29, జులై 2009, బుధవారం
ఏవి నా మతగ్రంధాలు. మతమా, ఆధ్యాత్మికతా, వేదాంతమా ? ఏది నా మతం?
వాసవ్య గారి వ్యాఖ్య చూసాక, నాకు ఇంకనూ ధర్మ సందేహములు తీరక ఈ టపా వ్రాయుచుంటిని. వాసవ్య గారు చదివి నాకున్న ధర్మసందేహాలను వారికున్న సాంకేతిక సశాస్త్రీయ ప్రిజ్ఞ్ణానముతో తీర్చెదరేమో నని ఎదురు చూచు చుంటిని.
ముందుగా వారి వ్యాఖ్య...ఈ టపా లో
"భాస్కర రామి రెడ్డి గారూ,
వికీపిడియాలో కావలసినంత వివరములు దొరుకును.
భూమి గురించి: http://en.wikipedia.org/wiki/Earth
భూమి వయసు గురించి: http://en.wikipedia.org/wiki/Age_of_the_Earth
మీకు యింకను, భూమి మీద ధర్మ సందేహములు వుండినను, ఈ లంకెలోని విషయములు చదవండి. http://en.wikipedia.org/wiki/Earth#References
పై విషయాలతో మీరు ఏకభవించకపొతే, భూమి గురించి మీకు తెలిసినది చెప్పగలరు. ఒకవేల మీరు చెప్పేది నిజమని భావించాలంటే, మీవాదమునకు బలముచేకూర్చే మత గ్రంథాల వివరములు తెలియజేయగలరు. ఒక ఛాలెంజ్ చేయగలను. కనీసం 6వ తరగతి సైన్సు పాఠ్యపుస్తకంలో వున్న విధముగానైనా, ఏ మత గ్రంథాలలోనూ సరి చూపించలేరు!
ఊహాగానాలకి/నమ్మకానికి, శాస్త్రీయతకి అసలు సంబంధములేదు. శాస్త్రీయతమీద నమ్మకము లేనియెడల, కేవలం మతగ్రంధాలలో చెపిన విధముగా నమ్మకముతో, శాస్త్రీయతతో పనిలేకుండ బ్రతకండి. అంతేగాని, మతగ్రంధాలే సైన్సుకు మూలాదారము అని మాత్రం దయచేసి వాదించకండి.
"
నిజమా అని అలోచిస్తూ .......
ఏవి నా మత గ్రంధాలు? హిందూ దేశంలో మతానికి, వేదాంతానికి ఆధ్యాత్మికతకు తెర ఎక్కడ? అసలు పురాతన భారతమేది? ఎల్లలు ఎక్కడ? విభిన్న కాలలలో విభిన్న ప్రాంతాలు విభిన్న రాజుల పరిపాలన క్రింద వున్నా సర్వకాల సర్వావస్థలందు నా పూర్వీకులు పాటించిన మతమేది? ఒకరికి వేదాలు మతగ్రంధాలు మరొకరికి రామాయణ భారతాలు మత గ్రంధాలు. మరొకరికి గీత మతగ్రంధం. ఇంకొకరికి సిద్ధాంత గ్రంధాలు మతగ్రంధాలు. భారత దేశంలో మతానికీ, సాంకేతికానికీ, ఆధ్యాత్మికతకు, వేదాంతానికి ఇదమిద్ధమైన గీటురాయి ఎక్కడ? ఒక దానికొకటి మమేకమై మానవజాతి మహోన్నత జాతిగా, వటవృక్షంగా ఎదిగి ఊడలు ప్రపంచమంతా వ్యాప్తిచెంది పాయ పాయలుగా చీలిపోయినా ఇంకా నిలచి ఉండడానికి కారణం పైనున్న వివిధ శాఖలతో నా మతానికున్న స్నేహ సౌభాగ్యాలే. నన్నెవరైనా ఆధ్యాత్మికతకు మతానికి , ఆధ్యాత్మికతకు వేదాంతానికి లేక వేదాంతానికి సాంకేతికానికి ఉన్న పొరను గుర్తించమంటే సాధారణ సాంకేతిక విద్యార్థిగా నేను చేయలేను. మీరు చేయగలరేమో ప్రయత్నించండి.
