ఉగాది గానాల జుగల్బంది...మత్తుగా సుతిమెత్తగా :-)
ఈ సారి వెరైటీ గా వ్యాఖ్యలద్వారా ఉగాది కి జుగల్ బందీ. జుగల్ బందీ అంటే మరి వ్యాఖ్యలు చేసే వాళ్ళు కావాల కదా. అసలే వ్యాఖ్యలకు గడ్డుకాలం అదీ పండగ పూటంటే మళ్ళీ విప్పిచెప్పాలా? అందుకని ముందు జాగ్రత్త చర్యగా అనానిమస్ వ్యాఖ్యలు కూడా ఎనేబుల్ చేస్తున్నాను. ఎందుకంటే కామెంట్లు తగ్గాయనుకోండి, అప్పుడు అనానిమస్ గా నేనే జిగేల్ జిగేల్ మని వ్యాఖ్యానించుకోవడానికి.
ఇంకో మూడు గంటల్లో శ్రీ ఖరమై మంగతాయారు గారు విచ్చేస్తారు. అప్పడిదాకా సెలవామరి?
ముందుగా బ్లాగు పాఠకులకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీ బ్లాగు ద్వారా అ౦దరికీ శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి- జిగేల్ జిగేల్ :)
Welcome జిగేల్ జిగేల్ ;-)
రిప్లయితొలగించండిMemu kuddaa raayocchaa andi:)
రిప్లయితొలగించండిసంపంగీ !
రిప్లయితొలగించండిసంపంగి మొగ్గవై సునాద గీతమై
సుస్వరాల మాలలల్ల మల్లెపూవువై
లలిత పద శతకములల్ల శబ్ద బ్రహ్మవై
శ్రీఖర దీవెనల కదిలిరా సౌమనసమా!
పాఠకులకు మరొక విజ్ఞప్తి
రిప్లయితొలగించండికందము||
ముదమున ముత్తెపు మాటలు,
మది రంజిల పదకవితలు, మరువపు వాక్కుల్,
నదియిది యని ఏమి? మనసు
కదలించగ పది పలుకులె "ఖరు"నికి చాలున్.
టక్ టక్ ఠక్
రిప్లయితొలగించండివచ్చేశా నేనొచ్చేశా
సోదర పాఠకులకు ఖరనామ సంవత్సర సందర్భముగా సోదరి మంగతాయారు శుభాకాంక్షలు.
Welcome మంగతాయారు :)
రిప్లయితొలగించండితయ్యారయ్యారా మరి?
పచ్చదనమై పల్లవించు
రిప్లయితొలగించండిమావికోమ్మై చిగురించు
వేపపువ్వై పుష్పించు
నువ్వే వసంతమై హాసించు
ఉగాది కోయల వత్సరమంతా
నీ హృదిలోనే వసించు
లేత మావి పిందెల పిండి పాలు త్రాగు సుతులు
రిప్లయితొలగించండిభారతావని నిండ భవిష్య నిర్మాతలైరి!
పల్లవించి చిగురించ పచ్చదనము ఖరము పాలు
శ్రీ ఖరమా , ఖరముల శిర ఖండనలె నీదు గమ్యం
మరొక ఉదయం
రిప్లయితొలగించండిమరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక చైత్రం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!
తెల్లారింది
రిప్లయితొలగించండిపొద్దుగుంకింది
అలసిపోయాం
నిద్రపోయాం
మరొక పండగ మళ్ళీ మామూలే ;-)
ద్వారానికి ఫల పుష్ప హారాలు,
రిప్లయితొలగించండిఅందాలు చిందే తోరణాలు...
అలంకరణల నడుమ గృహాలు
ఆనందమయ వేడుకల విడిదులు.
