13, అక్టోబర్ 2011, గురువారం
సరిగ్గా సంవత్సరం క్రితం... ఇదేరోజు ఏం జరిగిందంటే .................
2010 వ సంవత్సరం అక్టోబరు 13 వ తేది, అంటే సరిగ్గా ఇదేరోజు ఒక బృహత్తర కార్యాన్ని తెలుగు బ్లాగర్లు తలపెట్టారు.
తెలుగు నిఘంటువొకటి మన అంతర్జాలంలో ఉంటే బాగుంటదని అనిపించినదే తడవుగా online telugu nighantuvu కు అంకురార్పణ జరిగిన రోజు.
ఓసారి ఆనాటి భావాలెలా ఉన్నాయో చూడాలంటే ఈ టపా చదవాల్సిందే http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_13.html
ఓపికుంటే చదివి మళ్ళీ ఈ టపాకు రండి.
అలా మొదలైన మాయీ ప్రయత్నం కేవలం రెండు రోజుల్లో ఒక
తెలుగు నిఘంటు వేదిక http://groups.google.com/group/telugunighantuvu గా ఏర్పడింది. చాలా ఉత్సాహంగా మొదలైన గుంపులో ఆనెలలోనే దరిదాపు ఇరవైమంది దాకా చేరారు. మరో నెలకు ముప్పై మంది గల గుంపుగా తయారైంది. మరో రెండు వారాల్లో కావలసిన ఆర్దిక వనరులను మన బ్లాగర్లనుంచే సేకరించడం జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదువ వచ్చు. http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_29.html
పూర్తి విరాళాల వివరాలు తెలుగునిఘంటువు సైట్ లో చదువగలరు.
సభ్యుల్లో నూతనోత్సాహం వెల్లి విరుస్తుంది. తొలి విడత తర్జనబర్జనలయ్యాక సైటుకు "తెలుగునిఘంటువు" అనే పేరును నిర్ణయించాము.
అంతర్జాలంలో అప్పటికే స్కాన్ చేసి పెట్టిన సూర్యరాయాంధ్ర నిఘంటువుతో ( 8th volume ) పని మొదలు పెట్టాము. కానీ అలా అంతర్జాలంలో మాకు లభించిన స్కాన్ కాపీ చాలా నాసీరకంగా అక్షరాలు కనిపించకుండా ఉండటంతో సభ్యులకు ఆ అక్షరాలు సరిగా కనిపించక చాలా అవస్థలు పడ్డారు. ఇలా మేము 8 వ సంపుటితో కసరత్తు చేస్తున్న సమయంలో శ్యాం కందాళ ముందుకు వచ్చి వారి నాన్నగారి వద్దనున్న సూర్యరాయాంధ్ర నిఘంటువుల అన్ని సంపుటాలను స్కాన్ చేసి తెలుగునిఘంటువుకు సహాయపడటం ద్వారా మా కష్టాలు తీరాయని చెప్పాలి.
అలా ఐదైదు పేజీల స్కాన్డ్ కాపీస్ సభ్యులందరికి పంపించాము. మొదటి విడతబాగానే అయింది. సభ్యులకు ఇందులో సాధకబాధకాలు బాగా అర్థమయ్యాయి :-).
రెండవవిడతగా మరో ఐదు పేజీలను పంపించాము. ఎంతో ఉత్సాహంగా చేరిన సభ్యులు చాలా మంది చల్లగా జారుకున్నారు. ఇది వారిని విమర్శిస్తున్నాననుకోవడం కంటే, బహుశా నా పద్ధతి నచ్చక మానుకొని కూడా ఉండవచ్చు. లేదా వాళ్ళలో ఉత్సాహాన్ని నిరంతరం నూతనంగా ఉంచటంలో నేను కృతకృత్యుడను కాలేక పోయి ఉండవచ్చు. లేదా చెప్పుకోలేని అనేక కారణాలై కూడా ఉండవచ్చు. అసలు చేరడమే ఏం జరుగుతుందో చూద్దామని చేరినవారూ వుండి వుండవచ్చు :-). కానీ వీటన్నింటికంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవలసింది, ఈ గ్రూపు ఒక స్వచ్ఛందమైన గుంపు. తమంతట తాము ఇష్టంగా వచ్చి చేరిన వాళ్ళు. తరువాత కాలంలో వృత్తిపరమైన ఒత్తిడిలో లేక మరొక కారణాలవల్ల వీరు ఉత్తేజంగా పని చేయలేకున్నా, పిలుపిచ్చిన వెంటనే స్పందించి చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.
