మొన్నటి టపాలో పనిచేయని లేదా మూసివేసిన లేదా ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశమున్న బ్లాగులను చూశాం కదా. ఈ రోజు అత్యంత ఉత్సాహంగా బ్లాగింగ్ చేసే బ్లాగర్ల వివరాలివి. ఇవి కేవలం హారం | haaram వెబ్ సైట్ వద్ద వున్న వివరాలు మాత్రమే. ఈ సంఖ్యలు కచ్చితం అని చెప్పలేను కానీ పూర్తి సత్యదూరం మాత్రం కావని చెప్పగలను. ఈ వివరాలు బ్లాగ్ స్పాట్ వి మాత్రమే, వర్డ్ ప్రెస్ బ్లాగర్ల సమాచారం హారం | haaram వద్ద చాలా తక్కువగా వున్నది. మరో రకంగా మన తెలుగు బ్లాగావరణంలో హారం | haaram వద్ద వున్న వివరాలివి [ పనిచేసేవి చేయనవి కలిపి ]
Blogspot blog links 1547
Wordpress blog links 257
others [ అంటే వారి వారి సొంత డొమైన్స్ ] 45
మొదటి మూడు స్థానాలు సినిమా లకు సంబంధించిన బ్లాగులు సాధించాయి. కానీ విశేషమేమంటే మొదటిస్థానం సాధించినవారు నేను కలలో కూడా ఊహించలేనన్ని పోస్టులు వ్రాసారు. వారు వ్రాసినవి సినిమా పాటలను తెలుగు యూనికోడ్ లో టైపు చేసి పబ్లిష చేయడమైనా కానీ వారి అభిరుచికి, పట్టుదలకు, నిబద్ధతకు ఏరకంగా మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. వారికి నా జోహార్లు.
వారే గోకవరపు నాగేశ్వరరావు గారు. వారు 2400 పోస్టులతో ఇప్పట్లో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో వున్నారు. వారి బ్లాగు తెలుగు పాటలు
ధన్యవాదాలు నాగేశ్వర రావు గారూ.
ఇక రెండవ స్థానంలో డాక్టర్.శేషగిరిరావు [MBBS] గారున్నారు. వీరి బ్లాగులో సినిమా నాయికా నాయకల దగ్గరనుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఫొటో తో సహా చాలా వివరాలు దొరుకుతయి. వీరు ముచ్చటగా నాలుగు మొదటి అంకెలను వరుసగా సాధించారు. అంటే వీరు 1111 టపాలతో రెండవ స్థానంలో వున్నారు. వీరి బ్లాగు Tollywood photo profiles
ఇక మూడవస్థానాన్ని విహారి గారు కైవశం చేసుకున్నారు. వీరు ఆణిముత్యాల లాంటి పాటలను తెలుగు బ్లాగులోకానికి అందిస్తూ ఇప్పటిదాకా 1026 పాటలను సేకరించి మనకోసం ఆణిముత్యాలు ద్వారా అందించారు.
ప్రతి బ్లాగుకు ఇలా వ్యాఖ్యానం వ్రాయాలని వుంది కానీ సమయాభావం వల్ల ఈ క్రింది పట్టికతో సరిపెడుతున్నాను.ఈ పట్టికలో వీరు వ్రాసిన వాటికన్నా తక్కువ సంఖ్య కనిపించవచ్చు. కారణం ఈ పట్టిక మీరు మీబ్లాగులో పబ్లిష్ చేసిన టపాలసంఖ్యను మాత్రమే సూచిస్తుంది. పభ్లిష చేయకుండా ఉన్న టపాలతో కలుపుకొని ఎక్కవగా ఉండవచ్చు.
