20, డిసెంబర్ 2009, ఆదివారం
అలాగే ప్రియా..........
ప్రియ యామిని మదికౌగిలిలో
కలల కౌగిలి గిలిగింతలు
గిలిగింతల వెచ్చదనంలో
మనసు చెప్పే మూగఊసులు
ఊయలలూపే ప్రియభామిని
మమకార గారాలలో
ఇలలో కలల కౌగిలిలో
అలనై ఎగసి ఎగసి
ఉప్పైనై పొంగి పొంగి
పడిలేచే పరువపు గంగనై
గగన వీచికల వీచు గాలినై
కోకిల గానాన్నై
గానామృత మధువునై
అధరామృత తడినై
చెలి చెక్కిలి ఎరుపునై
తుమ్మెద ఘుంకారమై
మదిలో ఓంకారమై
జగతికి జనగీతికనై
ఇలలో కలలో
ప్రతి మనిషి హృదిలయలో
కలనై కరిగి
జ్వలితనై ఎగసి
నాదామృత జ్ఞానినై
జాతికి జాగృతినై
ఎగసి ఎగసి లయమై
మదిలో మహాగ్నినై
మనసుకు నవనీతమై
యువతరానికి నవ తరానికి
నేటి తరానికి నిన్నటి తరానికి
రాబోయే రేపుతరానికీ
మార్పులేక మాసిపోక
హృదయ లయల అలలపై
అలుపు లేక ఆగిపోక
ప్రతి నిత్యం ప్రసరిస్తుంటాను
నీరెక్కిన కంటికీ
నీలాల కంటికీ
చిగురించిన బ్రతుకుకూ
మోడిన జీవితాలకూ
నేను నిత్యం
నేను సత్యం
ఈ మాయా ప్రపంచంలో
మాయావినై సంచరిస్తుంటాను
పుట్టుక కు మరణానికి మధ్య.
****
భానూదయ కిరణాలే
హృదయ గాన తంత్రులై
మనసున మల్లెలపూయించి
ఉదయిస్తుంది ప్రేమ ప్రతిమనిషిలో
మాటల్లేవు ........మనసున మల్లెలు పూయించినట్టుందండీ!
రిప్లయితొలగించండిBaagundi!
రిప్లయితొలగించండిపరిమళం గారూ నచ్చినందుకు ధన్యవాదాలు. అంతేగదండీ, ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. ఆ మనః స్థితి బట్టి దాని తీవ్రత వుంటుంది.
రిప్లయితొలగించండిసునీత గారూ, నచ్చింది కదా. హమ్మయ్యా.. ఇది నా ప్రెండిచ్చిన ఒక ఇ-మెయిల్ కు సమాధానంగా మొదలైన ఈ కవిత ఓ ఇరవై నిమిషాల్లో ఈ రూపు సంతరించుకొని మీ ముందుకొచ్చింది. :)
ఇంకే నచ్చింది కాబట్టి అమ్మ (మీరు) హిందీలోనికి, చిన్నారి నిషి ఇంగ్లీష్ లోనికి మార్చేయండి మరి
భా.రా.రే చాలా ఐపోతున్నారే... అది..... ఇదీ చాలానే.. ;-) బాగుంది. మొదటి పేరా లో ఆఖరి లైన్ లో
రిప్లయితొలగించండిమనసు చెప్పే మూగఊసునై అంటే బాగుండేది కదా...బాగుంది.
అదే కదా ప్రేమ మహత్తు జగమంతటి లో ఏమైనా అవ్వగలదు...
జగమంతా వెలిగిన్చగల దివ్వె అవ్వగలదు..
అసూయల కంటి మంట గా గుండెల మండించగలదూ..
మీ గాలి మళ్ళింది......
రిప్లయితొలగించండిగుండె ఊసులాడింది......
అలాగే ప్రియా! అని పలికింది
ఏమైనా కవిత మదిని దోచింది
బాగు బహు బాగు మీ బ్లాగు, కవివర్యా.
రిప్లయితొలగించండిఅమాత్యవరా! ఈ కవిగంధర్వునికి మణిమయ రత్న ఖచిత ఉచితాసనం ఏర్పాటు చేయండి.
ఎవరక్కడా, మధువు, మరుమల్లెలు సిద్దం చేసి ఆతని భామినిని తోడ్కొనిరండు. ఇక కవిరాజా, మీరు కానిమ్ము. మా మానసము, డెందము మీ గానమునకై తపియించుచున్నవి... :)
ఇక జన భాషలో - అద్దీ అలా రావాలి కవిత ఉరికురికి వెల్లువై ఎగిసి ఎగిసి ఎద లయని వూపి దూకాలి. భేష్ భేష్
వాహ్ హుజూర్!!!!!!!!!
