17, అక్టోబర్ 2009, శనివారం
కోపమేలనే ఓ నారీ - అంటిని కదా ఓ సారీ!
కలికి చిలక సొగసు చూడగ
కులుకొలొలుకు సిగను చూడగ
సైగ చేసి చుక్కల మాటున
సిగ్గు లేని చందమామ
సందు చూసి సందెకాడ
నెల రాజు వంగి వంగి సిగలోన చేరెనులే
తళుకు లీను తారలన్నీ కొప్పులోన ఒదిగిపోయెలే
చెలియ సిగను సింగారించెలే |కలికి|
నింగి మొత్తము నెరజాణ కొప్పులోన విరగపూసెనులే
తారలన్నీ వలసపోయి నింగి బోసిపోయెనులే
పుడమి లోన వెలుగు కరువాయలే |కలికి|
ఆకశాన రాజు నైనా నిను చూడగ నడిచి రాలేదా?
పలుమారు నీ పెదవుల దాటి మరుమల్లె పదముల నవలేదా ?
పున్నమి రాత్రులకై వేచిన రోజులూ
వెన్నెల వెలుగుల విరహపు జాడలు
పద లయల స్వరగీతికలూ
గజ్జల రవళుల నాట్యభంగిమలు
దరిచేరి చూడగ సిగలోన కొలువైతిలే |కలికి|
సిగలోని చంద్రవంక తొంగి తొంగి చూసెనులే
కలువ భామ మోము గనక కినుకు చూసెనులే
చెలిమి జేసి చెలియా అని పిలిచిన ఇటు తిరగదాయెలే
నను కరుణించదాయెలే |కలికి|
సతి కొప్పున చేరి...
**** ఇక్కడ ఆకుపచ్చ రంగులో నున్న వాక్యాలు చందమామ స్వగతం.మరి నీలిరంగు? మీకేది తోస్తే అది :)*******
అందుకే మరి అలా కొప్పులో చేరకూడదండి.. మెడలో మెరిసే పచ్చల హారం లో రవ్వల నక్షత్రాల కాంతులతో కూడి భామ గొంతుక నలకరించుకున్న చంద్ర హారం లో చందమామైతే కలికి చిలుక కినుక చూసే భాగ్యమందేది కదా.. వో కినుక తో పాటు కోపాగ్నుల జ్వాలలకు భయపడి వెనుక దాక్కుని వుంటారు అవునా... ;-) మరి మీ నారి ఏ వంపు కు తిరిగినా అద్దరిన మీరు వుండి పోయారే... :(
రిప్లయితొలగించండి"తళుకు లీను తారలన్నీ కొప్పులోన ఒదిగిపోయెలే"
రిప్లయితొలగించండిఅధ్బుతం ...మా అమ్మ కొప్పు గుర్తొచ్చింది .
పున్నమి రాత్రులకై వేచిన రోజులూ
రిప్లయితొలగించండివెన్నెల వెలుగుల విరహపు జాడలు
బహుబాగు సోదరా!!
ముందుగా కామెంటిన అందరికీ ధన్యవాదాలు.ఒక చిన్న వివరణ. ఈ పైనున్న బొమ్మ నా ఫ్రెండ్ ది. ఇక కవిత విషయానికి వస్తే, ఇది సంసార సరిగమలను గానం చేసే ప్రతి ఒక్కరికీ చెందుతుంది.
రిప్లయితొలగించండిభావనగారూ, ఏదో తెలియక కొప్పులో చేరానండి.. ఈ బొమ్మ చూసి, మీ కామెంట్ చదివి ఇప్పుడు మా ఆవిడ అవన్నీ అడిగిందనుకోండి... హరిలోరంగ హరీ
చిన్నీ ధన్యవాదాలు
భాస్కరా నెనరులు.
