23, జులై 2010, శుక్రవారం

బ్లాగులు వాటి కథా కమామిషు 2 - ఉత్సాహం ఉరకలు వేస్తున్న బ్లాగర్లు

మొన్నటి టపాలో పనిచేయని లేదా మూసివేసిన లేదా ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశమున్న బ్లాగులను చూశాం కదా. ఈ రోజు అత్యంత ఉత్సాహంగా బ్లాగింగ్ చేసే బ్లాగర్ల వివరాలివి. ఇవి కేవలం హారం | haaram వెబ్ సైట్ వద్ద వున్న వివరాలు మాత్రమే. ఈ సంఖ్యలు కచ్చితం అని చెప్పలేను కానీ పూర్తి సత్యదూరం మాత్రం కావని చెప్పగలను. ఈ వివరాలు బ్లాగ్ స్పాట్ వి మాత్రమే, వర్డ్ ప్రెస్ బ్లాగర్ల సమాచారం హారం | haaram వద్ద చాలా తక్కువగా వున్నది. మరో రకంగా మన తెలుగు బ్లాగావరణంలో హారం | haaram వద్ద వున్న వివరాలివి [ పనిచేసేవి చేయనవి కలిపి ]

Blogspot blog links 1547
Wordpress blog links 257
others [ అంటే వారి వారి సొంత డొమైన్స్ ] 45



మొదటి మూడు స్థానాలు సినిమా లకు సంబంధించిన బ్లాగులు సాధించాయి. కానీ విశేషమేమంటే మొదటిస్థానం సాధించినవారు నేను కలలో కూడా ఊహించలేనన్ని పోస్టులు వ్రాసారు. వారు వ్రాసినవి సినిమా పాటలను తెలుగు యూనికోడ్ లో టైపు చేసి పబ్లిష చేయడమైనా కానీ వారి అభిరుచికి, పట్టుదలకు, నిబద్ధతకు ఏరకంగా మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. వారికి నా జోహార్లు.

వారే గోకవరపు నాగేశ్వరరావు గారు. వారు 2400 పోస్టులతో ఇప్పట్లో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో వున్నారు. వారి బ్లాగు తెలుగు పాటలు
ధన్యవాదాలు నాగేశ్వర రావు గారూ.


ఇక రెండవ స్థానంలో డాక్టర్.శేషగిరిరావు [MBBS] గారున్నారు. వీరి బ్లాగులో సినిమా నాయికా నాయకల దగ్గరనుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఫొటో తో సహా చాలా వివరాలు దొరుకుతయి. వీరు ముచ్చటగా నాలుగు మొదటి అంకెలను వరుసగా సాధించారు. అంటే వీరు 1111 టపాలతో రెండవ స్థానంలో వున్నారు. వీరి బ్లాగు Tollywood photo profiles



ఇక మూడవస్థానాన్ని విహారి గారు కైవశం చేసుకున్నారు. వీరు ఆణిముత్యాల లాంటి పాటలను తెలుగు బ్లాగులోకానికి అందిస్తూ ఇప్పటిదాకా 1026 పాటలను సేకరించి మనకోసం ఆణిముత్యాలు ద్వారా అందించారు.



ప్రతి బ్లాగుకు ఇలా వ్యాఖ్యానం వ్రాయాలని వుంది కానీ సమయాభావం వల్ల ఈ క్రింది పట్టికతో సరిపెడుతున్నాను.ఈ పట్టికలో వీరు వ్రాసిన వాటికన్నా తక్కువ సంఖ్య కనిపించవచ్చు. కారణం ఈ పట్టిక మీరు మీబ్లాగులో పబ్లిష్ చేసిన టపాలసంఖ్యను మాత్రమే సూచిస్తుంది. పభ్లిష చేయకుండా ఉన్న టపాలతో కలుపుకొని ఎక్కవగా ఉండవచ్చు.