ఇక వాసవ్య గారి ఛాలెంజ్ కి వస్తే , ఆరవ తరగతి కాదు కదా డాక్టరేట్ లు చేసినా మనలో స్లో పాయిజన్ గా తలకెక్కిన యూరోపియన్ భావజాలాన్ని మార్చడం అంత సులభంకాదు. ఆరవ తరగతిలో "భూమి గుండ్రముగా నుండునని క్రిష్టోఫర్ కొలంబస్ తన సముద్ర ప్రయాణం ద్వ్రారా కనుగొన్నారు" అని ఒకటికి మూడుసార్లు చదివి వంట బట్టించుకుంటాము. సర్ ఐజాక్ న్యూటన్ గతిశాస్త్రాన్ని ఎనిమిదవ తరగతిలో చదివి జీవితాంతం గుర్తుంచుకుంటాము ( నాకు ఐజాక్ న్యూటన్ అంటే అమితమైన ఇష్టం, కారణాలు అనేకం. ఈ వ్యాస పరిధికి ఆ వివరాలు అసందర్భం).ఇంటర్మీడియెట్ లో లెబ్నిజ్ ఈక్వేషన్స్ బట్టీ పెట్టి ( వాటి ఉపయోగమేమిటో ఎప్పుడైనా ఆలోచించామా?) డిగ్రీ / ఇంజనీరింగ్ సీటు తెచ్చుకుంటాము. ఫోరియర్ ట్రాన్స్ ఫర్మేషన్స్ లాగించేసి ఒక ఉద్యోగం సంపాయించి కాలం వెళ్ళబుచ్చుతామేగానీ ... ఎప్పుడైనా ఇవన్నీ యూరోపియన్స్ నుండి ఎందుకు అరువు తెచ్చుకున్నామని ఆలోచించామా? ఒకసారి చరిత్ర తిరగవ్రాద్దామా అని ఆలోచించామా? మీరేమో కానీ నేనెప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు.
నా పూర్వీకులైన వరాహమిహిర, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, చరక , సుశ్రుత,పాణిని, మహావీర, మాధవాచార్య,జేష్ట మొదలైన వారు మనము ప్రొద్దు పొడిచినఫ్ఫటినుండి తెల్లవారేదాకా ఏకరువు పెట్టే కొపర్నికస్, గెలీలియో, న్యూటన్, టేలర్, లెబ్నిట్జ్, గ్రెగొరీ, యూలర్, పైథాగరస్ మున్నగువారికంటే ఏ రకంగా అసమర్థులని ఆలోచించామా? వారు వ్రాసిన సాంకేతిక గ్రందాలను అర్థం చేసుకోలేని స్థితికి తీసుకెళ్ళిన మన పూర్వీకుల వ్యవస్థను తప్పు పడదామా లేక బానిస బ్రతుకులకు అలవాటు చేసిన బ్రిటీష్ రాజ్యాన్ని తలచుకొని రగిలిపోదామా? అతిధులుగా వచ్చి దొంగలుగా మారి దొరలవతారమెత్తి హిందూ మతమంత మూఢనమ్మకాల మతము లేదని తేనపూసిన కత్తితో మన చరిత్రను రచించి, విజ్ఞానాన్ని తస్కరించి నిర్వీర్యం చేసిన వారి పాషాణ సంకెళ్ళ చెరనుండి బయట పడాలంటే ఏది కర్తవ్యం?
మళ్ళీ ఒకసారి.. ఆరవ తరగతిలో "భూమి గుండ్రముగా నుండునని క్రిష్టోఫర్ కొలంబస్ తన సముద్ర ప్రయాణం ద్వ్రారా కనుగొన్నారు". ఇది చదివి ప్రశ్నలేసుకోమి. ఎందుకంటే యూరోపియన్స్ ఆర్ జీనియస్. అదే ఈ క్రిందిది చూడండి
म्रुज्जलषिखिवायुमयॊ भूगॊळः सर्वतॊ व्त्त्ः
Mrujjalashikhivaayumayo Bhoogola: sarvatho vruttha:
" మట్టి, నీరు, అగ్ని, గాలి (వాతావరణం) లతో ఉన్న ఈ భూగోళం ఎటునుండి చూసినా వృత్త ఆకారంలో నుండును" . ఆర్యభట్టీయం లో ఈ శ్లోకం గమనించినట్లైతే , భూమి ఒక గోళం. అంతేకాదు సెక్షనల్ వ్యూ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఎ సర్కిల్.
