7, నవంబర్ 2011, సోమవారం
భారత దేశ యాత్ర ....
నేను వచ్చే సంవత్సరము మన భారత దేశము శ్రీనగర్ నుంచి కన్యా కుమారి వరకూ, ఒఖార్ నుంచి ఇంఫాల్ వరకు పర్యటించ దలచుకున్నాను. పర్యటన ముఖ్య ఉద్దేశ్యము వివిధ పర్యాటక ప్రదేశాలే కాక, రకరకాల సమాజాలు, అందులో భాగమైన మనుష్యులు, వారి ఆచారవ్యవహారాలు,ఆ సమాజ మనస్తత్వాన్ని నాకు తోచినరీతిలో గమనించదలచుకున్నాను. ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా జరపాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యటనలో తప్పక దర్శించుకోవలసిన ప్రదేశాలు ఏమిటి? ఏఏప్రాంతాల్లో ప్రసిద్ధమైన దేవాలయాలున్నాయి? ఏఏ ప్రాంతాలు చారిత్రాత్మక మైన ప్రదేశాలు? ఏవి సుందరమైన ప్రదేశాలు. ఇలాంటి వివరాలు ఎవరైనా ముందుగా ఇవ్వగలిగితే నాకు చేతనైన విధంగా ముందుగా ఆ ప్రాంతము గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ముందుగా ఒక అభిప్రాయానికొస్తానని కాదు. భౌగోళిక పరిస్థితులు, మిగతా వివరాలు తెలుసుకుంటానని. ఇండియా మొత్తాని ఓపెన్ మైండ్ తో చూడదలిచాను. చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ టూర్ అని విశాఖపట్టణం, పూరీ, భువనేశ్వర్, ముంబాయి, మదుర,ఆగ్రా, ఫతేపూర్ సిక్రి, ఢిల్లీ,కలకత్తా చూడడం జరిగింది. కానీ అప్పుడు దేశంలో చూడదగిన ప్రదేశాలను చూడాలన్న ఆసక్తితో మిగిలిన విషయాలను పెద్దగా గమనించలేదు. ఉద్యోగపరంగా పైన చెప్పినవే కాకుండా, చెన్నై, బెంగుళూరు,పూనా, ముంబై లతో నాకు బాగానే సంబంధం ఉన్నా, జనుల మనస్తత్వాలను పెద్దగా గమనించలేదనేచెప్పాలి.
కానీ వచ్చేసంవత్సరం ఓ మూడు నెలల విరామం తీసుకొని ఈ పని చేయదలచుకున్నాను. మీకు తోచిన సలహాలు ఇస్తారా మరి?నాతో పాటు ఎవరైనా తిరగాలి అనుకుంటే చాలా సంతోషం. నేను ఒక్కడినే భారతదేశ యాత్ర చేసేబదులు మరో ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు వ్స్తే మరీసంతోషం. యాత్ర ప్రధానంగా కారు ద్వారా జరుగుతుంది. నాకు కూడా ఖర్చులు తగ్గుతాయి.ఏమంటారు?ఆలోచించండి. తేదీలు ఇంకా తెలియవు. అసలు చేస్తానోలేదో తెలియదు. ఇది ఒక ఆలోచన మాత్రమే. కానీ వచ్చేసంవత్సరంలో ఇక్కడ నాకుటుంబానికి కావలసిన అన్ని సౌకర్యాలనమర్చినతరువాత తేదీలు నిర్ణయిస్తాను.
ఏంటి వీడిదంతా రాస్తున్నాడనుకుంటునారా? అదేమరి కాకటైల్ ఎన్నో పెగ్గో చెప్పేస్థితిలో లేని కాబట్టి నా మాటలు సత్యాలనే మీరందరూ నమ్మొచ్చు :-)
భ రా రె గారు,
రిప్లయితొలగించండినేను కూడా వచ్చే సంవత్సరం నవంబర్ లో ఇండియా వెళ్తున్నాను.రెండు నెలలు ఇండియా లో ఉంటాను. ఒక నెల దేశ సంచారానికి నిర్ణయించాను. మీతో తప్పక రావడానికి ప్రయత్నిస్తాను.