ఉగాది కావాలి సకల శుభప్రదం
మమతానురాగాలు మిగలాలి ఎల్లకాలం
ప్రభాత వేళల వసంత కోకిల
రిప్లయితొలగించండిపాడుచున్నది లయతప్పని గీతములు
వీనుల విందుగ హృది పొంగగ
మనసు నిండుగ మది మరులు పొందగ
శ్రీఖరమా ఏమి నీ అదృష్టము!
వికృతి చేసిన విలయతాండవాన్ని మరిపించి
రిప్లయితొలగించండిఆనందతాండవం చేయించడానికి విచ్చేసిన
శ్రీ ఖర నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతూ ........
నీరాక సూచనాన్ని ముందుగానే సూచిస్తూ
రిప్లయితొలగించండిభారతావనికి విశ్వవిజేత పట్టమునందించిన
శ్రీఖరమా సాదర స్వాగతం...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఇవే నా శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసాటి 'ఖరములకి' ఇవే నా అభినందనలు .పండగ పూట నన్ను ఎవరు ఏమి అనరని ఆశిస్తున్న !!
భరత ఖరమా ఖర్మ దినాన శుభాకాంక్షలేల
రిప్లయితొలగించండిఖరముల ఓండ్రింపు వ్యాఖ్యల ఖర్మ మాకేల :-)
కోకిలమ్మల కూతలతో
రిప్లయితొలగించండిమావికొమ్మల పూతలతో
వచ్చేసింది ఉగాది
మీకు తెచ్చేందుకు సంతోషాల నిధి.
శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు..
మామిడితోరణాలు, తుమ్మెద ఝంకారాలు
రిప్లయితొలగించండిచైత్ర కోకిల మృదుమధుర మంజుల గానాలు
తొలి ప్రొద్దు పసిడి కిరణ హారాలు
మహేశ్వర విరచిత వర్ణమాలా మాలికలు
ఓంకార నాద నాదస్వరాలు
ఖరమా... రమ్య గీతికల్ వినంగ
వేగమె రావేల రాచ మార్గమున
కష్టమున్నప్పుడే సుఖం విలువ తెలిసేది...
రిప్లయితొలగించండిచేదు ఉన్నప్పుడే తీపి రుచి పెరిగేది...
కష్టాల్ని అర్థంచేసుకుని, చేదుని భరించగలిగితేనే జీవితం మధురమయ్యేది.
మీ జీవితంలో చేదు, కారం, వగరు నిండిన బాధల్ని అవగాహన చేసుకోగలిగే సమన్వయాన్ని ఈ ఉగాది మీకు అందించాలని
మనస్ఫూర్తిగ కోరుకుంటూ...
కష్టాల్లో సుఖం
రిప్లయితొలగించండిచేదులో తీపి
తెలుసుకుంటే జీవితానికి రాజమార్గమదే!!
కష్టం, సుఖం, తీపి, చేదు
కారం, వగరు ఉగాది రుచులా?
మమకార జీవిత మారురూపాలా?
రామి రెడ్డి గారికి పండగ శుభాకాంక్షలు !!
రిప్లయితొలగించండియుగాలనిరీక్షనంటేనే
ఇషమైన నాకు
క్షణమొక తీయని
యుగంగా గడిచేది.
మరి ఉప్పుడు,
ఓ కొత్త యుగాది! (ఉగాది)
-సత్య
సత్యా సత్యకాలంనుంచి
రిప్లయితొలగించండినేటికాలందాకా
మరో తెలియని కాలమొచ్చినా...
యుగాలు మారినా, ఉగాదు లెన్ని వచ్చినా
మనిషీ ఏదీ నీకు మనిషిపై ప్రేమ?
క్షణమొక యుగమై కరాళ కాల నృత్య
పదఘట్టనల మధ్య నలిగే ఉగాదులెన్నో
బ్రతుకుతూ చస్తున్న మనుష్యులెందరో
బ్లాగర్లకు, జీవని సభ్యులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ
రిప్లయితొలగించండిపండుగ రోజు విరిసిన ఆనందాలు కలకాలం మీ ఇంట నిలిచిపోవాలని. మీకు,
మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని
కోరుకుంటూ....