1)500 నుంచి 1000 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
Indian Hot Recipes [vaniram] మొత్తం టపాలు [969]
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ [PSTL] మొత్తం టపాలు [933]
తెలుగు పాటలు [ambatisreedhar] మొత్తం టపాలు [651]
కోణమానిని తెలుగు ప్రపంచం [Kusuma Kumari] మొత్తం టపాలు [651]
Telugu Movie Reviews ,News , And Telugu Movie Songs [jasmine] మొత్తం టపాలు [630]
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events [CCKRao] మొత్తం టపాలు [559]
తెలుగు పాటల తోరణాలు [రమేష్ ఆకుల] మొత్తం టపాలు [506]
ఆంధ్రామృతం [చింతా రామకృష్ణారావు.] మొత్తం టపాలు [505]
2) 400 నుంచి 500 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons) [CH Gowri Kumar] మొత్తం టపాలు [491]
నవ్వులాట [నవ్వులాట శ్రీకాంత్] మొత్తం టపాలు [484]
My VALUABLE LESSONS [Raj] మొత్తం టపాలు [472]
జ్యోతి [జ్యోతి] మొత్తం టపాలు [456]
లీలామోహనం [చిలమకూరు విజయమోహన్] మొత్తం టపాలు [454]
విశాఖతీరాన...... [రాజేంద్ర కుమార్ దేవరపల్లి] మొత్తం టపాలు [452]
Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం [Rakhee] మొత్తం టపాలు [448]
Health Tips ,Diet Tips and Healthy Foods [Lalitha Lakshmi] మొత్తం టపాలు [441]
తెలుగు పత్రికలు [Chandamama] మొత్తం టపాలు [431]
అమ్మ ఒడి [AMMA ODI] మొత్తం టపాలు [413]
పర్ణశాల [K. మహేష్ కుమార్] మొత్తం టపాలు [401]
3) 300 నుంచి 400 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
వెంకటూన్స్ [venkatoons] మొత్తం టపాలు [385]
నరసింహ [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [381]
షడ్రుచులు [జ్యోతి] మొత్తం టపాలు [378]
రచన - The Creation [శ్రీనివాస బాబు] మొత్తం టపాలు [368]
అమెరికా వార్తలు [America Vaarthalu] మొత్తం టపాలు [366]
శిరా కదంబం [SRRao] మొత్తం టపాలు [356]
story [MOHAMMED 9440682081] మొత్తం టపాలు [349]
నా కవితలు [ఆత్రేయ కొండూరు] మొత్తం టపాలు [345]
నా ప్రపంచం [cbrao] మొత్తం టపాలు [342]
దార్ల [డా.దార్ల] మొత్తం టపాలు [342]
టపాకాయ [AMMA ODI] మొత్తం టపాలు [339]
Satyam Sivam Sundaram [Syam and Madhu Mallampalli] మొత్తం టపాలు [334]
24 గంటలు [satyam] మొత్తం టపాలు [332]
Lahari.com [Sadhu.Sree Vaishnavi] మొత్తం టపాలు [332]
నాన్న [భాస్కర్ రామరాజు] మొత్తం టపాలు [322]
సురుచి [జ్ఞాన ప్రసూన] మొత్తం టపాలు [317]
శరత్ 'కాలమ్' [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [315]
శాస్త్ర విజ్ఞానము [నాగప్రసాద్] మొత్తం టపాలు [311]
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... [Ramu S] మొత్తం టపాలు [303]
4) 200 నుంచి 300 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
తెలుగురథం [కొంపెల్ల శర్మ] మొత్తం టపాలు [287]
మీ కోసం [SPLENDOR OF YOGA] మొత్తం టపాలు [283]
దీప్తి ధార [cbrao] మొత్తం టపాలు [282]
శీనుగాడి బొమ్మలు [శ్రీను] మొత్తం టపాలు [273]
telugu views [madhu's] మొత్తం టపాలు [271]
ఆనందిని [Kovela santosh kumar] మొత్తం టపాలు [263]
చదువరి [చదువరి] మొత్తం టపాలు [261]
cinemavinodam [raja] మొత్తం టపాలు [255]
ఆలోచనా తరంగాలు [సత్య నారాయణ శర్మ] మొత్తం టపాలు [254]
నెమలికన్ను [మురళి] మొత్తం టపాలు [253]
కావ్యాంజలి [Bukya Sridhar] మొత్తం టపాలు [240]
శోధన [Sudhakar] మొత్తం టపాలు [240]