Thank you Indrasena,
రిప్లయితొలగించండిI guess, October to Feb is the best time to travel. What do you say?
భ రా రె గారు,
రిప్లయితొలగించండినాకు మొత్తం రెండు నెలలే సెలవలు ఉన్నవి. అది కూడా నవంబర్ 15 నుండి జనవరి 15 వరకు మాత్రమె. ఈ రెండు నెలల్లో ఒక నెల వర్క్ ఫ్రం హోం. కనుక నేను ఒక నెల మాత్రమె దేశ సంచారినికి వెచ్చించ గలను. మీకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటె నేను మధ్యలో డ్రాప్ అవుతాను. నాకు పుణ్య క్షేత్రాలు ఏమి చూడాలని లేవు కానీ,వివిధ సమాజాలు పరిశీలించాలని అనుకుంటున్నాను. నేను మీతో త్వరలో మాట్లాడతాను.
తప్పకుండా ఇంద్రసేనా..నేను మూడు నెలలూ తిరుగుదామనే. మీరు నధ్యలో డ్రాప్ అవ్వవచ్చు.
రిప్లయితొలగించండిమంచి ప్రయత్నం. పైకో అయ్యర్ లా ఒక మంచి పుస్తకం వేలువరించండి ఆ తరువాయి -బ్లాగర్ల యాత్రా విశేషాలతో బాటు.
రిప్లయితొలగించండిThank hyou Zilebi. Please give us some suggesins.
రిప్లయితొలగించండిభలే వారండి భారారే గారు మీరు కామెంటు పెడితే వెంటనే suggestions చెప్పండి అంటున్నారు మీరీమధ్య ప్రతి సారీ. ఈ మధ్య ఏమైనా ప్రాజెక్టు మానేజుమెంటు ట్రైనింగ్ కి వెళ్లి వచ్చారేంటి ? నా వరకైతే చెప్పగల ప్రదేశం ఒక్క మాయావతీ రాజ్యం చాలు. మీ తల పండి పోతుంది మన తెలుగు యోగి శర్మ గారు ఈ మధ్య ఒక టపా రాసారు మాయావతీ నగరం గురించి.ఇలాంటి వెన్నో మీకు ఎదురవవుతై ఆ ఒక్క రాజ్యం లోనే.
రిప్లయితొలగించండిరెండవది మా బులుసు గారి ఎక్స్ దేశం - ఆస్సాము . నాగాలాండు వెళ్ళారంటే మీరు మరో మంచి అనుభవం పొందుతారు -
cheers
zilebi.
Zilebi,thank you :))
రిప్లయితొలగించండిPlease check the India map, its having kashmir chopped off.
రిప్లయితొలగించండినేను రెడీ...
రిప్లయితొలగించండి.
.
నా కళ్ళని కూడా మీ కళ్ళతో కలిపి చూసి వివరించే
యాత్రా విశేషాలని చదవడానికి:):):)
.
.
మీ ఆలోచనలకు అడుగులు వేసి
మీరు ప్లాన్ వేసి ప్రిపేర్ అవ్వండీ!!!
అజ్ఞాత, thank you very much.I did not observe it while posting it. I really hate Google giving a top rank for this image. Image is changed now.
రిప్లయితొలగించండిజయ గారి వ్యాఖ్య. ఏదో కారణాలవల్ల కనిపించడం లేదు. కాబట్టి ఇ-మైల్ నుంచి తీసుకొని ఇక్కడ తిరిగి వ్యాఖ్య పెడుతున్నాను.
