్గర చేరింది.
"నీకు తెలియకపోతే నేను చెప్తా చూడమంటూ "  ఓ లెక్క చేయడం మొదలు పెట్టింది. కుస్తీ పట్టి మొత్తానికి చేసింది. చూస్తున్న నాకు కడుపులో వికారం మొదలైంది.

మరోలెక్క... ఈ సారి Complex numbers మీద .... ఇదికూడా అంతే... ఈ సారి వికారం మరీ ఎక్కువైంది. Answers ఐతే వస్తున్నాయి కానీ ఆ చేసే విధానం నాకస్సలు నచ్చడం లేదు.

"ఎవరు చెప్పారమ్మా నీకు ఈ లెక్కలు ఇలా చెయ్యాలని" అని అడిగాను. వస్తున్న ఉత్సాహాన్ని ఆగపట్టుకుంటూ " ఏదో స్కూల్ వాళ్ళ టీచర్స్ You tube లో పెడితే అవి చూసి నాకై నేనే నేర్చుకున్నానని" గర్వంగా చెప్పింది. ఆ ఉత్సాహంపైన నాకు నీళ్ళు చల్లబుద్ధి కాక " Excellent " అని మెచ్చుకోక తప్పింది కాదు. నిజమే ఆ వయసులో ఈ Complex numbers  concept అర్థమవడం కొంచెం కష్టమే. లెక్క చేసే టప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఈ complex numbers కు కూడా ప్రాధమిక Algebra సూత్రాలు వర్తిస్తాయని తెలియక తికమక పడుతుంది.

ఇంట్లో వున్న white board తీసుకురమ్మని  కొద్దిసేపు ప్రాధమిక ఫార్ములాలపై లెక్కలు చేపించాక ఇంతకు ముందు లెక్క చెప్పడం మొదలు పెట్టాను. 



అందులో ఒక problem ఇది

Simplify 1/ i to the power of 13.

దీన్ని టీచరు ఈ రకంగా చెప్పిందట. ముందుగా i యొక్క విలువలను ఓ ప్రక్కగా ఈ రకంగా వ్రాసిందట

i=sqrt of -1
i2=-1
i3=-i
i4=1

తరువాత టీచరు ఏమి చెప్పిందో కానీ ఈ అమ్మాయి మటుకు ప్రతి power ను గణించడం మొదలు పెట్టింది. అంటే i  to the power of 5 నుండి i to the power of 13 వరకూ.... ఇలా చెయ్యడం చూస్తే నాకేమిటీ ఏమాత్రం బీజగణితం తెలిసిన వారికైనా వాంతులవ్వాల్సిందే మరి :))

మొత్తానికి నేను పాఠం చెప్పాక.... చెపుతున్న మధ్యలో మా పిల్ల నన్ను మెచ్చుకోవడం మానేసి " Daddy you should thank your teachers" అంటూ గబా గబా లెక్కలు చేసుకుంటూ ఇంత సులభమా అంటూ అప్పుడప్పుడూ ఓస్..ఇంతేనా అనుకుంటూ లెక్కలు చేసుకుంటూ నిద్రలోకి జారిపోయింది. రేపటి నుండి నెలలోపు Algebra and Trigonometry చెప్పకపోతే ఏమౌంతుదో తెలుసు కాబట్టి మిగిలిన కథలన్నీ కంచికీ నేనేమో ట్యూషన్ మాష్టారి అవతారం....

అన్నట్లు నిజమే కదా!!  I should thank my maths teachers కీర్తిశేషులు శ్రీ బంగారు రెడ్డి గారూ మరియూ  శ్రీ చిన్న కోటయ్య  గారు. వీరిరువురి దయవల్లే నాలాగా చాలా మంది ఉజ్జ్వలంగా బ్రతుకు బండిని లాగిస్తున్నారు.

23, జూన్ 2013, ఆదివారం

పౌరులకు, ప్రజాప్రతినిధులకు మధ్య చిరు వంతెన చిరుస్పందన ద్వారా...



దరిదాపు ఓ నెల క్రితం భారత ప్రజా ప్రతినిధులు.. మన కష్టాలు. Linking people with politicians అని ఓ పోస్టు వ్రాశాను. చూసే వుంటారు కదా? దానికి పొడిగింపుగా ఈ Article.

పురిటి నొప్పులు తట్టుకోని మొత్తానికి pre-matured బేబీ ని ప్రసవించేశాను. pre-matured బేబీ కాబట్టి ఇంకా సరిగ్గా కళ్ళు కూడా తెరిచి చూడలేదు.నిర్మాణం ఇంకా పూర్తికాలేదు కానీ మన రాజకీయనాయకులు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేదాకా  ఊరుకొనే ఓపిక నాకు లేదు కాబట్టి ఐనంత వరకు ముందుగా తెలుగు బ్లాగులోకానికి అంకితమిచ్చేస్తే ఓ పని ఐపోతుంది కదా? పనిలో పనిగా ఒకరిద్దరైనా మనసుపెట్టి Test చేసి నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేసే అవకాశం కూడా వుంటుంది.
url : bharathvoice.com 


ప్రస్తుతానికి ఇది తెలుగు బ్లాగులోకానికి మాత్రమే Testing కోసం ఇస్తున్న  సైట్...

ఇక సైట్ యొక్క వివరాలలోకి వెళితే ఈ సైట్ లో భారత దేశములో గల రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలను చేర్చడం జరిగింది. మన రాష్ట్రానికి ఎన్నికలు దగ్గరలో వున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకూ అన్ని అసెంబ్లీ స్థానాలనూ, వాటికి పోటీ చేసిన అభ్యర్థులను వారికొచ్చిన ఓట్ల వివరాలనూ 1978 వ సంవత్సరం మొదలుకొని 2009 వరకూ చేర్చడం జరిగింది.  అన్నీ బాగున్నాయయ్యా ఐతే ఏంటంట అంటే.... విషయం ఇది.