తురుపుముక్క [కోడీహళ్ళి మురళీ మోహన్] మొత్తం టపాలు [239]
పంచామృతం - Panchamrutham - पन्चामृथं [uvratnam] మొత్తం టపాలు [238]
మరువం [ఉష] మొత్తం టపాలు [237]
Krishna's page [Krishna] మొత్తం టపాలు [233]
MAATA VARUSAKU బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని [bharath] మొత్తం టపాలు [229]
పాటల పల్లకి - నీ కోసం [Venu] మొత్తం టపాలు [229]
FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ [Fun Counter] మొత్తం టపాలు [228]
అక్షరాలను మధించాను... భావమనే సుధ కొసం.... [బుజ్జి] మొత్తం టపాలు [214]
ANALYSIS <<<>>> అనాలిసిస్ [seenu] మొత్తం టపాలు [213]
శ్రీ కృష్ణదేవరాయలు [డా.ఇస్మాయిల్] మొత్తం టపాలు [212]
తృష్ణ... [తృష్ణ] మొత్తం టపాలు [210]
వెన్నెల రాజ్యం [వెన్నెల రాజ్యం] మొత్తం టపాలు [208]
మా గోదావరి [Satyavati] మొత్తం టపాలు [205]
స్వరగీతిక [Swapna] మొత్తం టపాలు [203]
లేవండి,మేల్కొనండి..... [సురేష్ బాబు] మొత్తం టపాలు [202]
అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]
5) 100 నుంచి 200 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]
స్వరాభిషేకం [సెలయేరు] మొత్తం టపాలు [196]
జీవని [jeevani] మొత్తం టపాలు [191]
నా మదిలో ... [ప్రవీణ్ గార్లపాటి] మొత్తం టపాలు [189]
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి) [జాన్‌హైడ్ కనుమూరి] మొత్తం టపాలు [181]
About Telugu Media [abouttelugumedia] మొత్తం టపాలు [181]
నిఖిత చంద్రసేన [నిఖిత చంద్రసేన] మొత్తం టపాలు [180]
నా తెలుగు రాతలు! [Bhale Budugu] మొత్తం టపాలు [178]
సందేశం [MOVIE] మొత్తం టపాలు [177]
vanisudheer [vanisudheer] మొత్తం టపాలు [177]
తెలుగు జోక్స్ (Jokes in Telugu) [CH Gowri Kumar] మొత్తం టపాలు [176]
Telugu MP3 Songs I Free Download [Telugu Songs By Mohan] మొత్తం టపాలు [173]
స్వప్న రాగలీన [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [173]
Travel ,holiday packages,India Goa,Kerala [KR] మొత్తం టపాలు [171]
Shakthi's recipes [srinath kanna] మొత్తం టపాలు [170]
కలలు + కల్పనలు = నా కవితలు [కలలు + కల్పనలు + నా కవితలు] మొత్తం టపాలు [169]
గడ్డిపూలు [Sujata] మొత్తం టపాలు [164]
Manoharam [Hima Bindu Kodali] మొత్తం టపాలు [161]
సాహితీ-యానం [బొల్లోజు బాబా] మొత్తం టపాలు [157]
GPVPRASAD [prasad] మొత్తం టపాలు [157]
శ్రీ శిరిడీ సాయి తత్వం [saiabhay] మొత్తం టపాలు [155]
Through The Looking Glass [కొత్త పాళీ] మొత్తం టపాలు [151]
అంతర్యానం [కొండముది సాయికిరణ్ కుమార్] మొత్తం టపాలు [148]
సాహిత్య అభిమాని [శివ] మొత్తం టపాలు [147]
విశ్వామిత్ర...మరో ప్రపంచం [శ్రీనివాస్ పప్పు] మొత్తం టపాలు [145]
సాహితి [మాలా కుమార్] మొత్తం టపాలు [143]
కిటికీ [నాగరాజు రవీందర్] మొత్తం టపాలు [143]
Telugu Vara Mandi [Telugu Vara Mandi] మొత్తం టపాలు [142]
శ్రీమదాంధ్రమహాభారతము-ఆణిముత్యాలు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [142]
రేఖా చిత్రం [సురేఖ] మొత్తం టపాలు [142]
www.youthatheart.in [HARISH] మొత్తం టపాలు [141]
అవీ-ఇవీ [త్రివిక్రమ్ Trivikram] మొత్తం టపాలు [141]
స్మృతులు [chava] మొత్తం టపాలు [140]
మధురవాణి [మధురవాణి] మొత్తం టపాలు [140]
రాజు గారి బ్లాగు [Hollywood Actors] మొత్తం టపాలు [139]
హిమబిందువులు [చిన్ని] మొత్తం టపాలు [138]
