20, మే 2010, గురువారం
తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం
బ్లాగులోకం గరం గరం. అందరి నరాలు తెగిపోతున్నాయి. రెండు వైపులా మహా జోరుగా సాగుతుంది. ఇప్పుడు నేనేటి చేయాలి. నిన్న బ్లాగుల్లో పడి అలా అలా పాకుతుంటే ఓ మహత్తర కామెంటు కనిపించింది. అంతే భలే చాన్సులే అహా బలే చాన్సులే అనిపించి నేనొక సంఘాన్ని స్థాపించ దలచుకున్నాను. అదే తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం. ఇప్పటిదాకా చాలా సంఘాలు వెలిసాయి కానీ ఇది నాకంటికి అగపడలేదు. ఈ రోజే ఈ సంఘనామాన్ని నాపేరు మీద పేటెంటు కూడా చేసుకున్నాను. కాబట్టి ఇంక మీకెవ్వరికీ దీనిమీద బోడిగుండు మీద వెంట్రుకంత అధికారం కూడా లేదు. మా సంఘ సభ్యులకు తప్పించి. ఇంతకీ మాసంఘ సభ్యులెవరయ్యా అంటే... ఇక్కడ కామెంటు రాస్తే చాలు. ఫ్రీ సభ్యత్వాన్ని మంజూరు చేసేస్తాను. కానీ అధ్యక్ష పదవి మాత్రం నాదే. తరవాత లొల్లి లేకుండా ఇప్పుడే చెప్తుండా.
మా సంఘం ఏమేమి చేస్తుందంటే
౧) మా మీదకు ఎవడైనా లేదా ఏ సంఘమైనా దండెత్తి వస్తే వాళ్ళని తుంగలో తొక్కుతాము. న్యాయా న్యాయాలతో మాకెలాంటి సంబంధం వుండదు.
౨)మా ఇష్టమొచ్చింది మేము రాసుకుంటాము. అడగడానికి మీకెవ్వరికీ అధికారం లేదు.అడిగితే మూకుమ్మడి దాడి చేస్తాం.
౩) ఇంకా మాకు మాలో గొడవలైతే వాడు నా కులపోడు కాకపోతే వాడిని పెద్దగా పట్టించుకోం. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అదే నా కులపోడైతే మాత్రం తిత్తి తీస్తాము.
ప్రస్తుతానికి మా రాజ్యాంగం అదే. సభ్యుల ఉచిత సలహాలను ఉచితంగా స్వీకరిస్తూ కామెంట్లతో సత్కరిస్తాం. ఆలసించిన ఆశా భంగం. త్వరపడండి. మీమీద దాడి జరిగితే ఎవడాదుకుంటాడు. అందుకని వెంటనే మా తొ.బ్లా.సా. లో చేరండి. సభ్యుల సౌకర్యార్థం ఎనానిమస్ కామెంట్స్ ను ఎనేబుల్ చేసాను.
ఎందుకయినా మంచిది నేను మీ సంఘంలో కూడా చేరతాను. బ్యాకప్ గా నయినా పనికివస్తుంది. అసలే అధ్యక్షపదవి లేక అల్లాడుతున్నాను. మీరు కనీసం ఓ సహాధ్యక్ష పదవో లేక కోశాధికారి పదవో ఇస్తో పండగ చేసుకుంటాను. మరీ సాధారణ సభ్యత్వం అంటే ఈ మాజీ అధ్యక్షులవారి అహానికి కాస్త చిన్నతనంగా వుంటుంది మరి.
రిప్లయితొలగించండిశరత్ మొదటి సభ్యుడ్నిగా చేరినందుకు మహదానందంగా వుంది. అధ్యక్ష పదవి తప్ప, మిగిలిన ఏపదవైనా తీసుకో.. గె వింగ్ అధ్యక్షునిగా వుంటావా? [ శరత్, గే అని నీ మనోభావాన్ని దెబ్బతీస్తే మన్నించు]
రిప్లయితొలగించండిమొదటి రెండు పాయింట్లూ వీజీగానే అర్ధమయ్యాయి కానీ మూడో పాయింటే సరిగ్గా ఎక్కలేదు. ఎక్కడో ఏదో మిస్సవుతున్నా అనిపిస్తోంది. సర్లెండి కాస్సేపలా బుర్ర గోక్కుంటూనేవుంటాను.
రిప్లయితొలగించండి"శరత్, గే అని నీ మనోభావాన్ని దెబ్బతీస్తే మన్నించు"
రిప్లయితొలగించండిఅధ్యక్షా, దీనిని నేను ఖండిస్తున్నాను. నేను గే అని సగర్వంగా, బహిరంగంగా ప్రకటించుకుంటున్నానని అందరికీ తెలుసు. ఇంకా నా మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయీ? అది నాకు గౌరవమే కానీ అగౌరవం కాదు అని మీతో పాటు అందరూ గుర్తించాలి అధ్యక్షా. అందుకు నేను గర్వపడుతుంటాను కానీ సిగ్గుపడను. That is Sarath!
నిజానికి నేను LGBT అయినా సింప్లిసిటీ కోసం గే వింగ్ అనే వుంచేద్దాం. అలాగలాగే. చిన్న గమనిక. ఇందులో చేరినంత మాత్రాన నేను కె బ్లా స కాదని కాదు. అది అదే, ఇది ఇదే. వీలయితే రెండింటికీ మధ్య తగువు పెట్టి తటస్థంగా వుండిపోవాలని నా ఆశయం అధ్యక్షా.
మా గేవింగ్ అధ్యక్షినిగా శరత్ నియమితుడయ్యారు. ఇక పోతే శరత్ మీరయితే ఈ తరం రాజకీయ నీతిపరులన్నమాట. :)
రిప్లయితొలగించండిఅవును శరత్, ఒకటడగడం మర్చిపోయాను. మీరు కెబ్లాస మాజీ అధ్యక్షులు కదా. ఇంతకీ కె.బ్లా.స అంటే ఏమిటి? ;)
రిప్లయితొలగించండినన్ను గే వింగ్ అధ్యక్షునిగా నియమించినందుకు ధన్యవాదాలు. తగువు పెట్టి తటస్థంగా వుండటమే ఇప్పుడు నా రాజనీతి!
రిప్లయితొలగించండికె బ్లా స అనగా నేమి అన్న మీ ప్రశ్నకు నేను వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాను అధ్యక్షా. కె బ్లా స ప్రస్థుత అద్యక్షులెవరో నాకే క్లారిటీ లేదు కానీ వారు వచ్చి ఈ తొ బ్లా స కోర్టులో వివరణ ఇచ్చుకుంటే బావుంటుందేమో (లేక బావోదేమో)
నేను తొ.బ్లా.స. చేరుతా... మూడొ పాయింట్ నాకూ అర్ధం కాలేదు.. అయినా పర్లేదు.. నాకొ పదవేస్కొండి.. ఎదయినా పర్లేదు :-)
రిప్లయితొలగించండి@ మంచు
రిప్లయితొలగించండిఏ పదవయినా అంటే గే పదవయినా పర్లేదా. కుదరదంతే. హమ్మా - నా వెనకాలే చేరదామనే!
మంచుపల్లకీ మీ పదవి మిగిలిన వాళ్ళు వచ్చేలోపు తీసేసుకోండి. ఎన్నైనా మనం మనం ఒకటి. ;)ఇప్పటికి ౨ పదవులు అయిపోయాయి. అధ్యక్షుని పదవి అలాగే గేవింగ్ అధ్యక్ష పదవి అయిపోయాయి.
