26, జులై 2013, శుక్రవారం

ఫేసు బుక్కు తో విడాకులకు ఫైలు చేస్తున్నా :-) వామ్మో ఫేసు బుక్కు - 2

ఫేసు బుక్కు వాడికి నా ఫ్రెండ్స్ లిస్టు చూసి కన్ను కుట్టింది. అప్పుడేమో మరీ ఇంత స్పీడు పనికిరాదు బాబూ అంటే సరేనని ఏదో ఒకటి అర Friends Request పంపుతున్నానా!! తీరా ఈ రోజు ఒక రెండు రోజులదాకా అసలు నువ్వు Requests పంపడానికి వీల్లేదని హుకుంజారీ చేశాడు. సరే ఇంక చేసేపనేముందిగనక మళ్ళీ బ్లాగుల్లోకొచ్చి ఇలా టపా వ్రాసుకుంటున్నాను.

ఫేసుబుక్ ఎకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసానో గుర్తులేదు.అలాగే ఈ ఫేసుబుక్ కి నేను కనీసం మామూలు పంకాను కూడా కాదు. దానికి తోడు మన బ్లాగర్లలో బహుశా ఎవరైనా ఫేసుబుక్ లో పనిచేసేవాళ్ళున్నారేమో, గత నెల వరకూ అప్పుడప్పుడు నా అకౌంట్ నూ వాడేసి కొన్నట్లున్నారు. ఐనా దేనికి security వుంది కనుక. మొన్నటికి మొన్న Apple  సంస్థ గంపగుత్తగా వారి దగ్గర నమోదు చేసుకున్న credit cards లను సైతం ఎవరికో దాసోహం చేసేసింది. ఇక ఫేసు బుక్కు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం పెట్టుకున్న Privacy settings వాటంతట అవే మాయమైపోతుంటాయి. మాయమైపోవడానికి Software లోపమైనా కావచ్చు లేదా అక్కడ పనిచేసేవారి నిర్వాకమైనా కావచ్చు లేదా అకౌంట్ లోకి వేరే ఎవరైనా చొరబడి కూడా వీటిని మార్చ వచ్చు.

సరే  గత పది రోజులగా haaram ను కొద్దిగా market చేసుకుందామని ఫేసుబుక్కులోకి లాగిన్ అయి రాచకార్యాలను చక్కపెట్టెడం మొదలు పెట్టాను. ఈ పదిరోజుల్లో నేను గమనించిన విషయాలు ఇక్కడ కొన్నింటిని మాత్రమే వ్రాస్తాను.ఈ ఫేసుబుక్కులో నాకు నచ్చిన వ్యాసాలు ఏ ఒక్కశాతమో కనిపించాయి. తాను మెచ్చిందే రంభ అన్నట్లు, నచ్చడమనేది ఆ సమయంలో వారి వారి మానసిక స్థితి బట్టి వుంటుంది కాబట్టి ఎవరిష్టం వారిదనుకోండి. ఇంతకీ మీరు నచ్చే వ్యాసాలు వ్రాశారా అని నన్ను నిలదీయకండి. అక్కడ నా ఏకైక ఎజెండా ప్రచారమే. ఐతే ఈ ఫేసుబుక్కు నిండా నాలాంటి ప్రచారగాళ్ళే అని తెలిసి ఔరా అని ముక్కుమీద వేలేసి గోక్కున్నా :-). ఏదైతేనేమీ ఏ విషయాన్నైనా వేలమందికి క్షణాల్లో చేరేవేసే సాధనం ఈ ఫేసు బుక్కు.

ఇక అక్కడ ఛాట్స్ చూస్తే భలే భలే అనిపిస్తుంది :-)

వున్నట్లుండి "Hi" అని మెసేజ్ వస్తుంది. తిరిగి "Hello" అంటే రిప్లై వుండదు. మరికొంతమందేమో కాసేపు మాట్లాడి ఈ పప్పుసుద్దగాడితో లాభంలేదనుకొని మాయమైపోయే రకాలు. ఇంకొంతమందేమో మరో టైపు... ఐనా ఇలా టై వేస్టు చేసుకొనే బదులు కావాలంటే నేరుగా పార్కులకెళ్ళాలి గానీ ఇలా ఫేసుబుక్కు ల్లో పగలూ రాత్రులు ఒకర్నొకరు గీక్కుంటే ఏమొస్తుంది చెప్పండి :-). అయ్యా/అమ్మా ఇక్కడెవర్నీ విమర్శించడంలేదు...కాకపోతే ఇలా గోక్కోడం బదులు మీకు తెలిసిన వాళ్ళతో ఈ మాత్రం ప్రేమ ఒలకపోస్తే workout అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నానంతే :))

24, జులై 2013, బుధవారం

గుర్తు కోసం మరో టపా.... ఈ సారి యం.ఎల్.ఎ ఎలక్షన్లు జరిగినప్పుడు దీనిపై వ్యాసం వ్రాసుకోవచ్చు.


పంచాయితీ ఎలక్షన్లపై వార్తాపత్రికల కథనాలు ఇవి. పంచాయితీ ఎలక్షన్లు జరిగినప్పుడు పార్టీల గుర్తులపై పోటీ చేయరు కానీ అప్పటికే పల్లెటూర్లలో వుండే గ్రూపుల మూలంగా అధికారికంగా పార్టీలు పోటీ చేయకున్నా అంతర్గతంగా ఓట్లు మాత్రం ఆయా గ్రూపు రాజకీయాలను బట్టే వేస్తారు. యం.ఎల్ ఏ. ఎన్నికల్లోనైతే వేరే ఊళ్ళలో వున్న ఓటర్లను పెద్దగా పట్టించుకోరు కానీ పంచాయితీలల్లో మాత్రం వాళ్ళ చార్జీలకు సైతం డబ్బులు ఇచ్చి పిలిపించి మరీ ఓట్లు వేయిస్తారు కాబట్టి ఈ ఎలక్షన్లు రాబోయే ఎన్నికల ముఖచిత్రం ఎలా వుండబోతుందో ప్రతిబింబిస్తుంది.


ఈనాడు పత్రిక కథనం 




ఆంధ్రజ్యోతి పత్రిక కథనం



సాక్షి పత్రిక కథనం


22, జులై 2013, సోమవారం

యం.బి.బి.యస్......సీటు చాలా సులువు గురూ....

ఈ రోజు సాక్షి నుంచి ఈ వ్యాసం...

 మెడికల్ కాలేజీల కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: ప్రతిభను బట్టే సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎలాంటి మార్గదర్శకాలు విధించినా.. ఆ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తూ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే పన్నాగాలు మెడికల్ కాలేజీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను పాటిస్తున్నట్లు నటిస్తూ దర్జాగా కోట్లు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ ఉండి డబ్బులు లేని విద్యార్థులు ఎప్పటిలాగానే అన్యాయమైపోతున్నారు. యాజమాన్య కోటా సీట్లను ప్రతిభను బట్టే కేటాయించాలంటూ ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను ఉల్లంఘించటానికి ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు సరికొత్త దొంగదారి కనిపెట్టాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం వైద్య విద్య కోసం అర్హత ఉండి, ఎంతైనా ఖర్చు పెట్టగలవారితో పాటు.. అసలు ఆ సీట్లలో చేరటానికి అర్హత లేనివారికి గాలం వేసి ఇద్దరితోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారితో పాటు, అర్హతలేని డమ్మీ అభ్యర్థులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఇంకేముంది.. ఆ జాబితాలో భారీగా సొమ్ము చెల్లించిన అభ్యర్థులే మెరిట్ అభ్యర్థులుగా అధికారికంగా నిర్ణయించి వారికి సీట్లు కేటాయిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు ఇచ్చామంటూ ఆ దరఖాస్తుల జాబితాను చూపిస్తున్నాయి. ఈ రెండు రకాల విద్యార్థులను సమీకరించటానికి ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థిని తీసుకొచ్చినందుకు సదరు దళారీకి రూ. 10 వేల వరకూ ముట్టజెపుతున్నాయి.

పేరుకే నిబంధనల అమలు...
రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించటంతో పాటు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రావాలి. కన్వీనర్ కోటాలో సీటు సంపాదించలేని విద్యార్థులు.. వారి ఆర్థిక స్తోమతును బట్టి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.

చాలా ఏళ్లుగా వైద్య విద్య కళాశాలలకు ఈ కోటా కిందే భారీగా సొమ్ము లభిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు విధించింది. దాంతోపాటు ఈ సీట్ల భర్తీని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని హైకోర్టు సైతం ఆదేశించింది. వీటన్నిటికీ విరుగుడు మంత్రంగా ప్రైవేటు కళాశాలలు దళారీల సాయంతో డమ్మీ అభ్యర్థులతో కనికట్టు చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నాయి.

