ఏమి వ్రాయను ఈ మృగతృష్ణ గురించి?
కళ్ళలో ప్రతిబింబించే ప్రతిమ రూపాలు
సుందర సఖీ వలపు విలాసాలు
అధర ధరహాస వింత వర్ణాలు
ఎండమావిలా బహు చేరువే!
మనసులోని భావవీచికలు వేడి గాడ్పులకు ఆవిరయ్యాయ్యా
అందాల అద్దాల మేడ మాటల బీటలు పారిందా
నిండు కుండ తొణికి ఒట్టిపోయిందా
బేధ భావల వలలో చిక్కి చిన్నబోయిందా !
అహంకారం ఆత్మస్థైర్యం
పరుషవాదం మిత్రవాదం
ఏది వరం ఏది శాపం
మనిషి మనుగడకు!
మాయా లోకంలో
యామిని కౌగిలికై
నిట్టూర్చి నిశ్చేష్టితయై
నిందను మోసిందా?
రంగేళి రాత్రులందు రసమయమై
ఆత్మ స్వరూపాన్ని ఎదురుగ కనిందా!
nice...
రిప్లయితొలగించండిpaint chaala baavumdi.
bagundhi'kavitha'.
రిప్లయితొలగించండిచాలా బాగుందండి .
రిప్లయితొలగించండిmanchi kavita. baagundi.
రిప్లయితొలగించండిగీతిక,
రిప్లయితొలగించండిచిన్ని,
రాధిక,
సునీత
అందరి వ్యాఖ్యలకు ధన్యవాదలండి.
ఆరునెల్లు సావాసం చేస్తే వారు వీరౌతారంట....కవితల్లో మీ స్ధాయికి నేను చేరలేకపోయినా...పెయింటింగ్స్ విషయంలో మాత్రం మీరు నా రూట్లోకి వచ్చేస్తున్నారుగా:):)భలే భలే!
రిప్లయితొలగించండిపైన చిత్రం మీరు గీసిందా.., నేను నెట్లో ఎవరిదో వాడుకున్నారేమో అని పట్టించుకోలేదు సుమా..
రిప్లయితొలగించండిబాగు బాగు, భలే వున్నది..
ఇంకా మీరు గీసినవి కుడా పరిచయం చేయొచ్చుగా..
పద్మార్పితా, కనీస సావాస దోషంగానైనా మీ విద్య నాకు అబ్బితే బాగుండు. నాకు పైంటింగ్స్ అంత బాగా రావు. పైనది నెట్ లో చూసి పైంట్ వేద్దామని ప్రయత్నించి కార్పెట్ కు రంగులు పూసి మొత్తానికి అదేదో గా తయారయింది. ఎందుకొచ్చిన గొడవలే అని ఒరిజినల్ కాపీ పెట్టేసాను :-).
రిప్లయితొలగించండితారా :-) పైన సమాధానమే మీక్కూడా ;)
అయితే నేను గీసిన పైంటింగ్స్ చూస్తారా? చూసి తట్టుకోగలరా అంట :-)
>>కార్పెట్ కు రంగులు పూసి మొత్తానికి అదేదో గా తయారయింది
రిప్లయితొలగించండిదాన్నే మోడ్రన్ పెయింటింగ్ అంటారు..
ఏది ఓపాలి పెట్టొచ్చుగా.. చూస్తాం
@tara
రిప్లయితొలగించండిSure, wait and see :-)
good job with the painting
రిప్లయితొలగించండిThanks for the comment kottapali gaaru.
రిప్లయితొలగించండివో నైస్ నువ్వు వేసేవాఈ పెయింటీంగ్? ఆ పైన మబ్బులో కింద పడవ నీడా? బాగా వేసేవు భా.రా.రే. నువ్వు నేనుబొమ్మలేస్తా అంటే కామెడీ అనుకున్నా నిజం గానే వేస్తావన్నమాట ఐతే. నైస్ జాబ్.
రిప్లయితొలగించండిభావనా నీకంతా కామెడీనే ;-)
రిప్లయితొలగించండిwow thats really good and nice painting tooo
రిప్లయితొలగించండి