రిప్లయితొలగించండిశరత్ మీ పదవికి నాకు తెలిసి ఎవరూ పోటీ పడరులెండి. నా పదవే వెన్నుపోటు పొడుస్తారని గుండెలో దడ :)
రిప్లయితొలగించండిమీరసలే రెండిటిలో సభ్యత్వం పుచ్చుకున్నారు గనక మీ మీద ఒక కన్నేసి వుంచాలి :). దీనికోసం మా FBI వింగ్ కి అధ్యక్షులు కావాలి
రిప్లయితొలగించండిబాబులూ రండయ్యా. అమ్మగారూ రండమ్మా. నేను ఇంత కష్టపడి లేక లేక ఒక తొక్కలో బ్లాగర్ల సంఘాన్ని పెట్టుకుంటే ఒక్కరంటే ఒక్కరూ రారేమి? ఇప్పుడే ఇలా అయితే మన సంఘం ఎలా అభివృద్ధి చేయాలి? తరవాత ఫైటింగ్ ఎలా చెయ్యాలి? హబ్బే ! ఫ్రీ ఫ్రీ అని చెప్తున్నా ఎవ్వరూ రాకపోతే ఇక సంఘం ఎట్టా బతుకుద్ది?
రిప్లయితొలగించండిఅబ్బే ఏ వింగ్ కి అధ్యక్షులు వద్దు .. నాకు ఉపాద్యక్ష పదవి కావాలి.. అదయితే.. కావాలెంటే ఆ తర్వాత అధ్యక్షపదవి లొ వున్నవారిని బలవంతంగా దింపేసయినా మనం అధ్యక్షుడు అయిపొవచ్చు (శరత్ ని దింపేసినట్టు ) ..
రిప్లయితొలగించండి@భా రా రే.. మా సభ్యులు ఒప్పుకుంటే ప్ర.క్లె.బ్లా.స ని ఈ తొ.బ్లా.స లొ వీలీనం చెసెద్దాం.
రిప్లయితొలగించండిHahaha
రిప్లయితొలగించండిమరి ఐడెంటిటీ కార్డేది?
రిప్లయితొలగించండిఅవును మంచుపల్లకీ గారూ ఇంతకీ శరత్ ని వెన్నుపోటు పొడిచి ఆ పదవిని కొట్టేసిందెవరు? ఇప్పుడు దానికి అధ్యక్షులెవరు?
రిప్లయితొలగించండిగీతాచార్యా, ఆ పైనున్న బొమ్మే మన ఐడెంటిటి. కత్తి తీసుకొని కస కస కొయ్యడమే :)
రిప్లయితొలగించండిమంచుపల్లకీ గారూ రమ్మనండి మీ సభ్యులనందరిని. అయితే మా ప్రియతమ అన్నాయిని మాత్రం ఒక్కమాటన్నా ఊరుకొనేది లేదు.
రిప్లయితొలగించండిఅది బానే ఉంది కానీ, సభ్యత్వ నమోదు పత్రం కూడా అదేనా?
రిప్లయితొలగించండిగీతాచార్య , నమోదు పత్రం ఏమీ లేదని ముందే చెప్పాగా. ఇక్కడ కామెంటితే చాలని ముందే చెప్పాగా. రేపు ప్రత్యేకంగా తొక్కలో బ్లాగర్ల సంఘం అను ఒక బ్లాగు ఓపెన్ చేసి మనందరం అక్కడ ప్రతిజ్ఞ చేద్దాం.
రిప్లయితొలగించండిఅలాహే
రిప్లయితొలగించండినేను కూడా మన తొ.బ్లా.స లో ఆర్ధిక విభాగానికి అద్యక్షుడిగా చేరుతున్నా . మన సంఘ కార్య కలాపాలకు ముందుగా తలా వెయ్యి డాలర్లు నా బ్యాంకు ఎకౌంటు లో వెయ్యండి
రిప్లయితొలగించండిబ్యాంక్ నేమ్ :- ముంచే బ్యాంక్
అకౌంట్ నెంబర్ :- 49231121( Diwala By giving 1 for A and 2 for B)
TeluguKingdom.net
(కోట్లల్లో ఒక్కటి కోటి మందికి ఒక్కటి )
స్వాగతమో తెలుగు రాజ్యపాలకా, సుస్వాగతం.
రిప్లయితొలగించండిమీ స్వాగతానికి ధన్య వాదములు .ఈరోజు ఆఫీసు నందు మా మేనేజర్ లేకపోయెను , సమయం దొరికెను
రిప్లయితొలగించండిTeluguKingdom.net
(కోట్లల్లో ఒక్కటి కోటి మందికి ఒక్కటి )
మీ సైటు చాలా బాగుందండి. అయితే ఈ రోజు ఆఫీసులో పండగన్న మాట. :)
రిప్లయితొలగించండి"మా ప్రియతమ అన్నాయిని మాత్రం ఒక్కమాటన్నా ఊరుకొనేది లేదు." ఎంతైయినా అన్నాయ్ అభిమానిని అనిపించుకొన్నారు :)
రిప్లయితొలగించండికృష్ణా ముందే చెప్పాగా మా అన్నాయి లేకుంటే బ్లాగులోకంలో ఇప్పుడు సగం పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకని మా అన్న నాలుగు కాలాలపాటు చల్లగా కథలు వ్రాసుకుంటూ, సైన్సు వివరాలందిస్తూ ఉండాలి. అయినా నిజం చెప్పాలంటే చాలా మందికంటే మంచి విషయాలే రాస్తాడు కానీ ఎటొచ్చి ఆ చెప్పడంలోనే కూసింత [ కూసింత కాదులే మరింతే ] బుఱ్ఱలు తింటాడు. ఇకపోతే మీకు నాదొక సలహా.. వ్యక్తిగత వైషామ్యాలకు పోకుండా చర్చించండి.
రిప్లయితొలగించండిఅవునా శరత్, మా ఊరు శీనయ్య ఇంత పని జేసిండా... ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు. ఏసేద్దామా?
రిప్లయితొలగించండిఅందుకే కదా తొ బ్లా స లొ చేరింది - మీరంతా తోడు వుంటారని. సందు చూసుకొని అందరం కలిసి శీనుని ఏసెయ్యాలంతే.
రిప్లయితొలగించండిశీను ఎసెత్తే ఎసెయ్యండి కానీ.. శరత్ ఏసెయ్యాలనే మా (ప్ర క్లె బ్లా స) ప్లాన్ లొ మాత్రం మార్పులేదు
రిప్లయితొలగించండిఆ అవునండి , ఇవాళ ఆఫీసు లో పండగే రేపోద్దునే వస్తాడు :(
రిప్లయితొలగించండినా సైట్ చూసినందుకు మీకు ధన్యవాదములు , రిజిస్టర్ అయ్యారా ?
కొంతమంది దుర్మారగపు రాజ కీయ నాయకుల వలన ఇలాంటి అయిడియస్ వస్తుంటాయి.
ఆ దుర్మార్గుడు ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటది . పేరు ఉచ్చరించటానికి కూడా అనర్హుడు .
మీకు తెలిసిన తెలుగు వారికి కొంచెం చెప్పండి .