‘మెరిట్’నూ సృష్టించటమే...
మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాలనే నిబంధనలను ఉల్లంఘించేందుకు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఓ వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. ప్రతిభ కలిగిన సాధారణ విద్యార్థులకు దరఖాస్తులు ఇవ్వరు. దళారుల సహాయంతో.. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో 50 వేలలోపు ర్యాంకు సాధించి.. కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చే అభ్యర్థులతో మొదట బేరం కుదుర్చుకుంటారు. వారితో మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాలో వారికన్నా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన, అర్హతలేని అభ్యర్థుల కోసం దళారులు వేట మొదలెడతారు. ఇంటర్‌లో నామమాత్రపు మార్కులొచ్చి, ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవటం వల్లో, ఎంబీబీఎస్‌పై అనాసక్తి వల్లో సాధారణ డిగ్రీలో చేరిన విద్యార్థులకు గాలం వేస్తారు. గత ఏడాది డిగ్రీలో చేరి ఈ ఏడాది ఎంసెట్ రాసిన వారినీ కలుస్తారు.

వారికి రెండు మూడు వేలు ఇస్తామంటూ ఆశ చూపి.. సదరు వైద్య విద్య కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేయిస్తారు. చివరగా కాలేజీల యాజమాన్యాలు డబ్బిచ్చిన విద్యార్థులు, అర్హత లేని విద్యార్థులతో ఒకే జాబితా రూపొందిస్తాయి. పకడ్బందీగా రూపొందించిన ఈ జాబితాను ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. ఇంకేముంది కళాశాలకు వచ్చిన దరఖాస్తులు, భర్తీ ప్రక్రియ అన్నీ ‘నిబంధనల ప్రకారం’ ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ వైద్య విద్య కళాశాలలకు విద్యార్థులను సమీకరించే దళారులకు.. ఒక్కో అభ్యర్థిని తీసుకువచ్చినందుకు రూ. 10 వేల వరకూ ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలివీ...
- యాజమాన్య కోటా సీట్ల భర్తీ 2004 జూలై 23న ఇచ్చిన జీవో 217 ప్రకారం జరగాలి.
- జీవో ప్రకారం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పాసవటంతో పాటు ఎంసెట్‌లో అర్హత సాధించాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.
- ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించాలి.
- ప్రతి కళాశాల భర్తీ ప్రక్రియకు ముందే ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి.
- అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు మెరిట్ ప్రకారం జాబితా తయారు చేయాలి.
- నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ వరకూ నిర్ణయించిన తేదీలోగా పూర్తి కావాలి.
- అడ్మిషన్ల ప్రక్రియ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రభుత్వానికి, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవ్వాలి.
- ఈ జాబితా పరిశీలన అనంతరం యూనివర్సిటీ అనుమతి ఇచ్చిన తర్వాతే భర్తీ జరగాలి.

ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాలు
మొత్తం ప్రైవేటు వైద్య కళాశాలలు 28
ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,400
యాజమాన్య కోటా సీట్లు 850
ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లు 510

- మెడికల్ కాలేజీల కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: ప్రతిభను బట్టే సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎలాంటి మార్గదర్శకాలు విధించినా.. ఆ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తూ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే పన్నాగాలు మెడికల్ కాలేజీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను పాటిస్తున్నట్లు నటిస్తూ దర్జాగా కోట్లు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ ఉండి డబ్బులు లేని విద్యార్థులు ఎప్పటిలాగానే అన్యాయమైపోతున్నారు. యాజమాన్య కోటా సీట్లను ప్రతిభను బట్టే కేటాయించాలంటూ ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను ఉల్లంఘించటానికి ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు సరికొత్త దొంగదారి కనిపెట్టాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం వైద్య విద్య కోసం అర్హత ఉండి, ఎంతైనా ఖర్చు పెట్టగలవారితో పాటు.. అసలు ఆ సీట్లలో చేరటానికి అర్హత లేనివారికి గాలం వేసి ఇద్దరితోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారితో పాటు, అర్హతలేని డమ్మీ అభ్యర్థులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఇంకేముంది.. ఆ జాబితాలో భారీగా సొమ్ము చెల్లించిన అభ్యర్థులే మెరిట్ అభ్యర్థులుగా అధికారికంగా నిర్ణయించి వారికి సీట్లు కేటాయిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు ఇచ్చామంటూ ఆ దరఖాస్తుల జాబితాను చూపిస్తున్నాయి. ఈ రెండు రకాల విద్యార్థులను సమీకరించటానికి ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థిని తీసుకొచ్చినందుకు సదరు దళారీకి రూ. 10 వేల వరకూ ముట్టజెపుతున్నాయి.

పేరుకే నిబంధనల అమలు...
రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించటంతో పాటు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రావాలి. కన్వీనర్ కోటాలో సీటు సంపాదించలేని విద్యార్థులు.. వారి ఆర్థిక స్తోమతును బట్టి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.

చాలా ఏళ్లుగా వైద్య విద్య కళాశాలలకు ఈ కోటా కిందే భారీగా సొమ్ము లభిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు విధించింది. దాంతోపాటు ఈ సీట్ల భర్తీని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని హైకోర్టు సైతం ఆదేశించింది. వీటన్నిటికీ విరుగుడు మంత్రంగా ప్రైవేటు కళాశాలలు దళారీల సాయంతో డమ్మీ అభ్యర్థులతో కనికట్టు చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నాయి.

‘మెరిట్’నూ సృష్టించటమే...
మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాలనే నిబంధనలను ఉల్లంఘించేందుకు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఓ వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. ప్రతిభ కలిగిన సాధారణ విద్యార్థులకు దరఖాస్తులు ఇవ్వరు. దళారుల సహాయంతో.. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో 50 వేలలోపు ర్యాంకు సాధించి.. కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చే అభ్యర్థులతో మొదట బేరం కుదుర్చుకుంటారు. వారితో మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాలో వారికన్నా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన, అర్హతలేని అభ్యర్థుల కోసం దళారులు వేట మొదలెడతారు. ఇంటర్‌లో నామమాత్రపు మార్కులొచ్చి, ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవటం వల్లో, ఎంబీబీఎస్‌పై అనాసక్తి వల్లో సాధారణ డిగ్రీలో చేరిన విద్యార్థులకు గాలం వేస్తారు. గత ఏడాది డిగ్రీలో చేరి ఈ ఏడాది ఎంసెట్ రాసిన వారినీ కలుస్తారు.

వారికి రెండు మూడు వేలు ఇస్తామంటూ ఆశ చూపి.. సదరు వైద్య విద్య కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేయిస్తారు. చివరగా కాలేజీల యాజమాన్యాలు డబ్బిచ్చిన విద్యార్థులు, అర్హత లేని విద్యార్థులతో ఒకే జాబితా రూపొందిస్తాయి. పకడ్బందీగా రూపొందించిన ఈ జాబితాను ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. ఇంకేముంది కళాశాలకు వచ్చిన దరఖాస్తులు, భర్తీ ప్రక్రియ అన్నీ ‘నిబంధనల ప్రకారం’ ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ వైద్య విద్య కళాశాలలకు విద్యార్థులను సమీకరించే దళారులకు.. ఒక్కో అభ్యర్థిని తీసుకువచ్చినందుకు రూ. 10 వేల వరకూ ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలివీ...
- యాజమాన్య కోటా సీట్ల భర్తీ 2004 జూలై 23న ఇచ్చిన జీవో 217 ప్రకారం జరగాలి.
- జీవో ప్రకారం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పాసవటంతో పాటు ఎంసెట్‌లో అర్హత సాధించాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.
- ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించాలి.
- ప్రతి కళాశాల భర్తీ ప్రక్రియకు ముందే ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి.
- అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు మెరిట్ ప్రకారం జాబితా తయారు చేయాలి.
- నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ వరకూ నిర్ణయించిన తేదీలోగా పూర్తి కావాలి.
- అడ్మిషన్ల ప్రక్రియ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రభుత్వానికి, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవ్వాలి.
- ఈ జాబితా పరిశీలన అనంతరం యూనివర్సిటీ అనుమతి ఇచ్చిన తర్వాతే భర్తీ జరగాలి.

ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాలు
మొత్తం ప్రైవేటు వైద్య కళాశాలలు 28
ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,400
యాజమాన్య కోటా సీట్లు 850
ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లు 510 - See more at: http://sakshi.com/Main/Fullstory.aspx?catid=639410&Categoryid=1&subcatid=33#sthash.bBSYWx8Q.dpuf

19, జులై 2013, శుక్రవారం

యాదృచ్చికమా లేదా పూర్తిగా మూఢనమ్మకమా.... only god knows about it...

