24, మార్చి 2010, బుధవారం
చేద్దామా రామనవమి! జనరంజక రామనవమి!!
భానుకులదీపం రణరంగ సుధీరం
సదాచార సంపన్నం సుజ్ఞాన విరాజితం
ఇనకులాత్మజం మునీశ్వర సంరక్షం
సత్య సల్లాపం ధర్మసంచారం శ్రీ సీతారామం
చేద్దామా రామనవమి
ఇత్తడి మనసుకు బంగారు తాపడమద్ది
బొక్కలు పడ్డ గోడకు ఎర్రని మట్టి పులిమి
కాగితప్పూల మాలల పందిరిలో
నల్లడబ్బు హోమాలు జరిపి
రామభక్తి పారాయణం చేద్దాం
పవిత్ర భారతంలో వెలుగు చిమ్ముదాం
భక్తవత్సలం జానకీనాధం దేవం
భవ భయ హరణం హనుమంతాత్మజం
కంటికో చూపు
కన్ను పొడిచినా చెరగదది
మగాడికో మీసం
ఎంత నరికినా తెగదది
మనిషికో బుద్ధి
పుఱ్ఱె పగిలినా మారదది
దశరథసుతం ధరణీజనప్రియం
నీల మేఘచ్చాయం సుందర రూపం
చెట్టు చాటున నిత్య సన్మార్గులు
సంతూర్ స్నానాల్లో సాంగోపాంగాలు
కులుకులొలికి మరో చారుశీల
శీలమమ్మి "శ్రీ" ని బంధించింది
రూపం మార్చి మరో దుర్మార్గుడు
రూపవతుల రూపు మారుస్తున్నాడు
గీత/రాత గీసి/రాసి మరో అజ్ఙాని
అంపశయ్య పూలపాన్పని భ్రమిస్తున్నాడు.
తాటక ప్రాణ విదారణం రామం
రావణాసురాది సంహారీ రాఘవం
శబరీహృదయసంచారి సీతామనోవల్లభం
శరణాగతవత్సలం భక్త జన శమంతకం
జీవన గీతాన్ని కలిపి రామగాన సుధామృతమును పంచినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీరాముని దయ చేతను ఇలలో సమకూరని శుభము కలదే అని ప్రార్ధించే మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసుధలు కురియు స్తోత్రనామాలు,
ముదము నిచ్చు పూజావిధులు.
సుఖశాంతుల జీవనగతులు,
ఇలలో మన సాంప్రదాయాలు.
భాస్కర రామిరెడ్ది గారూ !
రిప్లయితొలగించండిబావుంది. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మీ కవిత చదివాక మనసులో ఓ పక్క తెలియని ఆనందం, మరొక్క వైపు తెలియని బాధ. బాగుందండి. మీరు పత్రికలకు రాస్తే చూడాలని వుంది.
రిప్లయితొలగించండిమరీను మాకు అర్ధం కాని భాషలో రాసేస్తే ఎట్లనండీ .....కాస్త మావంటి వారిని దృష్టిలో పెట్టుకుని రాయాలి
రిప్లయితొలగించండి@విమల, రామగానం ఆస్వాదించినందుకు ధన్యవాదాలండి
రిప్లయితొలగించండి@ఉషా, పూజావిధాలు జీవన గతులకు ప్రతిబింబాలు కదా. అందుకే మన సాంప్రదాయాలు కూడా జీవిత సారం నుండి పుట్టి, జీవి ప్రయాణం తో పాటుగా మార్పుచెందుతూ ప్రయాణిస్తాయి.వ్యాఖ్యకు ధన్యవాదాలు నేస్తం.
@ఎస్ ఆర్ రావుగారూ మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.ఈ పండుగ మీకు వెలుగునింపుతుందని ఆశిస్తూ....
రిప్లయితొలగించండి@రాజేశ్వరి గారూ, బహుకాల దర్శనము సుమా :), పండుగ రోజుకదా ఇంతకీ మరచెంబు తీసుకొని రామాలయానికి పానకం, వడపప్పు కోసం వెళ్ళారా?
శ్రీరామనవమి శుభాకాంక్షలు
@చిన్నీ, అలా కాదుగానీ మరో మాట చెప్పండి. తెలుగును తెగ చదివిన మీకే అర్థంకాలేదంటే మనము రాసినదానికి అర్థమే లేదని వెక్కిరింతా?
శ్రీరామనవమి శుభాకాంక్షలు మిత్రమా.
బాగుంది భా.రా.రె. మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.మనిషి మారనంత వరకు మనుగడ రీతులను సరళం చేసుకోనంత వరకు నవము లెన్ని వచ్చినా కల్యాణాలెన్ని జరిగినా నిత్య దరిద్రమే జీవితం నిండా.
రిప్లయితొలగించండిపైన పెట్టిన ఫొటో బాగుంది. వెరైటీ గా హనుమంతుడు కూడా ఫొటో కోసం పూర్తి గా ముందుకు తిరిగి రాముడికి వీపు చూపిస్తున్నాడే? ఎక్కడ దొరికింది ఈ ఫొటో. :-)
భావనా మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముని/సీతమ్మ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఏపాటి?
రిప్లయితొలగించండిఅవునూ, పైన బొమ్మలో మీకలా అనిపించిందా..నిజమే సుమా, నాకైతే రామ భజన చేస్తూ భక్తులను పాడమని చెప్తున్న హనుమంతులు కనిపిస్తున్నారు :)
వో అలానా భక్తులను పాడమంటున్నారా సీతమ్మ ను పాడమన్నుట్లుంటేనూ..... (చేయి ఆమె వైపు చూస్తున్నట్లు వుంది మరి). వూరుకోబ్బాయి అసలే హనుమంతుడే ముందు తరానికి బ్రహ్మ అంట కోపమొచ్చుద్ది ఆయనకు.
రిప్లయితొలగించండిఏవిటండీ తెలుగును తెగ చదివానా ! మీకంటే! ఏదో ఉజ్జోగం కోసం ఆ మూడేళ్ళు మురుసుకుని మూలపడెసాను..పనయ్యాక :-)
రిప్లయితొలగించండినిజంగా సంస్కృతం ప్రాకృతం (హి..హి .)కలసి వుండేసరికి .
భా.రా.గారూ, రామామృతం పంచినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీరామనవమి శుభాకాంక్షలు.
అనూ