మళ్ళీ వార్తాపత్రికలమీదకి గాలి మళ్ళింది.కాకపోతే ఈ సారి కొన్ని సందేహ నివృత్తులకోసం ఈ టపా. మన బ్లాగుల్లో చాలా మందే విలేఖరులున్నట్లున్నారు. వారిద్వారా సమాధానాలను సేకరిద్దామన్న ప్రయత్నం.
నాకు వచ్చిన సందేహాలివి.ఒక సంవత్సర కాలాన్ని గడువుగా తీసుకుంటే ప్రతి వార్తా సంస్థ నుండి దరిదాపు 365 రోజుల వార్తా పత్రికలు వెలువడుతాయి కదా. ఈ సంవత్సర కాలంలో వెలువడ్డ వార్తా పత్రికలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో ప్రయత్నించండి.
1) ప్రతి పేపరూ ఇప్పుడు జిల్లా ఎడిషన్ ప్రచురిస్తుంది కదా. ఆ జిల్లా ఎడిషన్లో నెలలో కనీసం పదిరోజులన్నా జనాల సమస్యల గూర్చి వ్రాస్తారు అని నా ఊహ. ఈ సమస్యలను పత్రికలో అచ్చు వేసిన తరువాత ఒకవేళ ఆ సమస్యలు పరిష్కారమైతే వాటినీ ప్రచురిస్తారా లేదా? ఒకవేళ ప్రచురించినట్లైతే సంవత్సరాంతంలో ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయో ఎలా తెలుసుకుంటారు? ఇలా తెలుసుకోవడానికి ఏమైనా సాధనాలు వార్తా పత్రికల వద్ద వున్నాయా?
2) ఎప్పటిదో వార్తను అవసరార్థం ఈ రోజు వార్తలో ఉటంకించాలంటే ఆనాటి వార్తను ఎప్పుడు ఏ రోజు పత్రికలో ప్రచురించారో ఎలా కనిపెడుతున్నారు?
3) ఇక Off the topic, when a paper campaigns for a candidate they will have to get the complete details about his constituency and his successes and failures in the last 5 years. How do they manage this data? would some one writes the news on behalf of him by doing reasearch and submits the news or are there any proven fast methods?
4) ఎంత డబ్బు పంచినా, ఎంత సారా పారినా, ఎన్ని కుల సమీకరణాలున్నా గెలువగల అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నాడు కదా? ఒక అభ్యర్థిని ఎన్నుకొనేటప్పుడు ఓటర్లు డబ్బు,సారా,కులం కాకుండా ఇంకేమైనా చూసి ఓట్లు వేస్తున్నారా? ఒకవేళ వేస్తున్నట్లైతే అవేమిటి? నియోజక వర్గ అభివృద్ధా లేక వ్యక్తిగత అభివృద్ధా?
అబ్బో ఇంకా చాలానే ప్రశ్నలున్నాయి కానీ ఇప్పటికే చాలా అడిగేసినట్టున్నాను. ముందు వీటికి సమాధానాలు దొరికితే అప్పుడు మిగిలినవి చూద్దాం.

ఈ ప్రశ్నలన్నీ పేపర్ ద్వారా ప్రచారం , మరియు కష్ట నష్టాలు అన్నట్లు ఉంది.
రిప్లయితొలగించండి1.జిల్లా ఎడిషన్ లో వార్తలు సేకరించేవారు విద్యావంతులో, సామాజిక స్పృహ కలిగిన వారో కాదు. చాలావరకు నాకు తెలిసి.
2. అందరికే తెలిసిన సాధనాలు కాక ప్రత్యేకమైనవి ఉండే ఉంటాయి
3. ఈ వివరాలతో ప్రచారం కన్నా ముందు ముందు ఏంచేస్తారు అన్నది ముఖ్యం.
4. ఇది ఓపెన్ సీక్రెట్.దీనికి సమాధానం మీ అంతరంగమే చెపుతుంది. మీరు కూడా అందరిలో ఒకరు కాబట్టి
Mauli,ప్రశ్నలకు సమాధానాలు తెలియదని చెప్పకుండా సమాధానాలిచ్చారన్న మాట :)
తొలగించండిఇక చివరి సమాధానం :
4. ఇది ఓపెన్ సీక్రెట్.దీనికి సమాధానం మీ అంతరంగమే చెపుతుంది. మీరు కూడా అందరిలో ఒకరు కాబట్టి.
మీరు జనాలను,ఓటర్లను ఇలా జడ్జ్ చేయకుండా వుండటమే ఉత్తమమేమో :)
every one is part of a bigger society surrounded by the other people.
