4, జులై 2011, సోమవారం

బ్లాగు ఏగ్రగేటర్ గా హారం ప్రస్థానం. ఎటునుంచి ఎటు?

దరిదాపు ఒక నెలన్నర క్రితం హారాన్ని తమిళ,కన్నడ,హింది భారతీయ భాషలలోకి విస్తరించాలనుకున్న ఆలోచన వచ్చాక ఎప్పుడో సంవత్సరం క్రితం వ్రాసిన కోడ్ ను దుమ్ము దులిపి చూస్తే అప్పుడు ఏది ఎందుకు వ్రాసానో ఒక్క ముక్క కూడా అర్థము కాలేదు. అప్పుడు మొదలు పెట్టిన మార్పులు , చేర్పులు అతి కష్టం మీద ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చాయి. ఈ హారం ఆధునీకరణ మూలంగా ఈ మధ్య కాలంలో ప్రధానంగా దెబ్బతిన్నది తెలుగు నిఘంటువు పని. హారం పని మొదలు పెట్టినప్పుడు ఒక్క UI మాత్రము మారిస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ, అన్ని భాషల బ్లాగుల పట్టిక చూసాక పార్సింగ్ కు సమయం ఎక్కువ పడుతుండటముతో haaram core engine లో threading implement చెయ్యక తప్పింది కాదు. ఇన్ని భారతీయ భాషల బ్లాగులను ఒకే చోట చూపించడంతో హారం అతి త్వరలోనే భారతదేశపు అతిపెద్ద బ్లాగు సంకలిని గా అవతరించబోతుంది. కానీ దీనికి గూగుల్ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి. ఇప్పుడైతే హారంలో పలు బ్లాగులను ఒకేసారి చదవగలిగే అవకాసం వున్నప్పటికి గూగుల్ మాత్రం వారి సర్వర్స్ లో ఎక్కువ రిక్వెశ్ట్స్ ఈ ఐ.పి నుంచి వస్తున్నాయని Random గా requests ను block చేసి http error code 503 పంపుతుంది. ఏమైనా ఇప్పుడు హారం దరిదాపు 40,000 బ్లాగులను ప్రతి 20 నుంచి 40 నిముషాలకు update చేస్తుంది. ఇంకో 1,80,000 బ్లాగులున్నాయి కానీ ఆ లింకులు కావాలంటే ప్రస్తుతానికి ఆటోమేషన్ ద్వారా చెయ్యడానికి వీలు లేదు. గూగుల్ వాడు దానికి సహకరించడం లేదు. Manual గా 1,80,000 లింకులను ఎంటర్ చేసే ఓపిక, సమయం నాకు లేవు. ఇప్పటికి ఈ 40,000 తోనే సరిపెట్టుకుంటాను.

కానీ తెలుగు భాష బ్లాగులు మాత్రము మునుపుటికంటే వేగంగా పని చేసే అవకాశం వుంది. ఇంతకు ముందు 90 సెకన్ల నుండి, 150 సెకన్ల మధ్య కనిపించే బ్లాగు టపా ఈ సారి ఇంకొంచెం ముందుగానే కనిపించవచ్చు. హారం లో ప్రస్తుతమున్న ప్రధాన సమస్య దీనికి Dedicated server లేక పోవడమే. ఈ సమస్య వల్ల 20 seconds to 30 seconds కోల్పోవలసి వస్తుంది. ఒక పది పదిహేను రోజుల Data చూసిన తరువాత కచ్చితమైన సమాచారం ఇస్తాను.

ఇంతకీ ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకంటే, హారం ఈ రోజు, రేపు మైంటెనెన్స్ మోడ్ లో వుండవచ్చు. కాబట్టి మీ బ్లాగు టపాలు కనిపించకపోవచ్చు. ఒక్కోసారి అసలు పని చేయక పోవచ్చు.