 ఒక చిన్న ఖద్దరు సంచీలో పుస్తకాలను, మూడరల టిపిన్ కేరేజీలో సంగటి, పెరుగు, పచ్చడి కుక్కి ఎడమభుజానికి సంచీ, కుడి చేతీలో కేరేజీ పట్టుకోని ఒకటిన్నర మైలు నడిచినాక సవాసగాళ్ళమందరమూ వాగొడ్డున కూర్చోని తెచ్చుకున్న సంగటిలో సగం లాగించేసి  అరిగేదాకా నాటకాల్లో పద్యాలను దీర్ఘాలను తీస్తూ మిగిలిన సగ దూరాన్ని  నడిచేసి  హైస్కూల్  చేరేవాళ్ళము. ఇలా ఆటపాటలతో కాలం దొర్లిపోతుండగా నేను పదో తరగతి కొచ్చాను. ఇప్పటిపిల్లలకు పదో తరగతంటే పెద్దలేకలేదోమో కానీ మారోజుల్లో మా ఊర్లలో పదోతరగతి పాసయ్యాడంటే వాడు పెద్దహీరో. ఆ హీరోకి వచ్చే గుర్తింపు ముందు ఏ సినిమా హీరోకూడా పనికిరాడు మరి.  అదిగో అలాంటి పదోతరగతిని నేనూ చదవాల్సి వచ్చింది.

ఆటపాటలతోనడిచిన బాల్యాం.ఒక్కసారిగా హైస్కూల్ లో పదవతరగతి అనేటప్పటికి తెచ్చిపెట్టుకున్న పెద్దరికం. అలా పదవతరగతి వార్షిక పరిక్షలు మరో నెలన్నరలోపుకి వచ్చేసాయి. ఈత రాని వాడిని ఒక్కసారిగా నడి సముద్రంలోకి తీసుకువెళ్ళి నెట్టివేస్తే ఎలా వుంటుందో అలాగయ్యింది నా పరిస్థితి. దానికి తోడు పదవతరగతి పరీక్షలను మా బడ్లో వ్రాయటానికి వీల్లేదు. వెలిగండ్ల చెప్పుకోవడానికి మండల కేంద్రమే కానీ పరీక్షల నిర్వహణా సెంటర్ కాదు. ఊరి పొలిమేరల్లోనున్న పోలేరమ్మకు చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ మ్రొక్కు కున్నారు. ఏమని? తల్లీ మా స్కూల్ పిల్లలకు కనిగిరి గర్ల్స్ హైస్కూల్ సెంటర్ మాత్రం రాకుండా చూడమ్మా అని. అదేంటి ఆ మ్రొక్కు అని ఆశ్చర్యపోకండి. అప్పట్లో కనిగిరి  గర్ల్స్ హైస్కూల్ సెంటర్ అంటే ఆ తాలూకా మొత్తానికి ఒణుకు. కారణం చాలా స్ట్రిక్ట్ సెంటర్ అనీ, కాపీలు కొట్టడానికి అస్సలు వీలుకాదనీ, ఈ సెంటర్ లో పరీక్షలు వ్రాసిన వాళ్ళలో పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవాళ్ళు చాలా తక్కువనీ ... ఇలా చాలా చెడ్డ ( మంచి? ) పేరే వుంది. దానికి తగ్గట్టుగా అక్కడ పరీక్ష వ్రాసిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతమూ అలాగే వుండేది. అంటే వ్రాసిన వాళ్ళలో ఏ పది శాతమో పాస్ అయ్యేవాళ్ళు.

అదుగో అలాంటి పరిస్థితుల మధ్య చదవాల్సి వచ్చింది. ఇక్కడ కొద్దిగా సొంత డబ్బా.... నాకు కలల్లో అప్పుడప్పుడూ జరగబోయే విషయాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మీకు అతిశయోక్తిగానో లేక నమ్మశక్యంగానో లేకపోవచ్చు కానీ ఇది నిజం.  అందులో అతి ముఖ్యంగా ఏవైనా కొట్లాటలు, మృత్యువు లతోపాటు Question papers కూడా చాలా అస్పష్టంగా కనిపిస్తాయి. అవి ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు కానీ నాకు కలవొచ్చిన ఓ పది పది హేను రోజుల లోపు జరిగిపోతాయి. వాటిని ఆపే శక్తీ కానీ, నష్టం జరగకుండా తప్పించడంకానీ వీలుకాదు. అది ప్రకృతి ధర్మం. భగవంతుని శాసనం. చూస్తూ వుండిపోవాల్సిందే!!

అలా Girls high school లో పరీక్షను వ్రాసిన విద్యార్థులలో మా బడినుంచి నేనొక్కడిని పాస్ అయ్యాను. మా చెల్లిని పోగొట్టుకున్నాక ఇక మృత్యువు కలలోకి వచ్చిందంటే ఆరోజు నుంచి ఎవరి దగ్గరనుంచి ఫోను వస్తుందో నని ఎదురు చూడడం అలవాటయిపోయింది. ఇలాగే కొట్లాటల మూలంగా కొద్దిరోజులు కోర్టుల చుట్టూరూ తిరగడమూ అలవాటయిపోయింది.

అదిసరే నయ్యా ఇప్పుడు ఈ సుత్తి ఎందుకంటే .... వస్తున్నా వస్తున్నా .....

మొన్నకరోజు ఇలాగే ఒక Accident కలలోకి వచ్చింది. నిన్న నా కళ్ళముందే నట్ట నడిరోడ్డులో అమెరికాలో రోడ్డుకి కంకర వేసే లారీ బోల్తా కొట్టింది. అదృష్టము కొద్దీ ప్రక్క లేన్ లో ఏ కారూ లేదు కానీ వుండి వుంటే నుజ్జునుజ్జై పోయుండేది. ఆ లారి వెనుక ఒక కారు, ఆ కారు వెనుక నాకారు. లారీ డ్రైవర్ కు కాళ్ళు వత్తుకుపోయి బాగా దెబ్బలు తగిలాయి. బహుశా ఇది నాకొచ్చిన కల పరిణామమేమో అనుకొని నిన్నంతా అలా అలా ఆఫీస్ లో కాలం వెళ్ళబుచ్చి ఆ విషయాన్ని అక్కడతో వదిలేశాను...... కానీ ఇక్కడ నేనో విషయం మర్చి పోయాను...

ఈ రోజు ప్రొద్దునే ఆఫీసుకు బయలు దేరి కేరీ బ్యాగ్ ను కార్ లో పెడుతుంటే అకాలమైన తుమ్ములు వచ్చాయి. మనసులో కాసేపు ఆగి వెళదామనుకోని కూడా ఛ..ఇంతా చదువుకొని ఇలాంటి చచ్చు పుచ్చు మూఢనమ్మకాలను నమ్మడమేమిటిని కారు పార్కింగ్ లాట్ నుంచి బయటకు తీసి ఓ రెండొందల మీటర్లు పోనిచ్చానేమో.... ఉన్నట్లుండి  ధడ్ మన్న సౌండ్.... ఫలితం... ఇది....






అదృష్టం కొద్దీ ఎవ్వరికీ దెబ్బలు తగలలేదు. collision ఐన తరువాత  చైనీస్ లేడీ దిగి సారీ చెప్పి నాలుగు నెలల పాపను తీసుకొని ఇంటికెళ్ళిపోయింది. నేను విషయాన్ని నా ఆఫీసువారికి తెలియచేసి పోలీసులొచ్చేదాకా నేనూ ఆమె భర్తా కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళం చేరాము.

ఇంతకీ ఇందుకు ముందు పేరాలో "...... కానీ ఇక్కడ నేనో విషయం మర్చి పోయాను....." అని వ్రాశాను కదా!! ఆ మర్చిపోయింది ఏమిటంటే నాకొచ్చే కలల సన్నివేశాల్లో జరగబోయే వ్యక్తులు నేను కానీ నాకు తెలిసిన వ్యక్తులు కానీ   తప్పక అయి వుంటారు.... ఆ లారీ డ్రైవర్ నాకు తెలియదు. ఇంతటితో ఈ కల ప్రభావం ఐపోయినట్లేనా? ఏమో అది తెలిస్తే మనం మనుషులమెందుకవుతాము.... ఇలాంటివి నమ్మాలా లేదా యాదృచ్చికమనుకోవాలా???

16, జులై 2013, మంగళవారం

వామ్మో ఫేస్ బుక్.....( Face book )......