•▬• దీపావళి •▬• [Phani Yalamanchili] మొత్తం టపాలు [138]
................................ అంతరంగ తరంగాలు [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [136]
వరూధిని [Zilebi] మొత్తం టపాలు [136]
సరిగమలు... గలగలలు [రాజి] మొత్తం టపాలు [134]
fukuoka farm [Poodoori Raji Reddy] మొత్తం టపాలు [134]
విశాల ప్రపంచం... [మోహన] మొత్తం టపాలు [132]
నీ ధ్యాసలో....... [పండు] మొత్తం టపాలు [132]
బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]
బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]
అర్జునుడి బాణాలు... [మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్] మొత్తం టపాలు [131]
Padmarpita.... ['Padmarpita'] మొత్తం టపాలు [128]
కాలాస్త్రి [శ్రీ] మొత్తం టపాలు [127]
ఓ నేస్తమా [నరేష్] మొత్తం టపాలు [126]
కథా మంజరి [పంతుల జోగారావు] మొత్తం టపాలు [126]
పరిమళం [పరిమళం] మొత్తం టపాలు [124]
సూక్తి ముక్తావళి [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [121]
నైమిశారణ్యం [జ్యోతి] మొత్తం టపాలు [121]
కొత్త బంగారు లోకం _ తెలుగుకళ [తెలుగుకళ] మొత్తం టపాలు [121]
భగవాన్ కార్టూన్స్ [shaneer babu] మొత్తం టపాలు [120]
వాణీ పుత్రుని వాణి [Chittoor.S.Murugesan] మొత్తం టపాలు [120]
మనోనేత్రం [Sandeep] మొత్తం టపాలు [119]
మనసులో కురిసిన వెన్నెల [hanu] మొత్తం టపాలు [118]
అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [118]
యాత్ర - A Travelogue [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [118]
తెలుగు వెలుగులు ....... మీ కోసం ..... [బాలాజీ . మాడభూషి] మొత్తం టపాలు [116]
క ళా స్పూ ర్తి [బుసాని పృథ్వీరాజు వర్మ] మొత్తం టపాలు [115]
కొత్త బంగారులోకం [విహారి(KBL)] మొత్తం టపాలు [115]
సంకీర్తన [విహారి(KBL)] మొత్తం టపాలు [114]
హాస్యాంజలి [రాంగోపాల్] మొత్తం టపాలు [112]
నెల్లూరు బ్లాగుల సముదాయం.... nellore blogs junction... [వాసిలిసురేష్] మొత్తం టపాలు [111]
written by suman [సుమన్.గద్దె] మొత్తం టపాలు [111]
ఉబుసు పోక [చక్రవర్తి] మొత్తం టపాలు [111]
పలక - బలపం [సత్యప్రసాద్ అరిపిరాల] మొత్తం టపాలు [110]
మధురభావాల సుమమాల [రమణి] మొత్తం టపాలు [110]
Webdunia Telugu [Webdunia] మొత్తం టపాలు [108]
వాగ్విలాసము [రాఘవ] మొత్తం టపాలు [108]
కాల్పనిక లోకం [NARESHKOTA] మొత్తం టపాలు [107]
sarada [sarada] మొత్తం టపాలు [107]
జాహ్నవి [జాహ్నవి ని] మొత్తం టపాలు [106]
రాగం [చైతన్య] మొత్తం టపాలు [106]
Poetry [Pravallika] మొత్తం టపాలు [105]
ఉగాది పచ్చడి .... [శ్రీ] మొత్తం టపాలు [105]
నాతో నేను నా గురించి... [వేణూ శ్రీకాంత్] మొత్తం టపాలు [105]
Aaaalu [aaaalu] మొత్తం టపాలు [104]
Bhakti Ganga by Shri Dattaswami (భక్తి గంగ) [Shri Dattaswami] మొత్తం టపాలు [104]
Malekala's poetry [naveen malekala] మొత్తం టపాలు [103]
మోహనరాగాలు [పద్మ] మొత్తం టపాలు [103]
మాదిగకవులు [డా.దార్ల] మొత్తం టపాలు [101]
జీవితంలో కొత్త కోణం... [శ్రీనివాసకుమార్] మొత్తం టపాలు [101]
త్యాగరాజు కీర్తనలు [శ్రీ హర్ష PVSS Sri Harsha] మొత్తం టపాలు [101]
తెలుగు 'వాడి'ని [తెలుగు'వాడి'ని] మొత్తం టపాలు [100]
తెలుగుసినిమా చరిత్ర [L.VENUGOPAL, JOURNALIST, PRO] మొత్తం టపాలు [100]
ఆగండంగండి. అప్పుడే అయిపోలేదు. 99 కున్న ప్రాముఖ్యత మనకందరికి తెలిసిందే కదా. మరి ఈ క్రిందివారు 99 Not out వారికి కూడా శుభాకాంక్షలు.