రిప్లయితొలగించండి*******************************
మీ యాత్ర డిల్లీ నుంచి మొదలుపెడ్తారా? ఉత్తరాఖండ్ లో చార్ధాం యాత్ర చేయండి. భారతీయ ఆధ్యాత్మికత లో వచ్చిన మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కేరళ పర్యటించండి. మనుషుల్లో మిగిలి ఉన్న స్నేహశీలత వివరంగా అర్ధమవుతుంది. ఆంధ్రా తెలంగాణా మధ్య అనేక ప్రాంతాలు చూడండి. రాజకీయ స్వార్ధం పెరిగి పెరిగి ఒకప్పటి మహనీయుల త్యాగా ల తో ఎలా ముడిపెట్టుకుంటున్నారొ బాగా పరిశీలించవచ్చు. గుజరాత్ లో పుణ్యక్షేత్రాలు కాక మామూలు చిన్న పట్టణాలను ఒక రెండుమూడు చూడండి. మారిన ప్రజా జీవనానికి అద్దం పడుతుంది.
కాశ్మీర్ వదిలేయండి. అక్కడొచ్చిన మార్పంటూ ఏమీలేదు కదా!!! ఓకే, మధ్యలో రెస్ట్ కోసం పొండి. అక్కడ శాంతి లభిస్తే. ఆ చుట్టుపక్కల మంచుప్రాంతాలు కూడా వద్దులెండి. ఇప్పటికే మీ ఊళ్ళోనే మంచులో మునిగిపోయి ఉన్నారుగా :))))
రాజస్థాన్ ఎడారిలో కూడా పర్యటించండి. మన సైనికుల కష్టనష్టాలను పర్మిషన్ తీసుకుని మరీ పర్యవేక్షించవచ్చు. మర్చిపోకండి, పాకిస్థాన్ బార్డర్స్ తప్పకుండా వెళ్ళండి. సింధూనది తీరప్రాంతాలు వీలైతే చూడండి. ఇప్పటికీ మన ప్రాచీన నాగరికత కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఫరువాలేదు అక్కడిదాకా పోవచ్చు. నన్నడిగితే వాఘా సరిహద్దులకన్నా, ఇక్కడే ఎన్నో విషయాలు తెలుస్తాయి. సరిహద్దుల్లో నివసిస్తున్న పాకిస్థాన్, భారతీయులతో మాట్లాడండి. ఈనాటికీ వారి అసలైన కోరిక ఏమిటో చక్కగా చెప్తారు. పెద్దవాళ్ళతో చిన్న వాళ్ళతో, రెండు మతాల వారితో మాట్లాడండి. ప్రజల అసలైన మనోగతాన్ని తెరిచి మరీ వద్దన్నా చెప్తారు.
ఏదైనా కాస్త పుణ్యం కావాలనుకుంటె కాశీకి కూడా వెళ్ళండి. అక్కడెక్కడైనా జారిపడినా, ఉన్నంతకాలం జైనుల లాగా ముక్కు కట్టేసుకొని బతకాల్సి వచ్చినా నేను బాధ్యురాలిని కాదు. కాకపోతే కొంచెం సర్కస్ ఫీట్స్ వస్తాయి లెండి:)
గోవా, యానాం, పాండిచ్చేరి, నాగాలాండ్, మణిపురి తప్పక చూడాల్సినవే. ఆ తరువాత మీ విశ్లేషణ కోసం మేము ఎదురుచూడాల్సిందే:) మా దగ్గిర మణిపురి అమ్మాయిలు వాళ్ళ విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. కొన్నిసార్లైతే వాళ్ళు చెప్పిన ఈ సామాజిక తేడాలు చాలా ఆశ్చర్యమనిపిస్తాయి. నేను ఎప్పుడో అప్పుడు తప్పకుండా ఆ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇవి చూసాక, ఇంకొంచెం మార్పు కావాలనుకుంటే, పడమర నుంచి తూర్పుకి మధ్యలో ఒక లైన్ కొట్టేస్తూ సాంచి, సారనాధ్, నలందా, ప్రయాగ, బోధ్ గయా వెళ్ళండి. చివర్లో గయాకి వెళ్ళారంటే బీహార్ లో లల్లూ సార్‌ని చూసుకుని, మీ మాయావతీ నగరానికి కూడా పోవచ్చు:)
కావాలంటే గోవా తరువాత ఈ లైన్ మొదలుపెట్టి మాయావతి నుంచి నాగాలాండ్ , యానాం, ఆంధ్రా,తెలంగాణ, కేరళ వెళ్ళిపోయి ఆ తరువాత మీఊర్లో కొన్నిరోజులు మీ వాళ్ళతో కాసిని ముచ్చట్లు చెప్పుకొని అప్పుడు మీ దేశం వెళ్ళిపొండి:) పన్లోపనిగా మా నాగర్జునసాగర్ మరిచి పోకండేం.... ఇప్పటికీ పూర్తిగా లోకం తెలియని మనుషులు పాపం, నాలాగే:)
భారత దేశంలో పెట్రోల్ ధరలు చాలా అభివృద్ధి సాధించి ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది. వెళ్ళిపోయేప్పుడు మీ కారు అమ్ముకుంటారో మా లాంటి స్నేహితులకి బహుమతి గా ఇచ్చేసి పోతారో అది కూడా డిసైడ్ చేసుకోండి మరి:))))
భారతదేశపు ద్వారములు మీకై ఎప్పటికీ తెరువబడియే ఉండును....