హారం యొక్క ఫేస్ బుక్ పేజి ని తెరిచి అర్థ సంవత్సరం దాటిన సందర్భంగా మొన్నొక రోజు login అయ్యాను. మరీ బొత్తిగా సోషల్ సెన్స్ లేదనుకుంటారని ఈ మధ్య గత రెండు రోజులుగా suggest చేసిన పేర్లన్నింటికీ Add friend requests పంపిస్తున్నా. అంతవరకూ బాగానే వుంది. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ నాకీ ఫేస్ బుక్ ని ఎలా వాడాలో తెలిసి చావడం లేదు. నేను add చేసిన ఫ్రెండ్స్ వే కాకుండా ఎవరెవరివో ఏమిటేమిటో అలా వచ్చేస్తున్నాయి. చదివేలోపే ఎక్కడో అడుక్కి వెళ్ళిపోయె. ఇంతా చేసినా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో దరిదాపు నాలుగొందల మంది మాత్రమే. 400 మంది ఫ్రెండ్సా అని అడక్కండి. ఇందులో నాకు ముఖపరిచయమున్న స్నేహితులు ఒక్కరు కూడా వుండి వుండరని నా గట్టి నమ్మకం.

ఇక అందులో వచ్చే మెసేజెస్ చూస్తే..... అసలు జనాలదగ్గర ఎంత ఎనర్జీ వుందో అర్థమవుతుంది. రకరకాల విశ్లేషణలు, సినిమాలు, లవ్వులు, లౌగీతాలు, ఇంగ్లీష్ కాని టెంగ్లీష్, అబ్బో చాలా చాలా చదవ వచ్చు. కానీ అన్ని మెసేజస్ లో కూడా కనిపించే కామనాలిటీ ఒకటుంది. ఎవరో ఏదో రుబ్బురోట్లో యేసి బాగా రుద్ది దానికి కాస్తంత మసాలా కలిపి  పొడిపొడి అచ్చరాలతో అలా విదిలించి పొగడేరు కొట్టుకోటానికి అద్దం ముందుకు పొయ్యొచ్చేటప్పటికి లైక్ మీద లైకు..లైకు మీద లైకు ..అబ్బా..ఏమి ఎనర్జీ చదువుతుంటే ఎలర్జీ రావాల్సిందే ..... అదే ఆ రాసేది అమ్మాయైతే చుట్టూరా హచ్ నెట్ వర్కే....


ఎవరైనా నాకు  ఈ ఫేస్ బుక్కు ను ఎలా వాడాలో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ..వచ్చే మెసేజీ లను ఎంత సీల్ చేద్దామన్నా లీకైతానే వుండాయి. అసలు నాకో డౌటు, ఇక్కడ అందరూ అందరికీ తెలిసిన వాళ్ళేనా లేకా నాలాగే కనిపిస్తే add చేసుకుంటారా? నేనంటే ఏదో పదిమందికి website link తెలుస్తుందని ఆశ పడ్డాననుకోండి, మరి మిగిలిన వారూ...????

13, జులై 2013, శనివారం

మేరా మహాన్ ఆంధ్రప్రదేశ్....రాజరికపు వాసనలు

Worth reading today's article from Eenadu. Forum for good governance released cases and the nature of crime against MLAs in Andhrapradesh. ఈ గణాంకాలను చూసిన తరువాత మనకింకా రాజరికపు వాసనలు పోలేదనిపించడంలేదూ? రాజరికంలో ఇలాంటి చర్యలను సహజంగా వీరోచిత చర్యలుగా చేసిన వర్ణనలను చెయ్యకుండా కథలు కథలు గా చెప్పుకుంటాము కదా. ఆ కాలంలో వాళ్ళ వాళ్ళ దేశాలను వారి పదవులను కాపాడుకోవటానికి ఇలా ప్రవర్తించేవారు. ఆ పద్ధతే కొంచెం మారిందంతే....తేడా ఏమీ లేదు. ఆసక్తి కలవారు పూర్తి MLA, MLC, MP ల పట్టికను వారిపై ఎలాంటి కేసులు ఏఏ సెక్షన్ల క్రింద ఏఏ సంవత్సరాలలో నమోదయ్యాయో తెలిపే వివరాలను ఈనాడు నుంచి Download చేసుకోవచ్చు. ఈ గణాంకాలను Forum for good governance  రాష్ట్ర కార్యదర్శి పద్మనాభరెడ్డి సమాచార హక్కుల చట్టం క్రింద ప్రతిపోలీసు స్టేషన్ నుంచి సేకరించారట. I believe democracy is still surviving because of such people in India.

http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=5 















12, జులై 2013, శుక్రవారం

ఎలక్షన్ కమిషన్ & సుప్ర్రీం కోర్టు చరిత్రలో బహుశా ఇదొక మైలు రాయేమో...

 A person, who is in jail or in police custody, cannot contest election to legislative bodies, the Supreme Court has held, bringing to an end an era of under trial politicians fighting polls from behind bars.
In another path breaking verdict to prevent criminal elements from entering Parliament and state assemblies, the apex court ruled that only an ‘elector’ can contest the polls and he/she ceases the right to cast vote due to confinement in prison or being in custody of police.
The court, however, made it clear that disqualification would not be applicable to person subjected to preventive detention under any law.
Referring to the Representation of Peoples' Act, a bench of justices A.K. Patnaik and S.J. Mukhopadhayay said that the Act (Section 4 & 5) lays down the qualifications for membership of the House of the People and Legislative Assembly and one of the qualifications laid down is that he must be an elector.
The bench said Section 62(5) of the Act says that no person shall vote at any election if he is confined in a prison, whether under a sentence of imprisonment or transportation or otherwise, or is in the lawful custody of the police.
Reading Sections 4, 5 and 62(5) together, the apex court came to the conclusion that a person in jail or police custody cannot contest election.
The court passed the order on an appeal filed by the Chief Election Commissioner and others challenging a Patna High Court order barring people in police custody to contest polls.
"We do not find any infirmity in the findings of the High Court in the impugned common order that a person who has no right to vote by virtue of the provisions of sub-section (5) of Section 62 of the 1951 Act is not an elector and is therefore not qualified to contest the election to the House of the People or the Legislative Assembly of a State," the apex court said.
In a landmark judgement on Wednesday, the same bench had struck down a provision in the the Representation of Peoples Act that protects a convicted lawmaker from disqualification on the ground of dependency of appeal in higher courts. The bench had also made it clear that MPs, MLAs and MLCs would stand disqualified on the date of conviction.

11, జులై 2013, గురువారం

ఎల్లో గ్యాంగ్ ‘కిలాడీ’ రాతలు!...

Read Yesterday's news from leading Telugu news papers, and now read this news....... 




Article from sakshi.


7/11/2013 2:00:00 AM
- వైఎస్సార్ సీపీ నేతలు అంబటి, జోగి రమేశ్, శోభా నాగిరెడ్డి ధ్వజం
- పచ్చ పత్రికల కథనాలపై వైఎస్సార్‌సీపీ ధ్వజం
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ‘పచ్చ’ పన్నాగాలు
- కాంగ్రెస్, టీడీపీలతో కలిసి చౌకబారు ఎత్తుగడలు
- వైఎస్సార్‌సీపీలో నేరగాళ్లున్నారంటూ అభూతకల్పనలు
- అంబటి, శోభా నాగిరెడ్డి, జోగి రమేశ్ మండిపాటు

‘‘కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టిన రెండు పత్రికలు వైఎస్సార్‌సీపీపై సందు దొరికినప్పుడల్లా చౌకబారు విమర్శలు చేస్తున్నాయి. వైట్ కాలర్ క్రిమినల్, పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే చంద్రబాబేనని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు’’
- అంబటి రాంబాబు
‘‘అత్యాచారం కేసులో ఉన్న ఓ ఎమ్మెల్యే, దొంగనోట్ల చలామణి కేసులో అరెస్టయిన టీడీపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. బాబు మాటిమాటికీ చెప్పే ‘పిల్ల కాంగ్రెస్’ నిజానికి టీడీపీనే’’
- శోభా నాగిరెడ్డి
‘‘కత్తి, కర్ర, తుపాకీ వంటివేమీ అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు. సీఎంగానే గాక విపక్ష నేతగా కూడా అడ్డంగా దోచుకుంటున్న ఘనుడు’’
- జోగి రమేశ్

సాక్షి, హైదరాబాద్/గుంటూరు/ఆళ్లగడ్డ: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు తమ అనుబంధ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో అసత్యాలను ప్రచారం చేయిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. రాజమండ్రిలో సెక్యూరిటీ ఇన్‌చార్జిని చంపి కోట్లు కొల్లగొట్టిన కేసులో ముద్దాయి వైఎస్సార్‌సీపీలో కీలక నేత అంటూ అభూతకల్పనతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయంటూ మండిపడింది. కాంగ్రెస్, టీడీపీలతో జత కట్టిన రెండు పత్రికలు, రెండు చానళ్లు వైఎస్సార్‌సీపీపై సందు దొరికినప్పుడల్లా చౌకబారు విమర్శలు చేయడం హేయమని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

ఆ రెండు పత్రికలూ ప్రజా సమస్యలను విస్మరించి అసత్యాలను వండివార్చడం... మర్నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు వాటినే వల్లెవేయడం అందరికీ తెలిసిందేనని పార్టీ శాసనసభాపక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ నంబర్‌వన్‌గా ఉన్నందుకే పచ్చ పత్రికలు ఇలా పచ్చ రాతలతో బురద జల్లుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ధ్వజమెత్తారు. బుధవారం అంబటి గుంటూరులో, శోభ ఆళ్లగడ్డలో, రమేశ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రి ఏటీఎం డబ్బు దోపిడీ కేసు ముద్దాయి శ్రీధర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడని, పార్టీలో ప్రధాన నాయకుడని ఎల్లో మీడియా చిత్రించిన తీరును అంబటి ఖండించారు. చౌకబారు ఎత్తుగడలతో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేరన్నారు. ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు వారివైపే చూపిస్తాయని కాంగ్రెస్, టీడీపీ చెంబు బృందం గుర్తుంచుకోవాలన్నారు.