మనసులో మాట [సుజాత] మొత్తం టపాలు [99]
అందం [రాకేశ్వర రావు] మొత్తం టపాలు [99]
"కృష్ణశ్రీ" [కృష్ణశ్రీ] మొత్తం టపాలు [99]
ఇక 0 నుండి 99 టపాలను వ్రాసిన వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆలింకులను ఇక్కడ ఇవ్వలేక పోతున్నాను.
హబ్బ... చెమటలు పట్టేసాయి ఈ మాత్రం టైపు చేసే సరికి, ఇక నేను 2000 వ్యాసాలను ఎప్పుడు వ్రాస్తానో ఏమో :(
పనిలో పనిగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పడం మరవకండేం :-)
అదండీ చూశారా మన తెలుగు బ్లాగుల్లో ఎంతమంది ఉత్సాహవంతులైన ప్రచురణ కర్తలు, రచయితలు, పాఠకులు ఉన్నారో.. ఇలాగే తెలుగు ఈ అంతర్జాల ప్రపంచంలో నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఆలోచనలతో భారతీయ భాషలకొక చుక్కానిలాంటిది కావాలని మనఃస్పూరిగా ఆశిస్తూ..
సెలవు.
మాంచి సమాచారం సోదరా
రిప్లయితొలగించండిశ్రమకు అభినందనలు సోదరా!
రిప్లయితొలగించండిచాలా వివరాల్తో కూడిన సమాచారంతో ఎన్నో బ్లాగుల వివరాలు వాటి లింక్స్‌తో సహా ఇచ్చారు. థ్యాంక్యూ భాస్కర్రామిరెడ్డి గారూ.
రిప్లయితొలగించండిఅభినందనలు, ధన్యవాదాలు భాస్కర్,..
రిప్లయితొలగించండిగీతలహరిలో 500 టపాలు ఉన్నాయి..ఇది చేర్చాలనుకుంటా.
సోదరులు భాస్కర రామరాజు, విజయ మోహన్
రిప్లయితొలగించండివ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.
Your Honor,I object geetika gaaru, నా పేరు భాస్కర రామిరెడ్డి... భాస్కర్రామిరెడ్డి కాదండి. :-)
రిప్లయితొలగించండిసరదాగే వ్రాసాలెండి..మొదటి కామెంట్ వ్రాసారు కదా నా బ్లాగులో అందుకని :)
వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.
జ్యోతీగారు లింకు తెలిపినందుకు ఒకసారి, వ్యాఖ్యకు మరో సారి ధన్యవాదాలు
రిప్లయితొలగించండిశబాసో!
రిప్లయితొలగించండిఅభినందనలు మరియు ధన్యవాదములు భాస్కర్ గారు.
రిప్లయితొలగించండిశాస్త్రవిజ్ఞానంలో అన్ని పోస్టులు రాసింది నేను కాదు. శ్రీనివాస చక్రవర్తి గారు. ఆ బ్లాగు మాత్రమే నాది. అందులో ఇప్పటిదాకా రాసింది మాత్రం శ్రీనివాస చక్రవర్తి గారు. :-). కాబట్టి, పేరు సరిచేయగలరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిGreat effort
రిప్లయితొలగించండిఅభినందనలు భాస్కర్ గారు
ఇరగదీసారు రెడ్డి గారు, అభినందనలు!
రిప్లయితొలగించండినాదొక విన్నపం.. తెలుగులో మొదటి బ్లాగు ఎవరిది? సీనియారిటీ బట్టి బ్లాగులని వరసక్రమం లో పెడతారా ? అలా కాకపోయినా ఇప్పటి వరకు తెలుగులో ఎంత మంది బ్లాగర్లు వున్నారు ?
ధన్యవాదములు
రిప్లయితొలగించండిchaalaa krushichesaaru,dhanyavaadaalu.entaina sontaperu choosukonte ekkadainaa enta aanandamO!