చెలియ కరుణించి మీ వైపు మోము తిప్పునులే
రిప్లయితొలగించండిఅదిచూసి మీరు మరొక అందమైన కవిత రాసెదరులే
చదివిన వారి పెదవులపై చిరునవ్వులు విరబూయునులే
కొప్పు ఎంత అందంగా అమిరిందో మీ కవిత అంతగా అలరించింది. దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమరి ఆడగరూ... అలా కొప్పులో చేరి మళ్ళీ కినుకేలనే బాలా అని పాటలు పాడితే... పైగా "హరి లో రంగ హరి" అని కొసమెరుపొకటి...
రిప్లయితొలగించండిమీరు సంసార సరిగమలు గానం చేసే వాళ్ళందరిది అన్నారు కదా అందుకే సరదా గా (జస్ట్ సరదా గా దీనిని కోడీ గుడ్డు కు ఈకలు పీకినట్లు పీక వద్దు ప్లీజ్ purely fun intended) చెపుతున్నాను. చూసేరా ఈ మొగవాళ్ళ తెంపరి తనం. కొప్పులోకెక్కి చూడమంటే ఏలా చూద్దుమబ్బా... అసలు వెనుకనుంచి వాళ్ళకెలా తెలుస్తోందబ్బా మన పదలయల స్వర గీతికలు గజ్జెల రవళుల నాట్య భంగిమలు హన్నా (పెళ్ళి పుస్తకం లో దివ్య వాణి టైప్ లో నుంచున్నాము ఇప్పుడు అందరం) కొప్పులో చేరిన నెల రాజుకు వందనములు. కొప్పునుంచి భామ పెదవి అంచున విరిసిన చిరునవ్వు ను సంగ్రహించగల మానస చోరులకు అభివందనములు. ఎవెరవరి పతులు వారి సతులకు ఇది ఎట్లు సాధ్యంబవ్వునో ఒక్క సారి వివరించ ప్రార్ధన... ఆ వివరణ పత్రిఖా ముఖం అదే బ్లాగో ముఖం గా ఇస్తే అందరును కడుంగడు సంతసించెదము.. అసలు వీళ్ళు కొప్పులోకెక్కిన వుద్దేశమేమబ్బా... ? వెనుక నుంచి ఏమి వీక్షించవలెనని? హ్మ్మ్ ... అందరు అతివలు ఆలోచించవలసిన విషయం... చిన్నీ, సునీత, సుజాత, ఉషా, పద్మార్పిత, పరిమళం, మాలా, జ్యోతి, మధురవాణి, సుభద్ర, లలిత, సిరిసిరి మువ్వ, శ్రావ్య, హ్మ్మ్... ఆయాసం వస్తోంది... తృష్ణ, సృజన, వరూధిని, శ్రీలలిత, జాహ్నవి, కిరణ్మయి, మైత్రేయి,స్పందన, జయ ఇంకా ఇంకా ఆ... పేర్లు తెలియనందున అందరికి ముందు మిసెస్స్ అని తగిలించ్కోండి ప్లీజ్ ... (మిస్సెస్) భా.ర.రే, కొత్తపాళి, భాస్కర్, రౌడీ, విజయ్‌మోహన్, రావు గారు, శ్రీ, (బుర్ర గోక్కుంటున్నా) ఇంకా ఇంకా...రవి, రవిగారు, మురళి, ఇంకా ఇంకా ఇంకా అందరు వచ్చి ఈ విచిత్రం చూడండహో...
భా.రా.రే గారు. మీ ఫ్రెండ్ కు ధన్యవాదాలు చెప్పండీ ఆ ఫొటో ఇచ్చినందుకు చాలా బాగుంది నిజానికి అది నేను సేవ్ చేసుకున్నాను (సారీ పెర్మిషన్ అడగలేదు మీరు ఇంటర్నెట్ లో తెచ్చేరు అనుకున్నా) మా అక్క కు పంపించి వాళ్ళ పిల్లల కు కూడా డేన్స్ లకు అటు వంటి నెలవంక చేయించమని చెపుదామని. చాలా చాలా బాగుంది అది థ్యాంక్స్ అండీ.