ఇక పోతే 2008 డిసెంబరు లో మొదలైన హారం Statistics ఈ రోజు చూసాక చాలా సంతోషం వేసింది. అవి మీకోసం ఈ క్రింద.( సంవత్సరాల వారీగా )


Year 2009
----------




Year 2010
-----------



Year 2011 (ఇప్పటి దాకా. అంటే జూలై లో రెండురోజులు కలుపుకొని)
----------

27 కామెంట్‌లు:

  1. మీకు నా హృదయపూర్వక అభినందనలు ఇలానే ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుని అందంగా ముస్తాబయి మా ముందుకి రావాలని మనసారా కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  2. మీ హారం బ్లాగ్ అగ్రిగేటర్లలో ఓ మణిహారంలా నిలవాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. రసజ్ఞ, మీ కోరికకు అభినందనలకు ధన్యవాదాలు. మా హోస్టింగ్ వాడు రేపు పని చేస్తే రేపటికల్లా కొత్త హారం మన ముందుంటుంది.

    రిప్లయితొలగించండి
  4. సిరిసిరిమువ్వ గారూ, మీ అభినందనలకు ధన్యవాదాలు. మణిహారమైతే మంచిదే :)

    రిప్లయితొలగించండి
  5. అభినందనలు. మీరు అనుకున్నవన్నీ దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.. B O L

    రిప్లయితొలగించండి
  6. ఒకే సర్వర్‌లో ఒకటి కంటే ఎక్కువ అగ్రెగేటర్‌లు రన్ చేస్తే బ్యాండ్‌విడ్త్ సరిపోదేమో. నాది ఒకటే అగ్రెగేటర్ ఉంది కానీ రెండు సర్వర్లు ఉన్నాయి. డేటా సర్వర్ ఒకటి, క్రాన్ రన్నింగ్ సర్వర్ ఇంకొకటి. అందుకే నా అగ్రెగేటర్ వేగంగా రన్ అవుతోంది.

    రిప్లయితొలగించండి
  7. శుభాభినందనలు. మణిహారం లో మరెన్నో మణులు చేరాలని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  8. Congratulations Mr Ramireddy. All the very best to you.

    రిప్లయితొలగించండి
  9. దుర్గేశ్వర గారూ, మీ ఆశీస్సులు తప్పకుండా నాకు సహకరిస్తాయి. వ్యాఖ్యకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  10. ప్రవీణ్ మీకు రెండు సర్వర్ లను అద్దెకు తీసుకొనే స్తోమత వుంది. కానీ నాకు లేదు. మీ ఆగ్రిగేటర్ వేగంగా పనిచేపిస్తున్నందుకు మీకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  11. బులుసు సుబ్రహ్మణ్యం గారూ, మీ ఆశీర్వాదాలు కూడా మనఃస్పూర్తిగా స్వీకరిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  12. హ హ్హ, ఇంద్ర .. ఉచిత సలహాలు ఇవ్వడానికి కూడా మొఖమాట పడితే ఎలాగండీ :-).. మీకొచ్చిన ఆలోచనలన్ని ఇక్కడ వ్రాసేయ్యండి..ఈ వారాంతం వీటి గురించి చర్చించవచ్చు. రేపటినుండి ఆఫీసులో ఫుల్ బిజీ కాబట్టి శనివారం దాకా వీలు కాకపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  13. Bhaskar,

    Is it possible to have 'favourites' option @ all languages.

    one should be able to filter from such big list with multiple languages and categories.

    haaram tool baar ? :-)

    రిప్లయితొలగించండి
  14. @ ప్రవీణ్
    >>>డేటా సర్వర్ ఒకటి, క్రాన్ రన్నింగ్ సర్వర్
    అంటే ఏమిటి
    నాకు అంత తెలియక పోయినా ప్రస్తుతానికి ఏదో పని కానిచేస్తున్నాను
    అయినా "సంకలిని" ఫాస్ట్ గానే ఉంది

    రిప్లయితొలగించండి

Comment Form