ఈ క్రింద ఒక యూట్యూబ్ లింక్ ఇస్తున్నా చూడండి . మీకు నచ్చ వచ్చు
http://www.youtube.com/watch?v=-omV1fRupZE
TeluguKingdom.net
(కోట్లల్లో ఒక్కటి కోటి మందికి ఒక్కటి )
హ హా మంచు పల్లకీ మేము మాత్రం శీను ను ఏసేస్తాం. మీరు శరత్ ను ఏసేస్తామంటే మాత్రం మా తొ.బ్లా.సం. అడ్డుకుంటుంది లెండి.
రిప్లయితొలగించండి@ మంచు
రిప్లయితొలగించండిఎలాగూ ప్ర కె బ్లా సా ను ఇందులో విలీనం చేస్తానన్నారు కదా. ఇప్పుడు మనమూ మనమూ బ్రదర్సుము. అలాంటప్పుడు మనం మనం వేస్కోవడం తప్పమ్మా.
అసలు అందుకే తొ బ్లా స లొ చేరుతుంది.. పక్కనుండి.. అదునుచూసి.. సైలెంట్ గా ఏసేయ్యడానికే.. ప్లాన్ రేడి అయిపొయింది.. డల్లస్ ఏర్పొర్ట్ బయట ఒక సుమో పెట్టాం.. అక్కడ నుండి తప్పించుకుంటే 97 దగ్గర రెండు అంబాసిడర్లు వుంటాయ్.. అక్కడా మిస్స్ అయితే 121 మీద రెండు ఆయిల్ టాంకర్లు వుంటాయ్.. అవి తప్పించుకుంటే ఐ-35 జంక్షన్ లొ ఈ సారి ఏకంగా 10 సుమొలుంటాయ్.. అది కూడా తప్పించు కుంటే.. అబ్బె ఇక చెప్పకూడదు..
రిప్లయితొలగించండిఅదే మంచుపల్లకీ మీరు మరీను, శరత్ నేల మీద నడిస్తేనో ప్రయాణిస్తేనో కదా మీ ప్లాన్స్ సక్సస్ అయ్యేది? అందుకే స్కెచ్ లు గీయటానికి తొ.బ్లా.స పుట్టింది.
రిప్లయితొలగించండిఇక ఇంటికి పోవాలి. టైం అయ్యింది. ఇంటిదగ్గర కంప్యూటర్ తాకితే మా ఆవిడ ఇరగ దీస్తుంది. మరి మళ్ళీ రేపే.
సరే నేను కూడా రెడ్డీ. వేసుకో సభ్యత్వం. మరి నాకు పదవి వద్దు లే పదవంటే పని చెయ్యాలి మళ్ళీ ఆ తరువాత చెయ్యలేదని కేకలెడతావు. గౌరవ సలహా దారు పదవి ఖాళి వుందా?
రిప్లయితొలగించండిభ.రా.రే. మలక్ తో కుస్తీ కి దిగిన క్రిష్ణ నేను వేరు. బ్లాగు గ్లీగు లేని కేవలం కామెంట్లెసే వాడిని మాత్రమే నేను, ఓ నాలగు అయిదు ఏళ్ల నుండి.
రిప్లయితొలగించండి(మనలో మాట, ఈ నెలాఖరకు మా ఉరు సికాగో నుండి, ఎవరో వస్తున్నారు, వాళ్లకు స్పాట్ పెట్టాలంటూ, ఆస్టిన్ నుండి ఎవరో అభ్యర్ధన పంపించారు, ఎవరైనా ఓ చేయి వెస్తారా?)
మంచు, పైన మీ కామెంట్ చూడకుండా వ్రాసాను, అయితే స్పాట్ పెడతానికి నాతో బాటు ఇంకా కొంతమందికి సుపారి అందింది అన్నమాట :)
రిప్లయితొలగించండిభావనా, నీ కామెంట్ బావుంది.
రిప్లయితొలగించండిఅమ్మో, కామెంటితే చాలని నాక్కూడా సభ్యత్వం ఇచ్చేశారా కొంపదీసి రెడ్డి గారు!
:)
రిప్లయితొలగించండితెలుగు గారూ, మీ సైటులో సభ్యత్వం టీసుకున్నాను. తెలిసినవాళ్ళకు చెప్తాను.
రిప్లయితొలగించండిభావనా హమ్మా పని చేయకుండా సంఘంలో చేరి కాలాన్ని వెళ్ళబుచ్చుదామనే? మీరు లేకపోతే మాకు నన్నపనేనీ, గంగా భవాని వారిలాంటి లోటును ఎవరుపూడుస్తారు ;). అందుకు మిమ్మల్ని మీతో పాటు సుజాత గారికి మహిళా వింగ్ ను అప్పగించేస్తున్నాను. ఇంక మీ ఇష్టం. రచ్చ రచ్చ చేసేయండి.
రిప్లయితొలగించండికృష్ణా గారూ, అయ్యో ముందే చెప్పాల్సింది అండి నాకు ఎవరెవరో తెలియలేదు. సరేగానీ అసలికి ఈ తొక్కలో సంఘం పెట్టిందే ఏసెయ్యడానికి. అడగకుండానే ఏసేద్దాం అనే కదా మా స్లోగన్. ఇక సహాయం అడగాక కాదనమా ! చేతులతో పాటు కాళ్ళు కూడా వేసేస్తాం :)
రిప్లయితొలగించండిసుజాతగారూ ముందే చెప్పింది అందుకే.ఒక్కసారి కామెంటు పడ్డాక ఇంక మీరు మా వలలో నుంచి తప్పుకోలేరు. మీకు సభ్యత్వమేమి ఖర్మ, ఏకంగా మహిళా వింగ్ అంతా మీచేతుల్లోనే :)
రిప్లయితొలగించండివిజమోహన్ గారూ మా ఆర్ట్ వింగ్ మీదేనండి. మా తొక్కలో సభ్య బృందానికి మాంచి మాంచి రంగుల బొమ్మల చొక్కాలు ఇవ్వాలి.
రిప్లయితొలగించండి@ మంచు, 121 లు, I35 లు అంటూ స్కెచ్ బానే గీసారు, మ్యాప్ చూసా, లెక DFW లో ఉన్నారా?
రిప్లయితొలగించండికృష్ణా, బుల్డోజర్లు కార్లమీద నెంబర్లు లేక మ్యాప్ నాకు గందరగోళంగా వుంది. అయినా ఏసెయ్యడానికి మ్యాపులు గీపులు అవసరం లేదు కదా. వైర్లు పనిచేస్తే చాలు. :)
రిప్లయితొలగించండితొక్క మీద కాలేశాక జారక తపదు సుజాత గారూ. మీరూ సభ్యులే(ష/షి)
రిప్లయితొలగించండిభారారె గారు,
సుజాత గారిని కరంటెఫైర్లకు వాడొచ్చు. :D
లేదు.. 2008 లొ ఒకసారి టెక్సాస్ ట్రిప్ వెసా అంతే .. అయినా శరత్ బ్లాగులొ మేప్ పెట్టాడు కదా :-))
రిప్లయితొలగించండిఅయినా మాది సుపారి బిజినస్ కాదు.. ముఠా తగాదాలు ;-))
అయితే లోకల్స్ తో సుపారి గ్యాంగ్ లు, నాన్ లోకల్స్ తో ముఠాలను ఆస్టిన్ పెద్దాయన దింపుతున్నాడు అని అర్ధమవుతుంది కాబట్టి, సుమో లు గాల్లో లేవాల్సిందె, వైర్లు తెగాల్సిందే :)
రిప్లయితొలగించండినాకే వింగూ వద్దు బాబోయ్, నా చదువేదో చదూకోనివ్వండి! బై బై! :-)))
రిప్లయితొలగించండి:)))
రిప్లయితొలగించండిమాకు శరత్ ని వెసేయ్యడం తొ పాటు ఇంకొ అజెండా వుంది.. శరత్ బ్లాగుని టర్కి హేకర్ల సహాయం తొ హేక్ చేసి స్వాదీనపరచుకొవడం.. ఆ తరువాత ఆ బ్లాగులొ .. ఎం చెస్తామంటే..