రిప్లయితొలగించండిహహ హా, భావనగారూ.... మా ఆవిడ బంగారం అడగాలేకానీ బంగారుపూతపూసి కేజీలు కేజీలు కొనిపెట్టనా? అయినా బంగారంలాంటి నేనుంటే ఇంకా వేరే బంగారం ఎందుకండి ;)
రిప్లయితొలగించండిఇకపోతే "అలిగిన వేళనే చూడాలి" అని నేనెన్ని సార్లు తనముందుకు వెళ్ళినా గిరుక్కున బొంగరం తిరిగినట్టు తిరిగి జడతో ఠపక్కున కొడుతుంది. అందుకే ఇలా లాభం లేదని ఈసారి కొప్పులో చేరాను.ముందు వెనుకాల జయిస్తే తరువాత సంగతి తరువాత...
అయినా మీరెక్కడ ఈకలు పీకగలరండి? మగాళ్ళని చాలా తక్కువ అంచనా వేసారు సుమీ ;) వెనకనుంచి ఏమేమి చూడవచ్చో బొమ్మలతో టపా మార్చాను చూడండి. మరి ముందుకు పోయి మూడో కన్ను కోపాగ్నిలో కాలిపోవడంకంటే ఇదే మేలుకదా? వెనక చేరి చెవిలో జోరిగలా నసపెట్టి ఏదో సర్ది చెప్పుకోవచ్చు. ఇక పద లయల స్వరగీతికలు బాగానే వినపడతాయండి. ఎప్పటికంటే గట్టిగా పాటలు పాడుతారు కదా ;)
చూద్దాం ఈ అతివలేమంటారో, అతివల వలలోని పతులేమంటారో :)
ఇకపోతే, ఈ బొమ్మను అడగగానే ఇచ్చిన కవితాలతావని కి బ్లాగున్ముఖంగా ధన్యవాదాలు. మీకు ఆ కొప్పు నచ్చినందుకు..నచ్చి దాచుకున్నందుకు నా స్నేహితురాలికి మీతరుపున కూడా ధన్యవాదాలు. వింటున్నావా?
పద్మార్పిత గారూ మీకు కూడా పై సమాధానమే :), S.S.రావు గారిని మాత్రం మాగ్రూప్ లో సర్దేసుకుంటున్నాను.
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిశుక్రవారం కావటం యాదృచ్చికమా లేక ఇక ఆఫీసు వంకన తప్పుకోలేను, ఈ రెండు రోజులకీ ఈ కాళ్ళబేరం తప్పదని ఈ బాణీపట్టారా? ఇంతకీ మీ మణిపూస భామాకలాపం ఆపారా? కొప్పునున్న మిమ్మల్ని దులిపి పడేసారా? వెనక పడేవాళ్ళంటే మాలో మా మాట, అబ్బాయ్, మాకు నచ్చదు. అలాగే ముందు ముందు కళ్ళకడ్డం పడేవారనా మంటేను. కనుక ఏ దారి లేదిక మీకు, మీరు ఓ ఢోలు, సన్నాయి తెచ్చుకుని అ తకథిమి కి తాళం వెయ్యాల్సిందే. కొప్పున మల్లెలు మళ్ళీ ముఖానా పూసేవరకు మీకీ వానాకాలపు మబ్బు మొఖం తప్పదు. నా బ్లాగులో నన్ను వేళాకోళం పట్టించినందుకు మీకిదే నా శాపం. :) (ఉత్తుక్కికేనోచ్)
రిప్లయితొలగించండిభా రా రె గారూ ఈదీపావళికి మీ యింట టపాసుల మ్రోతలే కాదు మతాబుల,చిచ్చుబుడ్ల కాంతులు కూడా విరబూయాలని(మీ ఆవిడ మోములో) మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి@భావన
రిప్లయితొలగించండిబాగా చెప్పారు ....మన దాటికి జడిసి వంకర సమాధానం ...కదూ
అబ్బ!అబ్బా!చేతి బొటన వేలు మధ్యవేలు కలిపి పట్టుకుని చూపుడు వేలు విదిలిస్తే చప్పుడు వస్తుందే , ఇక్కడ అది, ఆ శబ్దం వేసుకోండి. ఎంచక్కని ఫోటో చక్కగా సన్న జాజులూ, మధ్యలో నెలవంక ఎంత అందంగా ఉందో!!ఇక్కడ కూడా ఫోటో సేవు ఐపోయింది.
