బ్లాగునొకకంట చూడక ఇన్ని దినంబుల్ సంసార సాగరంబందీదులాడి
కార్యాలయమున భారమున్మోసి తప్పటడుగుల నడకనేర్చు చిన్నారి ఓలె
తిరిగి వచ్చు చుంటి నా ప్రియసఖి చెంతకు మనసులోని మాటలన్
మురిపెముల ముచ్చట్లు పూసగ్రుచ్చినట్లు ముచ్చటించుకొరకు
మరిచితిని ఛందోగణాంకములను
మరిచితిని యతిప్రాసలను పద్యలక్షణముల్
చూడగ తెలుగే తరిగిపోవు సంధి కాలమున
తిరిగి చూచు చుంటి బ్లాగ్దేవి మోమున్
యతిప్రాసాదిగణ లక్షణముల్ తదుపరి నేర్వవచ్చు
వాక్కునకు మూలమగు స్పందన అడుగంటి
ఒట్టిపోక మునుపె భావ ఝరుల కక్షర రూపమిచ్చి
నా చిరుస్పందనల బ్లాగునందు కుప్పలు పోయవలె