రాష్ట్రంలో ఎన్ని పత్రికలున్నా ఎవరి అవసరాలు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. వార్తలకూ, విశ్లేషణలకు, వారి అభిప్రాయాలకూ తేడా తెలియకుండా వార్తలు రావడం మనం రోజూ చూస్తూనే వుంటాము. నాలాంటి కామన్ మేన్ కు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. అందుకోసం ఈ ఇ-జర్నలిజమ్ ప్రజలచేతుల్లో.

ప్రతిరోజూ మన చుట్టూ ఎన్ని అవకతవకలు జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఎంత మంది లంచగొండులు ఎన్ని కష్టాలు..ఎంతనష్టం?? వీటినన్నింటినీ మనమేదో ఒక్కరోజులో మారుస్తామని కాదు. అసలు మారకపోవచ్చు కూడా!! కానీ మీకు కడుపు మండినప్పుడు మీ ఘోష ను ప్రక్కవాడితో ఎలా చెప్పుకుంటారో అలాగే ఇక్కడకూడా ఓ ముక్క వ్రాసి పడేయండి. దీనివల్ల పెద్ద అద్భుతాలు జరగకపోవచ్చు కానీ ఓ ఎలక్ట్రానిక్ రికార్డు మాత్రం భద్రమైపోతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయిస్తుంది. ఏమీ చేతకానట్టు కూర్చోవడం కన్నా ఇది నయం కదా?

అలాగే మీరు మెచ్చిన నాయకుడి గూర్చి వ్రాసి పది మందికి తెలిసే టట్లు చేయండి. కారణమేమిటంటే ఈ డాటా ను ప్రాసెస్ చేస్తుంటే నాకు మనరాష్ట్రంలో నున్న అసెంబ్లీ స్థానాలే 30 శాతం దాకా తెలియలేదు. ఇక అభ్యర్థుల సంగతి చెప్పాలా? ఇందులో ఎంతో మంది ఎన్నో సామాజిక ప్రయోజన పనులను చేసే వారుండవచ్చు. వారిగూర్చి పదిమందికి తెలిపే వేదిక ఇది.

ఇందులో మీరు మీకిష్టమైన అభ్యర్థి వివరాలను వ్రాయాలన్నా, Issue వ్రాయాలన్నా, Vote వేయాలన్నా రిజిష్ట్రేషన్ తప్పని సరి. Register అయ్యేటప్పుడు పని చేసే e-mail Id ఇవ్వడం మరువకండి. కారణం email authentication లేనిది మీ రిజిష్ట్రేషన్ చెల్లదు.

ఇలా మరెన్నో .... నేను వ్రాయడం కంటే మీరే వెళ్ళి చూసి మీ అభిప్రాయాలను తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి. ఈ వెబ్ సైట్ మరో సంవత్సరం పాటు ఇలా అభిప్రాయసేకరణలను చేస్తూ వాటిని వెబ్ సైట్ లో చేరుస్తూనే వుంటుంది. 

Feel free to write your views without any hesitation.

Too much work..tired too much.. c u later.

17, జూన్ 2013, సోమవారం

వహ్వా వహ్వా శ్రీ సీతా రాముల సంవాదం

శ్రీ మద్రామాయణ కల్పవృక్షం చాలారోజులనుంచి చదవాలని కోరిక వున్నా ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ అప్పుడప్పుడూ అక్కడక్కడా చదువుతూ అలా బండిని లాగించేస్తున్నానా....అలాగే మొన్నకరోజు కూడా Random గా పేజీలు తిరగేస్తుంటే ఒక రసవత్తర ఘట్టం మనసులో కలిగించిన ఆనందాన్ని అణిచి వుంచలేక చేతనైన పద్యాలని టైపు చేసి బ్లాగులో పెట్టాలని టైపడం మొదలు పెట్టాను. వహ్వా వహ్వా  కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు.

 ఈ నాటకీయత భార్యా భర్తల మధ్య మాటల యుద్ధం, దెప్పిపొడుపులు ఎంత సహజ సుందరమో... ...వీలైనప్పుడల్లా ఇంతలా ఈ పద్యాలు ఎందుకు నచ్చాయో నాకు అర్థమైన వివరణ కూడా వ్రాస్తాను. ఈ లోపు మీరూ పద్యాలకు అర్థాన్ని తెలుసుకొని పద్యాలను పాడండి. పద్యాలను చదివితే మనసుకు అంత ఆహ్లాదం కలగక పోవచ్చు కాబట్టి అర్థవంతగా పాడుకోండి.



గీ || తన్ను హరిణంబు గొనితెమ్మటన్న కాంత సగముసగమైన మై రామచంద్రునకును
తన సమస్తకామమున కాస్థానభూమి కనులయెదుటను వచ్చి సాక్షాత్కరించె

ఉ|| ఈయమహేతువై వనులనెల్ల జరించెను దా బికారిగా
నీయమ హేతువై జలధికెంతొ శ్రమంపడి కట్టగట్టె దా
నీయమ హేతువై గెలుచు టెంతొ శ్రమం బయిపోయె లంకలో
నాయమ జూచినంత హృదయంబున బట్టగరానికోపమై

ఆ|| అతడు రాక్షసుండటంచు సౌమిత్రి వచించె సుంత వినదు చెలువ తాను
ననుభవించె దాను ననుభవించితి మేము నాడ దింతసేయుననుచు గలదె?

ఆ|| రావణుండు నప్సరః కాముకుండును
బరమ దుష్టుఁ డుగ్రభావయుతడు
లజ్జలేదు మఱిబలాత్కార కామాంధుఁ
డతివ వత్సరాంత మచటనుండె

ఉ|| ఇట్టు లనిశ్చితంబయిన యీ వ్యవహారమునందు రాఘవుం
డెట్టుల స్వీకరింపగలడీ ధరణీసుత, నయ్యొ ! సూర్యునిం
దొట్టి పవిత్రతేజములు తోగులువారిన యింట శీలముం
బట్టిన సంశయంబయిన భామినింగొంట యయోగ్యమై చనున్

ఉ|| ఎవ్వడొ దుష్టుడౌ దనుజుఁ డెత్తుకపోయె నదేమి కర్మమో
జవ్వని దేమి తప్పనిన జక్కనిమాట యదే వచింతు నా
జవ్వని పూర్వకర్మమని, జవ్వనిభర్తది పూర్వకర్మ, మా
యెవ్వడొ కర్మ దీని రచియించెనొ వానిది దోసమంతయున్

చ|| చెడుస్థలమందు వానకురిసెన్ జలమయ్యది నేను గ్రొమ్మొయిల్
కడుపున నున్న యప్పటి యకల్మషవృత్తిగట్టిదాన ని
ప్పుడు నన, నీవు పడ్డ పొలముంబడి మాఱితి వీవు, గంగలో
బడిన జలంబునం గలుగు స్వచ్ఛత యేగతి నీకు గల్గెడిన్.