O.K. All the best. Enjoy yourself. Have a nice time.
పద్మార్పితా నేనూ రెడీ.చూసొచ్చి చెప్తాను :))
రిప్లయితొలగించండిజయగారూ, విలువైన సమాచారాన్నిచ్చారు. దేశం చాలావరకూ చుట్టేసారన్నమాట. ఇంకా ఏమైనా గుర్తుకొస్తే చెప్పండి.
భాస్కర రామి రెడ్డి గారు.. మీ ఆలోచన చాలా బాగుంది. నాకు మీలానే యాత్రలంటే చాలా ఇష్టం..ఇప్పటికే నేను కొన్ని ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేస్తున్నాను. మీతో ఇదివరకు నాకెటువంటి పరిచయంలేదు..అయినా కూడ మీలా యాత్ర చేయాలనే తలంపు ఉన్నది....!
రిప్లయితొలగించండిTry the Jaisalmer desert festival in January.
రిప్లయితొలగించండిDo not miss the port blair and Lakshwadeep islands. I can go and on but will end it now.
Krishnaveni
మీరు భారద్దేశం చుడతారో , లేదో కాని ఈ టపాలోనే భారద్దేశ దర్శనం ఐయ్యేతట్టున్నది వచ్చిన సూచనలు చూస్తూంటే, కడుపు నిండి పోయింది. ఇంకా దేశం తిరగాల్సిన పనే లేదు రెడ్డి గారు
రిప్లయితొలగించండికమల్ చాలా సంతోషం. మీరు తీసిన ఫొటోలు చూసాను. చాలా బాగున్నాయి. ఈ యాత్రకు ప్లాన్ చాలా అవసరము కదా. ఎలా అవుతుందో ఓ రెండు మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. చూద్దాము.
రిప్లయితొలగించండికృష్ణవేణి గారూ మీ సూచన తప్పక దృష్టిలో పెట్టుకుంటాను. ఈ కొంచెము వ్రాసి ఆగిపోయారేమండి. మీకు తెలిసిన విషయాలు చెప్తే నాకేకాకుండా ఇలాంటి ప్రయాణాలు చేయదలచుకున్నవారికి ఉపయోగపడతాయి కదా.