1)500 నుంచి 1000 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

Indian Hot Recipes [vaniram] మొత్తం టపాలు [969]

పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ [PSTL] మొత్తం టపాలు [933]

తెలుగు పాటలు [ambatisreedhar] మొత్తం టపాలు [651]

కోణమానిని తెలుగు ప్రపంచం [Kusuma Kumari] మొత్తం టపాలు [651]

Telugu Movie Reviews ,News , And Telugu Movie Songs [jasmine] మొత్తం టపాలు [630]


వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events [CCKRao] మొత్తం టపాలు [559]

తెలుగు పాటల తోరణాలు [రమేష్ ఆకుల] మొత్తం టపాలు [506]

ఆంధ్రామృతం [చింతా రామకృష్ణారావు.] మొత్తం టపాలు [505]


2) 400 నుంచి 500 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons) [CH Gowri Kumar] మొత్తం టపాలు [491]

నవ్వులాట [నవ్వులాట శ్రీకాంత్] మొత్తం టపాలు [484]

My VALUABLE LESSONS [Raj] మొత్తం టపాలు [472]

జ్యోతి [జ్యోతి] మొత్తం టపాలు [456]

లీలామోహనం [చిలమకూరు విజయమోహన్] మొత్తం టపాలు [454]

విశాఖతీరాన...... [రాజేంద్ర కుమార్ దేవరపల్లి] మొత్తం టపాలు [452]

Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం [Rakhee] మొత్తం టపాలు [448]

Health Tips ,Diet Tips and Healthy Foods [Lalitha Lakshmi] మొత్తం టపాలు [441]

తెలుగు పత్రికలు [Chandamama] మొత్తం టపాలు [431]

అమ్మ ఒడి [AMMA ODI] మొత్తం టపాలు [413]

పర్ణశాల [K. మహేష్ కుమార్] మొత్తం టపాలు [401]




3) 300 నుంచి 400 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

వెంకటూన్స్ [venkatoons] మొత్తం టపాలు [385]

నరసింహ [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [381]

షడ్రుచులు [జ్యోతి] మొత్తం టపాలు [378]

రచన - The Creation [శ్రీనివాస బాబు] మొత్తం టపాలు [368]

అమెరికా వార్తలు [America Vaarthalu] మొత్తం టపాలు [366]

శిరా కదంబం [SRRao] మొత్తం టపాలు [356]

story [MOHAMMED 9440682081] మొత్తం టపాలు [349]

నా కవితలు [ఆత్రేయ కొండూరు] మొత్తం టపాలు [345]

నా ప్రపంచం [cbrao] మొత్తం టపాలు [342]

దార్ల [డా.దార్ల] మొత్తం టపాలు [342]

టపాకాయ [AMMA ODI] మొత్తం టపాలు [339]

Satyam Sivam Sundaram [Syam and Madhu Mallampalli] మొత్తం టపాలు [334]

24 గంటలు [satyam] మొత్తం టపాలు [332]

Lahari.com [Sadhu.Sree Vaishnavi] మొత్తం టపాలు [332]

నాన్న [భాస్కర్ రామరాజు] మొత్తం టపాలు [322]

సురుచి [జ్ఞాన ప్రసూన] మొత్తం టపాలు [317]

శరత్ 'కాలమ్' [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [315]

శాస్త్ర విజ్ఞానము [నాగప్రసాద్] మొత్తం టపాలు [311]

....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... [Ramu S] మొత్తం టపాలు [303]



4) 200 నుంచి 300 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

తెలుగురథం [కొంపెల్ల శర్మ] మొత్తం టపాలు [287]

మీ కోసం [SPLENDOR OF YOGA] మొత్తం టపాలు [283]

దీప్తి ధార [cbrao] మొత్తం టపాలు [282]

శీనుగాడి బొమ్మలు [శ్రీను] మొత్తం టపాలు [273]

telugu views [madhu's] మొత్తం టపాలు [271]