రిప్లయితొలగించండి.... సీక్రెట్
---
దీనికి మా ప్ర.పీ.స.స చస్తే ఒప్పుకోదు. "తొక్కలో సంఘం" అనే పేరు మా ప్ర.పీ.స.స కి అన్న పెట్టుకున్న ముద్దు పేరు. "తొక్కలో సంఘం", "గుంటనక్కలు" ఇవి ప్ర.పీ.స.స పేటెంటు రైట్లు. వీటిమీద ఎవరైనా కన్నేస్తే అన్న బ్లాగులో కథ పడుద్ది (రంగు పడుద్ది టైపులో)....ఇహ మీ ఇష్టం
రిప్లయితొలగించండితొక్క అనే పదానికి సంబందిందినదేదైనా ప్ర.పీ.స.స కే చెందుతుంది.
రిప్లయితొలగించండిగీతాచార్యా, మీరు మా సంఘంలో గీతా బోధకులు. మీ పని ఏంటంటే, ఇలా యుద్ధం మొదలవ్వకముందే పారి పోయే సుజాత లాంటి అర్జునులకు గీతోపదేశం చేసి యుద్ధానికి సన్నద్ధం చేయటమే :)
రిప్లయితొలగించండికృష్ణ అండ్ మంచుపల్లకి..వైర్లు తెగితే కష్టమే సుమీ. అందుకు మేము వైర్ లెస్ లతో వస్తాము ఈసారి.
రిప్లయితొలగించండిసుజాతగారూ పల్నాటి పౌరుషం ఏమైంది? అసలు మీది పలాడేనా అని అడుగుతుండా అధ్యక్షిణీ. కావాలంటే మీరు గీతాచార్య చెప్పినట్టు మీరు కరెంట్ ఫైర్ వింగ్ తీసుకోండి.ఇలా వెనకడుగు వేసి మా మనోభావాలను కత్తితో గాయపరచవద్దు.
రిప్లయితొలగించండిఇక నాకు మిగిలిన ఒకే ఒక అస్త్రం చెడ్డీ ఏసుకొని, ఖద్దరు పూల చొక్కా తొడుక్కొని బీడీ తాగుతూ నరసరావుపేట గడియారం స్థంబం ముందు నిరాహార దీక్ష చెయ్యడమే :(
అమ్మ ఒడి గారు, బహుకాల దర్శనం. మీరే మా FBI వింగ్ అధ్యక్షులవారు. :)
రిప్లయితొలగించండిసౌమ్యా, మీరిలా ప్రతిదీ పేటెంట్ చేసుకుంటే మేమెట్టా బతకాలి? అహా ఎట్టాగంట. తొక్కలో మీది అయితే మాకొక అచ్చతెలుగు పదం చెప్పరూ.
రిప్లయితొలగించండిఅన్నాయ్ కథ రాయాలే గానీ మీ అందరికంటే ముందు చదివేది నేనే :)
చిన్న సవరణ పైన సుజాత గారికి వ్యాఖ్యలో కత్తి అనే పదాన్ని వాడాను. వేరే వారి మనో భావాలు దెబ్బతింటాయి అనిపించి దాన్ని ఈ రకంగా మారుస్తున్నాను.
రిప్లయితొలగించండి"మా మనోభావాలను గుండు సూదితో గాయపరచ వద్దు :)"
అయ్బాబోయ్. నన్నేసెయ్యడానికి ఇంతమంది తయారయిపోతున్నారన్నమాట. ఈ ప్రమాదం ఊహించే రోజూ జిమ్ముకెళ్ళి బాగా కండలు పెంచుతున్నాను. హార్నీ, మంచుకి డల్లాస్ బాగానే తెలుసే అనుకున్నా ఆ రోడ్డు మీద సుమో పెడతా ఈ రోడ్డు మీద సుమో పెడతా అంటేనూ. ఆఖరికి సుమో ప్లాన్ అంతా నేను పెట్టిన మ్యాప్ లోంచి గీసిందే అని అర్ధమయ్యింది. ఇంకానయ్యం నేను వెళ్ళే ఇంటి అడ్రసు పెట్టలేదు నా బ్లాగులో. పెడితే అక్కడ ఈ పాటికి రెక్కీలు నడిచివుండేవన్నమాట!
రిప్లయితొలగించండిఊరెళతా అంటే ఇల్లు దోచేస్తాం, బ్లాగు దోచేస్తాం అంటారు - వెళ్ళే ఊరు మ్యాప్ పెడితేనేమో ఊర్లో అని రోడ్ల మీద సుమోలు పెడతామంటారు. అన్నీ బ్లాగితే బాగానే ఇబ్బందులొస్తున్నాయే. ఇంకానయ్యం డల్లాస్ ప్రయాణంలో వున్నప్పుడు ఆగినప్పుడల్లా కేక వేద్దామనుకున్నాను. అలాచేస్తే నేనెప్పుడొస్తున్నా, ఎక్కడ వున్నా ఇంకా వీజీగా వీళ్ళకి తెలిసేది :(
గీతాచార్య గారూ, క్రిష్ణ, మంచు అనే కుర్రాళ్ళు ఏదో అవేశంలో వున్నట్టున్నారు. వారిని శాంతింపచేయడానికి కొద్దిగా గీతాసారం బోధించకూడదూ. మీకేమో పుణ్యం దక్కుతుంది - నాకేమో ప్రాణాలు దక్కుతాయి!
అధ్యక్షుల వారూ
రిప్లయితొలగించండికత్తి అనే పదం కూడా ఎవరయినా పేటెంటు చేసుకున్నారా ఏంటీ. అంత దృశ్యం లేదు.
మీ బ్లాగులో నవ్వితే సభ్యత్వం ఇచ్చేస్తారా అధ్యక్షా!
రిప్లయితొలగించండి@శరత్ ఊరికెళ్తున్నారా.... ఎంత మంచి క్లూ ఇచ్చారు :).
రిప్లయితొలగించండి@అమ్మఒడిగారూ, మా బ్లాగులో కామెంట్ పడితే చాలు. సభ్యత్వమే కాదు. ఏదో ఒక పదవి ఇచ్చి సత్కరిస్తాం. నవ్వినా,ఏడ్చినా,కోప్పడ్డా మరే రకమైన హావభావాలతో మాకు సంబంధంలేదు. కామెంటారా లేదా అన్నదే ముఖ్యం.:)
‘వారాంతం మహా బోరుగా ఉంది’ అని టపా శీర్షిక చూసి, ‘మెయిల్స్ కు సమాధానాలు వ్రాసుకోవచ్చు కదా’ అని ఉచిత సలహా ఇద్దామని టపా చదివాను. ఆ టపా నాకు అర్ధంకాకపోయినా, అర్ధమయ్యే వాళ్ళకి పనికొచ్చేది కదా అని నా ఉచిత సలహా నా దగ్గరే పెట్టుకున్నాను :)
రిప్లయితొలగించండిఈ వారాంతం ‘తొబ్లాస’ పెట్టి, అందరికి పదవుల పంపకాలు చేస్తూ, వారాంతం హడావుడి చేస్తూ, బ్లాగుని చైతన్యపూరితం చేసావు :)
వచ్చే వారాంతం కోసం ఎదురు చూస్తూ....