మీ అందరి ఆశీస్సులతో బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న,
మీ,
జీవని పిల్లలు.
పసివాడని మొగ్గలం
రిప్లయితొలగించండిపసిడి బుగ్గల చిన్నారులం
కల్మష మెరుగని చిన్నారులం
భావి భారతనావికులం
మీకివె ఖరనామ వత్సర వందనములు.
శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!!!
రిప్లయితొలగించండిఅందరూ బాగుండాలి....
అందరూ బాగుండాలి
రిప్లయితొలగించండికాలం కలిసిరావాలి
కడుపు చల్లగుండాలి
కలం కదం తొక్కాలి.
ఖర నామ వత్సరంబున
రిప్లయితొలగించండిచిర సుఖ సంపదలు గల్గి జీవితము శుభా
కరమై విలసిల్లఁగ మన
సారఁగఁ గాంక్షించు శంకరాభరణ మిదే!
శంకర పద్యసుమము నీ
రిప్లయితొలగించండికంకిత మయ్యెకదరా నికన్ మాకు సుఖ
మ్మంకిత మివ్వగ రావా?
కంకణ ధారీ, జనహిత ఖరనామకరా
వ్రాయలేను తప్పులే లేకుండా పద్యమైనా
రిప్లయితొలగించండిపాడలేను పల్లవైనా భాష రాని దానను
వేయలేను తాళమైన లయనేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుసపెట్టి అంటున్నా....
నిండైన తెలుగుతనపు యుగాది శుభాకాంక్షలివిగో...
జయా
రిప్లయితొలగించండిచిరునవ్వులు చిందించే చిన్నారి భాషేది?
పరవశాన పాడు కోకిలమ్మకు పదమేది?
మనస్వీ, మనస్విని రూపమేది?
నిండైన తెలుగింటి ఇల్లాలు
మురిపెంగ మాలలల్లిన
తెలుగుదనపు ముత్యాలు
శ్రీఖరమా.. స్వీకరించుమా
జయ గారూ మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఖర నామ స౦వత్సరాది ను౦డి కావాలి శ్రేయస్
రిప్లయితొలగించండికర౦ అ౦దరికీ.వస్తూ తెచ్చిన జగతి పాత్ర ఆన౦ద
కర౦.వెళుతూ ఇవ్వాలి అక్షయ పాత్ర పాడి ప౦టల
తో.అ౦దరికీ స౦వత్సరాది శుభాకా౦క్షలు
ఖర౦ లొ ఈ హార౦ ఎగరాలి
రిప్లయితొలగించండిబ్లాగుల్లో జిగేల్ జిగేల్ మని ;-)
Wait wait mouli.. I am on train
రిప్లయితొలగించండి$భాస్కర రామి రెడ్డి గారు
రిప్లయితొలగించండి:: శ్రీఖరనామ ఉగాది నూతనసంవత్సర శుభాకాంక్షలు. ::
$మౌళి గారు
పాపం వారు ట్రైన్లో ఉన్నట్లుంది.. మీరేమో ఎగరమంటున్నారు! ;)
మీకూ
:: శ్రీఖరనామ ఉగాది నూతనసంవత్సర శుభాకాంక్షలు. ::
#అక్షయ పాత్ర పాడి ప౦టలతో
#అక్షయ పాత్ర పాడి ప౦టల ఎకరాలతో ;)
మౌలీ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసకల సౌభాగ్య కరమై ఖర ఉగాది
జగతి బాధలెల్ల తీర్చ నరుదెంచె
మురళి గాన లహరుల లభ్ధిపొందిన