ఆనందిని [Kovela santosh kumar] మొత్తం టపాలు [263]

చదువరి [చదువరి] మొత్తం టపాలు [261]

cinemavinodam [raja] మొత్తం టపాలు [255]

ఆలోచనా తరంగాలు [సత్య నారాయణ శర్మ] మొత్తం టపాలు [254]

నెమలికన్ను [మురళి] మొత్తం టపాలు [253]

కావ్యాంజలి [Bukya Sridhar] మొత్తం టపాలు [240]

శోధన [Sudhakar] మొత్తం టపాలు [240]

తురుపుముక్క [కోడీహళ్ళి మురళీ మోహన్] మొత్తం టపాలు [239]

పంచామృతం - Panchamrutham - पन्चामृथं [uvratnam] మొత్తం టపాలు [238]

మరువం [ఉష] మొత్తం టపాలు [237]

Krishna's page [Krishna] మొత్తం టపాలు [233]

MAATA VARUSAKU బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని [bharath] మొత్తం టపాలు [229]

పాటల పల్లకి - నీ కోసం [Venu] మొత్తం టపాలు [229]

FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ [Fun Counter] మొత్తం టపాలు [228]

అక్షరాలను మధించాను... భావమనే సుధ కొసం.... [బుజ్జి] మొత్తం టపాలు [214]

ANALYSIS <<<>>> అనాలిసిస్ [seenu] మొత్తం టపాలు [213]

శ్రీ కృష్ణదేవరాయలు [డా.ఇస్మాయిల్] మొత్తం టపాలు [212]

తృష్ణ... [తృష్ణ] మొత్తం టపాలు [210]

వెన్నెల రాజ్యం [వెన్నెల రాజ్యం] మొత్తం టపాలు [208]


మా గోదావరి [Satyavati] మొత్తం టపాలు [205]

స్వరగీతిక [Swapna] మొత్తం టపాలు [203]

లేవండి,మేల్కొనండి..... [సురేష్ బాబు] మొత్తం టపాలు [202]

అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]


5) 100 నుంచి 200 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]

స్వరాభిషేకం [సెలయేరు] మొత్తం టపాలు [196]

జీవని [jeevani] మొత్తం టపాలు [191]

నా మదిలో ... [ప్రవీణ్ గార్లపాటి] మొత్తం టపాలు [189]

సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి) [జాన్‌హైడ్ కనుమూరి] మొత్తం టపాలు [181]

About Telugu Media [abouttelugumedia] మొత్తం టపాలు [181]

నిఖిత చంద్రసేన [నిఖిత చంద్రసేన] మొత్తం టపాలు [180]

నా తెలుగు రాతలు! [Bhale Budugu] మొత్తం టపాలు [178]

సందేశం [MOVIE] మొత్తం టపాలు [177]

vanisudheer [vanisudheer] మొత్తం టపాలు [177]

తెలుగు జోక్స్ (Jokes in Telugu) [CH Gowri Kumar] మొత్తం టపాలు [176]

Telugu MP3 Songs I Free Download [Telugu Songs By Mohan] మొత్తం టపాలు [173]

స్వప్న రాగలీన [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [173]

Travel ,holiday packages,India Goa,Kerala [KR] మొత్తం టపాలు [171]

Shakthi's recipes [srinath kanna] మొత్తం టపాలు [170]

కలలు + కల్పనలు = నా కవితలు [కలలు + కల్పనలు + నా కవితలు] మొత్తం టపాలు [169]

గడ్డిపూలు [Sujata] మొత్తం టపాలు [164]

Manoharam [Hima Bindu Kodali] మొత్తం టపాలు [161]

సాహితీ-యానం [బొల్లోజు బాబా] మొత్తం టపాలు [157]

GPVPRASAD [prasad] మొత్తం టపాలు [157]

శ్రీ శిరిడీ సాయి తత్వం [saiabhay] మొత్తం టపాలు [155]

Through The Looking Glass [కొత్త పాళీ] మొత్తం టపాలు [151]

అంతర్యానం [కొండముది సాయికిరణ్ కుమార్] మొత్తం టపాలు [148]

సాహిత్య అభిమాని [శివ] మొత్తం టపాలు [147]

విశ్వామిత్ర...మరో ప్రపంచం [శ్రీనివాస్ పప్పు] మొత్తం టపాలు [145]

సాహితి [మాలా కుమార్] మొత్తం టపాలు [143]

కిటికీ [నాగరాజు రవీందర్] మొత్తం టపాలు [143]

Telugu Vara Mandi [Telugu Vara Mandi] మొత్తం టపాలు [142]

శ్రీమదాంధ్రమహాభారతము-ఆణిముత్యాలు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [142]

రేఖా చిత్రం [సురేఖ] మొత్తం టపాలు [142]

www.youthatheart.in [HARISH] మొత్తం టపాలు [141]

అవీ-ఇవీ [త్రివిక్రమ్ Trivikram] మొత్తం టపాలు [141]

స్మృతులు [chava] మొత్తం టపాలు [140]

మధురవాణి [మధురవాణి] మొత్తం టపాలు [140]

రాజు గారి బ్లాగు [Hollywood Actors] మొత్తం టపాలు [139]

హిమబిందువులు [చిన్ని] మొత్తం టపాలు [138]

•▬• దీపావళి •▬• [Phani Yalamanchili] మొత్తం టపాలు [138]

................................ అంతరంగ తరంగాలు [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [136]

వరూధిని [Zilebi] మొత్తం టపాలు [136]

సరిగమలు... గలగలలు [రాజి] మొత్తం టపాలు [134]

fukuoka farm [Poodoori Raji Reddy] మొత్తం టపాలు [134]

విశాల ప్రపంచం... [మోహన] మొత్తం టపాలు [132]

నీ ధ్యాసలో....... [పండు] మొత్తం టపాలు [132]

బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]

బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]

అర్జునుడి బాణాలు... [మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్] మొత్తం టపాలు [131]

Padmarpita.... ['Padmarpita'] మొత్తం టపాలు [128]

కాలాస్త్రి [శ్రీ] మొత్తం టపాలు [127]

ఓ నేస్తమా [నరేష్] మొత్తం టపాలు [126]

కథా మంజరి [పంతుల జోగారావు] మొత్తం టపాలు [126]

పరిమళం [పరిమళం] మొత్తం టపాలు [124]

సూక్తి ముక్తావళి [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [121]

నైమిశారణ్యం [జ్యోతి] మొత్తం టపాలు [121]

కొత్త బంగారు లోకం _ తెలుగుకళ [తెలుగుకళ] మొత్తం టపాలు [121]

భగవాన్ కార్టూన్స్ [shaneer babu] మొత్తం టపాలు [120]

వాణీ పుత్రుని వాణి [Chittoor.S.Murugesan] మొత్తం టపాలు [120]

మనోనేత్రం [Sandeep] మొత్తం టపాలు [119]

మనసులో కురిసిన వెన్నెల [hanu] మొత్తం టపాలు [118]

అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [118]

యాత్ర - A Travelogue [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [118]

తెలుగు వెలుగులు ....... మీ కోసం ..... [బాలాజీ . మాడభూషి] మొత్తం టపాలు [116]

క ళా స్పూ ర్తి [బుసాని పృథ్వీరాజు వర్మ] మొత్తం టపాలు [115]

కొత్త బంగారులోకం [విహారి(KBL)] మొత్తం టపాలు [115]

సంకీర్తన [విహారి(KBL)] మొత్తం టపాలు [114]

హాస్యాంజలి [రాంగోపాల్] మొత్తం టపాలు [112]