నాకు తెలిసిన సమాధానం చెప్పాను. తప్పయితే అఎదుకు తప్పో మీరు చెప్పచ్చు. ఇక నాలుగవ సమాధానం, అది జడ్జ్ చెయ్యడం అని మీరెందుకు అనుకుంటున్నారు?
తొలగించండి@every one is part of a bigger society surrounded by the other people.
నేను ఇందుకు విరుద్దమైన అభిప్రాయం వ్యక్తపరచలేదే?
డబ్బు కాని ఇంకేది కాని ఒకరు తీసుకొంటే తప్పు అనో, అవి ప్రభావితం చేస్తాయనో నేననుకోను.అలాగే ఇంకొకరి చాయిస్ తప్పు, నా ఛాయిస్ కరెక్ట్ అని నేను ఎక్కడయినా చెప్పానా?
మౌలీ,
తొలగించండిమీకు తెలిసిన సమాధానాలు చెప్పినందుకు సంతోషము. సమాధానాలు తప్పు అని అని అనుకొనేదానికంటే అవి నా ప్రశ్నలకు సమాధానంగా నాకనిపించలేదు. కాస్త సమయం ఎక్కువపట్టినా ఎందుకు అనిపించలేదో నా వివరణ ఇస్తాను.
మొదటి ప్రశ్న : ఇది అసిందగ్ధతకు తావు లేని ప్రశ్న. అంటే సమాధానం అవునో కాదో నిక్కచ్చిగా చెప్పగలిగేటువంటి ప్రశ్న.
"ఈ సమస్యలను పత్రికలో అచ్చు వేసిన తరువాత ఒకవేళ ఆ సమస్యలు పరిష్కారమైతే వాటినీ ప్రచురిస్తారా లేదా?"
ప్రచురిస్తే ప్రచురిస్తారనో లేదా కొన్ని పత్రికలు ప్రచురిస్తాయనో లేదా కొన్ని సందర్భాలలో ప్రచురిస్తారనో లేదా అసలు ఇటువంటి వివరాలు ఏపత్రిక పట్టించుకోదనో ఇలా సమాధానాలు రావచ్చు. ఇక మీరు చెప్పిన సమాధానం పై ప్రశ్నకు సమాధానంగా ఎందుకు తోచలేదో చెప్తాను
"జిల్లా ఎడిషన్ లో వార్తలు సేకరించేవారు విద్యావంతులో, సామాజిక స్పృహ కలిగిన వారో కాదు" నేనడిగింది ఎవరు వార్తలు సేకరిస్తారని కాదు. సేకరించిన వార్తలను ఏరకంగా భద్రపరచి సంవత్సరాంతలో లెక్కలు చూస్తారని. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే statistical analysis చేయడానికి అవకాశముందా లేదా అని.
రెండవప్రశ్న కు సమాధానం : "అందరికే తెలిసిన సాధనాలు కాక ప్రత్యేకమైనవి ఉండే ఉంటాయి".
ఇప్పుడు మీకు ఓ పరీక్ష పేపర్లో రెండవ ప్రశ్నను అడిగారనుకోండి. పైలాగే సమాధానమిస్తే మార్కులు వేస్తారా? :-)
ఇక్కడ నేను తెలుసుకోవాలనుకున్నది ఆ ప్రత్యేక సాధానాలేమిటి అని.
to be contd...
ఇక మూడవ ప్రశ్న: when a paper campaigns for a candidate they will have to get the complete details about his constituency and his successes and failures in the last 5 years. How do they manage this data? would some one writes the news on behalf of him by doing reasearch and submits the news or are there any proven fast methods?
తొలగించండిపై ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం "ఈ వివరాలతో ప్రచారం కన్నా ముందు ముందు ఏంచేస్తారు అన్నది ముఖ్యం."
పై సమాధానం ఏరకంగానూ సరిపోదు కదా. ఏమి చేస్తారన్నది నాకు సెకండరీ.
ఇక చివరిగా నాల్గవ ప్రశ్న : మీ రిచ్చిన సమాధానమేమిటి?
"ఇది ఓపెన్ సీక్రెట్.దీనికి సమాధానం మీ అంతరంగమే చెపుతుంది. మీరు కూడా అందరిలో ఒకరు కాబట్టి."
నేనడిగింది డబ్బు,సారా,కులం కాక అభ్యర్థిని గెలిపించే మిగిలిన సమీకరణాలేమిటి అని? దానికి పైది సమాధానమా? ఓపెన్ సీక్రెట్ అంటే అవేమిటో నాకు కూడా తెలిసుండాలి. కానీ అవేమిటో నాకు తెలియదు. మీకు తెలిస్తే మళ్ళీ వ్యాఖ్య వ్రాయగలరు.