గీ || ఇచట దోసము వీనిదం చెవనినైన గాని పూని నిందింపగా రానిచోటు
దోసమిచ్చట గలదంచుఁ దూచి చూచి నిక్కముగ నిశ్చయింప రానిదగుచోటు

శా|| నన్నుం జూడంగఁ గోరినా వనుచుఁ గాంతా! నిన్ను రప్పించితిన్
నన్నుం జూడంగ నేమియున్నయది? యైనన్ స్పష్టమై పోల్చెఁబో
మున్నే భర్తను నీవు భార్యవును, నా పొల్పిప్డు లోపించె, నా
సన్నంబై యొక దైవ మున్నముడి స్రంసంబందగాఁ జేయుచున్

ఉ|| నాగతి యేమికావలయునా నింక నీవు స్వతంత్రురాల వే
భోగము లీవు కోరెదవొ పూరుషు వానినిఁ గూర్పంగల్గెడుం
జేగ గలానిం జూచికొని చెందుము, లక్ష్మణుండో విభీషణుం
డో గణుతింప సూర్యసుతుండో మఱి నీదగు నిష్టమై చనన్

మ|| మఱియున్ నీకొకమాట  చెప్పవ;అయున్ మారీచునిం జంపితిన్
హరిణంబయ్యది కాదు లక్ష్మణుఁడు యాథార్థ్యంబు వాచించె ని
ష్ఠురు లాయిద్దఱుఁ గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క
బ్బుర మా బంగరులేడిఁ గోరెదని నీవున్ వార లెట్లెంచిరో?



సీత

శా || అంధోబంధము ప్రాణ మున్నపుడు పై నంత్యక్రియల్ సేయు సం
బంధం బుండును మానవావలికి, నీవైనావు నాకిప్డు కా
మాంధ న్నన్నుం బరిత్యజించెగద నీ యగ్రేసరుం డిట్లు నే
నుం ధాయ్యాదిక మాచరింపు మని నిన్నుంగోర లేదెప్పుడున్

శా|| నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా
కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల
చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నే నీ దరి
ద్రాకారంబునఁ జచ్చియుం బ్రతికి యౌరా! యొక్క రీతిం దగున్

మ|| తెరు విమ్మన్న నొసంగు నాజనని ధాత్రీదేవి, సత్ప్రేమభా
సుర, పుట్టింటికి బోవనేటికిఁ ద్రపాశూన్యల్ పతిత్యక్తలై
తరుణుల్, వహ్నినిఁ జొత్తు నే, ననలుఁ డంతర్వీధి నన్నూనఁగా
బరువం చెంచునె? సర్వలోకనిబిడజ్వాలా మహామూర్తియై.

క|| మీయన్న నీవు నెఱుఁగుదు వాయన మది నెంత తలచు నంతయు, సందే
హాయత్తచిత్త మఱి నీ వాయత్తము చేయు మగ్ని నని యాడంగన్

చితి లక్ష్మణుడు అంటించిన తరువాత.... శ్రీ జానకీ దేవి రామునితో నిట్లనియె

శా|| నేనొక్కించుకసేపులోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా
మీ! నీయాజ్ఞ వచింతు గొంచెము సమున్నీలద్యశోధామ! దై
వానన్ వచ్చిన దోస మంతయును నావంకన్ నిరూపింతు, నీ
వైనన్ దైవమ వండ్రు, నీకుఁ గృపలే దందున్ మఱట్లైనచో.

ఉ|| మచ్చికఁ జెట్ట యర్థముల మాటల నంటివి నన్ను నీవనన్
వచ్చును నేను నైఁన బడవచ్చును, బంగరులేడిఁ జూఁడగా
విచ్చిన కంటితో నెడఁద విచ్చెను, విచ్చినగుండెలోపలన్
జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వఋషీంద్రవాంఛలున్

చ|| నలినదళాయతాక్షి హఇణంబును గోరెను, గోరినందునన్
జలనిధి దాటినా వసుర జంపితి వింతటి కీర్తి వచ్చె, ను
జ్జ్వలతరపౌరుషంబునకుఁ బట్టయినాఁడవు, నీవు గుండెలోఁ
గలఁకను మాని చూడు ముపకారము కాదటవే జగత్ప్రభూ!

ఉ|| ఏ ఋషిభావనామహిమ యేర్పడ నాయెదలోనఁ జొచ్చి నన్
గోరఁగ జేసె లేడి, నది కోమలనీలపయోద దేహ! నా
కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా
నేరను వచ్చు, నీవిదియు నేరవె సర్వఋషీంద్రహృత్స్థితా!

చ|| ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం
బు కలుగఁ జూతురు తమోహరణా! దయ జూచితేని కో
రికయును నాది నీకు నురరీకృత కీర్తిరమాఫలప్రదం
బకలుషగుప్త శౌర్యబహిరాగతి దివ్యఫలంబు రాఘవా!

ఉ|| ఆఁడది యింతసేయు ననుటన్నది యున్నదెయంచు నన్ను మా
టాడితి, కైక కోరక మహా ప్రభు! నీవని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసురసంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్.

ఉ|| ఈ పదునాల్గువత్సరము లీవు వనంబులయందు నుండి సీ
తాపతి! నీవు మారవుగదయ్య కిరాతుడొ బ్రాహ్మణుండొ కా
నీ పది రెండు మాసముల నేనును మారను లేద, రాఘవ
శ్రీ పదచిం తనామృత వశీకృత చిత్తనమర్త్యబుద్ధినై.

చ|| మిగిలిన వేమొ లోకమును మీరఘువంశపు గౌరవంబు, న
త్యగణిత విశ్లథీకృత నిరంతర భిన్న విచిత్ర చేతన
త్వగుణ కణానుగం బయి కృతాకృతమైన జగత్తు, తమ్మిపూ
మొగడపు విచ్చి వచ్చిన ప్రభుండు విరించియు జాల డిచ్చటన్

12, జూన్ 2013, బుధవారం

పూరిగుడిసెలో ముసలివాడు

హై హై... ఈ రోజు నా ఇ-పుస్తకాల భోషాణాన్ని వెతుకుతుంటే  నేను ఐదోతరగతిలో వున్నప్పుడు చదువుకున్న తెలుగు పాఠం ఒకటి కనిపించింది. మళ్ళీ ఈ సముద్రంలో ఈ...ఇ పాఠం కలిసిపోతే దొరికే పనేనా?  మా పుస్తకంలో బొమ్మకూడా పాత చందమామ లో వుండే బొమ్మలాగా వుండెది కానీ ఈ ఇపుస్తకంలో బొమ్మలెదు :(


అడవిదాపల నొకపూరిగుడిసెయందు
కాఁపురం బుండె ముదుసలి కాఁపువాడు
అతఁడొకనాఁడు భూమిలో పాతుచుండె
చిన్న మామిడి టెంకల కొన్ని తెచ్చి.

వేఁటలాడఁగ నాదారివెంటఁ జనుచు
తనదు పరివారజనులతో ననియె రాజు
"కాంచితిరె మీర లీమూడుకాళ్ళ ముసలి
చేయుచున్నట్టి చిత్రంపుచేఁత లౌర?

"వృద్ధుఁడక్కట! ఎంతటి వెఱ్ఱివాఁడు?
విత్తుచున్నాఁడు మామిడివిత్తనముల
చెట్లఫలముల తాను భక్షింపఁదలఁచి
ఎంతకాలము జీవింప నెంచినాఁడొ?

కాటి కొకకాలు సాఁచియు కాపువాఁడు
ఉట్టికట్టుక కలకాల మూఁగులాడ
నెంచెఁ గాఁబోలు, లేకున్న నిట్టిపనికిఁ
బూని కాలంబు రిత్తగాఁ బుచ్చనేల!

నృపునిమాటల నాలించి వృద్ధుఁడనియె
"చెట్లఫలముల తిన నపేక్షించి కాదు
మున్ను మనపెద్ద లందఱు చన్నరీతి
ఆచరించితి నంతియె అవని నాథ!

వారు నాఁటిన వృక్షముల్ ఫలములీన,
అనుభవించుట లేదొకో మనము నేఁడు!
అట్లె, మన మిప్డు నాఁటిన చెట్లఫలము
లనుభవింతురు గద ! మనతనయు లవల

అంత నారాజు ముసలివాఁడాడినట్టి
పలుకులకు నాత్మ నెంతయు ప్రమద మంది,
గౌరవము మీఱ నాతని గారవించె
ఏడుబంగారు కాసుల నెలమి నొసఁగి.

అంత నవ్వుచు నావృద్ధుఁ డనియె "ఱేఁడ!
రిత్త కాలేదు నేఁడు నా విత్తనములు
అహహ! నాఁటిన తొలినాఁడె అక్కజముగ
ఏడుబంగారు ఫలముల నీనెఁ గాన


ఎంత మంచి పాఠమో...ఆరోజుల్లో అని రీల్ ను వెనక్కితిప్పితే..అప్పట్లో నేర్చుకున్న కఠిన పదాలు, జాతీయాలు కూడా కొద్దిగా గుర్తు ...

ఱేడు
ప్రమదము
రిత్త

"ఉట్టికట్టుక కలకాల మూఁగులాడు"
"కాటి కొకకాలు సాచి"

28, మే 2013, మంగళవారం

భారత ప్రజా ప్రతినిధులు.. మన కష్టాలు. Linking people with politicians


రెండున్నర నెలలైందా ! అనుకుంటా!!... ఈ బ్లాగు అడ్రసు కూడా కాసేపు గుర్తు చేసుకుంటే కానీ గుర్తుకురానని మొరాయించింది. తాళపు గుత్తి ఎక్కడుందో వెతికి లోపల చూద్దునా  మీసం, గడ్డం బాగా పెరిగిపోయినట్టున్నాయి. ఇల్లంతా బూజుపట్టి ఏది ఎక్కడుందో కనిపించటం లేదు. కాసేపు కష్టపడి కాస్త చీపురు పట్టుకోని చిమ్మినాక, ఏదో ఒకపోస్టు రాయకపోతే ఈసారి తలుపుకొట్టినా నేను తలుపు తియ్యను పో అని ఎక్కడ బ్లాగుపెళ్ళాం మొరాయిచ్చేస్తుందేమోనని ఈ పులిహోర.

బహుశా ఓ మూడు నెలల క్రితమనుకుంటా అమావాస్య అర్థరాత్రి ఏదో కలలాంటి ఆలోచన వచ్చింది.కలలన్నీ నిజం కావు కాబట్టి ఈ ఆలోచన కూడా నిజం కాదు. కానీ ఆ కల బైప్రాడక్ట్  గా ఓ చిన్న పని మొదలుపెట్టాను. దాని పర్యవసానంగా భారత ఎలక్షన్ కమిషన్ ( Election commission of India) వద్ద నున్న సమాచారాన్ని ఎనాలిసిస్ చెయ్యడం మొదలు పెట్టాను. ఈ సమాచారం Election commission of India website లో ఫ్రీ గా దొరకుతుంది.  ఇలాంటి ఎనాలసిస్ లకు ముందుగా డాటాను ప్రాసెస్ చెయ్యాలి కాబట్టి ముందుగా ఆపనిని మొదలు పెట్టాను. నిజానికి ఇది చాలా సులభమైన ప్రక్రియ అనిపిస్తుంది కానీ ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ ప్రజాస్వామ్య  ఎలక్షన్ల రిజల్ట్స్ ను ప్రాసెస్ చెయ్యాల్సి వచ్చేటప్పటికి ఓ రకంగా stars కనిపించాయి అని చెప్పాలి. ఎందుకో, ఏమి చెయ్యాలనుకున్నానో ఈ క్రింది పారాల్లో తెలుస్తుంది.