నెల్లూరు బ్లాగుల సముదాయం.... nellore blogs junction... [వాసిలిసురేష్] మొత్తం టపాలు [111]

written by suman [సుమన్.గద్దె] మొత్తం టపాలు [111]

ఉబుసు పోక [చక్రవర్తి] మొత్తం టపాలు [111]

పలక - బలపం [సత్యప్రసాద్ అరిపిరాల] మొత్తం టపాలు [110]

మధురభావాల సుమమాల [రమణి] మొత్తం టపాలు [110]

Webdunia Telugu [Webdunia] మొత్తం టపాలు [108]

వాగ్విలాసము [రాఘవ] మొత్తం టపాలు [108]

కాల్పనిక లోకం [NARESHKOTA] మొత్తం టపాలు [107]

sarada [sarada] మొత్తం టపాలు [107]

జాహ్నవి [జాహ్నవి ని] మొత్తం టపాలు [106]

రాగం [చైతన్య] మొత్తం టపాలు [106]

Poetry [Pravallika] మొత్తం టపాలు [105]

ఉగాది పచ్చడి .... [శ్రీ] మొత్తం టపాలు [105]

నాతో నేను నా గురించి... [వేణూ శ్రీకాంత్] మొత్తం టపాలు [105]

Aaaalu [aaaalu] మొత్తం టపాలు [104]

Bhakti Ganga by Shri Dattaswami (భక్తి గంగ) [Shri Dattaswami] మొత్తం టపాలు [104]

Malekala's poetry [naveen malekala] మొత్తం టపాలు [103]

మోహనరాగాలు [పద్మ] మొత్తం టపాలు [103]

మాదిగకవులు [డా.దార్ల] మొత్తం టపాలు [101]

జీవితంలో కొత్త కోణం... [శ్రీనివాసకుమార్] మొత్తం టపాలు [101]

త్యాగరాజు కీర్తనలు [శ్రీ హర్ష PVSS Sri Harsha] మొత్తం టపాలు [101]

తెలుగు 'వాడి'ని [తెలుగు'వాడి'ని] మొత్తం టపాలు [100]

తెలుగుసినిమా చరిత్ర [L.VENUGOPAL, JOURNALIST, PRO] మొత్తం టపాలు [100]



ఆగండంగండి. అప్పుడే అయిపోలేదు. 99 కున్న ప్రాముఖ్యత మనకందరికి తెలిసిందే కదా. మరి ఈ క్రిందివారు 99 Not out వారికి కూడా శుభాకాంక్షలు.

మనసులో మాట [సుజాత] మొత్తం టపాలు [99]

అందం [రాకేశ్వర రావు] మొత్తం టపాలు [99]

"కృష్ణశ్రీ" [కృష్ణశ్రీ] మొత్తం టపాలు [99]


ఇక 0 నుండి 99 టపాలను వ్రాసిన వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆలింకులను ఇక్కడ ఇవ్వలేక పోతున్నాను.


హబ్బ... చెమటలు పట్టేసాయి ఈ మాత్రం టైపు చేసే సరికి, ఇక నేను 2000 వ్యాసాలను ఎప్పుడు వ్రాస్తానో ఏమో :(

పనిలో పనిగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పడం మరవకండేం :-)

అదండీ చూశారా మన తెలుగు బ్లాగుల్లో ఎంతమంది ఉత్సాహవంతులైన ప్రచురణ కర్తలు, రచయితలు, పాఠకులు ఉన్నారో.. ఇలాగే తెలుగు ఈ అంతర్జాల ప్రపంచంలో నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఆలోచనలతో భారతీయ భాషలకొక చుక్కానిలాంటిది కావాలని మనఃస్పూరిగా ఆశిస్తూ..

సెలవు.

