29, ఆగస్టు 2011, సోమవారం
తెలుగు బ్లాగులకు ఆంగ్ల బ్లాగులకు గల ప్రధాన వ్యత్యాసాలేమిటి?
ఏదో ఒకటి రాయలన్న ఉత్సాహమేగానీ ఏంరాద్దామన్నా కీబోర్డు లో కీస్ ముందుకు కదలడంలేదు. ఆమధ్య అన్నాహజారే అవినీతిపై పోరాటానికి సిద్ధమైనప్పుడు ఒక వ్యాసం రాద్దామనుకొని చిన్న చిన్న వ్యాఖ్యలతో సరిపెట్టుకొన్నాను. అయినా ఈ అవినీతిపై పోరు ముగిసిందని సంబరపడుతూ నిన్నరాత్రి ఫుల్లుగా మందుకొట్టి పట్టుకొన్న పోలీసోడి చేతిలో ఒక వంద కొట్టి " జై అన్నా " అన్నాడట మా స్నేహితుడొకడు. వీడికంటే గట్టిగా పోలీసు మామ "జై అన్నా" అన్నడట, ఇద్దరూ ఎవరిదారిన వారు చక్కా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఇది తెలిసాక ఇంక రాయడానికేముంటుంది.
సరే ఏదో నాస్టాల్జా ( nostalgia) గురించి కాసేపు వ్రాద్దామనుకునేంతలో, అసలు మన తెలుగు బ్లాగుల్లో ఈ nostalgia ఎక్కువని ఎక్కడో ఎప్పుడో ఎవరో వ్రాసిన వ్యాఖ్య గుర్తుకొచ్చింది. అవును మరి మిగిలిన భాషా బ్లాగుల్లో పరిస్థితేమిటి అని ఓ క్వచ్చెన్మార్క్ బుఱ్ఱలో పుట్టింది. అన్ని భాషలంటూ తెలియవు కాబట్టి నాకొచ్చిన రెండు మూడు భాషా బ్లాగుల్లో కొద్దిరోజులుగా చూస్తున్న ట్రెండ్ ఒక్కసారి కళ్ళముందు మెదిలింది. ఆయనెవరో చెప్పినట్టు తెలుగులో చాలామట్టుకు ఎత్తుకొచ్చి అతికించే బ్లాగులది రాశిలో మొదటి స్థానం. అంటే అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్టు చేస్తారన్నమాట. ఈ బ్లాగుల్లో ప్రముఖంగా వార్తా,సినిమా బ్లాగులుంటాయి. ఆతరువాత స్థానం ఒకటి రెండు లైన్ల పోస్టులేసే బ్లాగులుంటాయేమో.
మూడో స్థానం ఈ nostalgia బ్లాగులకివ్వవచ్చు. ఇక నాలుగోస్థానంలో కవితలు, ఐదోస్థానంలో కథలు ఇలా ranking వుంటుందేమో. ఓపిక గల్గిన మహాశయలు ఏదైనా వివరాలతో ఒక పోస్టు వ్రాస్తే చదివిపెడ్తాము. అయినా అదేదే పాతసినిమాల్లో డైలాగ్ లాగా "ఎవరెట్టాపోతే నాకెందుకులమ్మా" అనుకొంటే అంతా సుఖమయమే :-)
ఇక ఆంగ్లబ్లాగులకొస్తే, మన తెలుగు కన్నా ఇక్కడ రెండింతలు ఎక్కువే చదివినట్టున్నారు. ఇక్కడ చాలామందికి బ్లాగ్వాపకం ఒక డబ్బులు సంపాదించే సాధనం. ఇందులో ముఖ్యంగా రకరకాల ప్రాడక్ట్స్ మీద రివ్యూలు వ్రాయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే సెన్సక్స్ బ్లాగుల్లో ఈ ఈ షేర్స్ కొనండి అని ప్రభావితం చేయడం ద్వారా డబ్బు సంపాదించే బ్లాగులు కొన్ని. చెప్పుకోడానికి భారతీయ ఆంగ్లబ్లాగులు వేలల్లో వున్నా వాసిలో చాలా మట్టుకు ఇంకా ఎదగాల్సి వుంది. అలా అని మరీ తీసివేయవల్సిన విధంగా కూడా లేవు. చాలా బ్లాగుల విషయపరిజ్ఞానం మన తెలుగు బ్లాగులతో పోలిస్తే మెరుగనే చెప్పుకోవాలి. ఇక్కడ పూటకూళ్ళిళ్ళో రకరకాల వంటల గురించి చెప్పుకొనే ముచ్చట్లు చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ ముచ్చట్లు ఎక్కువైనా చాలా మట్టుకు ఒరిజినాలిటీ కలిగిన వంటకాలుంటాయి. అలాగే ప్రేమ గురించి, పిల్లల గురించి కూడా వ్యాసాలు ఎక్కువే. ఓ నెల రోజులు హారం మీద అప్పుడప్పుడూ ఓ లుక్కేస్తుండండి. తెలుగు బ్లాగులకూ, ఆంగ్ల బ్లాగులకూ ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. అన్నట్టు ఇప్పుడు హారంలో రివ్యూ బ్లాగులు,సెన్సెక్స్ బ్లాగులు కనిపించవు. తొలగించబడ్డాయి.
