5, సెప్టెంబర్ 2010, ఆదివారం
గురుపూజోత్సవ దినాన నాగురువుల గురించి.
అందరి గురుపూజోత్సవ ఆర్టికల్స్ చదివాక నాకు మనసులో ఎప్పటినుంచో గూడుకట్టుకున్న నా గురువులకు ఆత్మసాక్షిగా నేనర్పించుకొనే ప్రణామాలివి. అక్షరాభ్యాసం మొదలుకొని ఉన్నతాభ్యాసం దాకా నా ఆలోచనలను, సమాజ పోకడలను ఎప్పటికప్పుడు నాకు నూరిపోస్తూ ఈరోజు నాకాళ్ళపై నేను నిలబడడానికి నాగురువుల మార్గదర్శకత , శిష్యుల పట్ల వారి స్వచ్ఛమైన ప్రేమ ఎన్నటికీ మరువలేను. ఆనాటి గత స్మృతులు మనసు పొరల్లో ఆవిరైపోకుండా ఈనాటిదాకా గుర్తున్నాయంటే వారు నా మీద వేసిన ముద్ర అలాంటిది. ఈ రోజుకున్న ప్రాముఖ్యతను సంతరించుకొని నాలో రేగిన గురు ప్రేమ మాలిక కు అక్షర రూపం ఈ చిన్న వ్యాసం.
మొదటిగా నేను తలుచుకొనవలసిన వ్యక్తి మా పెద్ద చిన్నాయన వేంకట సుబ్బారెడ్డి గారిని. ఆరేళ్ళు నిండినా అక్షరం ముక్క రాకుండా ఊర్లో బఱ్ఱెల వెంట, వాటి తోక పట్టుకోని వాగుల్లో ఈతకొట్టడం కార్యకలాపాలతో మహా సరదాగా గడుపుతున్న బాల్యాన్ని రెండే రెండు నెలల్లో ఒక గాటన పెట్టగ్లిగారు. అప్పట్లో మా చిన్నాయన అంబవరం [ ప్రకాశం జిల్లా దర్శిగుంట పేటకు దగ్గర ] హైస్కూల్ లో తెలుగు పండిట్ గా ఆరు , ఏడు తరగతులకు చిన్న తెలుగు అయ్యవారుగా పాఠాలు చెప్తుండేవారు. ఇంట్లో అమ్మ నాన్నల మాట వినకపోవటం, మాఊర్లో సరైన పాఠశాల లేకపోవడం కారణంగా ఎండాకాలం సెలవులు ఇంక రెండు నెలల్లో ఇస్తారనగా నన్ను మా చిన్నాన్న తీసుకు వెళ్ళారు. స్వతహాగా ఆయనకు తెలుగు పట్ల ఎంత మక్కువో లెక్కల పట్ల అంతకంటే ఎక్కువ మక్కువ. నాకు ఇప్పటికి గుర్తు నా మొదటి పలక పై నాకు వ్రాసి ఇచ్చిన వర్ణం. అది "ఓం" . ఆరోజు దాన్ని రుద్దిన తరువాత తీసుకెళ్ళి ఒకటవ తరగతి లో చేర్పించారు. పాఠశాలకు సెలవులివ్వడానికి రెండే నెలలు. ఇంకొద్ది రోజుల్లో ఒంటిపూట బడి మొదలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండే రెండు నెలల్లో నాకు వర్ణమాల మొత్తం నేర్పించడమే కాక, నాలో పలికేటప్పుటు ఉద్భవించే అనేక ధ్వని దోషాలను సవరించి తెలుగు అజంతా భాషపట్ల మక్కువ ను నా చిన్ని బుఱ్ఱలో నాటుకు పోయేట్టు చేయగలిగిన నా మొదటి గురువు. అలాగే తరువాతి మూడు నాలుగు తరగతుల్లో లెక్కల విషయంలో కూడా వైవిధ్య పూరితమైన లెక్కలతో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం మొదలైన మూల విషయపరిజ్ఞానాన్ని ఇచ్చిన లెక్కను ఏరకంగా ఆలోచించి సాధించాలో లాంటి విషయాల్లో క్షుణ్ణంగా తీర్చిదిద్దారు. ఈ చిన్నాన్న చలువ వల్లే నాకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండ లో సీటు వచ్చింది. అమ్మనాన్నలు నన్ను దూరంగా వుంచడానికి ఇష్టపడకపోవటంతో చేరలేదనుకోండి అది వేరే విషయం.