20, జులై 2010, మంగళవారం

బ్లాగులు వాటి కథా కమామిషు - 1 (బాధిత బ్లాగులు లేదా విసిగిపోయిన బ్లాగర్లు)




నిన్న నా పోస్టులో విమల గారు హారం వద్ద ఎన్ని బ్లాగ్ లింకులున్నాయని అడిగారు. ఓ రెండు నెలల క్రితం హారం కోడ్ ను నూతనీకరిస్తూ ఉంటే ఈ ప్రశ్నతో పాటి మరికొన్ని ప్రశ్నలు కూడా నాకు ఉదయించాయి. అందులో కొన్ని

1) ఎన్ని బ్లాగు లింకులు తొలగించారు?
2) ఎంతమంది బ్లాగర్లు మొదట ఓపెన్ గా బ్లాగు చేసి తరువాత విసుగుచెంది ఆహ్వానితులకు మాత్రమే అవకాశం కలిపిస్తున్నారు?
3) ఎంతమంది బ్లాగర్లు నిజంగా బ్లాగును రోజూ చూస్తున్నారు?
4) ఎంతమంది రోజుకు కనీసం ఒక్క పోస్టన్నా వ్రాస్తున్నారు?

5) అత్యంత ఎక్కువగా ఏబ్లాగరు పోస్టులు వ్రాసారు?
6) గత ఆరునెలల కాలంలో ఒక్క టపా అయినా వ్రాయని బ్లాగులెన్ని?

ఇలాంటి ప్రశ్నలకు అప్పటికి నా వద్ద సమాధానం లేదు. ప్రశ్నలంటూ రావాలే కానీ సమాధానాలు వెతుకుతాం కదా ! అలా అప్పట్లో అంటే దరిదాపు మూడునెలల క్రితం క్రోడీకరించిన సమాచారమిది. ఇందులో ఇప్పుడు కొన్ని పనిచేసే లింకులు కూడా వున్నాయేమో తెలియదు కానీ స్థూలంగా 90% సరైన సమాచారం అని చెప్పగలను.

ఇక పై ప్రశ్నలకు సమాధానాలు ఒకటొకటిగా చూద్దాం.


1) వివిధ కారణాలచేత వారంతట వారు డిలీట్ చేసిన బ్లాగులు

vera bradley purses cheap
సందేహం
యాత్ర.. a travelog
murkhudu
జయశ్రీ
అపూర్వం
స్వర్గం
కృష్ణ
మనమంతాకలసి
మనమంతాకలసి
నా భావాలు ....!
AVS
కలల కౌముది
* * *




2) తమకు వచ్చే వ్యాఖ్యలతో నొచ్చుకొనో లేక హేళన చేయడంతోనో లేక వేరే ఏకారణం చేతనో గానీ ఈ క్రింది వారి బ్లాగులు కేవలం ఆహ్వానితులకు మాత్రమే


2keegaa
అంతరంగ తరంగాలు
Just some thoughts..
తెలుగు నేస్తమా...
నిప్పులాంటి నిజాలు
"విజయ విశ్వనాథం"
కలవరమాయే మదిలో
sOdi సోది
గుంపులో గోవిందం
Jaabilli
జానుతెనుగు సొగసులు
అసంఖ్య
పాతకథలపై కొత్తచూపు
A-Z
తెలు'గోడు' unique speck
నాతో నేను నా గురించి...
విహంగం
జురాన్ సినిమా...
ఉయ్యాల
చిన్ననాటి జ్ఞాపకాలు
sky-astram
సుత్తి నా సొత్తు
ఒక మంచి మాట
జడివాన
Colorful Moments of my (he)art...ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం...
ద ఫిమేల్ క్రైమ్ బులెటిన్
కాంతికణం
కథా మంజరి
మోహనామురళి


3)ఇక గత కొంతకాలంగా స్తబ్దంగా వున్న బ్లాగులు. బహుశా ఇవి కూడా డిలీట్ చేసి వుండవచ్చు (వీటి HTTP Status code 404, అంటే భవిష్యత్తులో మనకు మళ్ళీ కనిపించవచ్చేమో ) లేదా వీరు వేరే పేర్లతో బ్లాగులు మొదలుపెట్టి వుండవచ్చు