నేనేదో nostalgia గురించి బ్లాగుదామని వచ్చి ఏదేదో రాసుకుపోతున్నా కదా. అసలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతీయులు ఇంతటి అవినీతిని ఊహించారా? లేదా? ఆనాటి నాయకుల మనసులో భావాలెలావుండేవి? ఇల్లాంటి విషయాలు తెలుసుకోవాలనిపించింది. ఎక్కడ దొరుకుతాయిమనకు? ఈ మధ్యనే తెలుగు ప్రెస్ అకాడమీ వారు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో వెతికితే ఆంధ్రపత్రిక 1947 ఆగష్టు ౧౫ నాటి పత్రిక లభ్యమైంది. చాలా పాతదవ్వటంతో పత్రిక స్కానింగ్ సరిగాలేదుకానీ కష్టపడి చదువవచ్చు. మీరూ ట్రై చెయ్యండి. ఆనాటి నుండి ఈనాటికి భారత ప్రగతి ఎంతో కనిపిస్తుంది. అవినీతితో సహా !!
చివరిగా రాబోయే ఎలక్షన్లలో ఎవరైతే తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రజల్ని నమ్మించగలరో వారే విజేతలు అవుతారేమో. అలాగే ఇకనుంచైనా రాజకీయ పార్టీలు రాజ్యవ్యవస్థను పటిష్ఠంగా పునర్నిర్మించి సామాన్యునికి ఈ లంచాల గొడవలేకుండా చేస్తుందేమో అని ఆసించడంలో తప్పులేదేమో.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణకూడా చెప్పుకోవాలి. పరాయుదేశమైన అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కార్ నడిపి పోలీసుకు చిక్కిన ఏ డ్ర్రైవరు కూడా పోలీసు కు లంచం ఇచ్చిన వార్త నాకింత వరకూ తెలియదు. అలాగే ఏ పోలీసు కూడా లంచం తీసుకొని వదిలేసిన సంఘటనా తెలియదు. కానీ మన భారతదేశంలో ఇది ప్రతిరోజూ ప్రతి ట్రాఫిక్ లైట్ దగ్గర పబ్లిగ్గా కనిపించే సన్నివేశం. కారణం?
ఒక్క రోజు అవినీతికి పాల్పడకుండా(ఎ విషయంలోనూ) మనిషి అసలు బ్రతకగలడా?లేచిన దగ్గిరనుంచి ఇంటా బయటా అంతా అవినీతిమయమే. అవినీతి రహిత భారత దేశాన్ని చూడగలము అనుకోవడం అత్యాశే.
రిప్లయితొలగించండిమొన్న ఆగస్టు పదిహేనునాడు పూనే లో టైమ్స్ అఫ్ ఇండియా వాళ్ళు మన స్వాతంత్ర్యం వచ్చిన నాటి రోజు టైమ్స్ అఫ్ ఇండియా పత్రి ని ఇచ్చారు. చాలా జాగ్రత్తగా దాచుకున్నాను.మన తెలుగు పత్రికను చదవగలిగినందుకు థాంక్స్.
తొలకరి గారూ అవినీతి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నామంటే మనం దానికి ఎంతలా అలవాటు పడ్డామో కదా!! అలాగే పూర్తి అవినీతి లేని దేశం చూడడం దుస్సాధ్యం కానీ మానవునికి నిత్య జీవనానికి అవసరమైన పనులనుంచి అవినీతిని తొలగించడం నాయకులు, ఉద్యోగులు తల్చుకుంటే అసాధ్యమేమీ కాదు.
రిప్లయితొలగించండివావ్..మీకు ఆనాటి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి దొరికిందా? ఎంత అమూల్యమైన బహుమానమో కదా!!