రిప్లయితొలగించండిgnana prasuna
మంచి ప్రయత్నం. మీరు ఇంకొక కాటగిరీ కూడా పెడితే బాగుండేది..ఎక్కువ రోజుల్లో తక్కువ టపాలు వ్రాసినవాళ్లు అని..తప్పకుండా నా పేరు మొదట్లో ఉండేది:))
రిప్లయితొలగించండిఅభినందనలు సోదరా!:)
రిప్లయితొలగించండిఒహ్ సూపరు....అభినందనలు. చెమటోడ్చి చేసిన ఏ పనైనా విజయం సాధిస్తుంది. great effort!
రిప్లయితొలగించండిదయచేసి మన్నించండి Your Honor ... ఇక మీదట ఈ తప్పు జరగనీయం.
రిప్లయితొలగించండిసరేనా... భాస్కర రామిరెడ్డి గారూ.
ఇక నేను చాలా బ్లాగులు (అలాంటి వాటిలో మీ బ్లాగ్ ఒకటి) ఫాలో అవుతుంటాను గానీ కామెంట్ చేయడం మాత్రం బాగా తక్కువ.
నేను కూడా 99 నాటవుట్. మరి ఇందు నా నామధేయము లేదేమి ?
రిప్లయితొలగించండి@ వరూధిని గారు ఎక్కువరోజుల్లో తక్కువ టపాలు రాసినవాళ్ళ లిస్టులో నేను మీతో పోటీకొస్తా
చాలా కష్టపడ్డారు కదండి..వెల్ డన్!!!!
రిప్లయితొలగించండిభాస్కర్ గారికి బక్కెట్టెడు బూస్ట్ ఫర్ ఎనర్జీ:)
Thank Q!
పద్మార్పిత, మరి భాస్కర్ ఈ పని కోసం ఎన్ని కిలోల పులిహోర కలిపి ఉండొచ్చు..అది లేకుంటే ఎలా?? :))
రిప్లయితొలగించండిరెడ్డి గారూ,
రిప్లయితొలగించండిఅదరగొట్టేసారుగా! చాలా కష్టపడి భలే మంచి జాబితా తయారు చేసారు. మా అందరి తరపునా అభినందనలు అందుకోండి.
హి హీ..నేనూ ఉన్నా ఈ లిస్టులో! ;-)
బావుంది.
రిప్లయితొలగించండి2000 వ్యాసాల కథ కమీషు ఏంటీ? అన్ని వ్రాయాలని ఎప్పుడు, ఎందుకు కంకణం కట్టుకున్నారేంటీ? నేనూ ఇలాగే కంకణాలు కట్టుకొని చిరాకేసినప్పుడు గోడకు వ్రేలాడదీసేస్తుంటాను. మళ్ళీ బుద్ధిపుట్టినప్పుడు మళ్ళీ చేతికి వేసుకుంటాను. అదీ నా కంకణవ్యూహం.
భాస్కరరామిరెడ్డి గారూ !
రిప్లయితొలగించండిచాలా ఎక్సర్ సైజ్ చేసారు. బ్లాగులన్నిటినీ ఒకతాటి మీదకు తెచ్చినందుకు అభినందనలు
చాలా శ్రమ పడ్డారు . బాగారాశారు . అభినందనలండి .
రిప్లయితొలగించండిఓహ్ నా పేరు కూడా వుంది . థాంక్ యు .
జ్యోతిగారు...పాపం! మనం ఇబ్బంది పెట్టడం ఎందుకండి?
రిప్లయితొలగించండిభాస్కర్ గారు బూస్ట్ తాగి తరువాత చెపుతారుగా:):):)
http://harephala.wordpress.com/
రిప్లయితొలగించండిvarivi more than 100 kada?
రవి ధన్యవాదాలు నేస్తమా.
రిప్లయితొలగించండినాగప్రసాద్, అయితే మీరు ఇల్లు కట్టి అద్దెకిచ్చేశారన్నమట ;)
శ్రీనివాస చక్రవర్తి గారూ, తెలుగు బ్లాగుల్లో శాస్త్ర రచనలకు శ్రీకారం చుట్టి నిర్వధికంగా దూసుకు పోతున్నందుకు మీకు ధన్యవాదాలు
హరేకృష్ణ గారూ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
కృష్ణ, ఏమి ఇరగదీసాను? నా కీబోర్డు బాగానే వుందప్పా ;) మరే, రెడ్డిగారా మజాకా కదా...నువ్వే చెప్పు :-)
రిప్లయితొలగించండిఇక మీ అభ్యర్థన కార్యరూపం దాల్చాలంటే కూడలి వారు వారి వద్ద నున్న లింక్స్ ను వెలువరిస్తే చెప్పగలను. కారణం హారం వద్ద 2000 లోపే వున్నాయి. ఉన్న లిస్టులోనే ఒక పట్టిక తయారు చేసి పోస్టు వ్రాస్తాలే.
