15, నవంబర్ 2008, శనివారం
కాంగ్రెస్, టి.డి.పి, తె.రా.సా ( ప్రజారాజ్యానికి ఇంకా టైం వుంది) వాళ్ళకి మాత్రమే. సామాన్య ప్రజానీకం ఈ వేద సూత్రాలు చదువరాదు.
ఈ చిత్రం చూస్తే నా మదిలో చిత్ర విచిత్రాలు చిత్రంగా ఒక్కసారిగా సుడులు తిరిగాయి.( బొమ్మ కాపి రైట్ ఆంధ్రజ్యోతి ఆదివారము వాళ్ళది , వాళ్ళూ ఎక్కడో నాలాగే కాపీ గొట్టి వుంటారు లెండి).విషయానికి వస్తే అదుగో బొమ్మలో అందరూ వున్నారు చూడండి. అచ్చంగా నేననుకున్నట్టే , మీరనుకున్నట్టే, మన రాజకీయ నాయకులనుకున్నట్టే వుంది చూడండి. నేను అందరికంటే పైన వుండాలని. మీకు వుందా ఈ సదాలోచన? మరి మీరు నాలాగా పైనే వుండలను కుంటే ఇవిగో నా మూడు సూత్రాలు పాటించండి. రిజల్ట్ తన్నుకుంటూ వస్తుంది.
భాస్కర్ మొదటి సూత్రం ( న్యూటన్ మొదటి సూత్రం లగా) :- క్రింద వాడిని తొక్కి పెట్టండి !
ఎందుకంటే కింద వాడు లేస్తే నాతో పాటి మీ మూతి పళ్ళు కూడా రాలతాయి కాబట్టి వాడిని ఎప్పుడూ లేవనివ్వకూడదు.అందుకని నాతో పాటి వాడిని మీరూ అణగ దొక్కండి.
భాస్కర్ రెండవ సూత్రం : - క్రింద వాడు పైకి చూడకూడదు !!
ఎందుకంటే,కింద వున్న వాడు పైకి చూసి అలోచించడము మొదలెట్టాడనుకొండి మన ముగ్గురి స్థానలు గోవింద.అందుకని వాడికి పైకి చూసే అవకాశము ఇవ్వకుండా మనము మనము ఇప్పటికి ఒకటి.(మధ్యలో ఎన్నెన్ని తిట్టుకున్నా)
భాస్కర్ మూడవ సూత్రం : - పైవాడు పైనే క్రింద వాడు క్రిందే !!!
ఒకవేళ కిందున్నోడు మన మోత భరించలేక చచ్చాడనుకొండి మా ఎదురీంటొడు,నువ్వు నా కింద వుండాల్సిందే.ఎందుకంటే సూత్ర ధారిని నేను కాబట్టి కొత్త సూత్రాలు వ్రాస్తాను.( మిమ్మల్ని మోసం చేయాలంటే కుక్క బిస్కెట్ విసిరేస్తే సరి.తరువాత తీరిగ్గా మళ్ళీ సూత్రాలు అల్లుకోవచ్చు)
ఇలాగే ఈ బొమ్మ ఇప్పటి ప్రపంచ ఆర్ధిక స్థితికి కూడా సరిగ్గా సరిపొతుంది మీరే ప్రయత్నించండి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form