14, మార్చి 2010, ఆదివారం
హిమబిందువులకు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
ఈ రోజు వేకువ వెలుగులు బ్లాగ్ మిత్రులు హిమబిందువులకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పటంతో మొదలు. వెన్నెలాంటి మనసుతో తన కృషి మేరా పదిమందికి జీవనోపాధిని కలిగిస్తూ వినూత్న కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తనదన శైలిలో సాగిపోతున్న ఈ శ్వేత బిందువు కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరో రెండు రోజుల్లో ఉగాది ఉంది అనగా పుట్టిన వారికి మరో వింత విద్యకూడా అలవడుతుందట. వీరు పుట్టగానే కోకిల పాటలు వింటారు కదా, అందుకని వీరికి కోకిల గానము చేయడము కూడా అలవాటయివుండాలి. కాబట్టి పుట్టినరోజు పాపాయికి పట్టులంగా పరికిణీలు, నవరత్న ఖచితాభరణాలు ఇస్తే మంచిదే. కానీ వీటన్నింటికనా తనకు విలువైనది పుస్తక పఠనం కాబట్టి శుభాకాంక్షలతో ఓ చిరు పుస్తకాన్నిస్తే మరీ ఆనంద పడతారు. ఇంతకీ పుస్తకం అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య కొన్ని పుస్తకాలు కొని చదువుదామనుకొని ఆ పుస్తకాలు దొరుకుతాయో లేదో కనుక్కోమని అడిగాను.ఓ శుభదినాన ఇంటికి ఒక పోస్టు వచ్చింది. ఏమిటబ్బా అని చూస్తే నేనడిగిన పుస్తకాలు అన్నింటిని పంపారు. ఆనందానికి అవధులు లేవు. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే ఇలాంటి మంచి మిత్రులతో స్నేహం చేయండి.మీకు కూడా పుస్తక పఠన భాగ్యం కలిగిస్తారు :)
ఆమె నవ్వింది
పది పేదకుటుంబాలు నవ్వాయి
ఆమె పాడింది
ఓ అనాధబాలిక బ్రతుకు గీతమయ్యింది
ఆమె ఏడ్చింది
వంద కుటుంబాలకు మెతుకు దూరమయ్యింది.
ఈ శుభ ఘడియల సందర్భంగా తనకు జన్మ దిన శుభాకాంక్షలతో పాటుగా
ఓం పూర్ణ మదః పూర్ణమిదమ్
పూర్ణాత్పూర్ణ ముదచ్యత్ |
పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణమేవావశిష్యతే ||
పైది ఒక ఉపనిషత్తుల్లోని శ్లోకం.
"అది పూర్ణం, ఇదీ పూర్ణమే. ఒకపూర్ణానికి మరో పూర్ణం కలిపినా పూర్ణమే మిగులుతుంది."
బ్రహ్మం ( పూర్ణం ) నుంచి జగత్తు ఆవిర్భవించినా దానివల్ల పూర్ణమైన పూర్ణత్వానికి కలిగే లోటు ఏమీ లేదు.
థాంక్యూ వెరిమచ్ భా.రా .రె-:) పాడే కోయిలని ఆస్వాదించడం తప్పించి కోయిలా రాగాలు మనకి రావు .
రిప్లయితొలగించండిహమ్మో హమ్మో ఇంత కుట్రా !పుస్తకాలు పంపానని ప్రపంచమంతా చాటుతారా? అవి ఇల్లు చేరాక ఎన్ని డాలర్లు వదిలాయో మీకు ఆ సంగతి చెప్పరే ?
చిన్ని గారికి 'హృదయస్పందనల చిరు సవ్వడి' ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండిచిన్ని గారూ !
రిప్లయితొలగించండిహార్థిక జన్మదిన ( భా.రా.రా. గారి ద్వారా ) శుభాకాంక్షలు.
Muralhigaari maaTae naadeenoo.
రిప్లయితొలగించండిచిన్ని, కుంచం లేట్ గా మీకు హృదయపూర్వక జన్మ దిన శుభా కాంక్షలు. మీన రాశి వారా ఐతే మీరు.. మీకు నాకు స్నేహం బాగా కుదురుతుంది ఐతే. పుస్తకాల కోసం కాదండోయ్ నిజంగానే నాకు best compatibility మీన రాశి వారితో. :-)
రిప్లయితొలగించండిచిన్నీ గారూ, ఉన్నమాట చెప్తే ఉలుకెందుకమ్మా :)
రిప్లయితొలగించండి@మురళీ
@SRRao గారూ
@సునీత గారూ
మీ శుభాకాంక్షలు అందుకునే వుంటారనుకుంటాను.
భావనా, పుస్తకాలకోసమయితే ఇంకొకరితో Friendship చేయండి. నాకు అన్యాయం చేయ్యొద్దు :)
చిన్ని, మళ్ళి మళ్ళీ రావాలీ శుభ ఘడియలు.. ఆనందప్రదమైన మీ జీవితాన.
రిప్లయితొలగించండి@భావన, ;) కాస్త ఎక్కువైంది జోరు.. తగ్గు మరి.
భా.రా.రె., థాంక్స్.
ఉష వె..వె...వె (వెక్కిరించా) నీకు కుళ్ళూ నా ప్రాణ స్నేహితురాలు ది కూడా మీన రాశి అని. ;-)
రిప్లయితొలగించండిభా.రా.రే: ఏంటీ అన్యాయం చేసేది చిన్ని పంపించిన పుస్తకాలు నాకు సగం ఇప్పుడు, చదివేక మిగతా సగం పంపిస్తానంటివే.. ఇదేంది అబ్బాయి మాట మార్చేసా? చిన్ని నువ్వు చెప్పలా పుస్తకాలు నాకు సగం పంపమని. నువ్వు బలేటోడివే రెడ్డి. మాట మార్చక.
రిప్లయితొలగించండి@మురళి
రిప్లయితొలగించండి@సునీతా
@SRrao
మరొక్కసారి ధన్యవాదాలు .
@ఉష
చాలా చాలా థాంక్సండీ -:)
@భావన
అవునా !మన ఇద్దరికీ సరిపోతుందా?మీది ఏ రాశో చెప్పండీ అవునోకాదో నేను చెబుతాను .ఈ భారారే భలే తెలివైనవాడో ఇట్ట టాపిక్ తెచ్చి నా రాశి అడిగి పుట్టినరోజు కనుక్కున్నారు
హ్మం !భా.రా.రె చదివే ఆ బొక్కులు కుసంత అర్ధం అయితే ఒట్టు ఎవరు అడక్కుండా వుంటారనే అర్ధం కానివి తెప్పించుకున్నారు-:) .
@భా.రా.రె
ఓలు చెప్పలమ్మ మాకు ఉలుకని , మేం ఉన్న మాటే చెప్పాం :(
చిన్నిగారి పుట్టినరోజు సందర్భంగా మీరు ,మురళి గారు అందమైన కానుకలిచ్చారు....మీ ద్వారా కూడా నా శుభాకాంక్షలు ఇలాగే పదిమందికి సహాయపడే భాగ్యం భగవంతుడు ఆవిడకు ఎల్లవేళలా కలిగించాలని నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను .
రిప్లయితొలగించండి