టీడీపీ వారు అద్దంలో చూసుకోవాలి: వైఎస్సార్‌సీపీపై పలు చానళ్లలో ఇష్టానికి విషప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి వంటి బాబు తాబేదార్లు ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని అంబటి సూచించారు. ‘యూరో లాటరీ అంటూ మోసగించిన కోలా కృష్ణమోహన్‌తో బాబు ఫొటోలు దిగలేదా? అతని నుంచి బాబు రూ.50 లక్షలు తీసుకుని, మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వజూడలేదా? బాబు మంత్రివర్గంలో ఉన్న కృష్ణా యాదవ్ నకిలీ స్టాంపుల కుంభకోణంలో జైలు జీవితం గడపడం రేవంత్ మరిచారేమో. ఇలాంటి బాబును దొంగలకే గజదొంగ అనాలా?’’ అని ప్రశ్నించారు.

చంద్రబాబు పేరిట రిజిస్టరయిన కారులో 2010లో కదిరిలో రూ.7 కోట్లు పట్టుబడ్డాయని గుర్తుచేశారు. ఆ సొమ్మంతా బాబుదేనని, కావాలంటే ఆయనతో ఫోన్లో మాట్లాడాలని టీడీపీ నేత పేరం హరిబాబు నేరుగా పోలీసులకే చెప్పడాన్ని అంబటి గుర్తు చేశారు. ‘కిరణ్‌తో బాబు లాలూచీ పడితే ఆ కేసు ఏమైంది? కేసు వివరాలను బయటపెట్టండి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బాబు చేసిన ఘోర తప్పిదాలను ప్రజలు మరవలేదు. వైట్ కాలర్ క్రిమినల్, పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే చంద్రబాబేనని పసి పిల్లాడిని అడిగినా చెబుతాడు. బాబును ప్రజలు మూడోసారి కూడా తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ విషయం మాకంటే బాబుకే ఎక్కువ తెలుసు’’ అన్నారు. దివంగత వైఎస్‌పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఒకసారి తన చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘‘గతంలో ఉస్మానియా వర్సిటీలో డ్రైవర్‌గా పని చేసిన వీహెచ్, ఆయిల్ దొంగతనం, టైర్ల దొంగతనం చేసినందుకు సస్పెండయ్యారు. కాబట్టి కాంగ్రెస్‌ను ఆయిల్ దొంగలు, టైర్ల దొంగల పార్టీ అనాలా?’’ అని ప్రశ్నించారు. బాబు పాదయాత్రకు కోటానుకోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చని, కానీ వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటున్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఆకాశంపై ఉమ్మితే తిరిగి తమ మీదే పడుతుందని కాంగ్రెస్, టీడీపీలకు హితవు పలికారు.

టీడీపీ నేతలపై ఉన్న కేసుల మాటేమిటి: శోభ
చంద్రబాబు మాటిమాటికీ చెప్పే ‘పిల్ల కాంగ్రెస్’ నిజానికి టీడీపీయేనని శోభ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారన్నారు. కోలా కృష్ణమోహన్ నుంచి డబ్బు తీసుకోవడమే గాక, అతను మోసగాడని ముందుగా ఎలా తెలుస్తుందంటూ బాబు దబాయించారని గుర్తు చేశారు. ‘‘అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే, దొంగ నోట్ల చలామణి కేసులో అరెస్టయిన టీడీపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. కడప ఉప ఎన్నికల్లో రూ.7 కోట్లు, కొవ్వూరు ఉప ఎన్నికల్లో రూ.కోటి టీడీపీ నేతల వద్ద పట్టుబడలేదా? డీజిల్ అమ్మి సస్పెండైన వ్యక్తి కాంగ్రెస్‌లో చేరి నేడు జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం.

కడప, కొవ్వూరు, అనంతరం 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ ఎన్ని అసత్యాలను ప్రచారం చేసినా ప్రజలు జగన్‌కే అండగా నిలిచిన విషయాన్ని మర్చిపోయినట్టున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అవిశ్వాసంలో పాల్గొనకుండా కాంగ్రెస్‌కు మద్దతివ్వడం బాబుకే చెల్లింది! జగన్ ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదనే చంద్రబాబు, సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి సోనియా కాళ్లు పట్టుకుని అడ్డుకుంటున్నారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. సర్పంచ్ సహా ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు వైఎస్సార్‌సీపీకే అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

విపక్ష నేతగానూ బాబు దోపిడీ: రమేశ్
ఆ రెండు పత్రికల తీరు పచ్చ కామెర్ల రోగి చందంగా ఉందని రమేశ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతాన్ని వైఎస్సార్‌సీపీయే గెల్చుకునేలా కన్పిస్తుండటం వల్లే ఇలాంటి అభాండాలు వేస్తున్నారన్నారు. ‘‘వైఎస్సార్‌సీపీకి కోట్లాది కార్యకర్తలున్నారు. వారిలో ఎవరో తప్పు చేస్తే దాన్ని నాయకత్వానికి ఆపాదిస్తూ రాస్తారా? ఇది జర్నలిజం విలువలను మంటగలపడం కాదా?’’ అని ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర ముఠా దొంగల భుజాలపై చంద్రబాబు చేతులు వేసి తీయించుకున్న ఫొటోలను విలేకరులకు రమేశ్ ప్రదర్శించారు. ‘‘వీరంతా చిత్తూరుకు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తులు.

కాబట్టి చంద్రబాబును అంతర్రాష్ట్రీయ దొంగ అనుకోవాలా?’’ అని ప్రశ్నించారు. ‘‘రాజకీయాల్లో హత్యలు చేసిన వ్యక్తి బాబు. ఎన్టీఆర్‌ను ఆయన హత్య చేయలేదా? మానసిక క్షోభ పెట్టి హత్య చేశారు. కత్తి, కర్ర, తుపాకీ వంటివేమీ అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు. సీఎంగా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకున్నాడో అందరికీ తెలుసు. విపక్ష నేత హోదాలో కూడా దోచుకుంటున్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు సహకరించి విదేశీ సంస్థల నుంచి వేల కోట్ల రుణం, కేంద్రం నుంచి లంచం పొందారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సమయంలో దొడ్డిదారిన పారిపోయి కాంగ్రెస్ నుంచి వేల కోట్లు లంచం తీసుకున్నారు. టీడీపీ మహానాడుకు కోట్లాది రూపాయల వసూలు చేశారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే చంద్రబాబు అమెరికా వెళ్లారు. రాజకీయాల్లో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడమా?’’ అంటూ దుమ్మెత్తిపోశారు.

కోలాకు యూరో లాటరీ వచ్చిందని నమ్మి, ఆ సొమ్మును భారత్‌కు తీసుకురావడానికి ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతూ సీఎం హోదాలో కేంద్రానికి బాబు లేఖ రాయలేదా? ఆయన మంత్రివర్గంలోని కృష్ణాయాదవ్ స్టాంపుల కుంభకోణంలో జైలుపాలు కాలేదా? అప్పట్లో నలుగురు మంత్రులు, పదిమంది ఎమ్మెల్యేలను తప్పించారు’’ అని గుర్తు చేశారు. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో చిల్లరగాళ్లంటూ దుయ్యబట్టారు. ‘నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పుట్టు పూర్వోత్తరాలేమిటి?’ అని ఒక పత్రికా యజమానిని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఇలా వార్తలు రాసిన పత్రికా యజమానుల్లో ఒకరు గతంలో గేదెలు కాచేవారు. మరొకరు సైకిల్‌పై పాలమ్ముకుని బతికారు. అవేమీ నామోషీ కాదు. ఒకప్పుడు అలా ఉన్నవాళ్లు శరవేగంగా వేల కోట్లెలా సంపాదించారు? ఒకరిపై బురదజల్లే ముందు తమ వెనక ఉన్నదేమిటో చూసుకోవాలి. ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు వీరికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అని హెచ్చరించారు.