రిప్లయితొలగించండిఅబ్బాబ్బ! ఏమి రాస్తారండీ మీరూ, ఉషగారూ, అస్సలు లాభం లేదు మీరు వచనం లో రాసిందాకా మేము మీరు రాసినవేవీ చదవం కాక చదవం, అంతే!!:-) :-)
@Bhaavana- ఇదేదో ఘట్టిగా అలోచించాల్సిన పాయింటే!
*కవిత బాగుంది. ఫోటోలు స్వర్ణ కమలం సినిమాను గుర్తు తెచ్చ్హాయి.
అమ్మఒడి గారూ, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిహమ్మా ఉష, ఎంత కసి నామీద ;) కాళ్ళబేరమా.. మగజాతికే అవమానం అందుకే ఇది కొప్పు బేరం .అయినా మా మణిపూస పండుగరోజుల్లో రుక్మిణి కదా అందుకే నో భామాకలాపం, కొప్పుల్లో మల్లెలెప్పుడూ ముఖానే. మబ్బుల్లేని నిర్మలాకాశమే.
రిప్లయితొలగించండిఅయినా ఉషాగారండీ, కొప్పునుంచి మమ్మల దులపాలంటే....కొప్పందం చెడిపోతుందాయె, కొప్పునున్న రత్నం పడిపోతుందాయె... అందుకని మేము కొప్పులోనే భద్రం , ఇక కళ్ళ ముందు పడదామంటే మంటన్నారు కాబట్టి ఈ సారి ప్రక్కనుంచి ట్రై చేస్తాము లెండి :-D
ఇక డోలు,సన్నాయిరెండెందుకండీ ! సన్నాయి నొక్కులు నొక్కటానికి సన్నాయి చాలు కదా ?
విజయమోహన్ గారు,టపాసులు టపాల్లోనే :), టపాసులు,మతాబుల,చిచ్చుబుడ్ల కాంతులు మాత్రం ఇంట్లోనే.:)
రిప్లయితొలగించండిచిన్నీ అంత వంకర సమా ధానం చెప్పానా? ఈజీగా అర్థం అవుతుందనుకున్నానే.
రిప్లయితొలగించండిసునీత గారు అంత ఏమి మిస్ అయ్యారబ్బా అలా వేలు కొట్టుకోవటానికి:)? ఫొటో నచ్చినందుకు నా ఫ్రెండ్ కు ధన్యవాదాలు మరోసారి. ఈసారి టపా వచనా వాణి నే. ఘట్టిగా అలోచించి మీకు తెలిసిన సమాధానాన్ని భావనతో పాటి మాతోనూ పంచుకోండి. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభా.రా.రె, ఏదో స్నేహితం మీద చెప్పాం మీరు విన్నారు. ఇకపై ఈ అలకలు, బేరాలు లేని సంసారం సాగిస్తాను అనకండేం, ఇవీ ఓ అందం...