మన్ కీ బాహోమే చాందినీ కీ రాతోమే,
రిప్లయితొలగించండిసప్నోం కీ తన్ హాయీ
ఇషారోంకి గరిమియా
మన్ మే చిమట్నే లగీ
భావనోకా ఝూలేమె పియాకె సాత్
మమతా కి ధూపేమే
యహా సపనోకి ఝరూకేమె
లేహెరే జైసే ఊంచీ ఊంచీ
సుహానీ గంగా మయ్యాకి తరా
నీలాకాస్ కి సన్నాతో మే హవాకి తరా
కోయల్ కీ బొలే జైసీ
మధుర గానోంకి మధుప్ జైసీ
హోటోన్ కీ అంగారే కి
మెహబూబ్ కి గాలోమే లాలీ
మధుమక్కీ కి ధుని జైసీ
మన్ కా ఓంకార్
ధర్తీకా గాన్ బంకే
సచ్ మే
సప్నోమే
ఆద్మీ కి మన్మే
సప్నా బంకె టూటీ
ఊంచీ ఆగ్ జైసీ
ఇస్ ప్రణవ్ మే రుషి బంకె
జాత్ కి సవెరా హోకె
భా.రా.రె
మీకు 20 నిముషాల కవిత నాకు ఇంతవరకూ చాలా సేపే పట్టింది. అలవాటు లేని పదాలు గుర్తుకు తెచ్చుకుంటూ. ఇంత హోం వర్క్ ఇస్తారా? ఎంత నాకు కవిత్వం రాకపోతే మాత్రం. అందుకే సగం H.W. చేసాను:-)నిషి కి ఇంత భావం అర్ధం కాదు, ఇంగిలీషు లో వ్రాయడానికి.
గమనిక-ఇదేదో సరదగా రాసింది, గ్రామరూ,సరి ఐన పదం కాదూ అంటూ ఎవరూ గోల పెట్టకూడదు
భావన గారూ అదీ, ఇదీ చాలానే "ఐ" పోయాను కదా. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మొదటి స్టాంజా పల్లవి లాగా చదువుకొనేప్పుడు స్లోగా సాగుతుంది కదా, అందుకని "ఐ" లు లేవు :) . ప్రేమ గురించి
రిప్లయితొలగించండిజగమంతా వెలిగిన్చగల దివ్వె అవ్వగలదు..
అసూయల కంటి మంట గా గుండెల మండించగలదూ..
బాగా చెప్పారు.
పద్మార్పిత గారూ, మళ్ళీ గాలి మళ్ళింది, గుండె ఊసులాడి, ఉరికురికి వెల్లువై, సాగిపోతానంటుంది. సునీత కోరిక మీరకు వచనం కుడానూ వుంటుంది.
రిప్లయితొలగించండిఉషారాణీ, మీ అస్థాన కవిగా నిర్ణయుంచి మేము చెప్పేకవితలకు మణిమయ రత్న ఖచిత ఉచితాసనం లతో పాటి మిగిలినవన్నీ ఇస్తుంటే పొంగమన్నప్పుడల్లా మనసుపొంగి పోదా మరి :)
రిప్లయితొలగించండికవిత నచ్చినందుకు థ్యాంక్స్ ఉష.
సునీతగారూ... "నాకు ఎలా కవితలు వ్రాయాలో రావంటూ" ఏం వ్రాసారండీ. నేనైతే ఫ్లాట్. చాలామంది అనువాదకులకంటే వెయ్యిరెట్లు నయం మీరు. అసలా పదాల అల్లిక చూడండి. ఏదో పెద్ద హిందీ కవి వ్రాసినట్టు లేదూ.. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. నిజంగా. ఇందులో శ్లేషలేమీ లేవు.
రిప్లయితొలగించండిఇక నిషిత కంత వయసు లేదని తెలుసండీ. ఊరికే చెప్పాను. అయినా మిమ్మల్ని హిందీ లోకి అనువదించమన్నది కూడా సరదాకే గానీ, మీ అనువాదం చూసాక హిందీ భాషా సౌందర్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
పూర్తిగా వ్రాసేసి బ్లాగులో పెట్టేసుకోండిక. మీ మొదటి కవితగా. మొదటి కామెంట్ మాత్రం నాకు రిజర్వ్ చేసి ఉంచండి.