AMMA ODI FBI అధ్యక్షా, మీ ఉచిత సలహా తో మీరు కూడా నా బట్టతల మీద [ ఇంకా బట్టతల రాలేదు లెండి, చాలా టైం వుంది :)] గుండు సూది బెట్టి గుచ్చారు :). సలహా పాటించాలనే అనుకుంటా గానీ ఎప్పటికప్పుడు ఏవేవో పనులో, బద్దకమో లేక ఏ విషయమూ లేకనో అలా అలా వాయిదాలేస్తుంటాం.
రిప్లయితొలగించండిఅయినా ఈ తొ.బ్లా.సా లు మరీ మరీ బోర్ కొట్టినప్పుడు అంటే ఏపనీ చేయాలనిపించనప్పుడు మనసును కాస్త ఉత్తేజ పరచడానికి ఇలాంటి తొక్కలో టపాలే కాని, నిజానికి నా వింగ్ ఇది కాదు. మీరు ముందు చూసిన "వారాంతం మహా బోరుగా ఉంది" లాంటి విషయాలే నాకు అమితానందాన్ని ఆసక్తిని ఇస్తాయి.
ఇన్ని రోజులు కెబ్లాస ను పట్టుకొని ఉన్నందుకు కనీసం ఒక్క పదవైనా ఇచ్చింది లేదు. అన్నీ వాళ్ళల్లో వాళ్ళు పంచుకోవడమే.
రిప్లయితొలగించండిమరి ఇక్కడ కామెంటితే నాకొచ్చే పదవెంటో చెబుతారా? ఇదేదో గిట్టుబాటయ్యే బేరం అయొతే పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నిస్తా.
:-)
అల్లో అల్లో ఏకలింగం.స్వాగతం. మీ కోసమే ద్వారాలు ఇంకా బార్లా తెరిచి వున్నాయి. మీకెందుకు ముందు గోడ దూకెయ్యండి. దూకేసాక శీనయ్యను ఏసేసే బాధ్యత ముందుగా నీకే. అంటే మంత్రి పదవన్నమాట. మంత్రి వద్దనుకుంటే, సైన్యాధికారైనా ఓకే.
రిప్లయితొలగించండిశీనయ్యను ఏసేయడం కంటే ముందు శరత్తుకు స్పాటుబెడితే బాగుంటదేమో. ఆయనే కెబ్లాస మూలపురుషుల్లో ఒక్కడు.
రిప్లయితొలగించండి>>శీనయ్యను ఏసేయడం కంటే ముందు శరత్తుకు స్పాటుబెడితే బాగుంటదేమో. ఆయనే కెబ్లాస మూలపురుషుల్లో ఒక్కడు.
రిప్లయితొలగించండిప్చ్ ఏకలింగం, ఆ ఛాన్స్ మన మంచు వదులుకోరనుకుంటా. మంచుగారు ప్ర.కె.బ్లా.స. ఇందులో విలీనం చేసిందే సందు చూసి శరత్ని వేసేసి ఆ పదవి కొట్టేద్దామని.
ఏం కె బ్లా స మూలపురుషుడినో ఏంటో. చివరికి నన్ను అందరూ మూల శంక పురుషుడిగా చేసేసి ఏసెయ్యాలని చూస్తున్నారు.
రిప్లయితొలగించండిఏకలింగం,
కె బ్లా స అధ్యక్షపదవి ఖాళీగా వున్నట్లుంది. మీరే స్వయంగా ఆ పదవి ప్రకటించుకోండి. కాదన్నదెవరు? మళ్ళీ ఎలాగూ కొద్దిరోజుల్లో రౌడీ తొండిచేసి ఆ పదవి నుండి లాగేస్తారనుకోండి. అందాక పండగ చేసుకోండి. రౌడీ అదో టైప్ - అధ్యక్షపదవి ఆయన ఎక్కరు కానీ ఎక్కిన వారిని మాత్రం దించేస్తుంటారు. అదేం ఆనందమో ఏంటో!
భా రా రే.. కాంపిటిషన్ ఎక్కువవ్తుంది.. నేను రెండొ మెంబర్ ని.. సొ ఇప్పుడే చెబ్తున్నా పదవుల పంపకం ప్రయారిటి లిస్ట్ లొ నేను రెండవపొజిషన్ లొ వుండాలి
రిప్లయితొలగించండినేనోదో అమాసకు పున్నమకు కనబడవాన్ని. నేనా పదవి తీసికొని ఏంజేసుకోవాలి. మీరైతే రోజుకు నాలుగు టపాలు రాసి కనీసం ఇద్దరినైనా కెలుక్కుంటున్నారు. మీరే ఆ పదవికి అన్ని విధాలా యోగ్యులు.
రిప్లయితొలగించండిఅబ్బే. లాభం లేదు. కె బ్లా స ముసలిదయిపోయింది. ఇప్పుడు తొ బ్లా స నే ఆకర్షణీయంగా వుంది. పెడితే దాని అధ్యక్షపదవికే టెండర్ పెట్టాలి. ఓ పని చేద్దాం. ఇద్దరం కుట్ర చేసి అధ్యక్షుల వారిని దింపేసి మనిద్దరం జాబ్ షేరింగ్ చేసుకుందాం.
రిప్లయితొలగించండిశరత్ అధ్యక్షుడు అయితేనే బెటర్,, ఎప్పుడయినా దింపేసుకొవచ్చు.. ఎలా దింపాలొ ప్రూవెన్ టెక్నిక్స్ వున్నాయ్..
రిప్లయితొలగించండిహమ్మ శరతు... మీరు అసలుకే ఎసరుబెట్టేట్లున్నారు. మనిద్దరం కలిసి తొబ్లాస పంచేసుకుంటే, పాపం దుకాణం తెరిచిన భారారే ఏం కావాలి? ఆయనను నమ్ముకొని ప్రకెబ్లాస ను విలీనం చేయడానికి సిద్దపడ్డ మంచు పరిస్థితేంకావాలి?
రిప్లయితొలగించండిఏడ్చినట్లు వుంది. నాకేంవద్దు ఆ నన్నపనేణి పోస్ట్. సుజాత కు కూడా వద్దు.. మా ఇద్దరికి ఆ పదవులు నచ్చలేదు అద్యక్షా.. నాకైతే కొంచం అవమానం కూడా చేసినట్లు అనిపించింది. అంటే మీరు ఇట్లా స్పాట్ లు పెట్టేసుకుంటే మేమేమో పోట్లాటలు పెట్టుకుంటూ కనపడినా వాళ్ళతో వుండాలా.. మాకేం నచ్చలా తంబి. మా ఇద్దరికి ఇంకో మాట చెప్పు.
