వేకువ వెలుగులు - 12 By భావన
పరుగు పరుగున పనులు చేసి, నిదుర కాచి, కలత కలలకు కొలువు తీరిన జాబిలమ్మ కు శుభో దయమని పలకనా....
నిదుర తీరి వెలుగు జిలుగులు పంచ వచ్చిన సూరీడుకు స్వాగతమని శుభోదయించనా ....
స్వగతాల స్వాగతపు తోరణాల కలిమి చెలిమి కి కాపు కాయనా....
అల్లనల్లన నిదురకు వేళైన చెలిమి కు జోల పాడనా. శుభో దయాల జోల పాటల తెర ను తీసిన తరుణమిదే....
వెలిగిన మనసులకు స్వాగతమిదే....
శుభోదయం భావనగారు .బాగుంది .
రిప్లయితొలగించండిమీ కవితలు చాలా బాగున్నాయండీ ...
రిప్లయితొలగించండి