భా.రా.రే
రిప్లయితొలగించండికవితా బావుంది. మరీ ముఖ్యంగా ఈ పాదాలు
నేను నిత్యం
నేను సత్యం
ఈ మాయా ప్రపంచంలో
మాయావినై సంచరిస్తుంటాను
పుట్టుక కు మరణానికి మధ్య.
కల్పనా
భా.రా.రె--ధన్యవాదాలు. నేనేదో సరదాకి రాస్తే ఇంత గొప్ప మాటలు చెప్పారు.అలానే. వీలున్నప్పుడు అనువదిస్తాను. మొదటి కామెంటూ, కవితకి మూలం మీ పేరుతో సహా..
రిప్లయితొలగించండికల్పనగారూ మీ తొలివ్యాఖ్యకు ధన్యవాదాలు. కవిత నచ్చినందుకు సంతోషం. అలాగే మీకు నచ్చనివి కుడా మీ అనుభవంతో విమర్శించి చెప్తే ఎంతో మేలు చేసిన వారవుతారు
రిప్లయితొలగించండిసునీత మీరు సరదాకు వ్రాసినా నాకు చాలా చాలా నచ్చింది.
బారారె గుంటూరు పిలగాని లీలలు నా సాయసక్తుల బయట పెడతుండాను. నువ్వొక చెయ్యి వెయ్యి. వాడక్కడ వ్యాక్యలు తీసేస్తుండాడు. అందుకని ఇక్కడ కుమ్ము.
రిప్లయితొలగించండిhttp://tammunililalu.blogspot.com/2009/12/blog-post.html
The following comment is exclusively for blagulOkapu tammuDu caartIki gaariki
రిప్లయితొలగించండిfor further details read this post
http://tholiadugu.blogspot.com/2009/12/blog-post_20.html
@caartheek, wow.. Super answer. What a diplomacy, but unfortunately as you rightly described I am a vedhava.
నువ్వన్న దానికంటే పెద్ద పోరంబోకోడ్ని. నీలాగా నైస్ గా అక్కల మాటున కామెంటడం నాకు రాదు. నేను వ్రాసేది అవతలి వారికి వెకిలిగా అనిపిస్తే రెండోసారి నాబ్లాగు గడప తొక్కరనే అనుకునేవాడిని. ప్చ్ కానీ ఇక్కడ కామెంట్ చేసిన ఇంత మందిని చూసాక బహుశా మనసులో ఇంత అక్కసుందేమో నని ఇప్పుడు కానీ తెలియటం లేదు.
నో ప్రాబ్లమ్.. ఇది ఎలాగూ మొదలైంది కనుక... నీలాగా నాకు అక్కల దగ్గర మంచి అనిపించుకోవాలని జిల లేదు కనుక.. నా సమాధానం రేపు చదువుకో. నువ్వెలాగూ ఈ కామెంట్ వుంచుతావో లేదో కనుక నా బ్లాగులో కూడా పెట్టుకుంటానేం. సరేనా ?
అన్నా బాస్కరన్నా, ఇంగ కానీయన్నా.. మనోడు ఇంకోసారి ఇలా చేస్తే నీ వెవరో అందరికీ చెప్తానని ఓ పెద్ద హెచ్చరిక చేసిండు గదా.. ఇంక పగలగొట్టు. ఇలాంటి గొడవలు చూసి చానా ఏళ్ళఎఇందే.
రిప్లయితొలగించండిభాస్కర్ గారు అది మిమ్మల్ని ఉద్దేశించి అనితెలియదు, నిజం చెప్పాలంటే కార్తీక్ ఎందుకు అంత భాధ పడుతుంది కూడా తెలియదు...ఎందుకో హర్ట్ అయ్యాడు కదా కాస్త లైట్ తీసుకోమంటే సరి అని అలా కమెంట్ పెట్టాను.
రిప్లయితొలగించండి:):)దట్స్ గుడ్ అలా నవ్వుతూ గో త్రూ దిస్...
ప్రియమైన బ్లాగర్ నేస్తమా!
అది మీరనుకోలేదు సుమా!
చిరుస్పందనలపై అలుగకుమా!
మనకి ఇంత రచ్చ అవసరమా!
తప్పైతే నన్ను మన్నించుమా!
అన్నీ లైట్ తీసుకో మిత్రమా!
ఈ విన్నపమును స్వీకరించుమా!
పసందైన టపానొకటి పెట్టేయుమా!