ఆనందో బ్రహ్మ
తెలుగు భాష
Harry
Favorite poetry/songs
తోలుబొమ్మలాట
అనగనగా ఒక ఊరిలో.....................
నా కబుర్లు
కంచు కథలు
కుమ్మై తరువత చూదం (KTC)
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !!!!
మన తెలుగు కబుర్లు
నా ఆలొచనలు
-- MUGA BHAVAALU -- ( Telugu kavithalu )
మనిషి
నా సాహిత్యం
నేను-లక్ష్మి
పానశాల
NAMASKARAM
నాడైరీ
syam
మహా........
సాహితీ ప్రయాణం (Saahitee PrayaaNam)
యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి
సమతలం
యువశక్తి
Sathyameva Jayate
dhoom machara
అరుణమ్
మిస్టర్ మూర్ఖ
Comedy in daily life
okadesam
చక్రం
జాబిల్లి
కాలనేమి
గుంటూర్ బ్లాగర్
e-matta nijam
eyeooopeners
చిన్నమాట
కువకువలు
తూర్పు-పడమర
ఇదీ సంగతి!
నన్ను అడిగితే ........
వాల్మీకం...
తాతా వారి డైరీ


ఇక రేపు ఉత్సాహవంతులైన బ్లాగర్ల గురించి తెలుసుకుందాం. చివరిగా గత సంవత్సరమున్నర కాలంగా హారం మొత్తం 1842 లింకులను సేకరించగా అందులో ఇప్పుడు పనిచేస్తున్న లేదా యాక్టివ్ గా ఉన్న బ్లాగుల సంఖ్య 1513.

10, జులై 2010, శనివారం

మిఠాయిలూ = కారాలూ మిరియాలూ.

ఈ మద్దెల టపా రాసి చానా రోజులైపోయ. ఏరోజుకారోజు ముక్కుతా మూలుగుతా కూలిపని చేస్కోని కొంప చేరే సరికి ఇంటికాడ పిల్లోల్లు టెన్నిస్ ఆడాలని ఆదార్నఅటే లాక్కెళ్ళిపోతుండారు. అసలే ఎండ్లాకాలం. ఆటలైనాక నీల్లుపోసుకోకుంటే వల్లు చిమ చిమ అంటది కదా.గబక్కిన రెండి చెంబులు గుమ్మరిచ్చుకోని బువ్వ తినంగాలే కళ్ళు మూసుకోని పోతాయి. అంతే కాసేపన్నా పండుకొన్నట్టే ఉండదు. అలారం చెవిలో జోరీగలా ఒకటే నస. దాని నెత్తినొకటిచ్చి మళ్ళా ముసుగుతంతానా, ఇంటావిడ నస మొదులైద్ది. " ఏడున్నరైంది లే, లే . కూలీకి పోవాలన్లేదా " అని. ఇంగ లాభంలేదని ఎట్టాగోట్టగ గబ గబ ఎనిమిదింటికి బయటపడ్తానా, మళ్ళీ ఇల్లు చేరే సరికి ఏడున్నరైపోతా వుండాది.

అదండీ సంగతి, ఇంక టపాలేమి రాస్తాను. అయినా ఇప్పుడు ఇక్కడ టపా పడకపోయినంత మాత్రాన కొంపలేమీ మునగవు గానీ ఆఫీసులో పని చెయ్యకపోతే మునిగిపోతాయి కదా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే నేను మహా బిజీ అనీ, అందుకని సరదాగా నయగారా ట్రిప్ వేసుకుంటే మనసుకు ఆహ్లాదమై పోస్టులు ఒకదాని తరవాత ఒకటి కుమ్మరించొచ్చనీ.... బొచ్చులేని గుండులోపల మెదడు దురద తట్టుకోలేక నయగారా ట్రిప్ వేసుకున్నాము. మేము అలా అలా ఆహ్లాదంగా ఆనందంగా ఆ ప్రయాణాన్ని ముగించుకొని వచ్చేలోపల నా బ్లాగుని లూటీ చేసెయ్యండి :)