మనకు రాష్ట్రంలో ఎలక్షన్స్  వచ్చే సంవత్సరంలో రానున్నాయి కదా ! ఈ సందర్భంగా మనరాష్ట్రంలో 1950 వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి అసెంబ్లీ స్థానంలో ఎవరెవరు, ఏ పార్టీ తరపున  పోటీ చేసారు, వారికి వచ్చిన ఓట్లెన్ని? ఆ అసెంబ్లీ స్థానంలో ఎంతమంది ఓటర్లు వున్నారు, వారిలో ఎంతమంది ఓట్లు వేశారు? ఏ పార్టీలు ఏ ప్రాంతంలో బలంగా వుండేవి? ఇప్పుడు ఆపార్టీలు ఎందుకు బలాన్ని కోల్పోయాయి మొదలైన విషయాలు తెలుసుకుందామని ఈ exercise మొదలైంది.  ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడంద్వారా ప్రయోజనాలలాంటివి ప్రక్కన పెడితే  మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత సంక్లిష్టమైనదో అర్థమైంది. Hats off to the Election commission of India for their efficiency.

ఎనాలిసిస్ లోకి వెళ్ళేముందు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసుకునేటువంటి కొన్ని assumptions ను నేనూ చేసుకున్నాను. అందులో అతిముఖ్యమైంది

ఒక రాష్ట్రంలో నున్న అసెంబ్లీ స్తానాల పేర్లు ఎప్పటికీ మారవని. Seems a very reasonable assumption..right. :-). కానీ ఓ నాలుగు రోజులు కొట్టుకున్నాక నేను parse చేసేటటువంటి డాటా ఎందుకు తప్పుగా వస్తుందో తెలిసింది. చాలా చిన్న కారణం.  కానీ ఈ చిన్న కారణమే ప్రజా ప్రయోజన సాఫ్ట్వేర్ ను రూపొందించడం ఎంత కష్టమో కూడా తెలియచేసింది. వివరంగా చెప్పాలంటే .....

ఇప్పుడు నర్సాపూరు అసెంబ్లీ నియోజక వర్గాన్ని తీసుకున్నామనుకోండి. దాన్ని తెలుగులో రాస్తే సాధారణంగా నర్సాపూరు అనే వ్రాస్తామనుకుంటా... కానీ ఎలక్షన్ కమిషన్ వారి వద్ద దొరికే PDF ఫైల్ ఇంగ్లీషులో వుంటుంది. అక్కడ నర్సాపూరు ను ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఒక్కోరకంగా వ్రాసి పడేసారు. ఈ నర్సాపూరు ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి ఈ క్రింది రూపాలు సంతరించుకుంది.

1)  Narsapur
2)  Narasapur
3)  Narasapuru
4)  Narsapuru

If you see the above names, all are right....right? Yes, This drives me nuts to identify the actual assembly constituency name. ఇదొక్కటే కాదు ఇలాంటివి బోలెడు. అసెంబ్లీ చివర పల్లె లేదా ఊరు వచ్చిందంటే నాకు సినిమా తారలు తళుక్కున కనిపించేవి.  మరికొన్ని ఉదాహరణలు

అనకాపల్లె = Anakapalle , anakapalli
మదనపల్లె = Madanapalle, Madanapalli, Madanpalli.....

పై Variations కు తోడు ఒకే పేరున్న అసెంబ్లీ స్థానం వేరేవేరే జిల్లాల్లో చూసిన తరువాత.... ఔరా ఏమీ ఈ మాయ అనుకోవాల్సి వచ్చి అర్జునుడు అస్త్ర సన్యాసం చేసి నట్టు నేను నా కంప్యూటర్ సన్యాసాన్ని పుచ్చు కున్నాను. మళ్ళో కలలో గీతోపదేశం అయ్యేంతవరకూ.....

ఈ ఇ-కష్టాల ఇక్కట్లు ఎలా వున్నా నాకు తెలియని చాలా ఆసక్తి ని గొలిపే విషయాలు వెలుగు చూసాయి. వాటిల్లో అతిముఖ్యమైనవి

1) 1950 ల్లో మనరాష్టంలో కాంగ్రెస్ అసలు నామరూపాలు కూడా లేవని మీకు తెలుసా? ఆరోజుల్లో మనరాష్ట్రం పూర్తిగా కమ్యూనిష్టు రాష్ట్రం
2) 1985 వరకూ రాజకీయాల్లో పెద్ద చైతన్యం కానీ అవినీతి కానీ వున్నట్లు కనిపించదు. అంతేకాకుండా చాలా అసెంబ్లీ స్థానాలకు ద్విముఖ పోటీ మాత్రమే వున్నది
3) 1989 వరకూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పెద్దగా పని చేసిన దాఖలాలు కూడా కనిపించవని చెప్పడానికి సందేహ పడక్కరలేదనీ కూడా మీరు డాటాను ప్రాసెస్ చేసే టప్పుడు గుర్తించగలుగుతారు. ఆ తరువాత నుంచి you will see the clear difference.
4)  1985 తరువాత రాష్ట్ర రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోయింది. 1985 తరువాత మనకు ద్విముఖ పోటీలున్న అసెంబ్లీ స్థానాలు అసలు కనిపించవు.
5)  రాష్ట్రంలో కూడా మనమెప్పుడూ పేర్లు వినని రాజకీయపార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎంతమందో ఇండిపెండెట్లగా పోటీచేస్తున్నారు. when you see this kind of picture, you will appreciate Election Commission and our democracy. Yes..in fact it is healthy.

6) అన్నింటికంటే నాకు నచ్చిన అంశం. నేను డిజైన్ చేసిన డేటాబేస్ చాలా రోబస్ట్ అని మీసాలు మెలివేసుకుంటున్న సమయంలో ఢిల్లీ,  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానల అభ్యర్థుల వివరాలు నా డిజైన్ ను బ్రేక్ చేసాయి.  Database లో అభ్యర్తుల వివరాలను save చెయ్యటానికి ఒక Composite key ని Define చేసికొన్నాను. Composite key అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనల్ని ఎవరైనా పిలవాలంటే మన పేరుతో పిలిస్తేనేకదా పలుకుతాము. అలాగే కంప్యూటర్ లో దాచిన వివరాలు కూడా పలకాలంటే దానికీ ఓ ప్రత్యేకమైన పేరు పెట్టాలి.

విశాఖపట్నానికెళ్ళి "సింహాచలం" అని పిలిస్తే ఓ పది మంది వెనక్కి తిరిగి చూస్తారు కాదా!!!.... మరి ఏ సింహాచలాన్ని పిలిచినట్లు?? అందుకని ఎలక్షన్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థిని unique గా గుర్తుపట్టడానికి వీలుగా నేను చేసుకున్న assumption ఏమిటంటే...... ఒకరాష్ట్రంలో ఒక జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానంలో ఆ సంవత్సరంలో ఒక పార్టీ మీద ఒకేపేరున్న మగ లేకా ఆడ అభ్యర్థి ఒక్కరే పోటీ చేస్తారని. అంటే
State, District, Assembly, Year, Party, Gender,Name..... ఇదన్న మాట నా unique key. బాగుంది కదా :-). కానీ పోయిన ఎలక్షన్ లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానంలో ఒకేపేరున్న ఇద్దరు మగ అభ్యర్థులు ఒకే పార్టీ గుర్తుపై పోటీ చేసారు :-) . నమ్మశక్యం కావడం లేదా?? ... నమ్మాలండీ. ఆ పార్టీ ఏమిటో తెలుసుకోవాలనుందా? Independents :D

[ Note that date of birth is not available with election commission of India ]


7) మరో అతిముఖ్యమైన పరిశీలన ఏమిటంటే, ఈ మధ్య కాలంలో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు పెరిగారు. కొన్ని స్థానల్లో ఇండిపెండెట్లందరూ కలిసి వుంటే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓడిపోయేవారు.


ఇలాంటి చాలా పరిశీలనలను మీరూ మరో నెలలోపు చూడవచ్చు. క్రొత్తగా రాబొయ్యే ఓ వెబ్సైట్ లొ పై వివరాలతో పాటు , మీరు మీ మీ గ్రామాల, మండలాల, అసెంబ్లీ వివరాలను కూడా ప్రచురించి సోషల్ మీడియా ల్లో పబ్లిష్ చేసుకునే అవకాశం వుంది. By the way, I was making an attempt to learn few latest frameworks. వాటిని నేర్చుకుంటూ build చేసింది కాబట్టి expect errors in this coming alpha version. Moreover, This will be open to public, meaning people are the administrators. People can administer from a village level to a state level. A user will be promoted to different levels based on his content contribution.



Anybody can post anything and anybody can report on any thing. There will be a public and private site. In fact you can choose your group and share your articles with that group only. It is the people who make it or break it. Any venture capitalists? In short it is a mini social web linking politicians with people.

Few screen shots....... so stay tuned for initial alpha version with limited features. These are not even 25%... Expect much more when it goes live.















Thanks for reading half technical, half formal and fully confused article :-)

6, ఏప్రిల్ 2013, శనివారం

Basic difference between India and China

China is adopting software and re writing it for chinese

India is adopting English and using existing software.


హ్మ్... ఇలా అలోచిస్తే ఇండియాలో అందరికీ ఇంగ్లీషు వచ్చేదీ లేదూ, మనం ముందుకు పొయ్యేదీ లేదు. ఇప్పుడే కాదు మరో వందేళ్ళవరకయినా గ్యారంటీగా వ్రాసిస్తాను.

కాబట్టి ఎవరి సంస్కృతిలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని Develop చేసుకోలేరో వారెప్పటికీ స్వతంత్రులు కాలేరు. మనకు అవతల వాడికి తెలియకుండా కాపీ కొట్టడం బాగా నే తెలుసు కానీ దీని తస్సాదియ్యా భాషలు వేరయి పోయి చాలా సాంకేతిక పరిజ్ఞానం మన భాషలకు పనికి రాకుండా పోయింది, లేకుంటే ఈ పాటికి కాపీలో చైనాకంటే ముందు వరుసలో వుండే వాళ్ళం కదా. ఆ రకంగా చైనా వారిని అభినందించక తప్పదు. కాపీలో కూడా ఇండియా చాలా వెనకే వుంది.


మరో ముఖ్యవిషయం కూడా..ఇండియా లో వ్యాపారం చెయ్యటం చాలా కష్టం. ఒక ఐడియా ను మార్కెట్ చెయ్యటమూ కష్టమే. మన వాళ్ళు డబ్బు పెట్టి కొనాలంటే  ముందుగా ప్రక్క వాడి జేబు చూసి కుదరకపోతే అప్పుడు కదా వాళ్ళ జేబులో చెయ్యి పెట్టేది. దానికి తోడు ఐడియా తస్కరణ ఎలాగూ యధేచ్చగా సాగుతూ వుంటుందాయె.

5, ఏప్రిల్ 2013, శుక్రవారం

తెలుగు ప్రజానీకానికి మరొకొన్ని సత్తా గల ప్రశ్నలు....:)

మనం ఏదో మంచి పనిలో వున్నప్పుడో, లేదా బాత్రూమ్ లో బాగా బిజీగా వున్నప్పుడో ట్రింగ్ ట్రింగ్ మని ఫోను మ్రోగుతుంది కదా ! ఏదో కొంపలంటుకున్నట్టు ఫోను తీస్తామా. తీరా అవతల వైపు నుంచి "మేము ICICI bank నుంచి మాట్లాడుతున్నామండి. మీకు మా బ్యాంకు సేవలు నచ్చితే "అవును" అని లేదంటే "కాదు" అని చెప్పండి" అని Message వివి వుంటారేమో కదా?  మీరలా "అవును" లేదా "కాదు" అని అన్నప్పుడు అటువైపు system confuse అవకుండా గుర్తు పట్టిన సందర్భాలేమైనా వున్నాయా? ఇక్కడ మిమ్మల్ని "1" లేదా "2" అని నొక్కండి అని అడగటం లేదు గమనించండి. మీరు ఫోనులో "అవును" లేదా "కాదు" అని మాత్రమే చెప్తున్నారు. అటువైపు వున్నది మనిషి కాదు కాబట్టి దానికి "అవును", "కాదు" కూడా గుర్తు పట్టడం కష్టతరమే.

ఇక ఎవరైనా స్పీచ్ రికగ్నైజర్  లేదా  IVR డెవలపర్స్ లేదా Call Center డెవలపర్స్ వున్నట్లైతే మనకు తెలుగులో ఏ ASR ( Automatic Speech Recognizers )  వుత్తమమైనది? Panda ( Microsoft ) plat form తెలుగు ను రికగ్నైజ్ చెయ్యగలుగుతుందా?


 ఎవరైనా Dragon Nuance Engine వాడినారా? Recognition success rate ఎంత? Grammars tune చేయడం ద్వారా ఎంత success rate ని ఇంప్రూవ్ చెయగలిగారు? ఒక్కో T1 Swich rate ఎంత వుంది ? Outbound phone calls కి ఏ క్యారియర్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు?

ఇప్పటికింతే...నా వయసు పదహారే.... :))

1, ఏప్రిల్ 2013, సోమవారం

ఈ ప్రశ్నలకు సమాధామివ్వగలరేమో చూస్తారా?

మళ్ళీ వార్తాపత్రికలమీదకి గాలి మళ్ళింది.కాకపోతే ఈ సారి కొన్ని సందేహ నివృత్తులకోసం ఈ టపా.  మన బ్లాగుల్లో చాలా మందే విలేఖరులున్నట్లున్నారు. వారిద్వారా సమాధానాలను సేకరిద్దామన్న ప్రయత్నం.

నాకు వచ్చిన సందేహాలివి.ఒక సంవత్సర కాలాన్ని గడువుగా తీసుకుంటే ప్రతి వార్తా సంస్థ నుండి దరిదాపు 365 రోజుల వార్తా పత్రికలు వెలువడుతాయి కదా. ఈ సంవత్సర కాలంలో వెలువడ్డ వార్తా పత్రికలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో ప్రయత్నించండి.

1) ప్రతి పేపరూ ఇప్పుడు జిల్లా ఎడిషన్ ప్రచురిస్తుంది కదా. ఆ జిల్లా ఎడిషన్లో నెలలో కనీసం పదిరోజులన్నా  జనాల సమస్యల గూర్చి వ్రాస్తారు అని నా ఊహ. ఈ సమస్యలను పత్రికలో అచ్చు వేసిన తరువాత ఒకవేళ ఆ సమస్యలు పరిష్కారమైతే వాటినీ ప్రచురిస్తారా లేదా? ఒకవేళ ప్రచురించినట్లైతే సంవత్సరాంతంలో ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయో ఎలా తెలుసుకుంటారు? ఇలా తెలుసుకోవడానికి ఏమైనా సాధనాలు వార్తా పత్రికల వద్ద వున్నాయా?

2) ఎప్పటిదో వార్తను అవసరార్థం ఈ రోజు వార్తలో ఉటంకించాలంటే ఆనాటి వార్తను ఎప్పుడు ఏ రోజు పత్రికలో ప్రచురించారో ఎలా కనిపెడుతున్నారు?

3) ఇక Off the topic, when a paper campaigns for a candidate they will have to get the complete details about his constituency and his successes and failures in the last 5 years. How do they manage this data? would some one writes the news on behalf of him by doing reasearch and submits the news or are there any proven fast methods?

4)  ఎంత డబ్బు పంచినా, ఎంత సారా పారినా, ఎన్ని కుల సమీకరణాలున్నా గెలువగల అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నాడు కదా? ఒక అభ్యర్థిని ఎన్నుకొనేటప్పుడు ఓటర్లు డబ్బు,సారా,కులం కాకుండా ఇంకేమైనా చూసి ఓట్లు వేస్తున్నారా? ఒకవేళ వేస్తున్నట్లైతే అవేమిటి? నియోజక వర్గ అభివృద్ధా లేక వ్యక్తిగత అభివృద్ధా?

అబ్బో ఇంకా చాలానే ప్రశ్నలున్నాయి కానీ ఇప్పటికే చాలా అడిగేసినట్టున్నాను. ముందు వీటికి సమాధానాలు దొరికితే అప్పుడు మిగిలినవి చూద్దాం.

31, మార్చి 2013, ఆదివారం

ప్రేమించుకుందాం......... రా

 
    పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
    పల్లకిని తెచ్చేసిందే బాలా...
    హడావిడిగా రెడి అవుదాం చలో లైలా
    ముచ్చటగ మేళం వుంది... ఆజా ఆజా
    తద్దినక తాళం వుంది... ఆజా ఆజా
    మంటపం రమ్మంటుంది... ఆజా ఆజా
    జంటపడు వేళయింది... ఆజా ఆజా

    పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
    పల్లకిని తెచ్చేసిందే బాలా...