క్రిష్టోఫర్ కొలంబస్ చెప్తే అది కరక్ట్, మనవారు చెపితే అది బోడిగుండికి మోకాలికి ముడి వేసినట్టు.
అలాగే ఇంకోటి గతి సిద్ధాంతం.
Bhakthe vilomavivare gathiyogenaanulomavivare dvow
Gathyantharena labdow dviyogakaalaavatheethaishyow
“If two objects are traveling in opposite directions, the time required for them to meet is equal to the distance between them divided by the sum of their speeds. If they travel in the same direction the time that has elapsed equals the distance between them divided by the difference in their speeds”
"సూర్యసిద్ధాంత" గ్రంధాన్ని ఎప్పుడైనా విన్నామా? సిద్ధాంత గ్రధం విన్నా దీని రచయిత ఎవరో తెలుసా? ఎంత దౌర్బాగ్యం? సుమారుగా ౧౦౦౦ బి.సి లో వ్రాసిన ఈ గ్రంధంలో ఆష్ట్రనామికల్ గణాంకాలు ఎన్నో వున్నాయట. ఆర్యభట్ట విరచించిన ఆర్యభట్టీయం లో సూర్యసిద్ధాంత రిఫరెన్స్‌లు ఎన్నో వున్నాయట.తను స్వయంగా ఆష్ట్రానమీ గణించడానికి తయారు చేసినవిలువైన పరికరాలు చక్రయంత్ర, గోళయంత్ర, ఛాయా యంత్రాలు.
సూర్యసిద్ధాంత సూత్రం గా చెప్పుకుంటున్న ఒక శ్లోకం చూడండి ( సుమారు 1000 B.C )
पारदाराम्बुसूत्राणिसुल्बतैलजलानिच
बीजानिपंसबस्तॆषुयॊगास्तॊपिदुर्लभः सूर्यसिद्धांन्त -११
Paradara, ambu, sutrani, shulbataila jalanicha. Bijani, pasava, asteshu prayoga,
stepi durlabha.
గమనించారా పాదరస ట్యూబ్ లాంటి పరికరన్ని, అప్పట్లో ఇలాంటి పరికరాలు దొరకడం/ చేయించడం ఎంత కష్టమో? దేనికి వాడతారు ఈ పాదరస భారమితి ని?
మరోటి
वंशस्य मूलं प्रविलॊक्य चाग्रं तत्सवन्तरं तत्स्य समुछ्चयं च
यॊ वॆत्ति यस्टॆयव करस्थ्यसौ धीयन्त्रवेदी किं न वॆत्ति
సిద్ధాంత సిరోమణి - భాస్క్రరాచార్య ( 1072 A.D)
వెదురు చెట్టు పైభాగాన్ని (చిటారు కొమ్మన్ని) క్రింద భాగాన్ని చూసి దాని దూరాన్ని, ఎత్తును అంచనా వేయవచ్చు. ఎవరైతే ఇది కర్ర తో సాదించగలరో వారు మిగిలిన ఏదూరాలైనా చెప్పగలరు. అంటే ఏ పరికరాన్ని వాడి వుంటారు? ఓ రెండు వెదురు చెట్ట్లో లేక కొమ్మలో ...ఇది త్రికోణమితి కాదా? లంబకోణ త్రిభుజాలు , పైథాగరస్ థీరీలు ఇందులో మనకు కనబడవు. ఇదీ బోడుగుండుకీ మోకాలుకూ ముడివేయుట అని అందురేమో...
చాలా వరకు పూర్వీకులు వాడిన భాష అర్థం కాక , వానికి పరిష్కార గ్రంధాలు లభింపక, ఉన్న గ్రంధాలు కాలిపోయినవి కాలిపోగా, తస్కరించినవి తరలి పోగా మనకు ఇప్పుడు మిగిలింది ...