ఇంకో కబురు, ఈ మధ్య శరత్ గారు వ్రాసిన టపా ఒకటి చదివాను.అదే బ్లాగర్ల సమావేశమని. అసలు అలా సమావేశమవసరమా అదీ మగవారితో అని నాకనిపించింది. ఎందుకంటే మగ బ్లాగర్లతో ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగమేముంది చెప్పండి? కొద్దిగా అటూ ఇటూ తేడా వస్తే కారాలూ మిరియాలూ నూరతారు తప్పించి నిజమైన కారాలు మిరియాలు ఎప్పుడైనా పంపించాలనిపిస్తుందా మొగబ్లాగర్లకు ? పంపించడం దాకా పోయారు, సమావేశంలో నైనా స్వీట్స్ పెడతారా అంటే అదీ ఉత్తదే అని తేల్చేసారు. స్వీట్స్ పెట్టకపోయినా కనీసం ఓటెల్ కన్నా పిలుస్తారేమోలో అని ఎక్కడో వున్న చిన్న ఆశా దీపం కూడా ఆరిపోయింది. అందుకే మగబ్లాగరులారా , ఆడ లేడీస్ తో స్నేహం చెయ్యండి. వాళ్ళైతే అప్పుడప్పుడు అలిగినా, ఒకప్పుడు కాకున్నా ఒకప్పుడైనా నాలుగు మిఠాయి ముక్కలు మనోట్లో వేసే అవకాశం ఉంటుంది. ఇదిగో అలా వచ్చిన స్వీట్స్ ఇవి



ఇక పైన స్వీట్స్ ను, ఇంతకు మునుపు పంపిన స్వీట్స్ ను సుష్టుగా మా ఇంటిల్లపాదీ ఆరగించాము. అందరూ మీకు కృతజ్ఞతలు తెలుపమని మరీమరీ చెప్పడంతో ఎంత ఆలస్యమైనా ఈ టపా ఈరోజు వ్రాయాలని నిర్ణయంతో పూర్తిచేసాను.

ఇక చివరిగా ఈ ఆడోళ్ళున్నారే వీళ్ళ బుర్రకు రెండువైపులా పదునే. ఏదో స్నేహితులు పంపారు కదా అని హాయిగా తిని అవసరమైనంత మేర థ్యాంక్స్ చెప్పమని చెప్పి కదలకుండా పక్కకు పోవచ్చుకదా. అలా అయితే వీళ్ళు ఆడ బాసు లెందుకౌతారు? ఇంట్లో మా ఆవిడ,పిల్లలు తిన్నంతసేపు పంపిన నా స్నేహితులను పొగడ్తలతో ముంచుతూ తిన్నారా, తీరా నేను తిందామని ఒక స్వీట్ తీసుకొన్నానో లేదో అప్పటిదాకా పొగుడుతున్న మా ఆవిడ కంఠంలో తేడా వచ్చింది.

" ఎప్పుడూ మీఫ్రెండ్స్ పంపిస్తే తినటమేనా, మనమేదైనా పంపేదుందా ?" అంది? దెబ్బకు నాకు పొరబోయి గబుక్కున రెండు గ్లాసుల నీళ్ళు తాగాల్సివచ్చింది.

కొద్దిగా తేరుకోని "నువ్వు చేస్తే కదా నేను పంపేది " అని అందా మనుకొని ఠక్కున నోటికి బ్రేక్ వేసేసాను. కారణ మేమై ఉంటుందంటారు?


హలో మిత్రమ్స్, విన్నారుకదా అందరితరపున మరోసారి " కారము,తీపి దాతల్లారా సుఖీభవ."