రిప్లయితొలగించండిసునిత, మళ్ళీ చూడండి, అవి మల్లెలు ;) ఇక కొంచం కవనం కొంచం వచనం - మా అమ్మవి కదూ అలా పంతాలు పోక వ్రాసింది వ్రాసినట్లు చదివేయ్ మరి!!!!!!! ఈ కొప్పు నాకూ ఏదో స్ఫూర్తినిస్తుంది, అదేమో గాని :)
మిస్స్ ఐ కాదండీ, విపరీతంగా నచ్చినపుడు కూడా అలా తేలు కుట్టిన ఎక్స్ప్రెషను ఇస్తాము కదా! అదేమైన అబ్బా! కాదు, రెండు హ్రస్వ అబ్బలు. ఉషా! యా!నిజమే!! నేను పొరపాటు పడ్డాను! నెలవంక నచ్చిన ఆనందంలో పడి సరిగ్గా గమనించలేదు.అవి మల్లెలే!ఎందుకో తెలియదు ఈ కవిత చదవగానే ఇంకో లైను గుర్తు వచ్చింది "ఓ మగువా!! నీతో స్నేహం కోసం' రుక్మిణిగారు ఎంత ప్రేమతో ఆ భర్తగార్ని కొప్పున అలంకరించుకున్నారో కదా!!ఐనా అర్ధనారీశ్వరుడే సతి గంగమ్మను కొప్పున దాల్చాడు ఇప్పుడు మా గౌరవానికి భంగం మేము దిగము అంటే ఒప్పుకునేది లేదు.
రిప్లయితొలగించండిమీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిఉషా గారండీ, టపాసులు లేక దీపావళి లేనట్టే, అలకలు లేక సంసారమే లేదు కదా? వద్దనుకున్నా ఆడవారికి "అలగడం జన్మ హక్కు" లాగా అవి ఉంటూనే వుంటాయి లెండి :). ఇక కవితలు అప్పుడప్పుడు, వచనం ఎప్పుడూనూ ( ఎప్పుడూనూ అంటే వచనం టైపు చేయడానికి కనీసం పదిహేను రోజులన్నా పడుతుంది కదా ? :))
రిప్లయితొలగించండికొప్పు మీకు కూడా స్పూర్తి నిచ్చిందా? అయితే ధన్యవాదాలు. ఇంకేం ఓ సాంగేస్కోండి... మీ ప్రమేయం లేకుండానే స్టెప్పులు వాటంతటవే వస్తాయి.
హమ్మయ్యా, కవితా విరోధి కి "కవిత" నచ్చిందన్నమాట. అబ్బబ్బ మధ్యలో ఈ శివయ్య, గంగమ్మ గొడవెందుకు? పార్వతి వింటే గొడవలై పోతాయి. ఇప్పుడు కొప్పునుంచి దిగి అర్థనారీశ్వరుడినే :)
రిప్లయితొలగించండిమాలా కుమార్ గారూ, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిబాగుందండీ కవిత.. తర్వాత చర్చ కూడా... అన్నట్టు ఫోటోల్లో డాన్సమ్మాయి 'స్వర్ణ కమలం' భానుప్రియ కదూ??
రిప్లయితొలగించండిఆ నీలం రంగు నా స్వగతం మాత్రం కాదండి ఎందుకంటే దానికోసమే నా నిరీక్షణ కూడా
రిప్లయితొలగించండిమురళి గారూ ధన్యవాదాలు. ఫొటోల్లో వున్న డాన్సమ్మాయి, స్వర్ణకమలం డాన్సమ్మాయి భానుప్రియే :)
రిప్లయితొలగించండి@వెన్నెల, ఎలాగూ మీరు నిరీక్షిస్తున్నారు కాబట్టి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు :)
ఆ తరువాత మీ చందమామ ఇంక వెన్నెల వాకిట ...
వెన్నెలా ఓ వెన్నెలా ! వెన్నలా కరుగవా !
భానుప్రియదే మరో సినిమా
రిప్లయితొలగించండిఅమెరికా అల్లుడు (1985). దర్శకత్వం, కె.వాసు. తారాగణం, సుమన్, భానుప్రియ , కాంతారావు. సంగీతం, చక్రవర్తి. నిర్మాణ సంస్థ, చికాగో ఫిల్మ్స్
ఆ జడ చూస్తే...అందులోని ఓ పాట గుర్తుకొచ్చింది నిజంగా, "నా వాలు జడ కృష్ణవేణి.. నా పూల జడ వెన్నెలా గోదారి, నా వళ్ళు గంగమ్మ పరవళ్ళుగా, నర్తించిన భారతిని కూచిపూడి హారతిని ..." [ఆ చివరి పంక్తి తప్పేమో?] అవునూ, మీరా సినిమా చూసారా? భానుప్రియ ఎంత బాగా నర్తించిందో ఈ పాటకి.