ఇక ఎంతమంది అనేది చెప్పడం కష్టం. Active గా ఉన్న బ్లాగులు 1500 + కాబట్టి, సరాసరిన ఒక్కొక్కరు రెండు బ్లాగులు నిర్వహిస్తున్నారు కాబట్టి [ కొందరు మూడు,నాలుగు బ్లాగులను కూడా అలవోకగా నిర్వహిస్తున్నారు ] సుమారుగా 700 మంది ఉండవచ్చని నా అంచనా.
జ్ఞాన ప్రసూన గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిసిరిసిరిమువ్వ గారూ, అలాంటి లిస్టు రాద్దామనుకొని మీకు పోటీ నేనొస్తానేమోనని మానేశాను. ఇంతకీ నా పేరు మిస్సింగ్ లిస్టులో నుండి :(
అమ్మఒడి సోదరీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
ఆ.సౌమ్య గారూ, నిజమేనండీ రెండు బకెట్ల చెమట అనవసరంగా వేస్టయింది. :)
గీతిక గారూ , ఫరవాలేదండీ..సరదాగా తీసుకోండి. నా బ్లాగును ఫాలో అవుతున్నందుకు నెనరులు.
రిప్లయితొలగించండిలలిత గారూ, మీరు రేగొడియాలు ఎగ్గొట్టారు కదా. అందుకే మీ బ్లాగు హుష్ కాకి :)
అయినా నేనీ వ్యాసం వ్రాసే సమయానికి మీరు 97 దగ్గర మహా జిడ్డుగా బ్యాటింగ్ చేస్తున్నారు :)
పద్మార్పిత, మీరేదో పులిహోర చేసి పెడతారనుకుంటే ఇలా బక్కెట్టడు బూస్ట్ ఇస్తే ఎలా? సరే ఏదో ఒకటి కానీ బక్కెట్టు బూస్ట్ తాగాక హెల్త్ చెకెప్ కూడా మీరే చెయ్యాలి మరి :)
జ్యోతీ గారూ, ప్చ్.. కలపాలనుకుంటే ఈ మధ్య పప్పులు ఉడకటం లేదండీ. మీరేమన్నా కలిపితే విని పెడతా :)
రిప్లయితొలగించండిమధురవాణీ గారూ, ఊరకరారు యువరాణీ లని ’మధుర’ వాక్కులను కూడా చేర్చాను మరి :-) అవునండీ ఇంతమంది చాలా కష్టపడ్డానని ధన్యవాదాలు చెపుతుంటే అఫీసు లో పని చేసేప్పుడు నటించినట్టు ఇక్కడ కూడా కష్టపడ్డట్టు నటించేస్తా :)
శరత్, పైన వారు వ్రాసిన వ్యాసాలు చూశాక కొద్దిసేపు ఆవేశం వచ్చి అలా వ్రాసాను. ఇప్పుడు అంత ఆవేశం లేదు. ఏదో ఆడ లేడీస్ బూస్ట్ కలిపిస్తే మళ్ళీ అలోచిస్తాను.
ఇకపోతే స్వేచ్చగా నచ్చింది వ్రాసుకొనే పరిస్థితి ఇంకా తెలుగు బ్లాగుల్లో రాలేదనే చెప్పాలి. దాడులు ప్రతిదాడులు బాగానె ఉన్నాయి కదా. కాకపోతే మీకు సలహాగా ఒక్కమాట. వ్యక్తిగత విషయాలు మరీ ఎక్కువగా వ్రాయడం అంత మంచిది కాదేమో అలోచించండి. పాటించడం పాటించక పోవడం మీ చేతుల్లో ఉన్నా మీరు వ్రాసేవి పూర్తి ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేస్తాయేమో ఆలోచించండి.
S.R.Rao గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. చాలా కాలం తరువాత మళ్ళీ చూస్తున్నాను మీ వ్యాఖ్య. సంతోషం.
