22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

హైదరబాదు చూడరబాబూ...నెత్తుటేరుల ఈదర బాబు



Hyderabad needs a real  tough policing .....

ఇది ఒకటవసారా లేదా రెండవసారా తీవ్ర దిగ్భ్రాంతిని  చిలకపలుకులు లాగా వల్లెవెయ్యటానికి? ఒకరు రెండురోజుల ముందే సమాచారముందంటారు కానీ ఎక్కడో తెలియదు. అసలు ఇలాంటి దాడులు జరిగినప్పుడు బొట్టుపెట్టి బాబూ మేము ఇదిగో ఈ సిటీలో బాంబులను మీ ముడ్డిక్రింద పెట్టిపోతాము అని చెప్పి మరీ చేస్తారా? సరైన టార్గెట్ ను కనుక్కొనడంలో కష్టాలుండవచ్చు. కానీ ముందు జరిగిన పేలుళ్ళ ద్వారా భారత పోలీసు వ్యవస్థ ఏమైనా నేర్చుకుందా? పోనీ నేర్చుకుందనుకున్నా అసలు ముందుగా గుర్తించి పేలుళ్ళు జరగకుండా ఆపిన సందర్భాలెన్ని? దారిన పొయ్యే దానయ్యలు సైకిలో స్కూటరో వేసుకొచ్చి చక్కగా సుష్టుగా భోజనము చేసి సంచీ మర్చిపోయి వెళతాడు. ఆ తరువాత అతి మామూలుగా ధనా ధన్ మని పేలుళ్ళు, అమాయక ప్రాణుల అవయవాలు చిదుగై చెదిరి రోడ్లపైన.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా హడావిడి. చనిపోయిన ప్రతి కుటుంబానికి నాలుగో ఐదో లక్షలిచ్చి చేతులు దులుపేసుకొని రాజకీయాల్లో మునిగి తేలుతూ, సరిగంగ స్నానాలు ఆచరిస్తూ, దొరికిన కాడికి దోచుకుంటూ,దొరకని దానిని దారికి ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తూ, ఆచరణల్లో పెడుతూ, ఐదేళ్ళకొకసారి పడుతూ  లేస్తూ జనవాసాలలో జనానికి దొరకకుండా సంచరించే మహానుభావులు ఇలాంటివి జరిగినప్పుడు విషన్నవదనులై నోటి ముత్యాలు రాల్చి ఆ ముత్యాలను ఏ వార్తాపత్రికలు బాగా ఒడిసి పట్టుకున్నాయో నని ఆరాలు తీస్తూ మరుసటిరోజుకే రాజకీయ భవిష్యత్తుపై ప్రణాళికా రచనలో నిమగ్నులై పోతారు.

అవును మనది సెక్యులర్ దేశమా? సెక్యులర్ ముసుగులో మతాలను ఏరకంగా వాడుకుంటున్నారో ఎవ్వరికీ కనిపించదా?  ముస్లింలు లేని ప్రదేశాల్లో ఇలాంటి బాంబుదాడులు ఎన్ని జరిగాయి?గణాంకాలను బయటికి తీసి చూడండి. ఇదేమన్నా దేశజనాభాను లెక్కించాల్సిన సమస్యా? కాదే !!! ఒక పౌరునిగా భారత రాజ్యాంగానికి అనుసరించి నడుచుకోకపోతే వాడిని ఏమి చేయాలి? అవును ముస్లింలు కదా !!! Touch me not.... Do you really think even a muslim support these kind of barbarian attacks? isn't it your plot for your political career??  అసలు వీళ్ళు భారతీయులా లేక  ముస్లిములు మాత్రమేనా??  ఇలాంటి వారిని నాలుగు పీకడానికి "భారత నిర్మాత" ల దగ్గర దమ్ములుండవు. అవును మరి ఓట్లకుండలకు చిల్లులు పడతాయి కదా? నిజానికి నీదేశానికి శత్రువు ఉగ్రవాది కాదు. నువ్వే....అవును ముమ్మాటికీ నువ్వే!!!

ఇంటెలిజెన్సీ వ్యవస్థను పటిష్టీకరించడానికి దేశంలో డబ్బులుండవు.... సారీ డబ్బులేకేమీ బ్రహ్మాండంగా వుంటుంది కానీ ఆచరణలో ఆ డబ్బు అయ్యవారి అలమరాల పాలు. నిన్ననే కదా ఇది జరిగింది ఓ వారంపోతే అన్నీ సర్దుకుంటాయని ఓ  అయ్యేయస్సుల సారు అయ్యేపియస్సల వారు ఉచిత సలహా ఒకటి పడేసి వాళ్ళ వాళ్ళ కెరీర్ గ్రాఫ్....సారీ మనీకెరీర్ గ్రాఫ్ ల్లో నిమగ్నమైపోతారు.


ఎంతకాలం నెల? రెండునెల్లు?? ఆ తరువాత పరిస్థితి  మాములే.... ఎవరికి తెలియని కథలివి? క్రొత్తగా చెప్పుకోవడానికేముంది గనక? yes you are right ....మా ఆవేశాలెంతసేపు మహా ఐతే ఓ పదిరోజులు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. "లైట్ తీస్కో భాయ్" వారం పోతే అంతా అదే సర్దుకుంటుంది.

3 కామెంట్‌లు:

  1. యువతరం ఫేస్ బుక్ కామంలో
    రక్షకులు లంచాల కామంలో
    రాజకీయాలు అరాచక అవినీతి కామంలో
    విద్యార్ధులు రాంకుల కామంలో
    మతోన్మాదులు బాంబుల కామంలో

    రిప్లయితొలగించండి
  2. ఓటర్లు డబ్బు-మందు కామం లో,అధికారం లో లేని వారు-సీఎట్లు రాని వారు సూడో సెక్యులరిసం తో నిండి "అఫ్జల్ గురు" అమాయకుడు అని ర్యాలీ లు తీస్తూ శిక్షలు వద్దని వారిస్తుంటే ఈ చచ్చు పనులు చేసే ఉగ్రవాదులకి భయం ఎక్కడ?ఆ ఏముందిలే జైల్లో వేస్తే "వర-వర రావు"లాంటి వారు మన పేరు మీద ర్యాలీ తీసి సెలెబ్రిటీ హోద ఇస్తారు అని ఇంకా ధైర్యంగా బాంబు ధాడులు చేస్తారు మరి!

    రిప్లయితొలగించండి

Comment Form