జిలేబి గారూ, ఏంటో మీకు టపా చదివితేనే కడుపు నిండిపోతే ఇక నిజంగా యాత్రచేస్తే ఎలా వుంటుందో కదా :))
ఇంకొక్కటి మరిచిపోయానండి. కోల్కత్తా వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు. శాంతినికేతన్ అండి. కొల్కత్తా నుంచి బరధ్వాన్ ప్రయాణం ఎంత బాగుంటుందో...ఇంకపోతే అక్కడినుంచైతే అస్సలు రాబుద్ధి కాదు. శాంతినికేతన్ లో చదువుకోవాలని నాకెంత కోరిగ్గా ఉండేదో. తీరలేదు:(
రిప్లయితొలగించండిబద్రీనాధ్ దగ్గిర ఇండియా-చైనా బోర్డర్ కూడా తప్పకుండా చూడండి. ఇండియా లో చిట్ట చివ్వరి గ్రామం 'మన ' దాటి విశాలమైన మైదానం నుంచి కొంచెం దూరం నడిచేసామంటే చైనా కెళ్ళిపోవచ్చు:) అక్కడొక్క చోట మాత్రమే మనం సరస్వతీ నదిని చూడగలం. అక్కడినుంచి భూగర్భం లోకెళ్ళిపోయిందని చెప్తారు. ఈ నది మీద, అక్కడే ద్రౌపది కోసం భీముడు వేసిన చిన్న బ్రిడ్జ్ కూడా చూడొచ్చు:)
గంగోత్రి దారిలో ఇండియా-టిబెట్ బోర్డర్ కూడా చూడొచ్చు. అక్కడ కనుమల్లో నడుస్తుంటే ఎంత బాగుంటుందో. అలాగే వెళ్ళిపోతూనే ఉండాలనిపిస్తుంది. పెద్ద వాతావరణ సమస్యలు కూడా ఏమీ ఉండవు. ప్రయాణం కొంచెం కష్టమనిపించినా యమునోత్రి తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. యమునోత్రి గురించి నా బ్లాగ్ లో కూడా రాసుకున్నాను. మరీ పెద్దవాళ్ళమయిపోతే ఈ ప్రాంతాలన్నీ తిరిగే శక్తి ఉండదు కదా!!! కేదారినాథ్ కార్తీక పౌర్ణమి తరువాత విపరీతంగా మంచుకురవటం మొదలవుతుందని ఆరు మాసాలు మూసివేస్తారు. ఉత్సవ విగ్రహాన్ని కింద ముక్తి మఠంలో ఉంచుతారు. కేదారినాధ్ లోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు కైవల్యం చెందారు. ఆ ప్రాంతం కూడా చూడొచ్చు. కేదారీనాధ్ దేవాలయం వెనకాల నడుచుకుంటూ వెళ్ళారంటే జటధారులైన మునీశ్వరులని యోగముద్రలో చూడొచ్చు.
మీరు ఈ పోస్ట్ వేసి అయిపోయారు. ఇంక ఇంతే సంగతులు:) మీ ఇష్టమైన ప్రాంతాలతో పాటు నేను చెప్పినవి కూడా తప్పకుండా చూడండి. ప్లీజ్. ప్లాన్ ఎలా వేసుకుంటారో మీఇష్టం. ఏమన్నా గుర్తొస్తే మళ్ళీ రాస్తానేం:))) బోర్ కొట్టేస్తే సారీ అండి.
జయగారూ, మీరివన్నీ చెప్తుంటే అసలు నేను ఇప్పటిదాకా ఏమేమి చూసానో వ్రాసిపెట్టుకోవాలని పించింది. మొన్న ఈ పోస్టు వ్రాసేటప్పుడే కొన్ని ఊర్ల పేర్లు గుర్తురాక కొన్ని వదిలేసాను. మంచి సమాచారమిస్తుంన్నందుకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి>> మీరు ఈ పోస్ట్ వేసి అయిపోయారు. ఇంక ఇంతే సంగతులు:)
అందుకే గదండి రూటు మార్చి వేరే టపాలేస్తున్నాను :)) JK. మీకు తెలిసిన సమాచారమంతా చెప్పండి.
అయ్యా భారారే గారు, నా పే టెంటు పదమైన జేకే ని మీరు మరీ కాపీ 'రైతు ' మీరి వాడుతున్నారు. మీకు ఇదే నా బ్లాగు కామెంటు పరమైన హెచ్చరిక! ఈ జేకే పదం పట్ల సర్వహక్కులు జిలేబి వె. ఈ పదమును మీరు ఉపయోగిచిన చొ ప్రతి పద ఉపయోగామునకు వెయ్యిన్నొక్క జిలేబీలు కప్పము గా కట్టవలె నని నోటీసు ఇవ్వడమైనది. జేకే - ఇట్లు జిలేబి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభారారే గారు మీకు ట్రెక్కింగ్ చేయడం ఇష్టమేనా..? మీకు కొన్ని హిమాలయాల మీద ట్రెక్కింగ్ గురించి అక్కడి ప్రాంతాల గురించి కొన్ని అంతర్జాలం లింక్స్ ఇస్తున్నాను చూడండి మీకు అటువైపు ప్రయాణం ఆసక్తి వుంటే మీతో నేను కూడ వొస్తాను..! ఇప్పటికే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కూడ వచ్చేవారు లేక....కాస్త సంసయిస్తున్నాను..
