మనిషి తన పరిశరాల ప్రభావానికి లోనై దాని ప్రోద్బలంవలన సుఖదుఃఖాల సమ్మేళనాన్ని అనుభవిస్తుంటాడు. ప్రకృతి నుండి మనిషి ఉదయించడం వలననేమో మానవుని హృదయం ప్రకృతి ధర్మాలను ప్రతిబింబింపచేసే దర్పణము. ప్రకృతి, పరిశరాల ప్రోద్బలంతో ఆనందానుభూతిచే ప్రభావితుడై ఏకాంతంగా మనసు విప్పి ప్రకృతితో చర్చిస్తుంటాడు. కొన్ని సందర్భాలలో సత్యస్వరూపాన్ని శ్రవణానందంగా అంతరంగంలో గానం చేస్తూ గడిపేస్తుండవచ్చు కూడా. ఆ సత్యస్వరూపం మనసుదాటి స్వరరూపం సంతరించుకుంటే కవిత్వమౌతుంది.
కవియొక్క భావమేఘాలు ప్రపంచమంతటా ఆవరించి అలుపెరుగక సంచరిస్తుంటాయి. మనఃప్రేరేపితముతో స్వేచ్ఛగా ఏభావప్రపంచంలో సంచరించడానికి అవకాశమున్నదో అచటికల్లా ప్రయాణమౌతాడు. పయనించి ఏకాంతంలో అనుభవించినదంతా కవితారూపంలో రంగరించి కావ్యాన్ని రచిస్తాడు. ఆలోచనలు, అనుభూతులూ సామాన్య మానవులకూ వుంటాయి. కానీ ఈ జగతికి ప్రాణాభూతమైనది ఆత్మ. చేతనాచేతనలకు మూలమూ ఆత్మనే. కవి అంతరంగంలో ఈ సాదృశ్యమైన తత్వాన్ని చూస్తాడేమో. అందుకే చాలా కావ్యాలలో తత్త్వానుభూతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది కూడా.
మనస్సు నివురుగప్పిన నిప్పులాంటిది. ప్రకృతిలో లీనమైన మనిషికి అచేతనావస్థలో మనస్సు తాత్కాలిక తేజస్సుతో విరాజిల్లి ఆ అమృతమయమైన క్షణాలలో మహత్తర కవిత్వము వెలువడుతుంది. ఆ కవిత స్పృశించిన ప్రతి విషయమూ స్వర్ణమయము. ఆ సమయంలోనే లయ/ఛందోబద్ధమైన కవిత్వం అలవోకగా పలుకుతుంది.
కొందరు శబ్దార్థాలతో కూడినది కవిత్వమన్నారు. మరికొందరు ఇష్టార్థములతో, అలంకారములతో కూడుకున్నదాన్ని కవిత్వమన్నారు. మరికొంత ముందుకెళ్ళి మాధుర్యము, ప్రసాద, శ్లేష,సమాధి,ఔదార్యము,సుకుమారము, కాంతి సమములతో కూడి దోషములు లేనిదాన్ని కవిత్వమన్నారు. అంతటితో ఆగక "వాక్యం రసాత్మకం కావ్యం" అని అన్నారు.
అలంకారికులు కావ్యాన్ని స్త్రీ తో పోల్చారు. స్త్రీ సౌందర్య రూపిణి. ప్రాణం కలిగినది. అలాగే కావ్యానికి ప్రాణం కావాలన్నారు. ఆ ప్రాణమేదన్నదానిపై భిన్నాభిప్రాయాల వలన అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే వికృతంగా వున్న దానిని కూడా సుందరంగా చూపించే ప్రక్రియే కవిత్వమేమో. వైకల్యంలో కూడా తత్త్వం అంతర్లీనం. తత్త్వం సుందర రూపం. అందుకే అలాంటి కవిత్వం చదవగానే మానసికోద్బోధన చేసి పరిచ్ఛిన్నత్వమును తొలిగిస్తుంది. మన భావనాపరిధులను విశాలం చేసే మనోవికాశం కవిత్వం. సత్యసౌందర్యముల ఆవేశమే కవిత్వం. అనుభూతి, అవేశము, భావము, ఊహ సమ్మేళనమే కవిత్వము. నవరసాలు కవితాకన్యకు ఆభరణాలు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form