ఇక నాలో పురాణాల పట్ల ఆసక్తి ని కలిపించిన వారు నాగిరెడ్డి మరియు నరశింహ రాజు గారు .వీరు నాకు ఒకటినుండి నాల్గవతరగతి వరకు గురువు గారు. ఎన్నో కథలను అభినయిస్తూ చెప్పేవారు. పద్యాలను సుస్వర భరితంగా పాడేవారు. అర్థం కాకున్నా సరే నేర్చుకొని పాడాలన్నంత కోరిక కలిగేది.నాగిరెడ్డి గారి ద్వారా భారత, భాగవత, రామాయణ కథలలో మూల సూత్రాలను చాలావరకు తెలుసుకోగలిగాను.
ఇక్కడ నా విద్యాభ్యాసం నాలుగు తరగతుల వరకు మాత్రమే సాగింది. వివిధకారణాలవల్ల ఐదవతరగతి చదవడానికి మా రెండవ చిన్నాన్న దగ్గరకు వెళ్ళాను. వారిపేరు కూడా సుబ్బారెడ్డిగారే. వీరు సింగరాయకొండ పరాశరభారతిలో [ ప్రైవేట్ స్కూల్ ] హెడ్మాష్టర్ గా చేస్తుండేవారు. వీరిదగ్గర చేరాక పట్నపోకడలు ఎలావుంటాయో మొదటిసారిగా తెలిసాయి. అప్పటిదాకా కాళ్ళకు చెప్పులైనా లేకుండా స్కూలుకు వెళ్లేనాకు ఒక్కసారిగా కాళ్ళకు బూట్లు, మెడకు టై, పుస్తకాలకు అల్యూమినియం పెట్టె, మధ్యాహ్న భోజనానికి కేరియర్.. వహ్.. నా ఆనందం చెప్పనలవి కాదు.అప్పటిదాకా నేను చూసిన సినిమాలు మహా అయితే మూడో నాలుగో వుంటాయి. కానీ నేను ఐదవతరగతి చదివేటప్పుడు అనగా కేవలం తొమ్మిది, పది నెలల్లో చూసిన సినిమాలు అక్షరాలా ముప్పై [ ఈ రికార్డును తరువాత ఆరునెలల్లో ఎనభై సినిమాలు చూసి బ్రేక్ చేసాననుకోండి. అది వేరే సంగతి ]. అంటే ఒక చిన్న పిల్లవానిగా సినిమాల ద్వారా ప్రపంచం అంతా చూశానని చెప్పవచ్చు. ఇక చదువు విషయానికొస్తే ఈ చిన్నాన్న ద్వారా సైన్స్ ను నేర్చుకోగలిగాను. పట్టాభి మాష్టారు ద్వారా సంస్కృతం కొంతవరకూ నేర్చుకోగలిగాను. అప్పట్లో మాకు బాలకాండము సంస్కృత పాఠ్యాంశంగా వుండేది.
అన్నదమ్ములు విడి పడటంతో ఆరవతరగతి నుండి పదవతరగతి వరకు నావిద్యాభ్యాసం వెలిగండ్ల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇది మాఊరినుంచి ఒక మూడు కిలోమీటర్లదూరం. ఈ పీరియెడ్ అంటే ఈ ఐదు సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. బాల్యాన్ని బాగా ఆస్వాదించగలిగాను. స్కూల్ పెద్దదే కానీ టిచర్స్ అంత మంచివాళ్ళు వుండేవారు కాదు. కానీ నా అదృష్టం కొద్దీ నేను ఎనిమిది లో వుండగా లెక్కలు చెప్పటానికి చినకోటయ్య మాష్టారు గారు వచ్చారు. ఈ మాష్టారు ఈనాటి నాస్థితికి కారణమని చెప్పుకోవచ్చు. లెక్కలను అద్భుతంగా చెప్పేవారు. చెయ్యకపోతే దండనా అలాగే వుండేది. నాకు చాలా ప్రియాతి ప్రియమైన టీచర్. పొద్దున పదికి స్కూల్ అయితే ఒక గంట ముందుగా వెళ్ళి ట్యూషన్ చెప్పించుకొనేవాడిని. వెలిగండ్లలో ఎండాకాలమొస్తే పాలు దొరికేవి కావు. నాకిప్పటికీ గుర్తు. మాకున్న గేదెల్లో ఇచ్చే లీటరు పాలతో నీళ్ళమజ్జిగ ఒక కేరియర్ లో తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడిని. అందులో నిజానికి మజ్జిగ ఎక్కడో అడుగున వుండేవి. కానీ ఆ టీచరు వాళ్ళు అవే పరమానందంగా తీసుకొనేవాళ్ళు. ఎండాకాలంలో పాలకు అంత గడ్డు పరిస్థితి. ఇంతకీ ఈ మాష్టారు ట్య్యూషన్ చెప్పినందుకు పైసా తీసుకొనేవారు కాదు. నన్ను చూసి ఓ పదిమంది విద్యార్థులు రావడం మెదలు పెట్టారు. అయినా సరే ఫ్రీ ఎడ్యుకేషన్. అంతటి మహానుభావుడు ఆయన. ఈయన చలువవల్లే పదవతరగతిలో నేను పాస్ కాగలిగాను. లెక్కలు [ చిన్నకోటయ్య ] , తెలుగు [ వేంకట సుబ్బారెడ్డి] , హిందీ [ పాపిరెడ్డి ] టీచర్స్ తప్పించి మిగిలిన పాఠ్యాంశాలకు సరైన ఉపాధ్యాయులు లేరు. ఉన్నారేమో కానీ నాకు నచ్చలేదు.
ఇక ఇంటర్మీడియేట్ కనిగిరి జూనియర్ కళాశాల. అన్నట్టు ఇక్కడ చాలా రాచకార్యాలనే నడిపానండోయ్ ;-). ఈ జూనియర్ కళాశాలను ఎప్పటికీ మరువలేను. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ శక్తివంచన లేకుండా బాగా చెప్పేవారు. ఫిజిక్స్,కెమిష్ట్రీ పెద్దగా అర్థమయ్యేది కాదు. కారణం నాకు బేసిక్స్ లేవు. కానీ లెక్కలకు కీర్తిశేషులు బంగారు రెడ్డి అని వుండేవారు. ఎంత క్లుప్తంగా ప్రాబ్లమ్ ను ఎలా సాల్వ్ చెయ్యాలో నేర్పారు. one of the best teacher I have ever seen.
ఇక బేసిక్స్ పడిన తరువాత పైచదువులలో పునాదిపైన ఇల్లు కట్టడమే కదా ! అయినా సరే నాలో సాంకేతిక విద్య పట్ల మక్కువను ఆరిపోకుండా కాపాడిన గురువుల్లో ప్రధములు
Dr v.s.r.k prasad గారు
Dr D Mukherjee
Dr Ray
నా చదువుల్లో నాకు ఇష్టమైన గురువుల కబుర్లు అవి.
గురుపూజోత్సవంరోజున గురువులను స్మరించడం సముచితం ! గురుభ్యోన్నమః !
రిప్లయితొలగించండిసంధర్బోచితమైన టపా చాలా బాగుంది, భరారేగారు.
రిప్లయితొలగించండిగురుదేవో మహేశ్వరహ...Good one!
రిప్లయితొలగించండిపరిమళం గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివేణూశ్రీకాంత్, కనీసం ఆ ఒక్కరోజన్నా తలుచుకుందామని.
పద్మార్పితా ధన్యవాదాలు.
మీకు, మీ కుటుంబానికి
రిప్లయితొలగించండివినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
మీకు, మీ కుటుంబ సభ్యులకీ వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఅబ్బో హారం, మాలిక నిండిపోయిందిగా అబ్బాయా మీ వినాయకచవితి శుభాకాంక్షలతో..
మరి మేము చెప్పడానికి ఒక టపా రాయలేదే..
meeku kuda vinayak chavithi subhakaankshalu andi
రిప్లయితొలగించండిbharaare garu,
రిప్లయితొలగించండిvinayakachaviti subhaakankshalu..
did you write the comments by using some code or its a manual effort? anyway.. thanks a lot for your wishes...
