2, అక్టోబర్ 2009, శుక్రవారం
ప్రేమ కొలనులో చేప పిల్ల
మరువం ఉష గారి జలపుష్పాభిషేకానికి నా చిరు స్పందన
పండు వెన్నెల వెలుగులో
పడుచు జంట జలకాలు చూడ
సరోవరాన దాగిన నింగి సిగ.
పండల్లె భ్రమించి
పరుగులెత్తిన పడుచు మీనాలు.
జలపుష్ప జలాకాలాటల
కదిలిన సరోవర చిరు తరంగాలు.
తరంగాల తాకిడిన తరలిన మీనాక్షి చూడ
మృచ్చకంఠి కనుల కొలనులో
అరవిరిసిన అలతి అందాలు.
అరుణారుణ అధరాల
అరివిరి నయనాల
చెంగావి చెక్కిళ్ళ
సిందూర సింగారి.
అరవింద నయనాల విలుకాడు
మీనాక్షి వలలోన బందికాడు
యువ చేప ప్రతి కదలికలో
పడుచు చేప పలుకులే!
పసిడి చేప ప్రతి పథములో
ప్రతిమగ నిల్చిన పడుచువాడు!
కదిలీ కదలని పెదవుల కదలికలో
ఉవ్వెత్తున ఎగసే హృదయ తరంగాలు.
చూసీ చూడని ఓరచూపుల
చెలెరేగే చిలిపి కోరికలు.
చిరుగాలి రెపరెపల ప్రియురాలి ముంగురులు
ప్రియుని చెంపల అదృశ్య రేఖల లిఖింప,
ఎలిమి ఎలనాగ రాణిని గాంచి
ఏకాంత కాసార వాసాన
ఆలపించె విరహ వేడుకోలు.
నయగారి నటరాజు
నయనాలు చుంబించి,
మాయావి మన్మధుడు
మదినంత అలరింప,
మధుర మధుగానాల మారాము చేసి,
అధరముల వీణ తంత్రులుగ మలచి
కరముల తంత్రులు మీటగ
ప్రతిధ్వనించిన విరహాగ్ని రాగాల
ప్రక్కనున్న పూలపొద రేపింది
హరివింటి పుప్పొడి దుమారం
తెలి వెన్నల నీటకురిసిన పుప్పొడి
జలచరాల నడుమ జ్వలనమై
జలపుష్ప జాతికి అనునాదమై
సాగరాన జరిగె ప్రతిసృష్టి.
విరిసిన వెన్నెల వాకిట
వెలసిన కన్నె పరువాలు.
పరువపు వెన్నెల ఆరబోతలో
కరిగిన యవ్వన యవనిక కోరికలు.
నీటనున్న చందమామ నింగికెగసె
ఒడ్డునున్న ప్రేమజంట నీటమునిగె.
ఏమిటో ప్రబంధాలు వ్రాసే కవులు ఇలా బ్లాగ్లోకంలోకి వచ్చారు. :) చాలా థాంక్స్, భా.రా.రె. గారు. చక్కని పద బంధాలు. భావ సంపద. మంచి కవిత. మరువం ఈ ప్రయత్నం తలపెట్టిన వేళ మంచిది.
రిప్లయితొలగించండియువ చేప ప్రతి కదలికలో
రిప్లయితొలగించండిపడుచు చేప పలుకులే!
పసిడి చేప ప్రతి పథములో
ప్రతిమగ నిల్చిన పడుచువాడు....
నీటనున్న చందమామ నింగికెగసె
ఒడ్డునున్న ప్రేమజంట నీటమునిగె.
ఎలా రాస్తారండీ, బాబూ నాక్కూడా నేర్ప రాదా? కీపిటప్. అభినందనలతో....నూతక్కి
చదువుతూ ఊహల్లో తేలిపోయా
రిప్లయితొలగించండివ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఉషగారూ, ఏదో బందీనై ఇలా దిక్కులేక జాలంలో విలపిస్తున్నా :)
నూతక్కి గారూ, మీకు నేను చెప్పటమేమిటండీ... గల గల పారే గోదారిలా మీ "పెన్నమ్మ" పరుగులిడుతుంటేనూ..
ప్రదీప్, తెల్లారింది..ఊహాలోక సుందరిని ఖాళీ చేసి బష్టాండ్ లో నిలబడండి.. నిజ సుందరి కోసం :)
అద్భుతం భాస్కర్ గారు...
రిప్లయితొలగించండివేణూ గారూ, మీ తొలి వ్యాఖ్యకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినచ్చిందంటే మరి ఎంతైనా మనం మనం పేటోళ్ళము కదా ;)
చాలా బాగుంది రెడ్డి గారు :)
రిప్లయితొలగించండినేస్తం, బాగుందంటే, కొంపదీసి మీదీ పేటేనా ;-)
రిప్లయితొలగించండిభాస్కర్! చేపల వేటంటే ఓకె. పేటల వేటేంటండి బాబు? వేణూతో కుమ్మక్కవుతున్నత్లుంది .