అయ్యో ఉషగారూ, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మా తోటలో చాకలి వారి కుండలను ( బట్టలు వేడిచేయడం కోసం ) గురిచూసి బొక్కలు పెట్టటంలోనూ, ఎండాకాలంలో ఏ కఱ్ఱ లేకుండా తాటిచెట్ల ఎత్తులు కొలవడంలోనూ చాలా బిజీ :).
రిప్లయితొలగించండిఅప్పుడప్పుడూ " భక్త యోగ పదన్యాసి వారణాసి,పావన క్షేత్రముల రాశి వారణాసి" . అదీ జీవితం.
అసలు ప్రొడక్షన్ నెంబర్ 1 అన్నా, అదొక సినిమా పేరేమో అనుకున్న రోజులవి.
తరువాత రెచ్చిపోయి సినిమాలు చూసే సమయంలో కూడా ఇది చూసిన గుర్తు లేదు.
ఈ సినిమాకోసం నెట్ లో ఇప్పుడే వెతికా కానీ ఏ లింకూ సరిగా పనిచేయటం లేదు. వ్యాఖ్యకు ధన్యవాదాలు.
నాకు కరక్ట్ గా పదాలన్ని గుర్తు లేదు కాని అవును ఈ సినిమా లో భానుప్రియ పాట గుర్తు వుంది.. ఇందులోనే అనుకుంటా సూర్యకాంతం అమెరికా వచ్చి బజ్జీల బండీ పెట్టి డాలర్ ఒక బజ్జి అమ్ముతుంది.. :-)
రిప్లయితొలగించండిభా. రా.రె. ఈ సినిమా కె. వాసు సినిమా అనుకుంటా. అంత హిట్ కాదు కాని ముక్కపుడక టైపు సినిమా అని గుర్తు. గూగులమ్మ ను అడి గి చూసేరా..
ఉషా బలే గుర్తు చేసేరు ఇప్పుడూ ఆ సినిమా కోసం వెతకాలి.
వెతికానండీ భావనగారూ, కానీ లింకులైతే వస్తున్నాయి కానీ ఏదీ సరిగా పని చేయటం లేదు.
రిప్లయితొలగించండిభా.రా.రె. ఓహో అన్నారంటా ;) రామాయణం చదివేవారంతా త్రేతాయుగంలో పుట్టారా? గీతాపారాయణం చేసేవారంతా ద్వాపరయుగం నుండీ వున్నారా? మేమేదో భూమి పుట్టక ముందు పుట్టినట్లుగా మాట్లాడుతున్నారు? మీరు గోళీలాడారో, కిళ్ళీలు కట్టారో అని అడిగామా? నాకు నృత్యం, సాహిత్యం ఇష్టం కనుక ఈ చిత్రాలు ఆ పాటని గుర్తుకు తెచ్చాయి కనుక ప్రస్తావించాం. హన్నా!! ;)
రిప్లయితొలగించండిభావన, సిడ్నీలో నిజంగానే డాలర్ బజ్జీలు అమ్మేవారు బోండై బీచ్ లో. అలాగే అక్కడ ఒక ఛానల్ లో వారానికొక రోజు హిందీ పాటలు [ఫిజీ ఇండియన్ వారి కారణంగా] వేసేవారు. కొలీగ్ అలా చిత్రంగా తిప్పుకుంటూ "నాయక్ నహీ కల్ నాయక్ హూ మై.." అని పాడటం ఇంకా గుర్తే... :)
ఓహో మీకైతే పదహారేళ్ళేనా ? ;)
రిప్లయితొలగించండి"నాయక్ నహీ కల్ నాయక్ హూ మై.."... yep.