రిప్లయితొలగించండిhttp://www.sankarsridhar.com/publish/index.php?x=portfolio&img=1
http://mybioscope.blogspot.com/2010/07/lahaul-spiti-jeep-safari-manali-shimla.html
http://www.sujoydas.com/Nepal-Himalaya/Kala-Pattar-and-Everest-Spring/17107726_DJR2DG#1296375114_mTL3Tks
నేను ఇప్పటికే వీరి నుండి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాను..! ఒక సారి మీరు చూడండి వీటి గురించి.!
http://www.sankarsridhar.com/publish/index.php?x=browse
ఈ కాపీరైటు,కప్పము,నోటీసు..ఈ పదాలన్నీ ఎక్కడో విన్నట్టుంది కదయ్యా/కదమ్మా జిలేబి? :-)
రిప్లయితొలగించండికమల్, మీ ప్రశ్నకు సమాధానమివ్వడానికి నాకు మరికొద్ది రోజుల సమయం కావాలి.
బారారే గారు..మీకొక యాత్ర చేస్తున్న ఒక అమ్మాయి బ్లాగ్ ఇస్తున్నాను చూడండి..! చాలా ప్రదేశాలు తిరిగారు..మీకు పనికి వస్తుందేమో చూడండి..!
రిప్లయితొలగించండిరామిరెడ్డిగారూ మీరు యాత్రలకని ఇటువంటి చోట్లు అని కనుక ఏమయినా నిర్ణయించుకున్నారా? వెళ్ళాలంటే అందరికీ తెలిసిన చోట్లకి వెళ్ళవచ్చు.లేకపోతే off beat destinations చాలా ఉన్నాయి. నాకయితే అవే ఇష్టం. చెప్పమంటే చేంతాడంత లిస్ట్ చెప్తాను. ఆలోచించుకోండి మరి. ఆక్కడ టూరిస్ట్ రష్ తక్కువా "అబ్బా భలే ప్రదేశాన్ని చూసేమే" అన్న ఆనందం ఎక్కువా కలుగుతుంది. ప్రతీ హిల్ స్టేషన్లో ఒక మాల్ రోడ్ని చూడాలంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి.
రిప్లయితొలగించండిక్రిష్ణవేణి.
కమల్. లింకు ఇవ్వడం మరిచినట్టున్నారు. లింకు ఇవ్వగలరా?
రిప్లయితొలగించండిఇక మీరన్న ట్రెకింగ్ గురించి ఆలోచించాను. అంతదూరము వచ్చి ఆ కొద్ది సమయాన్ని ట్రెకింగ్ కు కూడా కేటాయించాలా అని.కాబట్టి ఈ సారికి మీరు, మీ స్నేహితులు కలిసి ప్లాన్ చేసుకొనండి. ఒకవేళ మీరూ ఇదేటైములో చేయాలనుకుంటే మధ్యలో ఏదో ఒకచోట కలుద్దాము.
అజ్ఞాత/క్రిష్ణవేణి గారూ, మీకు మంచివి అనిపించిన ప్రదేశాలన్నింటిని ఇవ్వండి. రోడ్డుద్వారా ప్రయాణం కాబట్టి సాధ్యమైనవన్నీ చూడడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిభారారే గారు..సారీ..కాపీ చేశాను కాని పేస్ట్ చేయడం మరిచినట్లున్నాను.. అదేదో సినిమాలో డైలాగ్ " తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని " లాగ!
