అలక కన్నుల కావేరీ
కొలను నిండినది చూడు దేవేరీ
కలికి చిలక అలలపై అల్లిన
ప్రేమ పంజరం నవ్వినది చూడు నయగారి
తోరణాల అలంకార తోపులోన
త్రోవ త్రోవ వెదికి చూసితినే
తప్పి పోయిన ప్రియురాలెక్కడని
కొమ్మ రెమ్మల ఊపి అడిగినా
చెట్టు పుట్టల తరచి అడిగినా
జాడలేదు నీ జాజిమల్లి
వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెతకమన్నవి
కొండనడిగితి కోననడిగితి
కొండమీది మబ్బునడిగితి
సెలయేటి ధార నడిగితి
గాలిలోని పద్మపరాగము నడిగితి
ఎచటనుంది ముగ్ధమోహిని యని
ఎచట వెతికినా వలచి వగసినా
సిగ్గుదొంతర సిందూర పువ్వు
కానరాక కలియదిరిగితి
కానలందు కోనలందు
అలసి సొలసి ఇల్లు చేరితి
రాత్రి కరిగి పాలి పోయెను
నిద్రమత్తు వదిలిపోయెను :))
హియర్!హియర్! కవిత చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంతకీ అలిగింది అసలు "కవిత" నా లేక మీ "కవితా" కవితానా?
రిప్లయితొలగించండిNenu ithe alaga ledandi babu....Me kavitha Super..
రిప్లయితొలగించండిబావుంది.
రిప్లయితొలగించండిసునీత ఇది చదివితే అర్ధం కాలేదా? అలిగింది ఎవరో? పులిహోర కలిపే ప్రయత్నంలో వెలువడిన ఈ అందమైన కవిత ఏ కవితను అలరించడానికో??
ఇంతకూ మీ ప్రియురాలు దొరికిందా . బాగుంది
రిప్లయితొలగించండిసునీతా, వింటున్నా వింటున్నా.. మీకేదనిపిస్తే అదేనండి. అలాంటి సీక్రెట్స్ నాచేత చెప్పిద్దామనే ;-)
రిప్లయితొలగించండికవితా, హమ్మయ్య మీరు అలగలేదు కదా ఎంత మంచివారో :-)
కవిత నచ్చినందుకు బోలెడు థాంకులు.
జ్యోతీ ;)మీకు అర్థమయితే మీ మనసులోనే వుంచుకోండి. ఇలా అందరిముందు గోల గోల చేస్తే ఈసారి పులిహోర మీరే తినాల్సి వస్తుంది ;-)
రిప్లయితొలగించండికవిత నచ్చినందుకు ధన్యవాదాలండి
భాను... ఎక్కడండి ఊరికే దొరికితే లాభమేముంది :D
కవిత నచ్చినందుకు మీకు కూడా మరిన్ని థాంకులు
ఎక్కడ వెతికి వచ్చారు మీ కవితా మోహిని ని, మన్హాటన్ లోనా ఎడిసన్ రోడ్ల మీదా? ఇంట్లో వెతుక్కోకుండా అటు ఇటూ తిరిగితే మరి అలానే నిద్ర మత్తు ఎగిరి పోతుంది టెంకి జెల్ల తో.. ;-)
రిప్లయితొలగించండిభావనా మరేమో
రిప్లయితొలగించండిపెన్సిల్వేనియా కొండల్లో వెతికినా దొరకలే
న్యూయార్క్ జలపాతాలో వెతికా దొరకలే
న్యూజెర్సీ ఉద్యానవనాల్లో వెతికా దొరకలే
ఇక ఈ ఫాల్ సీజన్ లో న్యూ హేమ్షైర్ రంగుల్లో వెదకాలి :))
mee abhinandanalaku dhanyavaadaalu meeku koodaa panduga subhaabhivandanaalu !
రిప్లయితొలగించండిmee kavita bavundandi. mee subhaaseesulaku maa dhanyavadamulu. meeku kooda vinayaka chavithi subhaakankshalu.
రిప్లయితొలగించండి