భా.రా.రె
రిప్లయితొలగించండి>>నా పూర్వీకులైన వరాహమిహిర, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, చరక , సుశ్రుత,పాణిని, మహావీర, మాధవాచార్య,జేష్ట మొదలైన వారు మనము ప్రొద్దు పొడిచినఫ్ఫటినుండి తెల్లవారేదాకా ఏకరువు పెట్టే కొపర్నికస్, గెలీలియో, న్యూటన్, టేలర్, లెబ్నిట్జ్, గ్రెగొరీ, యూలర్, పైథాగరస్ మున్నగువారికంటే ఏ రకంగా అసమర్థులని ఆలోచించామా? వారు వ్రాసిన సాంకేతిక గ్రందాలను అర్థం చేసుకోలేని స్థితికి తీసుకెళ్ళిన మన పూర్వీకుల వ్యవస్థను తప్పు పడదామా లేక బానిస బ్రతుకులకు అలవాటు చేసిన బ్రిటీష్ రాజ్యాన్ని తలచుకొని రగిలిపోదామా? అతిధులుగా వచ్చి దొంగలుగా మారి దొరలవతారమెత్తి హిందూ మతమంత మూఢనమ్మకాల మతము లేదని తేనపూసిన కత్తితో మన చరిత్రను రచించి, విజ్ఞానాన్ని తస్కరించి నిర్వీర్యం చేసిన వారి పాషాణ సంకెళ్ళ చెరనుండి బయట పడాలంటే ఏది కర్తవ్యం?
ఇది చదివిన నాకొ రోమాంచ కలిగింది.
అత్భుతంగా చెప్పారు.
జైహో!!
Good article. Probably reason could be that the so called language in which the "granthas" are written viz., sanskrit which has gone for oblivion due to arrogance,negligence and later on due to getting the language linked to a religion giving it a status of a religion for sanskrit is hinduism! Neither hinduism is a 'ism' nor sanskrit is god's language. Once upon a time it was a well known language but fallen to such a status that now its ailing with a very few people who can interpret it correctly(many can rut it because of the language's beauty but very few can give a proper explanation)
రిప్లయితొలగించండిregards
భాస్కార్ రోమాంచితాలు మామూలు స్స్థితికి వచ్చిందా? మరోసారి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిజిలేబీ గారూ బహుకాలానికి మళ్ళీ వ్యాఖ్య. అర్థవంతమైన అభిప్రాయం. మీ వ్యాఖ్య చూసి మనసు ఊరుతుంది ( జిలేబీ అంటే మరి నోరూరదా?)
రిప్లయితొలగించండిచాలా చక్కగా వివరించారు. ఇకపోతే ఒక విషయం గమనించండి. జర్మన్స్ సంస్కృతం మీద ఎందుకు పట్టుసాధించి, మన గ్రంధాలను అధ్యయనం చేస్తున్నట్లు? అక్కడికి మన పురాతన గ్రంధాలు ఎలా చేరినట్లు? వాటికి సమాధానం తెలిస్తే, అప్పుడు యూరోపియన్స్ గొప్పదనం గురించి మాట్లాడవచ్చు.
రిప్లయితొలగించండిఅద్భుతంగా చెప్పారు. మనవాళ్ల గొప్పతనం మనం చచ్చినా ఒప్పుకోము. తరాలు మారినా ఇది ఇంతే. మనకు కనీసం వీళ్ల పేర్లు అన్నా తెలుసు. మన తరువాత తరాల వాళ్లకి అది కూడా తెలియదు. వాళ్లంతా ఇక అలా శాశ్వతంగా మన చరిత్ర శిధిలాల కింద నిక్షిప్తమయి ఉండాల్సిందే.
రిప్లయితొలగించండిమీ బ్లాగులో తెలుగులో వ్యాఖ్య వ్రాయటానికి కొంచం సమస్యగా ఉంది. ప్రివ్యూ లోకి వెళ్లి సరిచేయి అన్నాకే తెలుగులో వ్రాయను వీలవుతుంది. మరి ఈ సమస్య నాకేనేమో తెలియదు.
బహుకాల అభిప్రాయ దర్శనాలు ఈరోజు. ఆదిలక్ష్మి గారూ మీ వ్యాఖ్య కు సమాధానాన్ని మీద్వారా వినాలని కోరిక. శ్రమ అనుకోకుండా మీ దగ్గరున్న సమాచారాన్ని క్రోడీకరించి చెప్పగలరా? మీరు చేసినట్టు అనాలసిస్ నేను చేయలేను. ఇది మీద్వారానేసాధ్య పడాలి.