రిప్లయితొలగించండినేస్తాన్ని కూడా పులుసులోకి లాగేలా కనపడుతోంది....!
యింతకీ యేం పులుసేంటి? బొచ్చలా?బురద కొయ్యలా
భాస్కర్! చేపల వేటంటే ఓకె. పేటల వేటేంటండి బాబు? వేణూతో కుమ్మక్కవుతున్నత్లుంది .
రిప్లయితొలగించండినేస్తాన్ని కూడా పులుసులోకి లాగేలా కనపడుతోంది....!యింతకీ యేం పులుసేంటి? బొచ్చలా?బురద కొయ్యలా?
wOw !bhaskar! you are an artist too?
రిప్లయితొలగించండిwhat ever...
wonderful painting.
Thanks for your comment on my coment.
Nutakki Raghavendra Rao.
www.nutakki.wordpress.com
నూతక్కి గారు, మా పేటలో చేపలపులుసు బాగుంటందండీ, అందుకే పేటలో చేపలవేట :) , ఎన్నన్నా మనం మనం ఒకటే సార్, ఒకే జిల్లా వాళ్ళం. మీకూ ఓ పలస పులుసు ముక్క. :)
రిప్లయితొలగించండిఇది నా పైంటింగ్ కాదండి, హంటింగ్.. మీ వ్యాఖ్యలకు మనఃపూర్వక ధన్యవాదాలు. మీ కవితలు చదువుతున్నాను, కానీ కామెంట్ వ్రాద్దామనుకొనేలోపే కొత్త కవిత.. ఇలా గయితే ఎలాగండి?
10/10
రిప్లయితొలగించండిభాస్కర్, 10/10 దేనికి, నా కవిత కా,బొమ్మకా, చేప పిల్లకా లేకపోతే పేట పులుసుకా? :)
రిప్లయితొలగించండిఇవేవీకాదు.. గుంటూరు ఫీలింగ్ అంటావా?
Guntur feeling..-:)
రిప్లయితొలగించండిఅంతే నండి, గుంటూర్ ఫీలింగ్ తప్పించి, మా కవితలు మీకెందుకు నచ్చుతాయి :(
రిప్లయితొలగించండికవిత 10/10
రిప్లయితొలగించండిబొమ్మకి 10/10
చేప పిల్లకి 10/10
పేట పులుసుకి 10/10
గుంటూరు ఫీలింగ్ 100/100
చూసీ చూడని ఓరచూపుల
రిప్లయితొలగించండిచెలెరేగే చిలిపి కోరికలు.
చాలా బాగుందండి. Really excellent.
భాస్కర్ , అయితే ప్రోగ్రస్ రిపోర్ట్ లో మార్కులు బాగొచ్చాయి. మా అయ్య తంతాడని నేనేమీ దిద్దలేదు సోదరా :)
రిప్లయితొలగించండిశ్రీనిక గారూ, నచ్చినందుకు ధన్యవాదాలండీ.
Naagundi kavita.
రిప్లయితొలగించండిsorry! m badulu n pablish aindi.
రిప్లయితొలగించండిభా రా రే గారు మీ కవిత చదువుతుంటే "తరంగాల తాకిడిన తరలిన మీనాక్షి చూడ
రిప్లయితొలగించండిమృచ్చకంఠి కనుల కొలనులో
అరవిరిసిన అలతి అందాలు." అలవోక గా సాగిన ఒక కవితా సుందరి కళ్ళముందు మెదిలి మనసు ను చాలా సంతోషపెట్టింది... అబ్బ ఎలా రాయగలరండీ తెలుగు లో అంత బాగా నాకు బలే జెలసీ వచ్చేస్తుంది సుమా.... నేనూ ప్రయత్నిస్తాను కవిత రాద్దామని తవిక తప్ప ఇంకేమి రాదు... శ్రీ లక్ష్మి గుర్తొచ్చి ఆపేస్తాను.. ;-)
సునీత గారు, నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభావన గారూ, అంతా బాగానే వుంది కానండి, చీలచ్మి ఎవరు [ అమాయకంగా ] మీ పక్కనింటిలో కూడా చీలచ్మి వుందా ? ;)
అమ్మో! ఎన్నెన్ని మధురమైన భావాలో?
రిప్లయితొలగించండిహన్నన్నా నేను ఇక్కడ చానా మిస్ అయినట్లున్నా పొత్తులు ప్రోగ్రెస్ రిపోర్ట్ లూనూ :-) అదేంటి భరారె గారు చంటబ్బాయ్ లో శ్రీలక్ష్మి తవికలు నిజంగా తెలీవా!! కామెడీనా :-)
రిప్లయితొలగించండిపద్మార్పిత గారూ, మధురమైన ధన్యవాదాలు
రిప్లయితొలగించండిహన్నా వేణూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మరి. ఓ ఆ శ్రీలక్ష్మి తవికలా....బాగానే గుర్తున్నాయి :)