ఏదేమైనా ఆంధ్రుల ఆరంభ సూరత్వం మరోసారి ఋజువైంది. ఇక్కడ ఆంధ్రులంటే మేము లేముకదా అని తెలంగాణా, రాయలసీమ వాళ్ళు అనుకోనవసరం లేదు లెండి :-) ... నా ఉద్దేశ్యంలో ఆంధ్రులంటే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడూ. లేకపోతే మా అప్పటి సభ్యుల్లో చాలామంది దేశానికి బయట నివసిస్తున్నవారే.
కానీ అసలైన పని రెండవవిడత పేజీలను పంపాక మొదలైంది. బాబూ పేజీలయ్యాయా??? అమ్మా పేజీలయ్యాయా అని అడుక్కోవడమన్నమాట :-) సరదాగానే వ్రాస్తున్నానండి ఎవ్వరూ పెద్దగా ఫీల్ కావొద్దు. కొద్దిరోజులకు గట్టిగా ఉక్కుతీగల్లా ఐదారు మంది సభ్యులు మిగిలారు. వారు చాలావేగంగా పని చేయడం మొదలెట్టారు. ఉన్నది కొద్ది మందే కాబట్టి మేము మొదలుపెట్టిన నిఘంటు వేదిక అటకెక్కేసింది. నేరుగా సభ్యులతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి.
నిజానికి నిఘంటువేదిక సుప్తచేతనావస్థ దశలోనే నిఘంటువు పని అమితవేగంగా జరిగింది. అంటే అక్టోబరు 2010 లో మొదలైననిఘంటువు పని ఈ సంవత్సరకాలంలో ఈ క్రింది మైలురాళ్ళను సాధించింది.
1) నిఘంటువును వేగంగా టైపు చేయడానికి ఎలాంటి పద్ధతినవలంభించాలో చర్చ మరియు దానికి కావాలసిన ఒక ఫార్మాట్ ను తయారు చేయడం. కాలానుగుణంగా, మాకు అందులో అనుభవమొచ్చేకొద్దీ ఈ ఫార్మాట్లో మార్పులు చేర్పులు కూడా చేసాము. దీని వివరాలను ఇక్కడ చూడవచ్చు.
https://sites.google.com/site/telugunighantuvedika/new-rules
2) పైన చేసిన ఫార్మాట్ ప్రధానంగా రకరకాల సెర్చ్ ఫంక్షనాలిటిని దృష్టిలో ఉంచుకొని తయారు చేసింది కాబట్టి దానికనుగుణంగా ఆ పదము,అర్థము, పద వివరణము మొదలైనవి భద్రపరచడానికి ఒక Database Design చేసాము
3) తెలుగు నిఘంటువు ను అంతర్జాలంలో అందరికీ అందుబాటులోనికి తీసుకురావడానికి http://telugunighantuvu.com అనే వెబ్ సైటు రిజిష్టర్ చేయించాము.
4) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఎనిమిదవ సంపుటిని పూర్తిగా టైపు చేసాము.
5) గూగుల్ మహాభారత గుంపులో లభ్యమైన పద్యాలను parse చేసి సూర్యరాయాంధ్ర నిఘంటువులోని పద్య ఉదాహరణలతో అనుసంధానించాము. దాని వివరాలు ఇక్కడ చూడవచ్చు.http://chiruspandana.blogspot.com/2011/04/similarity-index.html
6) టైపు చేసిన పేజీలలోని పదములను Database లోకి పంపించడానికి అవసరమైన Dataparser ని అభివృద్ధిపరిచాము.
7) http://telugunighantuvu.com website ని డిజైన్ చేసి, కోడ్ చేసి online లో ఎనిమిదవ సంపుటితో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి తీసుకొని వచ్చాము. అలాగే వెబ్సైట్ లో కొన్ని మార్పులు చేర్పులతో పోయిన నెల సరిక్రొత్తగా మరో వెర్షన్ తో మీముందుకొచ్చింది.
8) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు రెండవ సంపుటిని అనిల్ గారు పూర్తిగా టైపు చేసారు.
9) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు నాల్గవ సంపుటిని దేవి( మందాకిని ) గారు పూర్తిగా టైపు చేసారు.
10) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆరవ సంపుటిని కందిశంకరయ్యగారు పూర్తిగా టైపు చేసారు.
11) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మూడవ సంపుటిని కవిత పూర్తిగా టైపు చేసారు.
12) ఇక ప్రస్తుతము ఏడవ సంపుటిని అనిల్, ఐదవ సంపుటిని దేవి, ఒకటవ సంపుటిని కందిశంకరయ్య గార్లు టైపు చేస్తున్నారు. అలాగే తెలుగుపర్యాయపద నిఘంటువు ( ఆచార్య జి.యన్.రెడ్డి ) ను పూర్తిగా కవిత టైపు చేస్తుంది.
క్లుప్తంగా తెలుగునిఘంటువులో మొత్తము ఎనిమిది శ్రీసూర్యరాయాంధ్రనిఘంటువు సంపుటాలలో 2,3,4,6,8 సంపుటాలు పూర్తిగానూ, ఒకటవ సంపుటిలో 296 వ పేజి వరకూ, ఐదవ సంపుటిలో 119 వ పేజి వరకు, ఏడవ సంపుటిలో 10 పేజీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే తెలుగుపర్యాయపద నిఘంటువు ( ఆచార్య జి.యన్.రెడ్డి ) నిఘంటువులో మరో 170 పేజీలు చేస్తే పూర్తవుతుంది కానీ ఇప్పటికే పూర్తయున పేజీలు ఇంకా తెలుగునిఘంటువులో పాఠకులకు అందుబాటులో లేవు.
అలాగే మహాభారత గూగుల్ గుంపునుంచి తీసుకొన్న పద్యాలనుకూడా ప్రస్తుతానికి ఎనిమిదవ సంపుటికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. పూర్తిగా శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు టైపు పని పూర్తైన తరువాత అన్నింటిని ఒకేసారి అందుబాటులోకి తీసుకొని వస్తాము.
ఏవైనా క్రొత్త సాంకేతిక పదాలను ఈ నిఘంటువులో చేర్చాలన్నా తెలుగునిఘంటువు పేజిలోనుంచి చేర్చవచ్చు. http://telugunighantuvu.com లో గల సదుపాయాలను, ఈ వెబ్సైట్ ఎలా వాడాలన్నది మరో టపాలో వివరిస్తాను.
తెలుగు నిఘంటు వేదిక సభ్యుల తరుపున
భాస్కర రామిరెడ్డి.
నేను కామెంట్ చెయ్య, నాపేరు లేదు :)
రిప్లయితొలగించండిహ హ్హా అజ్ఞాతా :-). మీరెవరో చెప్తే కదా మీపేరు ఎక్కడుందో చెప్ప గలను :-)
రిప్లయితొలగించండిcongratulations to all telugu lovers!!!!!
రిప్లయితొలగించండిభారారె మీ ప్రయత్నం భళారె బహు అభినందనీయం. telugunighantuvu లో
రిప్లయితొలగించండిగ్రంధ సాంకేత పట్టిక కనిపించుటకొఱకు ఇక్కడ నొక్కండి
సంజ్ఞావివరణ పట్టిక కనిపించుటకొఱకు ఇక్కడ నొక్కండి
రెండింటికీ ఒకటే విష్యం చూపిస్తున్నారు చూసారా !?
cheers
zilebi
http://www.varudhini.tk
wow...అప్పుడే ఏడాది అయిందా! congratulations to all!
రిప్లయితొలగించండిNow, its time to speed up the work!
మందాకిని గారూ, తెలుగు లవర్స్. ఈ సారి కనిపిస్తే ఓ సారి అడిగానని చెప్పండి :-)
రిప్లయితొలగించండిహాయ్ హాయ్ జిలేబీ... మీకు బోలెడు జిలేబీల ధన్యవాదాలు. ఇది సరిచేయ్యాలంటే ఇప్పుడు ఆ గుర్తులన్నీ టైపుచెయ్యాలి. త్వరలోనే చేస్తాను.అవునండి, జిలేబీల్లో ఎన్ని రకాలున్నాయి :).ఏంటో చాలా అవస్థలు పడుతున్నట్టుంది.
సౌమ్యా, అవునండీ అప్పుడే సంవత్సరమైపోయింది. పేజీలిచ్చికూడా ఏడాది దాటిందండి :-) jk