భా.రా .రె ఇంకా హాట్ హాట్ గానే వున్నారా .-:)
రిప్లయితొలగించండిపద్మార్పితా ;). కవిత చదివి నవ్వేసాను
రిప్లయితొలగించండిచిన్నీ అబ్బే మనకు అస్సలికి సిగ్గేలేదు. మళ్ళీ హాట్ హాట్ ఒకటి ;)
ఇక హాయిగా మీ "హృదయ స్పందనల చిరు సవ్వడి" ని చదువరుల కనుల విందైన కైతలుగా లిఖించు నేస్తం.
రిప్లయితొలగించండిఉషా, ఈ కవితలొద్దూ పాడు వద్దుకానీ నేనెళ్ళి ఏ గొందిలో నన్నా కూకోని సందులు వ్రాసుకుంటే పోలే :)
రిప్లయితొలగించండిఅద్గది ఆ వూసెత్తుతావా లేదనే ఒ రాయేసా రాయలసీమ బిడ్డా, లెక్క సరీగ్గా సరిపోయింది. ;) ఈ మారేమన్నా రాయి తగిలితే మా మీదకు విసరకే...
రిప్లయితొలగించండిరాయలసీమ బిడ్డా???? ఎప్పుడు అయిపోయావు అబ్బాయ్ ?
రిప్లయితొలగించండిఅయ్యొయ్యో ఉషా నన్నెక్కడ రాళ్ళెయ్యనిస్తున్నా రండీ. విసిరే విసుర్లన్నీ మీరు విసురుతుంటేనూ ;)
రిప్లయితొలగించండిఊషా, భావనా ఏదో అడుగుతుంది చూడమ్మాయ్;౦)
bhasker gaaru nannu kshaminchandi. naaku inka aa mails vathune unnay mee perutho... naaku mundu meeru anna anumaanam kalagaledu tharvatha meeru naa blog lo coment chesinappudu eppudu raaani vaaru naa blog ki vachcharu kada anduke naaku anumaana balapadindi. modati mail lo athanu maatladina theeru mee lane undi. andulo meeru coments lo matlaadina matalu ku dagara aatladi nattu rasthoo aa link add chesi , nenu akkalu bhavinche vaallani andarini chandaalamgaa matlaaaduthoo naaku mail pampaadu.. anduke nannu adi antha theevramgaa badinchindi.... vaadu bayatiki raavalane alaaa chesaanu kaani aa tpa ki anonymous coment raasina vidaanam choosi aa kinda meeru vyakyanincharu kabatti meere anukunnanu. vaadi IP adress nenu trace chesthaanu nannu kshaminchandi naa valla blogs lo andariki chedda peru vasthundi anduke nenu bloging maanedam anukuntunnanu..... nannu kshamisthaarani aasisthunnanu.
రిప్లయితొలగించండిwww.tholiadugu.blogspot.com
భా.రా.రె-మంచి టపా రాయండి.
రిప్లయితొలగించండికార్తీక్ లైట్ తీస్కో భాయ్..అసలు గుంటూరు పిలగానివి క్షమించండి అని అడగొచ్చా.. మనము అసలా పదము ఎప్పుడో ఎంతో అవసరమైతే కానీ వాడకూడదు. ఇలాంటప్పుడు ఇంగ్లీష్ పదం సారీ అని వాడేస్తే చాలు :)
రిప్లయితొలగించండిఅయినా ఏమాటకామాటే ఎర్రమిరపకాయ కారం ఘాటు నషాళానికెక్కించి మొత్తానికి నా చేత డాన్స్ చేపించావు కదా ;). ఇలాంటివి చూసి బ్లాగులు మూసేస్తే ఇక ఇక్కడ ఒక్క బ్లాగు కూడా మిగలదు మరి.
సునీత గారు మీరడిగాక వ్రాయకుండా వుంటానా? :)
రిప్లయితొలగించండిచప్పట్లు! భా.రా.రె. గారూ, మీ స్పందన చాలా హుందాగా ఉంది.
రిప్లయితొలగించండిఎంటి కార్తీక్ .. ఉంటే పూర్తి గా పైనా లేక పూర్తిగా కిందా.. మద్యలొవుండవా.. బ్లాగ్ ముసేయడం ఎందుకు? అలా అయితే భాస్కర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏ బ్లాగులు వుండవు.. నువ్వు అన్ని మర్చిపొయి మాములుగా కంటిన్యూ అయిపో..
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిCarthik, to me, it is past and it deserve nothing [ keep on discussing on it]. just trash your thoughts and keep going.
రిప్లయితొలగించండి