రిప్లయితొలగించండిసిరిసిరి మువ్వగారూ, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండి.ఇప్పటికైనా భారత సాంకేతిక యువశక్తి కళ్ళు తెరచి తమవైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటే బాగుంటుంది. ఈ తరం యువత వీరిని మర్చిపోకుండా వుండడానికి మీదైన తరహాలో మీ ప్రయత్నాలు సాగించండి. అవి నిర్విఘ్నంగా జరగాలని మనసారా కోరుకుంటాను.
రిప్లయితొలగించండిభాస్కర రామి రెడ్డి గారు,
రిప్లయితొలగించండిమీరు "భుమి పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తారా?" అని నన్ను అడిగారు, ప్రస్తుత శాస్త్రసాంకేతిక పరిజ్ణనముతో ఎక్కువమంది శాస్త్రీయ పరిశోధికులు బలపరిచిన వాదన్ని తెలుపుతూ వికీపీడియ Referrences పంపించాను. ఆ విషయములతో మీరు విభేదించేటట్లైతే, మీకు తెలిసిన విషయాలు "భుమి పుట్టు పూర్వోత్తరాలపై" తెలపమని కోరాను నా టపాలొ. నా వ్యాఖ్యలోని ఆఖరి లైనుపై మాత్రం వ్యాఖ్యానించారు.
పై టపాలో మీరు వ్రాసినదానికి సమయం దొరికినప్పుడు తప్పక వాక్యానిస్తాను.
ఏ క్రిందివాటికి సమాధానం మీదగ్గర ఏముందో చెప్పగలరా?
1. భుమి పుట్టు పూర్వోత్తరాలపై మత గ్రంథాలు ఏమిచెపుతున్నాయి?
2. అన్ని మతాలు ఒకేవిధమని చెపుతున్నాయా?
3. అన్ని మతాలు చెపేవి నిజమేనా? లేక కేవలం ఏదో ఒక్కమతం చెప్పేది నిజం మిగిలిన మతాలు చెప్పేవి అభూతకల్పనలేనా?
నిజంగా చెప్పాలంటే, పై వాటికి నాదగ్గర సమాధానాలు లేవు అందుకే, విధిలేక శాస్త్రీయ పరిజ్ణనాన్ని నమ్ముకున్నను.
మీజాబుకు కుతూహలంగా ఎదురు చూస్తున్న..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభా.రా.రె
రిప్లయితొలగించండినాకో భయంకరమైన ప్రశ్న -
శాస్త్రీయ పరిజ్ఞానం అంటే ఏంటి? ఏ శాస్త్రీయత? ఎవరి శాస్త్రీయత?
>>భూగోళః సర్వతో వృత్తః
ఇది శాస్త్రీయ ధృక్పదం కాదా?
అంతదాకా ఎందుకు -
అత్యంత పురాతన దేవాలయాలు మనకళ్ళముందే కనిపిస్తున్నాయి, సే, శ్రీరంగం, లేక తంజావూరు, లేక ముండేశ్వరస్వామి దేవాలయం లేక గుడిమళ్ళం - ఇలాంటి దేవాలయాల్ని ౧-౫౦౦ 1-600 AD లలో కట్టారు అని మనకు తెలిసిందేనా?
అలాంటి స్ట్రక్చర్స్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటే, ఏ శాస్త్రీయ పరిశోధనా లేకుండా కట్టబడినవేనావేనా?
నిన్నటికి నిన్న, దిల్లీలో ఓ వంతెన కూలింది. పై గుళ్ళు మేజర్ పార్ట్స్ ఇంతవరకు చెక్కుచెదరలేదు.
వాసవ్య గారూ ,
రిప్లయితొలగించండిFamous late American astronomer Carl Edward Sagan says
"The Hindu religion is the only one of the world's great faiths dedicated to the idea that the Cosmos itself undergoes an immense, indeed an infinite, number of deaths and rebirths. It is the only religion in which the time scales correspond, to those of modern scientific cosmology. Its cycles run from our ordinary day and night to a day and night of Brahma, 8.64 billion years long. Longer than the age of the Earth or the Sun and about half the time since the Big Bang. And there are much longer time scales still.
A millennium before Europeans were willing to divest themselves of the Biblical idea that the world was a few thousand years old, the Mayans were thinking of millions and the Hindus billions."
If you still need information on earth please refer any hindu mythology book.
Regarding other questions you have
2. అన్ని మతాలు ఒకేవిధమని చెపుతున్నాయా?