ఉగాది నిచ్చుగాక సకల సంపదలు
ఔను మౌళి...హారానికి నా హారం
రిప్లయితొలగించండిఎగురవే ఎగురవే హారమా
ఖరమ్ములోన ఖండాతారలపైన
విశ్వవినూధుల విశ్వవిజేతవై
బ్లాగు బాంధవుల రచనలు సుమ మాలగ జుట్టి
సకల విభాగ విరించియై
ఎగురవే ఎగురవే హారమా
ఖరమ్ములోన ఖండాతారలపైన
విశ్వవినూధుల విశ్వవిజేతవై
రచనల మణిహారమై
రచయితలు రంజిల
రాగద్వేష నిష్కారివై
ఎగురవే ఎగురవే హారమా
ఖరమ్ములోన ఖండాతారలపైన
విశ్వవినూధుల విశ్వవిజేతవై
రాజేష జి, మీకు కూడా నూతన ఖరనామ ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఆఫ్ ది టాపిక్ (?) ఖరములో నైనా MS, EU లో నెగ్గి అక్షయపాత్ర సాధిస్తుందేమో చూద్దాం ;)
నిండార పాడి పంటల
ఫల పుష్ప సంపదల
రైతు బాధల మోయు
ఖరమై రా, సుభకరా
ఏమిటికి ఈ గానాలు, గమ్మత్తులు? ;) కానుక గా మా బూరుగుపూడి బెల్లం అచ్చులు అందిస్తారా...బుట్టాయగూడెం చింత పండు ఇస్తారా? రాళ్ళగుంట మామిడికాయ పంపుతారా...గరువు మీద వేప రెమ్మలు విరిచి ఇస్తారా? అయితే గియితే మీ కారాల బస్తాలు లోడ్కెక్కిస్తారు గాని. :)
రిప్లయితొలగించండిగగనాలు పోసిన చినుకుల తలంబ్రాలు,
సెలయేటి కాంతకి ఒడిబియ్యాలు
ఊట నేలలో ఎదిగిన చెరుకు బెల్లాలు అవుతాయి...
చివురులు కోయిల సరిపెట్టుకుంటే,
పిందెలు చిలుకమ్మ చిదిమి వదిలితే,
మామిడికొమ్మ మళ్ళీ కాయలు కానుకిస్తుంది...
చింతలెరుగని బతుకుండదని,
ఈదులాడనంటే ఒడ్డు ఆమడదూరాన్నే ఆగిపోతుందని,
పులుపు మేళవింపు చింతచెట్టు తన వంతుగా పంపుతుంది...
కాకమ్మ ఎత్తుకెళ్ళిన పళ్ల లెక్కలడగని,
గాలిగాడు రాల్చిన ఆకుల అజ పట్టని,
వేపమ్మ చేదుమందే శాస్త్రమని పువ్వులో పెట్టి చెప్తుంది...
కారాలు చెపుతాయి ఊరూపేరూ వివరాలు.
ఆరబోసిన మిరప మిలమిలలే
ఉగాది నోటికి కారాలు, కంటికి నీరూను...
ఏడేడు సంద్రాలు ఎన్ని యుగాల కన్నీటి కాలువలో?
శోకాలు లేనిదే శ్లోకాలు పుట్టవనేమో,
రవ్వంత ఉప్పు కలపని ఉగాదికి నిండుదనం రాదనే చెప్పాలి.
గులకరాయంత కష్టానికి ఫలం,
బండరాయంత సుఖం...
కష్ట సుఖాల కలబోతల జీవితాలు
ఉగాదికి ఉగాదికీ నడుమ షడ్రుచుల విస్తర్లు.
-మరువం ఉష
ఉషా ;-)
రిప్లయితొలగించండిసాయంకాలం షడ్రుచల విందే అయితే ;).. కొచెం తీపి, కొంచెం వగరు, కొంచెం చేదు, మరికొంచెం పులుపు, కొంత ఉప్పు...మరింత కారం. మరి మాకు పండేదే అది కదా లోడ్లు లోడ్లు.
