9, ఫిబ్రవరి 2010, మంగళవారం

అమ్మలారా అయ్యలారా..రారండోయ్ రారండి... వచ్చి * మార్క్ చదవండి.

ఇక్కడ స్నేహితులు వ్రాసిన కొన్ని కవితలు పాఠకుల కోసం. అంతేకాదండోయ్ , ఇవి ఎవరు వ్రాసారో చెప్పిన వాళ్ళకు మంచి వయసుకు తగ్గ ఓ కవిత ఫ్రీ * అన్న మాట . అంటే, కుర్రోళ్ళకు "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు" లాంటి కవిత, సునీల్ లాంటి యువతరానికి "పాప నన్నే చూస్తుంది " లాంటి కవిత, ఏదో కొద్దిగా పెద్దతరహాలో కనిపిద్దామనుకున్నోళ్ళకు " రామ రామ కృష్ణ కృష్ణ" లాంటి కవితలు ఇలా అన్నమాట. ఇక్కడ ఇంకో మార్కెటింగ్ మార్క్ వుంది. జాగ్రత్త గా * చదువుకోని నిర్ణయం తీసుకోండి.

* పాఠకుల వయసు వారే నిర్ణయించుకోవాలి. అంటే వయసు మళ్ళిన వారు కుర్రాళ్ళు అవ్వొచ్చు లేదా పిల్లాడు "రామ రామ కృష్ణ కృష్ణ" అనుకోవచ్చు. ఇందులో పాఠకుని లేదా కామెంట్ వ్రాసే వారి నిర్ణయమే ఫైనల్. వాళ్ళకిచ్చిన ఆ రాజ్యాంగ హక్కును మేము ఈ రకంగా ప్రోత్సాహించ దలచాము.

ఇప్పుడు కవితలు లేదా తవికలు లేదా ఇకైకలు లేదా పకపకలు :)


మొదటి కవిత :
--------
అబ్బయ్యో అబ్బయ్య
నీకింక పిలక మొలిచిందబ్బయ్యా
అబ్బయ్యో అబ్బయ్య
నెత్తిన జుట్టు పీలికలౌతుందబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
దాగుడు మూతలు ఇంక మానాలబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
అట్లాంటిక్ సిటీ దారి మరవాలబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
ఐదోనెల కడుపును దింపాలబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
....
...

ఇలా ఓ పెద్ద ఆశు కవిత ఇది :)


రెండవ కవిత
--------
నేస్తం
స్నేహమనే చిన్ని పూవుని
మన చెలిమితోట లో విరబూయించావు
అనురాగమనే పదాన్ని
మన పరిచయం లో ఎన్నెన్నో రాగాలతో
మేళవించి మాకు వినిపించేవు

ఎంత తలచినా తరగని మన చెలిమి
కరగని కార్తీక మాసపు చిరువెన్నెలలో
కుప్పవోసిన మిలమిలలను
పారిజాత వనం లో
కళ్ళేదుట నిలిపినట్లు వుంటుంది

తెలియని దేవుడికి తలవంచి మొక్కుతున్నాం
అడగకనే నిన్ను మా నేస్తం గా ఇచ్చినందుకు
నీ స్నేహం మాకొక అపురూప వరమైతే
నీ జన్మ దినం మాకు అవ్వదా ఒక పర్వదినం

జన్మదిన శుభాకాంక్షలతో


మూడవ కవిత
---------

నీ చెలిమి పంచిన నునులేత వెలుగు ఎరుపు
నా ప్రయాణపు దారిని సుగమం చేస్తోంది.
నీ ప్రేమ పంచిన చిరుజల్లుల తుంపరలు
నా దప్పిక తీర్చే నీటి చెలమవుతోంది


ఒంటరి నడక లో అలసి, కమ్ముకునే సాయం సంజలలో
నేస్తం నీకు నేనున్నాననే నీవంపిన కబురు
పావురపు కువ కువ లతో
విచ్చిన చంద్రకాంతపు సువాసనలతో కలిపి
నా దారిని పచ్చిక బయళ్ల వెంబడి
వెన్నెల వెలుగును కలిపి చూపుతోంది.