meeku vinayayaka chavithi subhaconkshaalu andi raami reddy gaaru
రిప్లయితొలగించండివినాయక చవితి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిభాస్కర రామి రెడ్డి గారు (చాలా పెద్ద పేరు, కుంచెం తగ్గిస్తే బాగుండు). ఒక్కొక్క అంశమే నేర్చుకుంటూ, మెల్లిగా మీరు ఎదిగిన విధానం, అందులో మీ పూజ్య గురువుల బాధ్యత తెలుసుకుంటుంటే చాలా సంతోషంగా ఉందండి. మీ గౌరవాభిమానాలకు వారెప్పుడూ ఆనందిస్తారు. అప్పుడప్పుడూ కనిపిస్తే ఆ శిష్యుని చూసుకుని మురిసిపోతారు. మీకు ప్రత్యేక అభినందనలు. వినాయక చవితి బాగా చేసుకున్నారా! శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబ సభ్యులకీ వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండితార
రిప్లయితొలగించండికార్తీక్
అశోక్
సవ్వడి
జయ
కమల్
అందరి అభినందనలకు చాలా సంతోషం వేసింది.
తారా పోస్టు వ్రాస్తే కానీ శుభాకాంక్షలు చెప్పరా ;)
కార్తీక్...it is a conscious effort :-)
జయగారూ, హ్మ్..పేరు కుదించాలంటే భారారె వుందిగా [ బ్లాగుల వరకు ] ఒక ఉపాధ్యాయునిగా మీరు ఆమాట చెప్పడం చాలా ఆనందం వేసిందండి.
అదేమీలేదు బాసు, నేనూ కుడా కామెంట్ ఫాంలో కామెంట్ పెట్టి ఆటోరిఫ్రెష్ పెట్టి వదిలేవాడ్ని, స్నిప్పెట్ అవసరం లెదుకదా దీనికి, ఇక ఒక నాలుగైదొందలు కామెంట్లు అయ్యాక ఆపేసివాడ్ని..
రిప్లయితొలగించండిఅదే టపాలేకపొయే సరికి వేరే టపాలను ఖరాబు చేయలేక వదిలేసాన్నమాట...హిహిహి..
అది కాదు కాని, తిరిగి ఎక్కడ శుభాకాంక్షలు చెప్పాలో తెలియలేదు, ఇక్కడేమో అసంధర్భంగా ఉన్నది అనిపించింది..
@తార
రిప్లయితొలగించండి>> నేనూ కుడా కామెంట్ ఫాంలో కామెంట్ పెట్టి ఆటోరిఫ్రెష్ పెట్టి వదిలేవాడ్ని, స్నిప్పెట్ అవసరం లెదుకదా దీనికి, ఇక ఒక నాలుగైదొందలు కామెంట్లు అయ్యాక ఆపేసివాడ్ని..
ముచ్చటగా వుంది మీరు చెప్తుంటే... అయితే మీరిప్పటిదాకా వ్రాసిన వ్యాఖ్యలన్నీ అలాంటివేనా? ;)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యో అట్టే ఎట్టా ఐతదు భా.రా.రె. బాబు
రిప్లయితొలగించండిఈ టెంప్లెట్ల్లొ అవడం లేదు, వార్డ్ ప్రెస్ ఐతే అవుద్ది, హ్మ్ ఇంకొన్ని టెంఫ్లెట్లలొ కుడా జరిగింది, పెద్దగ గమనించలేదు,.. వెతికి వస్తా..
రిప్లయితొలగించండి:-) all the best.
రిప్లయితొలగించండి>>ముచ్చటగా వుంది మీరు చెప్తుంటే... అయితే మీరిప్పటిదాకా వ్రాసిన వ్యాఖ్యలన్నీ అలాంటివేనా? ;)
రిప్లయితొలగించండిLol, నేను మీ ఒక్క బ్లాగ్‌లోనే రాస్తాను అన్నాను మాష్టారు, అన్ని బ్లాగుల్లో అంటే స్రిప్ట్ రాయకుండా అవదు కదా..
ఒకే బ్లాగ్‌లో కామెంట్లు (ఒకటే కామెంటు) నింపడానికి ఒక చిన్న బగ్ గమనింఛారు, కాని దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు..
మూడ్ వచ్చినరోజు మొదట ఇక్కడే వదులుతా... హిహిహి..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిkoncham laeTu gaa vinaayaka chaviti,gurupoojoetschavam,ramjan Subhaakaankshalu.
రిప్లయితొలగించండిసునీత మీకు కూడా అన్ని పండగలకు కలిపి పేద్ద శుభాకాంక్షల మాల.:-)
రిప్లయితొలగించండి