భాస్కర రామి రెడ్డి గారు
రిప్లయితొలగించండిభలే సందడి చేసేశారండీ!
ఉష గారూ !
చప్పట్లు మీకు!!
సో, ఫోర్ కొట్టాము, ఓ సిక్స్ వేస్తే పోలా? :) ధోనీ ఇంకా గీతాబోధ చేస్తుంటే. ఈ జుగల్బందీ గెలుపు కొట్టేస్తూ... రామీ, ఇక మీ పరుగులు ఆపమని వెక్కిరిస్తూ :)
రిప్లయితొలగించండిబాగుంది మీ ప్రయత్నం నిజానికి.
ఇకపోతే, అనురాగం అన్న అధరువు లేని మనుగడకి విలువ లేదు. ఆ ప్రాతిపదికన సాగే పయనాన తప్పని షడ్రుచులు జంట గీతాలాపనలు.
ఆ స్ఫూర్తితో వ్రాసిన ఈ వ్యాఖ్య ప్రతి జంటకీ అంకితమిస్తూ...
ఉగాది వచ్చిందీమారు
ఆమనికోయిల పాటగా..
తలపుల రాగాలు
రుచులుగా తోస్తుందందుకేనేమో!
విరహిత కనుల ఎరుపు,
కొత్త కారానికి దీటు.
మల్లియని మందారంగా మార్చేను..
ఉప్పుటేరుగ పొంగే శోకతప్త కనులు,
సముద్రమంతా పట్టే ఊటబావులు.
వేదన స్ఫటికాలను కరిగించేను..
ఎడబాటు తనువున పొగరు,
ఎదురొచ్చే చెలికానికి వగరు తోడుగ.
తప్పిదానికి తగు మర్యాద చేసేను..
వలకాని చిలిపి వాగ్ధాటి,
ముగ్ధ మురిపానికి సైజోడు.
బుంగమూతికి పటికబెల్లం హారతిచ్చేను..
కరుగు కాలాల చేదుకి,
కరగని కలల విరుగుడు.
మది ముంగిట రంగవల్లిగ మెరిసేను..
మురిపాలు కలిపిన కవ్వింతలు,
చింత పులుపుకి ఎదురంట.
కలిసిన మనసుల అతిశయం నిత్య ఉగాది..
@మందాకిని గారు, వినమ్రంగా మీ అభినందన స్వీకరిస్తున్నాను. :)
రిప్లయితొలగించండిఈ సంబరం లో పాలు పంచుకున్న అందరికీ,
ఈ ఉగాది రాబోవు కాలాలలో మీకు, మీ కుటుంబ సపరివారానికీ సుఖ సంతోషానంద భరితమై మీ జీవితాలలో ఆహ్లాదాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ.
ఉష గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు...అభినందనలు. అసలైన ఉగాదిని జరిపించేసారు. భాస్కర రామిరెడ్డి గారూ, మీకూ ధన్యవాదాలు, ఉగాది ముత్యాల హారం మాకు కానుక సమకూర్చినందుకు. (ముత్యాలు అని ఎందుకన్నానంటే, నాకవే ఎక్కువ ఇష్టం కాబట్టి)
రిప్లయితొలగించండిఉషా, పోర్లు సిక్సర్ తో మ్యాచ్ ని దగ్గరుండి గెలిపించుకున్నారు. ఇంక మేము చేసేదేముంది? :)
రిప్లయితొలగించండిమందాకిని గారూ.. నేనింత సందడి చేస్తే నాకు చప్పట్లు లేవా.. వా వ్వాఆఆ
రిప్లయితొలగించండిఅంతేనండీ ఎంతైనా మీరు మీరు ఒకటి :)
జయ గారూ మీరెంత మంచోరండి నాకు కూడా ధన్యవాదలు మర్చిపోకుండా చెప్పారు JK.
రిప్లయితొలగించండిThank you Jaya.