అటువంటి నేస్తానికి జన్మదిన శుభా కాంక్షలు
ఏమని చెప్పగలను... చిరాయువు కావాలని
కోవెల గంటలపై, కరగని మమతలపై ఆన చేసి
కోరుకోవటం తప్ప...

ప్రేమతో


ఇంతమంది ఆత్మీయ స్నేహితులను ప్రసాదించినందుకు ఆ దేవదేవుని కరుణతో మనసంతా అర్ద్రమైంది.

ఇక చివరిగా మీ గెస్స్ లు, అచ్చు బొమ్మలు వెయ్యండి సమాధానం పట్టండి వయసుకు తగ్గ పాటలు పాడుకోండి.

12 వ్యాఖ్యలు:

 1. భారారె, జర భద్రం మరి. వీపు సాఫీ అయ్యే సూచనలు కనపదుతున్నాయిక. ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. యాపీ బర్త్ డే భా.రా.రె. మొదటి కవిత నాకు తెగ నచ్చేసింది. ;-) నా పేరు రాసుకో ఆ కవిత ముందు.. నచ్చింది నాకు. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భా.రా.రె. Many many happy returns of the day. ఇంకో సందేహం ఎవరో కొత్తగా పేరెంట్స్ అవబోతున్నారని? ఏంటో కొంచం కంఫ్యూసన్.నాకు కవితలు రావు కనుక చదివి ఊరుకుంటానంతే!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నా గెస్ జాబ్:
  ౧. భా.రా.రె.
  ౨. చిన్ని
  ౩. చిన్ని
  ఇంకా వస్తే అవీ చిన్నీనే... ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @ఉష
  హమ్మో హమ్మో ఉష ...అన్యాయం ....మనకంత సీన్ వుందా!వుంటే ఈ భూమి మీద ఆగుతానంటార అలాటి కవితలు రాయగాలనంటార!సరే మీ శిష్యురాలిగా చేర్పించుకొండే.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఏమిటో ఈ కాలం పిల్లలు అస్సలు అర్ధమే అవరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఏమోనండి అంతా కంప్యూజింగ్ గా ఉంది ఎవరు పుట్టారో? ఎవరికి శుభాకాంక్షలు చెప్పాలో?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఈ రోజు మనసుతీరా కవితల్ని ఆస్వాదించాను.
  ధన్యురాలిని.మమ్మల్ని ఇంత ఆనందింపజేసినందుకు మీకు అంతకు రెట్టింపు సంతోషం మీ జీవితంలో కలగాలని ఆశిస్తూ

  అనూ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఉషా గారూ, నేనేమన్నాను మేడం వయసును ఎవరికి వారే చెప్పుకోమన్నాం అంతేగదా. ఈ మాత్రానికే వీపు సాఫీ కావాలా.  భావనా ఏమి దౌర్జన్యం చేస్తున్నావు? మా ఫ్రెండు వింటే ఇంతేసంగతులు.  సునీత గారూ థ్యాంక్యూ.ఇప్పుడు వున్న ఇద్దరికే చదువు చెప్పుకొనే తీరికలేక బ్లాగునే ఏదో మొక్కుబడిగా వ్రాస్తుంటే, మళ్ళీనా ... :)  చిన్నీ హబ్బే లాభం లేదండి.:)  ఉషా, బాగా చెప్పావు కదా. అవునవును చిన్నీ కవితలే అవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చిన్నీ భలే ఎత్తు వేసావే :)


  ఆత్రేయ గారూ, అంటే ఏంటట సారూ? మీరు పిల్లకాయ కాదని చెప్పడమా :-) లేక స్వదేసీ కుట్ర ఏమైనా వుందా?


  పద్మార్పితా, ఇదే మరి, నీకే కన్ఫూజన్ గా వుంటే ఇక నాగతేం కాను చెప్పు ;) ధన్యవాదాలు నేస్తం.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. అనూ, బహుకాల దర్శనమండి.మీకు నా స్నేహితుల కవితలు నచ్చినందుకు, మీ దీవెనలకు ధన్యవాదాలతో...

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form