అసలే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మొదలయ్యే సమయం. పుష్కలంగా మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరే సమయం. 2nd year కు వచ్చిన వారు కొత్త బ్యాచ్ ఎప్పుడెప్పుడు చేరుతుందా ఎప్పుడెప్పుడు Ragging చేద్దామా అని పంచెలు ఎగకట్టి మరీ ఎదురు చూస్తుంటారు కాబట్టి కొత్త విద్యార్థుల ర్యాంగింగ్ లో తప్పక వుండే అంశం "అమ్మాయి వర్ణన" అలాంటి అమ్మాయి వర్ణన వారికోసం ఇక్కడ
ఇప్పుడంటే తుపాకులు, మిస్సైల్స్, ఆటంబాంబులు వచ్చాయి కానీ పూర్వకాలంలో ఒకరాజ్యాన్ని మరో రాజ్యం జయించాలంటే విల్లంబులతో బాణప్రయోగాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటి మిస్సైల్స్ అయినా అప్పటి బాణాలైనా శత్రువుకు దూరంగా వుండి ప్రయోగించడము మూలానే
వీటికి అంతటి ప్రాముఖ్యత. అంతటి ప్రాముఖ్యత గల విల్లంబులను ఓ సొగసరి కనుబొమలతో పోలిస్తే? అది కూడా ఒకే కాలంలో పదునాల్గు లోకాలను జయించగల విల్లంబులతో పోలిస్తే?
నదీ ప్రవాహంలో తెప్పలు తేలుతూ వెళుతుంటాయి. నదిలో నీరు ప్రధానం. నీటికి ప్రవాహం సహజగుణము. అదే కాంతి ప్రవాహమైతే? ఆ ప్రవాహంలో ఈదుతున్న కుండతెప్పలైతే? ఆ తెప్పలు కూడా రాత్రివరకూ కనిపించలేదంటూ యౌవన ఉదయముతో ఉద్భవించిన ఇంతి స్థనములైతే? అంటే అమ్మాయిలకు వయసు వచ్చేకొంది స్థన సంపద వృద్ధి అవుతుందని కవితాత్మకంగా చెప్పడం. ఆ కాంతి ప్రవాహంలో మన్మధులు ఈదులాడుతూ వుంటారు.
ఆ కమలముఖి యొక్క నడుము ఇంతయే. ఇంతయే అంటే పిడికిలిలో ఇమిడేతంటటి చిన్నది. అలాంటి నడుమును చేటి వేళ్ళతో పట్టుకోగా వ్రేళ్ళ సందులలో నుంచి ఉబికిన భాగములే నడుము ముడతలైతే?
ఇక ఆ ఇందువదన కురలైతే యవ్వనములోనున్న మనసు లనే లేళ్ళ సమూహమును కట్టి పడేసే మన్మధకురులైతే? వేటకాని వలలో లేళ్ళు పడినట్టు ఈ ఇంతి కురులలో యౌవ్వనవంతులైన వారి మనస్సులు చిక్కుకు పోతే?
ఆమె పాదముల అడుగులు సూర్యుని వరప్రభావముచేత పుట్టినటువంటి పంకజములే. తామరపూలు సున్నితత్వానికి సూచిక. ఇక్కడ ఆమె కాలి అడుగులు కూడా అంతే సున్నితము.
ఇన్ని సంపదలు ఆ దేవుడు ఈ సుందరాంగికి చేకూర్చి విభజన రేఖను స్పష్టపరిచాడు మరి. అంటే biological గా ఇన్ని మార్పులు చేకూరిన తరువాతే యవ్వనవతి... దానికి పూర్వ మంతా బాల్యమే. బ్రహ్మ గీసిన ఈ విభజనరేఖ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రముఖి జవ్వనియే.
వర్ణనలో ఇది ఒక భాగము మాత్రమే !! ఇంతటి వర్ణనా చాతుర్యమెవ్వరికుంటుంది ఒక్క శ్రీనాధునికి తప్ప. అదీ శ్రీనాధుని సీసమైతే.....
భావము తెలిసిన తరువాత, పైన వ్రాసిన వాక్యాలకంటే ఈ క్రింది పద్యము ఎంత మనోహరమో చూడండి.
జగము లొక్కుమ్మడి సాధింపనెత్తిన రతి మన్మథుల విండ్లు రమణి బొమలు
కాంతి నిర్ఝరమీదు కామయౌవనముల కుంభప్లవము లింతి కుచయుగంబు
నడుమింత యని కేలదొడికి పట్టిన ధాత యంగుళిరేఖ లబ్జాస్యవళులు
యువమనోమృగరాజి దవిలింప దీర్చిన మదనవాగుర లిందువదన కురులు
బాల్యతారుణ్య సీమా విభాగమునకు
నజుడు వ్రాసినరేఖ తన్వంగియారు
భానువరమున బడసిన పంకజముల
యపర జన్మంబు పూఁబోడి యడుగు లధిప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form