What do you think?


10, జులై 2013, బుధవారం

రండి బాబూ రండి.... జిల్లాలు లేదా ప్రాంతాల వారీగా. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మనస్తత్వాలు

ఇప్పుడు మీరందరూ మనస్తత్త్వశాస్త్రవేత్తలే... మీరు ప్రాంతాల వారీగా ఎప్పుడైనా ప్రజల మనస్తత్వాలను గమనించారా? అదేంటి ఒక్కొక్కడు ఒక్కో టైపు కదా అని చెప్పకండి. ఒక్కొక్కడు ఒక్కో టైపైనా సహజంగా ఆ ప్రాంత సంస్కృతిని బట్టి మెజారిటీ ప్రజల మనస్తత్వాలు వుంటాయి కదా. అలా మీరు పరిశీలించిన అభిప్రాయాలను ఇక్కడ వ్యాఖ్యల్లో వ్రాయవచ్చు. దేశం వదిలి కొన్ని ఏండ్లయింది కాబట్టి అప్పటి నా అభిప్రాయాలు ఇప్పుడు కూడా వర్తిస్తాయో లేదో తెలియదు కానీ మీ మీ అభిప్రాయాలు చదివాక నా అభిప్రాయాలు వ్రాస్తాను.

Short and sweet post. Isn't it?

7, జులై 2013, ఆదివారం

భావగీతమంటే బావగీతమే......

పాత సినిమా సీతామహాలక్ష్మి సినిమాలో చంద్రమోహన్ చెప్పినట్లు "భావ గీతాలను"  బావగీతాలు అన్నా సరైనదే. ఈ గీతాలు బావలు పాడవచ్చు లేదా బావలమీద పాడవచ్చు. ఈ భావగీతాల అందమే వేరు. ఓ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరితోనైనా ప్రేమలో పడితే వాళ్ళు సంచరించే లోకమే వేరు. ఆ లోకంలో వాళ్ళ వాళ్ళ భావాలన్నీ బావ/మరదుల చుట్టూరా తిరుగుతూ వుంటాయి. అసలు బావా మరదళ్ళ సరసాలే వేరు. ఇప్పుడు బావా లేడు, మరదలు లేదు..ఆ స్థానంలో వున్నది జీన్సుపాంటే కాబట్టి బావ ఏమంటాడో మరదలు తెలియదు. మరదలు సమాధానమూ బావకు తెలియదు.

ఇద్దో అచ్చం అలాంటిదే కాకపోతే ఇది పద్యరూపంలో. ఇంతకు ముందు టపాలో ప్రభాత వర్ణనంలో తిక్కన ద్రౌపది ఆక్రోషాన్ని ఓ సరస్సుకు అన్వయించి ఆ కొలనులో అప్పుడే విచ్చిన తామర పూల పరిమళం అక్కడనుండి ఎలా వెలువడుతుందో చెప్పాడు కదా. ఇప్పుడు ఈ పద్యంలో స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి.

నిజానికి సైరంధ్రి, కీచకునికి కనిపించిన తీరిది. కావ్యంలో కీచకుడైనా, సైరంధ్రైనా తిక్కన గారే కాబట్టి ద్రౌపది ని తిక్కన ఎలా ఊహించాడో చూడండి. అసలు అమ్మాయిని వర్ణించమంటే ఏవో పూలు, చంద్రుడు, సంపెంగ మొక్కలు ఇలా ఏవో ఏవో చెప్పాలని ఆలోచన వస్తుంది కానీ, పూలు తెచ్చి సాదుపట్టడం, చందమామను క్రిందకు దించి చంద్రునిలో నున్న మచ్చను తేర్చడం, నల్లని నారుపోసి ఆ నారు తో స్త్రీ జుట్టును పోల్చడం... ఎవరికి వస్తాయండీ ఇలాంటి ఆలోచనలు?

ఇక పద్యము. 

నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టినట్లంద మొంది
చక్రవాకంబుల చందంబు గొని వచ్చి, కుప్పలు సేసినట్లొప్పు మెఱసి
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి
యళికులంబులకప్పు గలయంతయును దెచ్చి, నారు వోసిన భంగి నవక మెక్కి

యంఘ్రితలములుఁ గుచములు నాననంబుఁ
గచభరంబును నిట్లున్నరుచిరమూర్తి
యనుపమానభోగములకు నాస్పదంబు
కాదె యీత్రిప్పు లేటికిఁ గమలవదన

కొన్ని పదాలకు అర్థాలు :

నెత్తమ్మిరేకులు = తామర రేకులు




అచ్చున బెట్టు = అచ్చు పోయు
అళి= తుమ్మెద
అళి కులంబుల కప్పు = తుమ్మెదల నలుపు
నవకము = మృదుత్వము
అంఘ్రి= కాలు; అంఘ్రి తలములు = కాళ్ళు
కందువ = నల్ల మచ్చ
కొమరు=మనోహరము,మనోజ్ఞము,చక్కనిది
కుచములు = చన్నులు
ఆననము = మొఖము
కచము = తల వెండ్రుకలు; కచభరము = తల వెండ్రుకల బారువ
ఆస్పదము = చోటు
కమలవదన = కమలము వంటి మొగము కలది.


మామూలుగా ఈ కాలంలో అమ్మాయి వర్ణన చెప్పేటప్పుడు నేను విన్నంత వరకూ, చూసినంతవరకూ పై భాగాల నుంచి క్రిందిభాగాలకు వస్తారు. కానీ తిక్కన కాళ్ళనుంచి మొదలు పెట్టి జుట్టు దాకా వెళ్ళాడు. సీస పద్యంలో వర్ణనలు చేసి ఆ క్రిందనుండే ఎత్తుగీతిలో ఏ వరుసలో ఆ వర్ణనలు చేసాడో చెప్పాడు. అలా చెప్పి, ఇంతటి అందగత్తెలు వున్నదే భోగాలు అనుభవించటంకోసమంటూ ఓ బో త్రిప్పుకుంటున్నావే అని ఓ చమత్కారాన్ని విసిరాడు. ఆ తరువాత ద్రౌపదికి మండిందనుకోండి అది వేరే విషయం. ఇక సీస పద్య పాదాల్లోకి వస్తే

నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టినట్లంద మొంది -- యంఘ్రితలములు

అంఘ్రితలములు అంటే కాళ్ళు. ఈ ద్రౌపది కాళ్ళు ఎలా వున్నాయయ్యా అంటే  తామర పూరేకుల నుంచి ఆ పూల పైపొరను విడిగా తెచ్చి అచ్చులు పోస్తే ( పాదము రూపంలో అచ్చుపోయటం)  ఎలా వుంటుందో అలా వున్నాయట. అంటే తామరపూలు లేత ఎరుపురంగులో వుంటాయి. అలాగే అసలు ఏపూవైనా చాలా మెత్తగా వుంటుంది.తామర పూల మెత్తదనం ఎక్కడ వుంటుంది? ఆ పూల పై పొరల్లో వుంటుంది. అలాగే దాని రంగు లేత ఎరుపురంగు. అంటే ఆ మెత్తటి లేత ఎరుపురంగు ను విడదీసి తెచ్చి కాళ్ళ రూపంలో  అచ్చుపోస్తే ఎలా వుంటుందో అలా వున్నాయట ద్రౌపది కాళ్ళు.

ఇక రెండవపాదం
చక్రవాకంబుల చందంబు గొని వచ్చి, కుప్పలు సేసినట్లొప్పు మెఱసి -- కుచములు 



ఇక ద్రౌపది స్థనములు ఎలా వున్నాయంటే చక్రవాక పక్షుల అందాన్ని తెచ్చి  కుప్పలుగా పోస్తే  ఎలా వుంటుందో అలా వున్నాయట. చక్రవాక పక్షుల ఉబ్బెత్తుగా అర్థచంద్రాకార ఆకారంలో  వుంటాయి. అలాంటి చక్రవాకపక్షుల అందాన్ని  తెచ్చి రెండుచోట్ల కుప్పలుగా  పోస్తే ఎలా వుంటాయో అలా వున్నాయట.