3. అన్ని మతాలు చెపేవి నిజమేనా? లేక కేవలం ఏదో ఒక్కమతం చెప్పేది నిజం మిగిలిన మతాలు చెప్పేవి అభూతకల్పనలేనా?
నాకు మిగిలిన మతాలగురించి ఇసుమంతైనా జ్ఞానము లేదు. వ్యాఖ్యానించడానికి అర్హుడను కాను.
భాస్కర రామిరెడ్డి,
రిప్లయితొలగించండిమీరు అడిగిన దానిని వ్రాయాలంటే, కనీసం రెండు టపాలు వ్రాయాలి. వీలయినంత త్వరలో నాబ్లాగులో వ్రాస్తాను.
వాసవ్య గారూ,
రిప్లయితొలగించండి2. అన్ని మతాలు ఒకేవిధమని చెపుతున్నాయా?
3. అన్ని మతాలు చెపేవి నిజమేనా? లేక కేవలం ఏదో ఒక్కమతం చెప్పేది నిజం మిగిలిన మతాలు చెప్పేవి అభూతకల్పనలేనా?
మతపరమైన విశ్లేషణ కామేంట్లలో చర్చించుకునేంత చిన్నవి కావు. మీరు ఆ భేదాలను తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది ని చదవండి.
http://www.scribd.com/doc/15691127/Hindu-View-of-Christianity-Islam-Ram-Swarup
గురు శిష్య పరంపరగా అందిచబడి మీరన్న దౌష్ట్యానికి, దౌర్జన్యానికి లోనవగా మిగిలినవి లేశమే. ప్చ్.. అయినానేమి మనవంటి వారం అసలు నిజాల్ని నొక్కిచెప్పలేమా ఏమి? తనివి తీరలేదు, మళ్ళీ మళ్ళీ చదువుతాను, నాకు తెలిసిన మరో నలుగురికీ చెప్తాను. కృతజ్ఞతలు. మీకు మీరే సాటి..
రిప్లయితొలగించండిఆదిలక్ష్మి గారూ, మీ పోష్ట్ కై ఎదురు చూస్తున్నాను.
రిప్లయితొలగించండివికాసం గారూ, మంచి సమాచారం. ధన్యవాదాలు.
ఉషగారు, ఆలస్యం ఎందుకు.. జీవితాల ఉషోదయాన్ని నింపండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీరు కేవలం ఒక ఆమెరికన్ astronomer చెప్పిన విషయం ఉటంకిస్తున్నరు. దానికి ప్రంపంచ వ్యాప్తంగా వున్న అస్త్రొనొమెర్స్ మద్దతు లేదుగా! ఉదాహరణకు, భారతదేశంలో చాలా మంది హిందూ ఉన్నత శ్రేణి వర్గం కూడా హిందూ మతాము పై నమ్మకము సడలి క్రైస్తవ మతాన్ని స్వీకరిచడం మనము చూస్తున్నాము. దీనిని మీరు ఆమెరికన్ astronomer ను ఉటంకించినట్లు ఈ విషయమూ చెప్ప్దదలిస్తే, హిందూ మతము తప్పు అనేవారు రోజురోజుకు పెరుగుతున్నరు కదా? ఎంతమంది ప్రంపచవ్యాప్తంగా హిందు మతము మాత్రమే నిజం అని హిందూ మతంలోకి మారుతున్నరు? దీనిని గమనంలోకి తీసుకోకుండా, ఎప్పుడో ఒకాయన చెప్పిన విషయన్ని మాత్రం గుర్తుంచుకున్నరు! (గమనిక: నేను క్రైస్తవ/ఏ మతము చెప్పేది కూడా నిజమని భావించను/సమర్దించను)
రిప్లయితొలగించండిమిగతా మతముల గురించి తెలియదని తెలివిగ తప్పించుకోజాలరు. ఎందుకంటే, అన్ని మతాలు ఒకటే చెప్పితే ఇన్ని మాతాల ఎందుకు వెలిశాయి? ఇన్ని వైరుధ్యలు మతాలు మధ్య ఎందుకు? మీకు మతాల మధ్య తేడలు/వైరుధ్యాలు లేవని తెలియదంటే అది నమ్మసక్యముగా వుంటుందా? ఒకసారి ఆలోచించండి!