ఇది లాస్ట్ వీకెండ్ స్నోపడిన రోజు వ్రాసుకున్నా కానీ అనివార్య కారణాల వల్ల ప్రచురించలేదు. ఇదిగో ఈ రోజు తీరిగ్గా ఇలా ...
అర్థరాత్రి వెలుగెపుడైనా చూసారా
పుడమి కాంత కాంతి నెపుడైనా కన్నారా!
మల్లెపూల మాలతురిమి
చెంగల్వపూల చీర కట్టి
వేపపూల రవిక తొడిగి
హొయలొలికే అతివను కన్నారా?
అనంత ఆకృతి తాండవాన
జాలువారిన జాజులనెపుడైనా చూశారా?
జారిపడిన జాజుల పరిమళం
కాశ్యపి ఎదలో లయమవడం కన్నారా?
ఇల చేరిన మంచు విత్తులు
పాల పుంతల పంటపండించినవట
అవని కాంత స్ఫటిక తళుకులద్దుకుని
వేయిగజాల పెళ్లిచీర చుట్ట బెట్టుకుందట!
సిగ్గులొలుకు భువనేశ్వరి
సింగారి శ్రీలక్ష్మి
నడిరాత్రి నడిచింది
తారాజె రాజని.
ముందుగా చప్పట్లు. ;)
రిప్లయితొలగించండిమంచు మొగ్గలు పరిచిన
వెచ్చటి పక్కలు సిద్దమా
నిత్య యవ్వన జవ్వనీ
ఓ నేలకాంతా?
విభుని చేరగ తహతహలా
శుభ ఘడియల సన్నాహాలా
ఋతురాగాల సరాగాలా
సరసయామిని రేయి సల్లాపాలా
మీ ఫోటో మాయమైంది
రిప్లయితొలగించండిహృదయం అక్కడ చేరింది
అర్థరాత్రి అమ్మాయి నడిచింది
మీ హృదయం పులకరించింది
చిరుస్పందనలతో వెల్లడించింది
మాకు భలే భలేగా నచ్చేసింది:):)
మరువం ఉషగారి కన్నా గట్టిగా నా చప్పట్లు..
రిప్లయితొలగించండిభా.రా.రె. గారూ !
రిప్లయితొలగించండిమీరు మాకు పంచిన అమృతం మీ భావవాహిని . అభినందనలు. దానికి జోడించిన ఉషామృతం అద్భుతం. వారికి కూడా అభినందనలు.
Wow..! Good Show. !
రిప్లయితొలగించండిచాలా బాగుందండీ..
రిప్లయితొలగించండిభా.రా.రె--బాగుంది.కాస్త వచనంలో కూడా రాయండి. మంచు పడినప్పుడు బాగానే ఉంటుంది. అది గడ్డ ఐయ్యాకే నరకం చూపిస్తుంది. ఏంటో మీ కవిత చదివాక మంచు కూడా బాగానే ఉందనిపిస్తుంది.
రిప్లయితొలగించండి@మురళీ గారు, ;) అవునండీ ఆ ఎత్తుగడ ఎందుకటా, "మరువం ఉషగారి కన్నా" అని? "సరిలేరు నాకెవ్వరూ నెమలికన్ను మురళీగారు, మంచు కైతలు ముదమార చదవగ, మురిపెపు భావనలు ముద్దారగ తెలుపను" :) మీకు కూడా చప్పట్లు.
రిప్లయితొలగించండిఉష & మురళి ఇద్దరికన్నా ఘాఠ్ఠీగా చప్పట్లు :-) చాలా బాగుంది భారారే. ఫోటో కూడా చాలాబాగుంది.
రిప్లయితొలగించండిచాలా బాగుంది భ.రా.రె. ఎడ తెగని మంచు పేర్చిన పూల చిత్రం.. తమ్మి పువ్వుల మీద తళుకు లద్దేను.. తళు కు వెన్నెల మీద వలపు వంచేను వలపు పిలుపుల రేడు రాలేదు నేడని మంచు గాలుల తోటి కబురు పంపేను రాడేమొ రాడేమి నాయుడు బావ ఎంకి తలపులనే ఏలుకొనగా.. ;-)
రిప్లయితొలగించండిkaasyapi edalo layamavvadam kannaara?
రిప్లయితొలగించండిnot able to understand. can u explain?
Wow..beautiful
రిప్లయితొలగించండి"అనంత ఆకృతి తాండవాన
జాలువారిన జాజులనెపుడైనా చూశారా?"
చూసాను, చూస్తుంటే ఆ అందం తనివి తీరా గొంతు నిండా అనుభవించాలని ఆశ పడ్డాను..కాని అలుపెరగక కిటికీ లోంచి అలాగే చూస్తూ ఉండి పోయాను.
జారిపడిన జాజుల పరిమళం
కాశ్యపి ఎదలో లయమవడం కన్నారా?
ఎస్. ఎస్సెస్. నేను ఆ ఎద లోకెళ్ళి నన్ను నేను కప్పుకోవలని కూడా ఆశ పడ్డాను. తెల్లారి ఎప్పుడో ఎండ కాసినప్పుడు అనతంగా కొన్ని ఎకరాల మేరా 22 ఇంచుల మెత్తటి, స్వచ్చమైన పడకలో పిల్లలు వెల్లకిలా పడుకొని సూర్యుణ్ణి కేసి చూస్తూ సంభాషిస్తున్నప్పుడు నేను వాళ్ళలో భాగం కావాలని గింజుకున్నాను.
అవేవి చేయక పోయినా, కనీసం అలాంటి ప్లేస్ లో కదల్లేకుండా 30 గంటలు ఇరుక్కుపోయినందుకు కనీసం కృతజ్ఞతలు చెప్పుకున్నాను నా ఫేట్ కి.
ఏనీవే, బాగా రాసారు భాస్కర్ గారూ. బ్యూటిఫుల్.
ఉష, కవితకు పొడిగింపుగా మంచి వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు. చప్పట్ల దెబ్బకు ఎక్కడో చెంప పగల బోతుందట :)
రిప్లయితొలగించండిపద్మార్పితా, నా ఊహాసుందరి నచ్చినందుకు నెనరులు. :)
మురళీ గారూ చప్పట్లు వినిపించాయి. ప్రతిధ్వనించాయి కూడా :). ఇప్పుడు తిరుగు చప్పట్లు నావంతు :)
రిప్లయితొలగించండిరావు గారూ, బహుకాల దర్శనం. మీ వ్యాఖ్య కు చాలా సంతోషం.
సుజ్జీ, తృష్ణ గారూ నచ్చినందుకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిసునీత గారూ :-), ఆ నరకాన్ని ఆల్రెడీ అనుభవిస్తున్నాం :)
ఉషా, ఏదో మీ కవితా పొడిగింపుకు కూడా మురళి గారు చప్పట్లు కొట్టారని అర్థం చేసుకోరూ ;)
రిప్లయితొలగించండివేణూశ్రీకాంత్ గారూ, మీరలనా ఘట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పటి దాకా బానే వుంది :)
అనూ ఎవరబ్బా మీరు? ??? ? కాశ్యపి అంటే భూమి అని.
రిప్లయితొలగించండి>>కాశ్యపి ఎదలో లయమవడం కన్నారా? అంటే భూమి మీద అప్పుడే పడి కరుగుతున్న మంచును ఊహించుకోండి.
భావనా ఎంతబాగా పొడిగించావు?చాలా బాగుంది. ఎదురుచూపుల ఎంకి సంపంగె కోసం నాయుడు బావ ఎక్కడున్నా వచ్చేస్తాడు కదా ;)
రిప్లయితొలగించండికుమార్ గారూ ఇలాంటి దృశ్యాలు ఒంటరి జీవితంలో కాకూడదండీ. ఇలా చిక్కుకు పోయే పరిస్థితి వస్తే నేచర్ యొక్క నిజరూపం కళ్ళకు కడుతుంది కదా! ఎంత దయనీయమైన అనుభవమో కదా :(. ఇంతకీ ఎప్పుడు, ఎక్కడ ఎలా ఇలాంటి విషమ పరిస్థితిలో చిక్కుకున్నారు?
రిప్లయితొలగించండిఅద్భుతంగా వుంది.
రిప్లయితొలగించండిభా.రా.రె. గారికి, ఉష గారికి అభినందనలు.
హా! అటువంటి అతివలు ఎందరో నాకు పరిచయం. నా కలలలో ...
ముందుగా అభినందనలు.నెట్లో విహరిస్తూ వుండగా అనుకోకుండా చదవగానే చిన్న సంతోషం.తొలకరి జల్లును ఆస్వాదించినంత.
రిప్లయితొలగించండిఇంకా మనసుని తాకేవి రాస్తారని, రాయలని అభిలషిస్తూ(అనూ)
ఫణి గారూ మీ అభినందనలకు సంతోషం. మరీ అతివలను ఎక్కువ ఊహించుకోకండి. నిద్ర కలత నిద్రగా మారి కలవరించ గలరు :)
రిప్లయితొలగించండిఅనూ గారూ, మీప్రోత్సాహానికి కృతజ్ఙతలు.
ప్రయత్నిస్తాను.
భా.రా.రె. అవునూ మళ్ళీ పుటో మార్చారే ;) అయినా యేదో సంధి చేయటానికి చూస్తున్నారు గానీ నేనొల్ల. సరీగ్గా సదవండే ఆ మురళీ గారేమన్నారో, యేదో మా జిల్లానే అని చూసీచూడనట్లు వదిలేసాలెండి. ;)
రిప్లయితొలగించండివేణు గారూ, మీకిక తలంటే.. :)
సరేగానీ జనులారా మరొక చెయ్యి కావాలి. నాకన్నా, మురళీ గారి కన్నా, వేణు కన్నా గాట్టిగా చప్పట్లు కొట్టాలి. అప్పుడు నలుగురు మెచ్చిన మా భా.రా.రె. కైత అనిపించాలి.
శభాష్ నేస్తం, మీ కవిత మాత్రం చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నానంటే ఎందుకో తెలుసు కదా! :) ఎందుకంటే అంతే!
ఉషా, మళ్ళీ కామెంటు వ్రాసావు కదా, అంతకు రెండింతల ప్రతీకారం తీర్చుకుంటాను చూడు :)
రిప్లయితొలగించండిఈ కక్షలేమిటో, ప్రతిజ్ఞలేమిటో - యే గాలి పీలుస్తున్నారు? ;) అయినా ప్రతిఘటన లోని వీరోయిన్ను తెల్దా యేటి, సాప కింద నీరుమాదిరిగా ఇలన్ని యేసేత్తది. ఇలా సెప్పి కాదబ్బి, చేసి చెప్పాల. :)
రిప్లయితొలగించండి