మూడవపాదం
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి - ఆననము

ఇది చూడండి. ఎంతటి భావుకత కలవారైనా పడిపోవాల్సిందే... అమ్మాయి మోము ను మామూలుగా పూర్ణ చంద్ర బింబంతో పోలుస్తారు. ఎందుకంటే పౌర్ణమి నాటి చంద్రబింబం రంగు వేరు.దాని రూపు వేరు. ఆ కాంతి వేరు కాబట్టి. కానీ తిక్కన ఏమి చేసాడో చూడండి. ఆ చంద్రకాంతిని క్రిందకు తీసుకొచ్చేసాడు. కానీ ఓ సందేహం కూడా వచ్చేసింది. చంద్రుడిలో మచ్చ వుంటుంది కదా మరి మచ్చ వున్న చంద్రుని నుంచి వచ్చే కాంతి కూడా మచ్చగలదియై వుంటుంది కదా? అందుకని ఈ మచ్చను వేరు చేయడానికి ఆ కాంతిని తేర్పార పట్టాడు. తేర్పారపట్టడం అంటే విభజించటం. మీరు ఎప్పుడైనా రైతులు కల్లం చేసేటప్పుడు చూసివుంటే  ధాన్యాన్ని పొట్టునుంచి వాళ్ళు ఎలా వేరుచేస్తారో చూసే వుంటారు. అలా, ఇక్కడ చంద్రకాంతిని చాటలతో అలా జాలువార్చి ఆ మచ్చను వేరుచేసి చూస్తే ఎలా వుంటుందో అంతకన్నా సుందరంగా మనోజ్ఞంగా వుందట ద్రౌపది మోము. ఏమి వర్ణన!!!

ఇక నాలుగోపాదం

యళికులంబులకప్పు గలయంతయును దెచ్చి, నారు వోసిన భంగి నవక మెక్కి - కచభరంబు



ఇక్కడ ద్రౌపది జుట్టును నారుకయ్యలోని నారుతో పోలుస్తున్నాడు చూడండి. ఇదేమి వర్ణనండీ అని అనుమానం రావచ్చు.అంత సుందరి జుట్టును  ఏ నల్ల త్రాచుతోనో పోల్చకుండా అని అనుమానం రావచ్చు. కానీ ద్రౌపది వస్త్రాపహరణమైనప్పుడు ఓ పంతం పట్టింది గుర్తుందా? తనని జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చిన దుశ్శాశనుడి రక్తాన్ని నాజుట్టుకు పూసుకొనే దాకా ఈ జుట్టును జడవేసుకోను పొమ్మని!! అదుగో అందుకే కాబోలు తిక్కన గారు నారు కయ్యను ఎంచుకున్నారు. మరి నారు కయ్యలో మొక్కలు ఆకుపచ్చగా వుంటాయి కదా. జుట్టేమో నలుపు రంగు కదా? అందుకని ఏమి చేశాడంటే తుమ్మెదల కులము యొక్క నల్ల రంగును తీసుకొచ్చి నారుపోస్తే ఆ నారు నుంచి పెరిగే మొక్కలు నల్లగానే వుంటాయి కదా? ఆ నారు కయ్యలో నారు మొలచి కొంచెంపెద్దదయ్యాక మీరెప్పుడైనా ఆ మొక్కల స్పర్శను ఆస్వాదిస్తే ఆ మెత్తదనం తెలుస్తుంది. ఆ నారు కూడా గాలి వీచినప్పుడు అటూ ఇటూ వూగుతూ చూడ్డానికి ఆహ్లాదంగా కూడా వుంటుంది. మరి ద్రౌపది జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకొని వుంటుంది కదా. ఆ జుట్టు అదుగో ఆ పైన నారు కయ్యలో నారు ఎలా వుందో అలా వుందట. అంటే అంత మృదువుగా అలా గాలికి ఊగుతూ వుందని అర్థము.


ఇలా వర్ణించి ఊరుకుంటే వాడు కీచకుడెందుకవుతాడు. అంతా చెప్పి చివరిగా ఏమంటున్నాడో చూడండి. ఇంత అందగత్తె లుండేది అనుభవించడానికని నీకు తెలియడంటే త్ర్రిప్పులాడీ అంటాడు. ఇలా అంటే ఏ అమ్మాయైనా ఊరుకుంటుందటండీ :-).

5, జులై 2013, శుక్రవారం

ద్రౌపది కి ఎలా తెల్లవారింది.....?

తే|| ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేడినిట్టూర్పులోయన వెడలెఁ గ్రొత్త
తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల


ఇది కవిత్రయ మహాభారతములోని తిక్కన రచించిన విరాటపర్వము ద్వితీయాశ్వాసములోని ప్రభాత కాల వర్ణనములోని మొదటి పద్యము.  పద్యము మొదటి సారి చదివితే సగం మాత్రమే అర్థమయింది. స్థూలంగా పద్య భావం కూడా అర్థంకాలేదు.  అ, ఆ లు మాత్రమే తెలిసిన నాలాంటి వాడికి  పద్యము అందులోని అంతరార్థం మొదటిసారి చదివినప్పుడు అర్థం కాకపోవడంలో వింతేమీలేదు. కానీ మళ్ళీ మళ్ళీ చదివితే చదివిన ప్రతిసారీ ఏదో క్రొత్త అర్థం స్ఫురిస్తుంటుంది. అందునా మహాకవుల గంటంనుంచి పద్యం తాళపత్రమెక్కిందంటే అందులో అంతరార్థాలు లేకపోతే ఆశ్చర్యపోవాలి.

పై పద్య సందర్భమేమిటంటే  పాండవుల అజ్ఞాతవాస సందర్భంగా ద్రౌపది మారుపేరుతో సైరంధ్రిగా విరాటుని కొలువులో విరాటుని భార్యయైన సుదేష్ణ దగ్గర పరిచారికగా కాలాన్ని వెళ్ళతీస్తూ వుంటుంది. ఒకరోజు మత్సదేశానికి సర్వసైన్యాధ్యక్షుడు, విరాట రాజునకు బావమరిది ఐనటువంటి కీచకుడు సైరంధ్రి అందచందాలకు ముగ్ధుడై  సైరంధ్రి పొందు కోరుకుంటాడు. వినని సైరంధ్రిని సైన్యాధ్యక్షుడనన్న అహంకారంతో వెంటపడి తరుముకుంటూ  రాజసభలో క్రిందపడదోసి తన్నడం వలన ఆమెకు నోటి నుంచి రక్తం కారుతుంది.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అదే రాజసభలో వేరు వేరు నామాలతో ధర్మరాజు, భీమసేనుడు కూడా వుంటారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కనీసము నోరెత్తి ఇది తప్పు అనికూడా అనలేదు. తన భార్యను నిండుసభలో తనముందే  అవమానిస్తుంటే అన్నీ మూసుకు కూర్చోవలసిన దౌర్భాగ్య పరిస్థితిలో వున్నారంటే వాళ్ళ మానసిక వేదన ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించండి? ఇక ద్రౌపది పరిస్థితి చెప్పాలా? అటువంటి భర్తలు వుంటే ఏమి లేకుంటేనేమి?

ఇదిగో ఆ సందర్భంలో ఆరోజు రాత్రి  రహస్యంగా కలుసుకొంటుంది. నిజానికి ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడల్లా కాపాడిన వాడు భీముడే. బహుశా అందుకే తన వ్యధను అర్థంచేసుకొని తనకు న్యాయం చేయగల్లవాడు భీముడేనన్న తలంపుతో భీముని కలిసిందే లేక వేరే ఏదైనా వుద్దేశ్యమో కానీ మొత్తానికి ఇద్దరూ కలిసి కీచకుని చంపడానికి స్కెచ్ గీస్తారు. అద్దో అప్పుడు రాత్రి గడిచి తెల్లవారే సందర్భంలో వ్రాసిన పద్యమిది

పద్యానికి స్థూలంగా అర్థాన్ని చెప్పాలంటే, ద్రుపదుని కూతురైన ద్రౌపదికి భర్తలు ఎదురుగా వుండి కూడా అనాదరణకు లోనైనందువల్ల ఆ సరోవరము  దుఃఖముతో పరితపిస్తుంటుంది. ఆ పరితాపము వల్ల సరస్సులోపల అప్పుడే క్రొత్తగా వికసిస్తున్న తామరపూల పరిమళం వేడి నిట్టూర్పుల వలే వుందట.

 ..... కానీ ఇప్పుడు ప్రతి పదార్థములను వ్రాసి సందర్భాన్ని బట్టి అర్థం ఎలా మారుతుందో చూద్దాము. ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి. పద్యానికి ఎన్నిరకాల అర్థాలైనా చెప్పుకోవచ్చు. చదివేకొద్దీ, ఆలోచించే క్రొద్దీ రకరకాల భావాలు గోచరిస్తుంటాయి.

ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేడినిట్టూర్పులోయన వెడలెఁ గ్రొత్త
తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల


ప్రతి పదార్థము : ద్రుపద నందన = ద్రుపదుని కూతురు
పరిభవము = అనాదారము, తిరస్కారము, ఓటమి
ఉల్లము = హృదయము
దురపిల్లు = శోకించు; పరితపించు
సరసి = స్త్రీ, సరస్సు
తావి= సువాసన, పరిమళము ; పండ్లపాచి
నెత్తమ్మి = నెఱ+తమ్మి = విరిసిన తామర
విరి= వికసించినది.


పదాలకు వున్న అర్థాలను దృష్టిలో నుంచుకొని చూస్తే : సరసి అంటే రెండర్థాలు ఒకటి స్త్రీ, రెండవది సరోవరము అని. అలాగే దురపిల్లు అంటే శోకించడము ఒక అర్థము. మరొకటి పరితాపము. ఇక్కడ తాపము అంటే వేడి, పరితాపము అంటే అత్యుష్ణత లేదా మిక్కిలి వేడి అని అర్థంగా చెప్పుకోవచ్చు.

ఇక్కడ క్షోభను అనుభవించింది ద్రౌపది కాబట్టి ద్రౌపది క్షోభను సరస్సు నకు అన్వయించి ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా కథా వస్తువు ద్రౌపది కాబట్టి ద్రౌపదికి ఎలా తెల్లవారిందో కూడా చెప్పుకోవచ్చు.  ద్రౌపది సుందరి కాబట్టి అలంకారికంగా స్త్రీ పెదవులను తామర పూ రేకులతో పోల్చి కూడా చూడవచ్చు. అంటే తామర పూరేకుల వంటి మెత్తని ఎర్రని పెదవులు గలదని అర్థం. ఈ రకంగా చూస్తే

ఆ రాత్రి మంతనాలయ్యాక ద్రుపదనందన వెళ్ళి పడుకొంది కానీ అంతమంది ముందు అంతటి అవమానం జరిగిన తరువాత నిద్ర ఎలా పడుతుంది? అందునా స్త్రీ.   కాబట్టి ఆ రాత్రంతా సైరంధ్రి, ద్రుపదనందనకు జరిగిన అవమానానికి  హృదయంలో ఏడుస్తూనే వున్నది. హృదయంలో ఏడవడమంటే తనబాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి కుమిలి ఏడవడం. ఇప్పుడు ద్రౌపది పరిస్థితి అంతే మరి. ఈ రకంగా రాత్రంతా ఏడ్చి ఏడ్చి  తెల్లవారుతుందనగా లేస్తుంది. రాత్రంతా నిద్రలేక కోపంతో రగిలిపోతూ తన నిస్సహాయతకు దుఃఖిస్తూ వుంటే లేచిన తరువాత శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల సహజంగానే వేడి నిట్టూర్పులు వస్తాయి కదా.
ఆ వేడి నిట్టూర్పుల వల్ల తామర పూలవంటి పెదవులు కలిగిన సైరంధ్రి విచ్చిన పెదవులనుంచి ఓ రకమైన వాసన వ్యాప్తిచెందింది అని చెప్పుకోవచ్చు.

మరో విశేషం : తామరపూలనుంచి ఎప్పుడూ సువాసనే వస్తుంది. అలాగే సుందరాంగి ఐనటువంటి ద్రౌపది తామరపూ రేకులవంటి పెదవులనుంచి ఎప్పుడూ పరిమళమే వచ్చుగాక....కానీ....ఇక్కడ పరిమళము రాదు..రాకూడదు. కారణం జరిగిన జరగబోయే సన్నివేశం ఏమాత్రమూ మంగళకరమైనది కాదు కాబట్టి. ఈ భావం నాకు స్ఫురించింది మాత్రమే... కవి తిక్కన వుద్దేశ్యము ఇది ఐ వుండవ్వచు లేదా కాకపోయీ వుండవచ్చు. అలాగే ఈ పద్యాన్ని చదివిన వారుకూడా ఈ భావంతో ఏకీభవించకపోనూ వచ్చు.


ఇక సహజమైన పద్య అర్థం పైన చెప్పుకున్నట్లే.... ద్రౌపదికి జరిగిన పరాభవం వల్ల దు:ఖముతో సరోవరము లో అప్పుడే క్రొత్తగా విచ్చుకుంటున్న తామర పూల పరిమళం  వేడి నిట్టూర్పుల వలే వుందని అర్థం.

3, జులై 2013, బుధవారం

ఇండియాతో పోలిస్తే USA లో డబ్బులు ఎక్కడున్నాయి బాబూ?

స్టేట్ ఎప్పుడు విడిపోతుందో ఏమన్నా న్యూస్ వ్రాశారేమో నని ఈ రోజు దక్కన్ క్రానికల్  పత్రిక చదువుతుంటే Business & Technology విభాగంలో  ఒక కారు బొమ్మ కనిపించింది. ఓ ఇదేదో బాగుందని దానిక్రింద నూస్ చదివాను. నమ్మలేక మళ్ళీ చదివాను. వూహూ, నాకళ్ళు ఏమన్నా మోసం చేస్తున్నాయేమోనని మళ్ళీ మళ్ళీ చదివి నిర్థారించుకొన వలసి వచ్చింది. కాసేపు అనవసరంగా అమెరికాకు వచ్చేశాము అనిపించినా మరుక్షణమే..."ఆ... ఇక్కడకు రాకపోతే ఈ మాత్రం  బ్రతుకు కూడా అక్కడ మనలాంటోళ్ళకు ఎక్కడదొరుకుతుందని" సమాధానపెట్టుకున్నాను. నిజమే..ఇవన్నీ వుద్యోగాలు చేసుకుంటూ నీతీ నిజాయితీగా అక్కడెప్పుడు కొనాలి? అంటే అన్నామనుకుంటాము కానీ ఈ కారు కొనాలంటే ఇండియా లో వాడెలాంటి వాడయి వుండాలి?

విషయమేమిటంటే "ఆడి" క్రొత్త మోడల్ RS 5 ను మార్కెట్లో విడుదల చేసింది. ముంబాయి లో దాని షోరూమ్ ధర అక్షరాల తొంభై ఐదులక్షల ఇరవై ఎనిమిది వేలే నట... అంటే మన చేతికి అందేటప్పటికి కోటి పది లక్షల రూపాయల పైమాటే . ఇప్పుడు చెప్పండి ఈ కారు ఇండియాలో ఎవరు కొనగలరు :-)

http://www.deccanchronicle.com/130702/news-businesstech/article/audi-rolls-out-rs-5-coupe-hike-prices-2-3-cent-soon



అదే మోడల్  అమెరికాలో RS 5 Coupe  వెల  $68,900. అంటే ఇప్పటి ప్రకారం డాలర్లలోకి మారిస్తే నలభై ఒక్క లక్ష పదివేల రూపాయలు ( డాలరుకు అరవై రూపాయలు వేసుకున్నా సరే )... ఎక్కడి కోటి ఎక్కడి నలభైఒక్కలక్ష?



సరే!! ప్రజలదో, ప్రక్కనోడి రక్తాన్నో లేదా ప్రజల అమాయకత్త్వాన్నో  ధారలుగా పోయించి ఆ కోటి పెట్టి కారు కొన్నామనుకో.... మొదటి రోజు ప్రక్కసీట్లో కత్తిలాంటి ఫిగర్ ను కూర్చో పెట్టుకొని రోడ్డుమీదకు వెళతామో.... ఏ ఆటో వాడో వచ్చి కారుకు పచ్చరంగు గీతలు పులిమేసి చక్కా వెళ్ళిపోతాడు. ప్చ్.... అసలు ఇండియా రోడ్లకు ఇంతటి ఖరీదైన కార్లు అవసరమా? అన్నట్లు ఇక్కడ నలభై లక్షల కారు అక్కడ కోటి రూపాయలంటే ఇదంతా గవర్నమెంట్ కు ఆదాయమే..ఓమ్మో ఓమ్మో ఎంత ఆదాయము, ఏమి సంగతీ....ఎన్నెన్ని పనులు చెయ్యొచ్చు?

ఐనా ఇదంతా చూస్తుంటే పేద దేశం ఇండియా కాదు ...అమెరికానే...కాదంటారా? డబ్బు సంపాయించే నేర్పు కలవాళ్ళకు ఇండియా స్వర్గ ధామం..అది చేతకాని నాలాంటోళ్ళకు అమెరికానే గతి.

1, జులై 2013, సోమవారం

కొమ్మ కొమ్మనూ మురిపించి మదిని మైమరపించే రంగు రంగుల పూబాలలు


ప్రకృతి పరవశించెలే నా మనసు పరిమళించెలే
అందాల తోటలోన అణువణువు పులకరించెలే || ప్ర ||
..........

ప్చ్ మిగతాది దారిలోనే మర్చిపోయా :(... అందుకే ఇప్పటికి ఒకే ఒక పల్లవి చర్విత చరణం
.