ఎండాకాలం.మనసులోని చెమ్మ ఆవిరై చిరాకును తెప్పించేకాలం.సరదాగా కాసేపు బయట తిరుగుదామన్నా ప్రకృతి సహకరించని మాసం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయని వార్తలు.కానీ అతిముఖ్యమైన రెండు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.రెండూ ఆంధ్రప్రదేశ్ లోనే. ఒకటి ఒంగోలులో మరొకటి నరసరావుపేట దగ్గర నర్శింగపాడులో.ఈ రెండు పెళ్ళిళ్ళను చూడడంకోసం ఎలాగూ వెళుతున్నా కాబట్టి నేను చిన్నప్పుడు తిరిగిన దార్లను,గోలీలు ఆడిన ప్రదేశాలను,బఱ్ఱెలను మేపిన పచ్చిక బయళ్ళను,ఈతలాడిన వాగులను,ఎండాకాలంలో దూకిన ఊరబావులను,ఎక్కిన తాటిచెట్లను,సాయంకాలాలు ఆటలకై గుమిగూడిన కూడళ్ళను, ఆరుబయట పున్నమి వెన్నెల రాత్రులందు చందమామను,పాలపుంతను,దక్షిణార్థ గోళంలో కనిపించే సప్త ఋషి మండలాన్ని,చీకటి రాత్రులందు ఆకాశాన్ని చుట్టిముట్టే నక్షత్రాలను అన్నింటిని మరోసారి చూసి అనుభవించి రావలె.అంతేనా ఆనాడు నేను చదివిన పాఠశాలలను,ఆ తరగతి గదులను,వీలైతే నాడు విద్యాబుద్ధులను నేర్పించిన అయ్యవార్లను కూడా కలిసి రావలె.
నాకొక చిన్న కోరిక పోయినేడాదినుండి బలంగా వుండిపోయింది.వినుకొండనుంచి గాంధీనగర్ వెళ్ళే బస్టాండులో నిలబడి ఒక మంచి నిమ్మకాయ సోడా సుఉఉఉఉఉఉఉఉయ్య్య్య్య్య్య్య్య్య్ అని శబ్దము
వచ్చేటట్టు కొట్టించుకోని త్రాగి పల్లెవెలుగు బస్సులో గాంధీనగర్ వెళ్ళాలని.గాంధీ నగర్ తో దాదాపు పది సంవత్సరాల అనుబంధం.నేను B.Tech second year లో వుండగా నా జన్మస్థలమైన జిల్లెళ్ళపాడు ( కనిగిరి తాలుకా,వెలిగండ్ల మండలం) ను వదిలి వలస వచ్చిన ఊరు.చేలల్లో పండిన మినుములను వినుకొండ తీసుకొచ్చి అమ్మి వచ్చిన డబ్బులతో ఓ సినిమా చూసి, ఇంట్లోకి కావలసిన సరుకులను తీసుకొని బస్టాండులో నిలబడి ఒక సోడా తాగితే ఆ మజాయే వేరు.కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎక్కడినుంచి వస్తుంది? ఏదో కొంత పొలం తప్పించి ఊర్లో వున్న ఇల్లును అమ్మేశాము.ఊరికెళ్ళినా చుట్టపుచూపుగా ఏదో ఒక పూట అరపూట ఎవరింటో నైనా వుండగలమే కానీ నాకంటూ అక్కడ వుండడానికి ఏమీలేదు.ఐనా సరే వెళ్ళి నిమ్మకాయ సోడా త్రాగి రావాల్సిందే :-). ఇంట్లో ఇట్లాంటి కోరికలు చెప్తే పిచ్చోడి క్రింద జమకట్టి ఓ వెఱ్ఱి నవ్వు నవ్వుతారు కానీ అందులో వుండే ఆనందం వీళ్ళకేమి తెలుసు :)
పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో వెళ్ళాను. కానీ వెళ్ళేముందున్న ఉత్సాహం ఆరోగ్యపరిస్థితి బాగాలేని కారణంగా అక్కడ దిగగానే ఆవిరైపోయి ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళిపోదామా అన్న పరిస్థితిని తీసుకువచ్చింది.ఈ సారి అలాంటి ఆటంకం రాకుండా చూడమని భగవంతుని నాతోటి మీరు కూడా ప్రార్థించండి మరి :)
అన్నట్లు నేను మే 24 వ తేదీ నుండి మే 28 వ తేదీ వరకూ హైదరాబాదులో వుంటాను. 28 మధ్యాహ్నంగా బయలుదేరి ఒంగోలు వెళుతున్నాను. ఈ రోజుల్లో ఆనాటి పాతకాపు బ్లాగర్లెవరైనా హైదరబాదులో వుండి నన్ను కలవాలనుకుంటే నాకొక మైల్ చేయండి.నా మైల్ ఐడి ramireddy.mvb[at]gmail.com. ప్రస్తుతానికి నాదగ్గర కాంటాక్ట్ నెంబరు లేదు. ఒకవేళ ఎవరైనా కలుస్తామంటే ఇంటివద్దో లేక ఎండాకాలం కాబట్టి హాయిగా ఏదైనా restaurant లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాము.