13, ఫిబ్రవరి 2009, శుక్రవారం
అమెరికా ఉద్యోగాలు
ఈ రోజు న్యూయార్క్ టైమ్స్ పత్రిక లో ఒక ఆర్టికల్ దాని మీద పాఠకుల అభిప్రాయాలు చదివిన తరువాత ఈ సంక్షోభం ఎంత త్వరగా సమసి పోతే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఉద్యోగాలు పోయి కొందరేడుస్తుంటే ఉద్యోగాలు వుండి భయపడుతూ బ్రతికే పరిస్థితి కొందరిది. అమెరికా ఎంత వలసల రాజ్యమైనా వారికంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలు వున్నాయి. మనమైనా మనదేశం లో ఇలాంటి పరిస్థితి వస్తే ఇంతకంటే ఎక్కువగానే స్పందిస్తామనుకుంటా.
నాకూ నిజమేనని పించింది. సంవత్స్రరం క్రితందాకా నాకు రైల్వే స్టేషన్ లో కారు పార్కు చేసు కోడానికి స్థలం దొరికేది కాదు. రైల్లో మన వాళ్ళ తో పాటి వాళ్ళు 50-50 వుండే వాళ్ళు. 6 నెలల క్రితం కార్ పార్కింగ్ సులభంగా దొరికేది. జనవరి 2009 నుండి పార్కింగ్ చాలా ఖాళీగా కనిపిస్తుంది.
న్యూయార్క్ టైమ్స్ లో ఈ ఆర్టికల్ చదివిన తరువాత నా ఙ్ఞాపకాల్ని పరికిస్తే , రైల్ లో 70 % విదేశస్తులు. న్యుయార్క్ వీధుల్లో సాయంకాలం 7 తరువాత 80 % మనవాళ్ళు. అక్కడక్కడా అమెరికన్స్ కనిపిస్తారు ... పరదేశం లో వున్నట్టు !!! . ఇంతెందుకు మా కార్యాలయం లో దాదాపు 13 దేశాల ప్రాతినిధ్యం వుంది. ఇందులో అత్యధికులు రష్యన్స్, మనది అంత పెద్దసంఖ్య కాదు కానీ ప్రాతినిధ్య శాతం బాగనే వుంది. ఇంతకి మైనారిటీ ఎవరో చెప్పక్కరలేదనుకుంటా.
ఉద్యోగాలు పోయిన వాళ్ళల్లో అందరూ వున్నారు కానీ నాకెందుకో లాప్ టాప్ సంచు లతో వారి స్వదేశంలో విదేశీయులు ఎక్కువగా కనిపిస్తున్నారు.పలువురు చెప్పేదాన్ని బట్టి వచ్చేసంవత్సరము జూన్ దాకా ఈ పరిస్థితికి విరుగుడు లేదంట ????
ఇది అమెరికన్ల సహనానికి పరీక్ష పెట్టి, ఈ ద్వేష భావము ఇంకా పెరగకముందే "సర్వేజనా సుఖినోభవంతు" అని శుభం కార్డు పడాలని నాతో మీరూ ప్రార్థించండి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form