    అక్షితలు వేసేసింది షాదీ
    అడ్డుతెర తీసేసింది షాదీ
    స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
    ఇష్టపడు కన్యాదానం.. లేజా లేజా
    జానెమన్ ఏ దుళన్ కో... లేజా లేజా
    మై డియర్ హబ్బి ముజ్కో... లేజా లేజా
    ఆశపడు అందం చందం... లేజా లేజా

    అక్షితలు వేసేసింది షాదీ
    అడ్డుతెర తీసేసింది షాదీ

    ఆలుమగలై పోయామే... భామా
    అసలు కథ బాకీ వుంది... రామ్మా
    అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా

    మల్లెలతో మంచం సిద్ధం... దేఖో దేఖో
    అల్లరితో మంత్రం వేద్దాం.. దేఖో దేఖో
    మన్మధుని ఆహ్వానిద్దాం... దేఖో దేఖో
    ముద్దులతో సన్మానిద్దాం... దేఖో దేఖో
    ఆలుమగలై పోయామే... భామా
    అసలు కథ బాకీ వుంది... రామ్మా
    అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా.. ఆ.. ఆ..



--సిరివెన్నెల

30, మార్చి 2013, శనివారం

People use this link to get details from Google.

ఏ  వ్యక్తులనుండైనా మీకెప్పుడైనా abusive comments వస్తే don't let them go. Use the following link to get the user details and report in local police station.


https://support.google.com/mail/contact/abuse?hl=en&rd=1

26, మార్చి 2013, మంగళవారం

మీ అందాల నటుడు "ధీరోదాత్తుడు" అందచందాల తార "ప్రగల్భ" నటించిన నవరస భరిత చిత్రం

మీ అందాల నటుడు "ధీరోదాత్తుడు" అందచందాల తార "ప్రగల్భ" నటించిన నవరస భరిత చిత్రం అతి త్వరలో హృదయస్పందనల టాకీస్ లో విడుదల కాబోతుంది. 

ఆనెక్కు టికెట్టు దొరకలేదని బాధపడక్కరలేకుండా  ఉల్లిగడ్డ నంజుకొంటూ సద్దికూడు పొట్టనిండా తిని గతుకుల రోడ్లను లెక్కచేయకుండా ఎఱ్ఱబస్సులో మా యీ టాకీస్ కి వచ్చి ఇప్పుడే ఓ తుండుగుడ్డ, కండవ, పైపంచె సీట్లో వేసుకొని టిక్కెట్టు రిజర్వు చేసుకోండి. 


ఇప్పుడు సినిమా ట్రైలర్ అన్నమాట.....


టాయ్..టట్టడాయ్..ట్టాయ్య్...ట్టట్టడ్డాయ్య్...

శృంగార వీరరసముల నుఱ్ఱుత లూగిస్తూ  ఆశల సౌధంలో విహరింపచేసే చిత్రం
అందాలు ఆరబోసి రంభామేనక తిలోత్తమలకు సైతం చెమటలు పట్టించే చిత్రం
ఆంగిక ,వాచక, ఆహార్య, సాత్వికాభినయనంలో కళ్ళుచెదిరి గుడ్డి వాళ్ళను చేసే చిత్రం :))

హమ్మయ్య ట్రైలర్ సూపర్ గా వ్రాశాను కాబట్టి సినిమా ఓపనింగ్స్ బాగా వుంటాయి లెండి :)))


ఇంతకీ ఈ పోస్టు ఇప్పుడెందుకు వ్రాయల్సొచ్చింది? ఏకంగా మొత్తం వ్యాసమొక్కసారే రాయొచ్చుకదా !!! వచ్చిందా మీకా అనుమానం? అబ్బే అదేమీలేదండీ ఇదో ఐడెంటిటీ క్రైసిస్.

24, మార్చి 2013, ఆదివారం

మనమెంత భద్రం ? ఈ యుగంలో భారత యుద్ధంలో లా కత్తులు కటార్లు అక్కరలేదు.

If anyone is close to any telugu news paper, you may share this post with them.

మన వార్తా పత్రికలకు  IT డిపార్ట్ మెంట్ అంటూ ఒకటి వుంటుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వున్నా వారి జీతభత్యాలు ఎంత వుంటాయో తెలియదు. జీతాలు పెద్దగా లేకపోతే పనిచేసే సామర్థ్యత ఎంత వుంటుందో  కూడా చెప్పడం కష్టమే. ఇదంతా ఇప్పుడు ఎందుకు వ్రాయాల్సి వస్తుందంటే గత నాలుగు రోజులుగా నాకు చేతనైనంత గొడవచేస్తున్నా తాత్కాలికంగా తప్ప  పరిపూర్ణమైన  ఫలితం కనపడలేదు. పాఠకుల భద్రత ఇప్పటికీ  గాలిలోనే.  ఇవి కూడా  Third party వారి సర్వర్స్ లో నడుస్తున్నాయా అనుమానం కూడా వస్తుంది.

ఇక ఈ వైరస్ గురించి చెప్పాలంటే ఇవి ఉడతలు, మండ్రగబ్బలూ, పసిరిక పాములూనూ !! అవును :-))). మీమీ నిరాధారమైన గాలి వార్తలను ఊహలను ఆపి కాసేపు క్రింది పేరా కూడా చదవండి.


నిజానికి ఈ వార్తాపత్రికల సర్వర్ లకు పట్టిన వైరస్  " Linux rootkit Virus " లాంటిది.. rootkit Virus అంటేనే మీరూ నేనూ వ్రాసేటటువంటి వైరస్ లు కాదు. వ్రాయలేమా అంటే వ్రాయగలమేమో కానీ చాలా సమయాన్ని, అంకిత భావాన్ని వినియోగించాల్సి వస్తుంది. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్స్  లో code ని inject చెయ్యడం ద్వారా పనిచేస్తాయి. మన వార్తాపత్రికలకు పట్టిన వైరస్ ఇటువంటిదే. ఇంత సమయాన్ని వెచ్చించినవారు ఊరికే వుండరు కదా ! ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ వైరస్ బ్యాంక్ లావాదేవీల కోసం శృష్టించబడింది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే వుంటుంది :))



ఇది ప్లగిన్ ద్వారా వ్యాప్తి చెందినదంటున్నారు.
 
ఈ క్రింది బొమ్మలో వివరాలను చూడవచ్చు.






అదనపు  వివరాల కోసం ఈ క్రింది వ్యాసాన్ని చదువవచ్చు.

http://arstechnica.com/security/2012/12/apache-plugin-turns-legit-sites-into-bank-attack-platforms/