"నేను ఇందుకు విరుద్దమైన అభిప్రాయం వ్యక్తపరచలేదే?" దీని గురించి చెప్పాలంటే మీ వ్యాఖ్య మళ్ళీ ఒక్కసారి చదువుతారా?
"మీరు కూడా అందరిలో ఒకరు కాబట్టి."... అంటే మీరు కాదా? :))
హ్మ్ ముందుగా చెప్పినట్లుగా నాకు తెలిసిన ( ఊహించినవి కాదు ) సమాధానాలు చెప్పాను. పరీక్ష అయినా మార్కులకోసం వ్రాయడంలో నాకాసక్తి లేదు. అంత కరెక్ట్ గా సమాధానాలు దొరికితే ఎలక్షన్ కి ఇంత ఖర్చు అవసరమే ఉండదు.
తొలగించండిమొదటి ప్రశ్న కు సమాధానం, మీరు అడిగిన విధంగా సమస్యలను ట్రాక్ చేసి మళ్ళీ ప్రచురించాలంటే ఎక్కువశాతం విలేఖరులు విద్యావంతులో, సామాజిక స్పృహ కల్గినవారో అయ్యుండాలి. నేను గమనించిన వరకు సమస్య పరిష్కారం అయితే ప్రచురించినవి కొంచెం తక్కువ. అసలు లేవు అని కాదు. కాని ఇంకా మెరుగైన సమాచారం ఎవరికైనా తెలిస్తే ఇక్కడ ఎవరు ఒకరు ఇస్తారు అని నాకు ఆసక్తిగా ఉంది.
రెండవ ప్రశ్న , పత్రికల మధ్య పోటీ రీత్యా , ఇంకా ఆన్లైన్ వార్తా పత్రికలూ ప్రతిఒక్కరు ఇస్తున్నందు వల్లా ఇది సాధ్యమే. అది కాకున్నా పత్రిక లైబ్రరీ లో పాత సంచికల కాపి తప్పనిసరిగా ఉంటుంది.
మూడవ ప్రశ్న : మీరు ఇది పత్రికల్లో పనిచేసేవారిని ప్రత్యేకంగా అడిగి ఉండొచ్చు. కాని అది ఎవరైనా చెపుతారా? నాకు తెలిసినంతవరకూ ఈ సమాచారం కోసం పత్రికే మొత్తంగా శ్రమ పడనవసరం లేదు. ప్రయోజనం లో భాగస్వాములు ఉన్నట్లే, బాధ్యతల్లోను ఉంటాయ్.
నాలుగవ ప్రశ్న : మీరు టపాలో వ్రాసిన ప్రశ్నకు సమాధానం అది. నేను కూడా కాదని నా సమాధానం చెప్పదు . కాని నా నిర్ణయం కి మీరు కారణాలు తెలుసుకోవడం కన్నా మీ నిర్ణయం కి కారణాలు తెలుసుకోవడం మీకు తేలిక , ఇంకా నమ్మదగ్గవి అవునా?
ఓపెన్ సీక్రెట్ అయినా నాకు కూడా ముందునుండీ తెలియదు. ఈ చిన్న నిజం తెలిసాక, మనం ఓటు వేసే అభ్యర్డే గెలుపుకు అర్హుడు అనే భ్రమలు ఉండవు.
జిల్లా వార్తలకి ఇండెక్స్ లేదు
రిప్లయితొలగించండి౨. ఇండెక్స్ ఉన్నవాటి ని తెలుసుకొంటారు లేని వాటిని చూచాయిగా చెబ్తారు. (మనకూ ఎట్లాగు మతి మరుపు కాబట్టి అంత ఖచ్చితం గా కనుక్కోము. ఒక వేళ కనుక్కుంటే, గమనిక అని ఒక సవరణ వేసుకోవచ్చు)
౩.Refer to point 2 reply
౪ అట్లాంటివి ఏమీ లేవు. మీ మా తరపున అభ్యర్థి కి వోట్లు వారే వేసుకుంటారు !
చీర్స్
జిలేబి.
ha ha Zilebi garu, good answers. so, if I understood correctly, there is no such system available with Telugu news papers today.
తొలగించండిలేవు.
తొలగించండిఉంటే గింటే, అవి ఉపయోగించే దానికి మాకు సమయమూ లేదు!
జిలేబీలు వేడి గా వేసి ఓ రోజు లో పచారీ కొట్టు కి తీసు కెళ్ళే పేపరు ముక్క కి ఇన్నేసి reearch గట్రా చెయ్యడానికి సమయం లేదు సుమీ !
జిలేబి.