రిప్లయితొలగించండిఅల్లో ఏకలింగం నా లింగానికి ఎసురు పెడితే నీకు బోడిలింగమే గతి. అందుకే ముందు చెప్పింది. నాకుర్చీ నాదే. కావాలంటే నువ్వో తొక్కలో సంఘం పెట్టు నేనూ వచ్చి కామెంటుతా.
రిప్లయితొలగించండిభావనా..ఎక్కడ ఏడుపులు? సరే ఈంకో మాటంటే...హ్మ్మ్మ్మ్మ్మ్...
రిప్లయితొలగించండిఓకే విదేశాంగ శాఖను చూసుకోండి. సుజాత కు ఎలాగూ కరెంట్ ఫైర్స్ ఇచ్చాంగా..తరువాత తననుంచి ఏమీ నిరశనలేదు.
ఇక సౌమ్యకు ఏమి పోష్టా అని పొద్దుటనుంచి ఆలో చించి చించి విదేశాంగ వారి సిఫార్సు మీద తనకు తొ.బ్లా.సం రౌడి పదవినిచ్చి సత్కరిస్తున్నాము
రిప్లయితొలగించండిఒకవేళ సౌమ్య కు ఏకారణం చేతైనే, వేరే ఎముంటాయి లెండి, మా అన్నాయి కథలు చదివి కోలుకోలేని స్థితికి వస్తే భావన ను విదేశాంగ శాఖతో పాటి సహాయ రౌడీగా అపాయింట్ చేసేస్తున్నాము.
రిప్లయితొలగించండివిదేశాంగ శాఖా? అదేంటీ...foreign affairs minister అని చెప్పక ఆ మాత్రం మాకు తెల్సు... పని ఏటుంటాది ఏమైనా పైన వచ్చే లాభం వుందా చెప్పు... లేక పోతే ఎందుకు చెప్పు... మళ్ళీ ఎవరో వచ్చి మొదలెడతారు ,ఏదో మాట పడ్డా వుపయోగం వుంటూంది అంటే చేస్తాము.
రిప్లయితొలగించండిఛ ఛ ఛ. అందరూ నన్ను దింపేద్దాం, ఏసేద్దాం అనేవాళ్ళే కానీ ఒక్కరన్నా శరతు రోజుకి మూడు నాలుగు టపాలు వ్రాసి బ్లాగ్సేవ చేస్తున్నాడూ - పాపం సన్మానం చేసేస్తే ఓ పని అయిపోతుంది అనుకునేవారున్నారా. ప్చ్.
రిప్లయితొలగించండిఅధ్యక్షా, తొ బ్లా స తరఫున నాకు అర్జంటుగా సన్మానం ఏర్పాటు చేయించే బాధ్యత మీదే సుమా. కావాలంటే ఓ సన్మాన శాఖనో, సాంస్కృతిక శాఖనో ఏర్పాటు చేసి ఆ బాధ్యత వారికివ్వండి.
అవునూ, ఒంగోలు శీను ఎక్కడ? లైలా ఎఫెక్ట్ పడిందా?
@శరత్, సన్మానం, సన్మానం అంటున్నారు గా, డల్లాస్ లో మీరు డబ్బులు ఇస్తే సన్మానాలు చేసే వాళ్లకు తక్కువేమీ లేదు, డబ్బులు పెట్టుబడికి మీరు రెడీ అయితే చెప్పండి, మీ డల్లస్ ట్రిప్ లో సన్మానం ఖాయం చెద్దాం, ఎ రేంజ్ లో కావాలంటే ఆ రెంజ్ లో :)
రిప్లయితొలగించండిభావనా, ఇక్కడ కూడా పై ఆదాయం కుదరదమ్మా. అయితే మీకు foreign affairs minister ఖాయం.
రిప్లయితొలగించండిహి హి శరత్, తోబ్లాసా ఇంకా పూర్తిగా పదవుల కుమ్మలాట స్థాయిలోనే వుంది. అప్పుడే మీకు సన్మానమంటే ఎలా చెప్పండి. ముందు కృష్ణ గారికి సన్మాన శాఖ, సాంస్కృతిక శాఖ రెండూ ఇవ్వనివ్వండి. ఆ తరువాత మీరూ మీరూ చూసుకోండి :)
రిప్లయితొలగించండికృష్ణ గారూ, మీరు మరీను. శరత్ దగ్గర సన్మానానికని డబ్బులు తీసుకొని నొక్కేద్దామనా? హమ్మా !
రిప్లయితొలగించండిఇంక తొమ్మిది వ్యాఖ్యలు ఎవరన్నా రాయండయ్యా/ రాయండమ్మా.. కొత్త పోస్టు రాసుకుంటాను.
రిప్లయితొలగించండివాకే మరి నాకు ఇచ్చే పదవి చెప్తే నేనూ చేరిపోతాను. అంత పనిలేని చైర్మన్ పదవి ఐతే చాలు ఎక్కువ వద్దు. లేదా అకౌంట్స్ అడగని మనీ డీలింగ్ పని కావాలి.. టిటిడి చైర్మన్ లా.. :)
రిప్లయితొలగించండిఇది డబ్బులు నొక్కేయటం కాదనీ, ఇది కేవలం సన్మానం కావాలని కోరుకొనే వాళ్ల కోరిక తీర్చటానికి అయ్యే ఖర్చు మాత్రమే అని పైకి నొక్కి వక్కాణిస్తున్నము అధ్యక్షా!!
రిప్లయితొలగించండి(మనలో మాట, నొక్కేసిన డబ్బులు లో, అధ్యక్షులకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుందన్న మన తో.బ్లా.స. నిభందనలలో ieee 1394 సెక్షన్ను కూడా గుర్తుచేస్తున్నాను :))
జ్యోతక్కా లాల్ సలామ్ [ ఎర్రసైన్యం టైపులో ఊహించుకోండి ] :).. మీకు నల్లమల కూంబింగ్ ఆపరేషన్ అప్పగిస్తున్నామక్కా. ఇదైతే పెద్దగా పనేమీ ఉండదు. ఇక అకౌంట్స్ అడగని మనీ డీలింగ్ పని కావాలి అంటే వైట్ లిస్టు చానా వుంది :)
రిప్లయితొలగించండిఅంతే నంటారా కృష్ణ గారూ. సరే సత్కారం అడిగి చేపించుకుంటే మందేం బోయింది. చేసెయ్యండి. నేను వంద కామెంట్లు కాగానే మన సంఘం తరపున ఒక సైటు పెట్టి అందరికీ ఉచిత టపా పోస్టింగు సౌకర్యాన్ని చేసే పనిలో వుంటా.
రిప్లయితొలగించండిఓకే తొక్కలో బ్లాగు సంఘ సభ్యులారా ఈ రోజు/ రేపు / ఎల్లుండి సెలవు. మా బ్లాగు వస్తే గిస్తే గనక అంటే మా సంఘ సభ్యులం అప్పటిదాకా కొట్లాడుకోని విడిపోకుండా వుంటే గనక :) మా తోబ్లాసా తో వచ్చేవారం కనిపిస్తాం.