రిప్లయితొలగించండినేను కేవలం ట్రెక్కింగ్ గురించి సమాచారమే ఇచ్చాను కాని అదే ఖచ్చితంగా వెళ్ళాలని కాదు..కాకపోతే కొన్ని ప్రదేశాలు ట్రెక్కింగ్ అవసరం లేకుండా తిరగవచ్చు..!
http://www.travelwithneelima.com
రామిరెడ్డిగారూ, నేను అజ్ఞాతని కాను. నా పేరు క్రిష్ణవేణే. కానీ నాకు బ్లోగ్ లేకపోవడం వల్లో మరి ఎందుచేతనో మరి కానీ మీ బ్లోగ్లో నా కామెంట్ పోస్ట్ అవడం కష్టం అవుతోంది. ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించి చూసేను. జి మైల్ ఐడితో మరి దేనితోనూ ఏ విధంగానూ పోస్ట్ అవడం లేదు.
రిప్లయితొలగించండిఇకపోతే మీరు ఊళ్ళు తిరిగి రావాలన్న ఉద్దేశ్యం విహారాలకా, తీర్థయాత్రలకా మరి దేనికైనానా? భారతదేశంలొ ఏ పక్కకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు? అది చెప్తే నేను నాకు తెలిసినంత మట్టుకు చెప్పగలను.
ఇదయినా పోస్ట్ అవుతుందో లేదో మరి.
క్రిష్ణవేణి
అజ్ఞాత కృష్ణవేణీ,
రిప్లయితొలగించండిబ్లాగ్ క్రియేట్ చెయ్యడం చాల సులువు. మూడే మూడ స్టెప్పులు. క్రియేట్ చేసేస్తే ఓ పని ఐపోతుంది. హారం లో చేర్పించండి మీ బ్లాగుని కూడా. ఆ పై మీరు చాలా ఈజీ గా కామెంటవచ్చు. ! probably you are behind some firewall that prevents login into blogging world !
కమల్ లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీలు చూసుకొని చూస్తాను.
రిప్లయితొలగించండిక్రిష్ణవేణి గారూ, మీరు అజ్ఞాతగా వ్రాస్తుంటే ఎవరో వేరేవాళ్ళు మీపేరుతో వ్రాస్తున్నారేమో అనుకున్నాను. జిలేబి గారి వ్యాఖ్యనూ ఒకసారి చూడండి. ఇక నా విహారం లో ప్రధానమైన ఉద్దేశ్యం టపాలో చెప్పినట్టు భారతదేశాన్ని చుట్టడం. జనసాంద్రత కల్గిన ప్రదేశాలతో పాటు విహార యాత్రలు కూడా. ఇప్పటికే నేను ఈ క్రింది ప్రదేశాలు చూసాను.
రిప్లయితొలగించండిపూరి
కోణార్క్
భువనేశ్వర్
పూనా ( చుట్టుప్రక్కల )
ముంబాయి
నాసిక్
జైపూర్
మథుర
ఆగ్రా
ఫతేపూర్ సిక్రి
డిల్లీ
ఖడగ్ పూర్
కలకత్త
మహాబలిపురం
మద్రాసు
ఊటి
బెంగుళూరు
మైసూరు
ఇంకా ఏమన్నా చూసానేమో... తీరిగ్గా కూర్చొని ప్లాన్ చేసేటప్పుడు గుర్తుకు రావచ్చు.
జిలేబీ ఫైర్‌వాల్స్ గురించి మీకెలా తెల్సు చెప్మా???
రిప్లయితొలగించండిఅయ్యా భారారె,
రిప్లయితొలగించండిపురాణీ దేవీ యువతిహి! మూడు సంవత్సరముల మునుపు బ్లాగులోకములో కొచ్చినప్పుడు నేర్చుకున్న జ్ఞానం ! మీ కాలములో ఫైర్ వాల్ అందురు. మా కాలములో అగ్గి బరాటా! వ్యత్యాసము ఏమీ లేదు !
Zilebi,
రిప్లయితొలగించండిపురాణీ దేవీ,ఫైర్ వాల్ = అగ్గి బరాటా.. kevv ani arustunnaa :)) good one.