2, ఆగస్టు 2013, శుక్రవారం

ఇంతకీ తెలుగుదేశం పార్టీ దేన్ని సమర్ధిస్తున్నట్లు?

ఇంతకీ తెలుగుదేశం పార్టీ దేన్ని సమర్ధిస్తున్నట్లు? తెలంగాణానా లేక ఆంధ్రప్రదేశ్ నా ? కొంతమంది MP లు రాష్ట్రం కలిసి వుండాలని రాజీనామాలు చేస్తారు. కొంతమంది తెలంగాణా కు మద్దత్తు ప్రకటిస్తారు. అసలు నాయకుడు అసలు మాట్లాడడు. ఎవరి పార్టీ వాళ్ళకు ముఖ్యం కాబట్టి ఇప్పుడు పార్టీ లు రెండు వర్గాలను సృశ్టించి కొంతమంది సమైక్యంగా వుండటానికి మద్దత్తిస్తే మరికొంతమంది తెలంగాణా కు మద్దత్తు ఇస్తారు కాబట్టి రెండు ప్రాంతాల్లో తమ పార్టీ మనుగడకు ఎలాంటి ఇబ్బందులుండవ ని కోడి లెక్కలు వేసుకోవచ్చు. దీనిలో భాగమే ఇప్పుడు జరుగుతున్న రాజీనామాలు. కేవలం రాజీనామాలైతే పరవాలేదు, దానికి విరుద్ధంగా మళ్ళీ తెలంగాణా కు సపోర్టు. 
ఇది రెండు పడవలపై ప్రయాణం లాంటిది. కాబట్టి మునిగిపోక తప్పదు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే అటు తెలంగాణాలో ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లో పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనిపిస్తుంది.

వైయస్సార్ పార్టీ, వీరి MLA లు అందరూ రాజీనామాలు సమర్పించినా పార్టీ పరంగా మాత్రం స్పష్టంగా మేము ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడానికి వ్యతిరేకమని చెప్పలేకపోతున్నారు. ఇలా ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ఈ పార్టీకి రెండు ప్రాంతాల్లో మనుగడ వుంటుంది. కారణం తెలంగాణాలో  కూడా సమైక్య వాదులు కనీసం 30-40 శాతం వుంటారు.

రాష్ట్రం ఎందుకు సమైక్యంగా వుండాలి? ఇది చాలా చిన్న ప్రశ్నైనా సమాధానం చెప్పాలంటే కనీసం మూడు నాలుగు పేజీలైనా రాయాలికాబట్టి మరోసారి చూద్దాం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Comment Form