రిప్లయితొలగించండిఈ లోపు ఎవరైనా డబుల్ గేమ్స్ ఆడి గెస్సింగ్ లు కిస్సింగ్ లు పెట్టుకున్నా మా సంఘం పేరుతో వేరే వెబ్సైట్ ఓపెన్ చేసి మా పేర్లు వాడుకున్నా మాకు ఎలాంటి బాధ్యత వుండకపోగా తరువాత వుత్పన్నమయ్యే పరిణామాలకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు.
cu on monday ... bye bye
వార్నీ నేను లేటుగా చూశాను. మొదట కామెంట్లు పెట్టినోళ్ళకు పదవులు పంచేశ్తారా. మేము జెండాలు పట్తుకుని తిరగాలా? ఇదేం బాలేదు. అందరికి పదవులు ఇచ్చేయండి. కార్యకర్తలు లేని ఏకైక సంఘంగా తొ బ్లా స చరిత్రలో మిగుల్తుంది. :)
రిప్లయితొలగించండిఇక్కడ బ్లాగడం అంటే నే పిల్లితల గొరిగే వాళ్ళు అనేలా అర్థాలు మార్చేసుకుంటున్నారు. మరిక అలాంటి మీకు ఏ సంఘమైతే నేమి? అన్నీ మీవే .. తోకలేని ఆడ, మగ దళిత , బూర్జువా, ఫ్యూడల్ కమ్యునిస్ట్ కోతులు అన్నీ ..
రిప్లయితొలగించండిఈ కామెంట్ తో వంద కామెంట్లు పూర్తయ్యాయి. శతకామెంట్లోత్సవం ఎప్పుడూ? పార్టీ ఎమైన ఉందా? అంటే ఆరిసెలు, జీడిపప్పు పాకాలు గట్రా గట్రాలు! మందు మాకులు మాకొద్దబ్బా! మాకే రోగాలు లేవు!
రిప్లయితొలగించండిఅద్యక్షా!
రిప్లయితొలగించండిమలక్ తో గొడవ పడుతున్న కృష్ణని నేనె! నాకు సభ్యత్వం వద్దు గాని, మీ బ్లాగు లో కామెంట్లు రాసుకునే భాగ్యం కలిపించవలిసింది గా వేడుకుంటాను.మలక్ మీద వ్యక్తిగత దాడులు ఆయన బ్లాగులోనె చేస్తాను, మరి అన్న ఇక్కడ చదువుతాడో లేదొ కదా! నా శ్రమ వృధా అయ్యిపోదు.
మరొ కృష్ణా! మనం పేర్లు మార్చుకోవలసిన అవసరం వుందేమొ కొంచెం చెప్పండి, చాలా మంది కంఫ్యూజ్ అయ్యిపోతున్నారు.
క్రిష్ణ క్రిష్ణ , ఏదో క్రిష్ణ
రిప్లయితొలగించండిఏరాయైతేనేం పళ్ళూడకొట్టుకోడానికి!ఏదో ఓ పేరులో ఏడవండి.
ఎవరిక్కడ నన్ను ఎసేయ్యడానికి కుట్ర పన్నుతుంది హన్నా
రిప్లయితొలగించండిజీవని గారూ, మాకు కార్యకర్తలు వద్దు. మాలో అందరూ నాయకులే. అప్పుడు బాగా తిట్టుకోవచ్చు.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారూ ఇక్కడ బ్లాగడంలో మీకింకేమైనా లాభాలు కనిపించాయా? అయినా అన్ని సంఘాలు మాకే ఇచ్చేస్తున్నారు మీదేసంఘం అంట? :))
రిప్లయితొలగించండిఅమ్మఒడి గారు , హమ్మయ్య వందకామెంట్లు. వందో కామెంట్ వ్రాసిన మీకు అరిసెల పండగే. కానీ అరిసెలు ఎప్పుడంటే అప్పుడు రావుకదా. వచ్చే సంక్రాంతికే మల్లీ.
రిప్లయితొలగించండికృష్ణా, నా బ్లాగు ఓన్లీ ఫార్ సబ్జెక్టివ్ డిస్కషన్.... వ్యక్తిగత దాడులు లేకుండా వ్రాసుకోవచ్చు. ఇక్కడ నాకు అసభ్య కరంగా కనిపించినవి తొలగిస్తాను.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గరూ, మీరేదో వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారనుకుంటా.. మీకు నచ్చని సంఘం పెట్టుకుంటున్నాము కాబట్టి ఏడ్చినట్టే వుంటుంది.
రిప్లయితొలగించండిశ్రీనివాస్, అది నేనే.. హ హా హ హా!!! అల్రెడీ లైలా దెబ్బ పడినట్టు వుంది కదా. జన నష్టం ఏమైనా అయ్యిందా?
రిప్లయితొలగించండిసభ్యత్వం కూడా తీసుకొమ్మని బలవంతం చేస్తారు, ఏదొ పదవి కూడా అంటగడతారు,మొహమాటపడుతున్నట్టు, కొంచెం నసిగి అల్లాగె అందామనుకున్నాను, అద్దెచ్చా! మీరు ఏమిటి తుస్సుమనిపిచేసారు, నాకు ఏమి ఇవ్వారా? వా:-(
రిప్లయితొలగించండిOnce commented ur a member and we support u:)
రిప్లయితొలగించండిమరి పదవి, గిదవి ఏమి ఇవ్వరా అద్దెచ్చా?
రిప్లయితొలగించండిఅభినందనలు .......మరీ బొత్తిగా పనేమిలేదనుకుంటాను ఆఫీసులో :-):)
రిప్లయితొలగించండినల్లమల అడవులా? వాకే.. అక్కడో మల్టీ ప్లెక్స్, మాల్ మొదలుపెడితే సరి. భాస్కర్.. నువ్వు బేగంపేట్ ఎయిర్పోటులో సెకండ్ హ్యాండ్ హెలికాప్టర్లు కొనేసి, ఎవరెవరిని ఏసేయాలో ఎక్కించి నల్లమలకు పంపించు. నేను చూసుకుంటా..ఎలాగూ వచ్చేది వానాకాలం. ఈ సుమోలు.సుపారీలు ఎందుకు చెప్పు?? అనవసరంగా శబ్దకాలుష్యం.. :)
రిప్లయితొలగించండిఅయ్యొయ్యో కృష్ణా, పదవిలేని కార్యకర్త మన సంఘంలో ఉండ కూడదు. అది మొదటి రూలు. ఇంతకీ మీకు ఏంపదవి కావాలి?
రిప్లయితొలగించండిచిన్నీ హబ్బే శుక్రోరం కదా కూసింత ఖాళీ..ఇయ్యాల ఈ పప్పులు ఉడికేట్టు లేదు. వల్లొంచి పనిచేయాల్సి వచ్చేట్టుంది.
రిప్లయితొలగించండిజ్యోతీ గారూ, ఏకంగా ఎలికాప్టర్లలో ఎక్కించి ఏసేద్దామనా? సరే ఐతే మిస్సైల్స్ రెడీగా వుంచుకోండి మరి :)
రిప్లయితొలగించండిఅన్నీ బాగున్నాయ్ కానీ ఇంతకీ తొ.బ్లా.సా లో ఇంకా అందరూ వున్నారా లేకపోతే మాకెందుకులబ్బా అని జారి పోతున్నారా? ఉంటే ప్రెజెంట్ సార్ అని అటెండెన్స్ వేసుకోండి :)
రిప్లయితొలగించండిలేకపోతే చలకపార తీసుకోని నా పనికి నే పోతా.
No ప్రెజెంట్ సార్
రిప్లయితొలగించండిఏమైంది శరత్? అలా అనేసావు ఒక్కసారే. ఇక మీరే లేకపోతే మా సంఘానికి పెద్దదిక్కు ఎలా?
