6, ఆగస్టు 2013, మంగళవారం

మా దేశం మాకు కావాల్సిందే...... ఉద్యమబాట !!!

మా కల్చర్ వేరు. మా రంగు వేరు. మా నామధేయాలు వేరు. మా భాషవేరు. మేము మాట్లాడేభాషంటే కొన్ని ప్రాంతాల వారికి చాలా వెటకారంగా వుంటుంది.

స్వాతంత్ర్యం వచ్చిన నాటినప్పటినుండి ఈ నాటి వరకు భారతదేశ ప్రధానులుగా పనిచేసిన వాళ్ళలో ఎంతమంది దక్షిణభారతీయులున్నారు? ఎంతమంది పశ్చిమ భారతీయులున్నారు? ఎంతమంది తూర్పుభారతీయులున్నారు? వీళ్ళ వీళ్ళ జీవనవిధానం వేరు, పండుగలు వేరు, తలసరి ఆదాయం వేరు, ఇంకా చాలా చాలా వేరు.

ఒకప్రాతం అభివృద్ధి జరిగినట్లుగా మరోప్రాతం అభివృద్ధి జరుగలేదు. ఒక ప్రాంతానికి కేటాయించిన నిధులతోపోలిస్తే మరోప్రాంతానికి కేటాయించే నిధులను అసలు పోల్చలేము. కేంద్రము ఇలా ఒక ప్రాంతంపై తల్లిప్రేమనూ, మరోప్రాంతంపై సవతిప్రేమనూ చూపిస్తుంటే మేము ఎన్నిరోజులు ఇలా కలిసి వుండాలి? మా ప్రాంతాలు మీలా సమానంగా అభివృద్ధి జరగాలంటే మీనుంచి మేము విడిపోవాలనుకుంటున్నాము కాబట్టి భారతదేశాన్ని ఉత్తర,దక్షిణ,పశ్చిమ,తూర్పు దేశాలుగా విభజించాలని, దీనివల్ల అన్ని దేశాలు బాగా అభివృద్ధి చెందుతాయనీ, మా నిధి నిక్షేపాలనూ మేమే వాడుకోవటానికి అవకాశం వుంటుందనీ, ఒక ప్రధాని కి బదులు నలుగురు ప్రధానులు, అలాగే లెక్కలేనన్ని మంత్రిపదవులతో దేశంలో పూర్తిగా రాజకీయ నిరుద్యోగం తగ్గి అన్ని ప్రాంతపు దేశాలు సర్వతోముఖాభివృద్ధిని సాధించగలవనీ మీరు గుర్తెరిగి మీమీ ప్రాంతపు దేశాలకై ఉద్యమబాటను పట్టినట్లైతే ఎలా వుంటుందో ఆలోచించ వలసినదిగా ఓ సగటు భారతీయుని ఆలోచన !!!!

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఇంతకీ తెలుగుదేశం పార్టీ దేన్ని సమర్ధిస్తున్నట్లు?

ఇంతకీ తెలుగుదేశం పార్టీ దేన్ని సమర్ధిస్తున్నట్లు? తెలంగాణానా లేక ఆంధ్రప్రదేశ్ నా ? కొంతమంది MP లు రాష్ట్రం కలిసి వుండాలని రాజీనామాలు చేస్తారు. కొంతమంది తెలంగాణా కు మద్దత్తు ప్రకటిస్తారు. అసలు నాయకుడు అసలు మాట్లాడడు. ఎవరి పార్టీ వాళ్ళకు ముఖ్యం కాబట్టి ఇప్పుడు పార్టీ లు రెండు వర్గాలను సృశ్టించి కొంతమంది సమైక్యంగా వుండటానికి మద్దత్తిస్తే మరికొంతమంది తెలంగాణా కు మద్దత్తు ఇస్తారు కాబట్టి రెండు ప్రాంతాల్లో తమ పార్టీ మనుగడకు ఎలాంటి ఇబ్బందులుండవ ని కోడి లెక్కలు వేసుకోవచ్చు. దీనిలో భాగమే ఇప్పుడు జరుగుతున్న రాజీనామాలు. కేవలం రాజీనామాలైతే పరవాలేదు, దానికి విరుద్ధంగా మళ్ళీ తెలంగాణా కు సపోర్టు. 
ఇది రెండు పడవలపై ప్రయాణం లాంటిది. కాబట్టి మునిగిపోక తప్పదు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే అటు తెలంగాణాలో ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లో పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనిపిస్తుంది.

వైయస్సార్ పార్టీ, వీరి MLA లు అందరూ రాజీనామాలు సమర్పించినా పార్టీ పరంగా మాత్రం స్పష్టంగా మేము ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడానికి వ్యతిరేకమని చెప్పలేకపోతున్నారు. ఇలా ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ఈ పార్టీకి రెండు ప్రాంతాల్లో మనుగడ వుంటుంది. కారణం తెలంగాణాలో  కూడా సమైక్య వాదులు కనీసం 30-40 శాతం వుంటారు.

రాష్ట్రం ఎందుకు సమైక్యంగా వుండాలి? ఇది చాలా చిన్న ప్రశ్నైనా సమాధానం చెప్పాలంటే కనీసం మూడు నాలుగు పేజీలైనా రాయాలికాబట్టి మరోసారి చూద్దాం.