రిప్లయితొలగించండిసరే అయితే ఇక నేను కొత్త పోష్టు రాసుకుంటా మరి.. బై బై.
అహబ్బే. మీరు అపార్ధం చేసుకున్నారు. అటెండెన్సు పలకమంటే క్లాసులో వుండి కూడా నో సర్ అని అంటే ఎలావుంటుందో అన్న చిలిపి ఆలోచన మాత్రం అది.
రిప్లయితొలగించండిచిన్న సవరణ: నన్ను గే వింగుకి కాకుండా బై వింగుకి అధ్యక్షుడిని చేయండి. ఇప్పటిదాకా సింప్లిసిటీ కోసం గే అనే పదం నేను ఉపయోగిస్తున్నా బై ల గురించి కూడా అందరికీ అవగాహన రావాల్సి వుంది కాబట్టి ఇకనుండి ఆ పదంతోనే నన్ను ఐడెంటిఫై చేసుకుందామనుకుంటున్నాను. సో, తగిన అభ్యర్ధి దొరికేంతవరకు గే వింగు పదవి ఖాళీగానే వుంచేద్దాం.
నే వున్న అధ్యక్షా !!
రిప్లయితొలగించండిఏ పని లేకుండా కొద్దో గొప్పో, పైనో కిందో రాబడి వచ్చె పదవులు ఏమి లేవా అద్దెచ్చా?
రిప్లయితొలగించండిఅన్నట్టు నేను కూడా ప్రజెంట్:-)
కృష్ణా, ఈ టాపిక్ బోర్ కొడుతుంది గానీ ఏదైనా కొద్దో గొప్పో పనికొచ్చే పని చేద్దామా? ఇంతకీ మీ మేజర్ ఏంటి? అంటే మీరు ఎక్కువగా ఎందులో నిష్ణాతులు? కెలుకుడు కాకుండా వేరే మాట చెప్పండి.
రిప్లయితొలగించండిif you want to be anonymous, u can mail me too... ramireddy.mvb[at]gmail.com
రిప్లయితొలగించండిరోజు మళ్ళీ ఇదొకటా... ప్రజంటేంచుకోవాలా ఏందయ్యోవ్.. రామారావు గారికి మల్లే క్రమశిక్షణా తరగతులు పెట్టేవా ఏంటి?
రిప్లయితొలగించండిమీ ప్రశ్న నా చదువుకి సంబందించినదా? లేక నా నిష్ణాత కి సంబందించినదా?? చదువుకి సంబంధించినదైతే నేను చదివింది, లోహ సంగ్రహణ శాస్త్రం లో డిప్లొమా!ఇక నా నిష్ణాత ఎందులోను లేదు అద్దేచ్చా! కనీసం కెలుకుడులో కూడా లేదు.ఇప్పుడిప్పుడే మా అన్నాయ్ నాకు క్లాసులు ఇస్తున్నాడు ఎలా కెలకాలా అని?
రిప్లయితొలగించండిఅందుకే ఏ పని లేని పదవి కావలని అడిగా అద్దెచ్చా! నేను ఇలా అడగడం తప్పా?తప్పా?
భావనా, మరదేనమ్మా క్రమశిక్షణ లేకుండా పదవి ఊరికే ఇస్తారా?
రిప్లయితొలగించండికృష్ణా అదే నేనడిగింది. మీరు మెటలర్జీ చేసారు కదా. ఇంకేమి హాయిగా యూనిట్ ఆపరేషన్స్ గురించి, ముడి ఖనిజ ప్రాసెసింగ్ పద్ధతులు గురించి కూడా అప్పుడప్పుడు రాస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండికానీ ఎవరైనా చదివే వారు వుంటారా? అసలు మెటలర్జీ ఆంటే తెలిసిన వారే చాలా తక్కువ! అది కాకుండా అదొక మహా సముద్రం. ఎన్ని రకాల లోహాలు? ముడి ఖనిజాలు? సంగ్రహణ పద్ధతులు? పొరపాటున ఎవరైనా ఏ జింకు గురించో, అల్యూమినియం గురించి అడిగితే ? నేనా ఇప్పుడు కేవలం ఇనుము మరియు ఉక్కు గురించి మాత్రం చెప్పగలను.
రిప్లయితొలగించండిఅవును అది మహాసముద్రమే కానీ మీకు తెలిసిందే చెప్పండి. ఇక చదివేవాళ్ళంటారా? ఇప్పుడు ఈ కెలుకుడు టపాలున్నాయి, ఈ రోజు చదువుతారు మహా అయితే రేపూ చదివి నవ్వుకుంటారు. ఆ తరువాత? ఎప్పటికైనా నిలిచేవి అలాంటి స్టఫ్ వున్న టపాలే. ఉదాహరణకు దీనికి ముందు టపా చూడండి. దీనికంటే దానికి వచ్చిన హిట్స్ తక్కువ. కానీ మంచి మంచి యూనివర్శిటీల నుంచి హిట్స్ వచ్చాయి. అక్కడ నేను రాసిందేమీ లేదు. నాకు తోచిన ఒక హైపోథెసిస్ వ్రాసాను అంతే. కనీసం ఆసక్తి గల వారికి అది కొద్దో గొప్పో ఉపయోగపడుతుందని ఆశ. అందుకే మీరు మెటలర్జీ గురించి వ్రాస్తే నాయిస్ బహుశా తక్కువ వుండొచ్చేమోకానీ ఇష్టపడి చదివినవాళ్ళు మాత్రం తప్పక అభినందిస్తారు.
రిప్లయితొలగించండిభాస్కర రామి రెడ్డి గారూ...,
రిప్లయితొలగించండినమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
సరే భాస్కర రామి రెడ్డి గారు,
రిప్లయితొలగించండిమీ తొ.బ్లా.స. ఎప్పుడు మొదలు పెడుతున్నారు?
అందరూ కామన్ గా అక్కడ రాసే వీలు వుంటే నేను కూడా నాకు తెలిసినవి అక్కడ పంచుకుంటాను. మీ సూచన చాలా బాగుంది. కృతజ్ఞతలు.
హారం ప్రచారకులూ ఏంటో మతప్రచారకుల లాగా :), నన్ను కూడా వదలకుండా కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికృష్ణా ఈ వారాంతం ఒక సైటు తయారు చేస్తాను. ఈ లోపు మీరు వ్యాసం వ్రాసి పెట్టుకోని రెడీగా వుండండి మరి. అన్నట్టు ఏదైనా మంచి పేరు సూచిస్తారా తొ.బ్లా.సా సభ్యులారా?
రిప్లయితొలగించండిహేవిటీ నేనేదో కాస్త బిజీగా ఉండి ఇటువైపు చూడకపోయేసరికి నాకు రౌడీ పదవప్పజెబుతారా...హన్న, ఇదెక్కడన్యాయం? మీరంతా మంచి మంచి పదవులు తీసేసుకుని నాకు రౌడీ పదవి కట్టబెడతారా....లాభం లేదు. మా అన్నని రంగంలోకి దింపాల్సిందే. ఈ తొ.బ్లా.స మీద కథ పడాల్సిందే!
రిప్లయితొలగించండి@సౌమ్య, ఇదేం బాలేదు. మా తొ.బ్లా.సా లో అత్యంత ప్రతిష్టాకరమైన రౌడీ రంగమ్మ అని బిరుదునిస్తే కించ పరచామంటారా?
రిప్లయితొలగించండి