రిప్లయితొలగించండిమాలాకుమార్ గారూ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
మళ్ళీ పద్మార్పిత, పద్మములను అర్పించువారికి.. సరే నండీ ముందు బూస్ట్ ఇవ్వండి, పులిహోర గురించి మనం మనం తరువాత మాట్లాడుకుందాం. :-)
పానీపూరీ గారు ముందే చెప్పా కదండీ హారం వద్ద వర్డ్ ప్రెస్ లో వ్రాసిన వ్యాసాలు అన్నీ లేవండీ. అందుకే పైన ఇచ్చిన జాబితా బ్లాగ్ స్పాట్ వాఅరివే. ఇక
రిప్లయితొలగించండిhttp://harephala.wordpress.com/ గారివి హారం వద్ద 97 మాత్రమే వున్నాయి.
మీరు ప్రస్థావించింది నా శరత్ కాలం టపాల గురించా లేక స్వప్నరాగలీన లోని టపాల గురించా?
రిప్లయితొలగించండిభ.రా.రె గారు అంతేనా....అంతేనా.....అంతేనా...హు..హు...హు..... ( మీకో సీక్రెట్ తెలీదుకదూ ...మీ వ్యాసం చూసాకా బాగాలేవని పబ్లిష్ చెయ్యకుండా దాచిపెట్టిన రెండు టపాల్ని పబ్లిష్ చేసి 99 చేసా .ప్చ్....అయినా పని జరగలేదు )
రిప్లయితొలగించండి" ముందు తెలిసెనా ప్రభూ......
కాస్త ముందు తెలిసెనా........." అని పాడుకుంటాలెండి
భాస్కర రామి రెడ్డి గారు ,
రిప్లయితొలగించండిపాపం చిన్న పిల్ల అడుగు తోంది . 99 నాట్ ఔట్ లో లలిత బ్లాగ్ కూడా చేర్చండి .
( లలిత గారు ,
నేను మీ పేరు రికమెండ్ చేసానుగా , మీరు నా కమ్మటికలలను రికమెండ్ చేయండి సరేనా ? )
మీకు ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిఅయినా రికార్డులకోసం టపాలు వ్రాస్తామా? .....స్తే, రెండువేలేం ఖర్మ......!
జీవని గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశరత్, నేను ప్రస్థావించింది శరత్ కాలంలో కొన్ని కొన్ని వ్యాసాలకు మాత్రమే వర్తిస్తుంది.
లలిత గారూ :-) ఈసారికంతే , మళ్ళీ వచ్చేసంవత్సరం మీరి పంపే రేగొడియాలబట్టి చూద్దాం లేండి :)
మాలా కుమార్ గారూ :-), వ్యాఖ్యకు ధన్యవాదాలండి
కృష్ణశ్రీ గారూ పైన వ్రాసినవారిలో రికార్డులకోసం ఎవరైనా వ్రాశారా? వ్యాఖ్యకు ధన్యవాదాలు.
సిరిసిరిమువ్వ గారు, లలిత గారు మరి నేనో:)
రిప్లయితొలగించండిభాస్కర రామిరెడ్డి గారు అభినందనలు.
koddigaa laeTugaa abhinandanalu bhaa.raa.re.
రిప్లయితొలగించండిInteresting stats.
రిప్లయితొలగించండిThank you for taking the time and putting in the effort to share this.
On the whole, original content generation is still a long way off in Telugu blogs.
జయ గారూ, మీరూ మీరూ చూసుకోండి :). వ్యాఖ్యకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిసునీత ధన్యవాదాలు
కొత్తపాళీగారూ, మనకున్న బ్లాగర్ల సంఖ్య వేలల్లోకి మారితే గానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయేమో.
భాస్కర్ గారూ ! చాలా శ్రమపడి సమాచారం అందించారు మాకు ! అభినందనలండీ ...అలాగే థాంక్స్ కూడా ...
రిప్లయితొలగించండి23 జులై 2010 నాటికి 112 టపాలతో ఉన్న నా బ్లాగు "Dr. Acharya Phaneendra", మిత్రుని కంటికి ఆనలేదెందుకో ?
రిప్లయితొలగించండిఏమైనా మంచి పరిశోధన ... తెలుగు బ్లాగులను గురించి అధ్యయనం చేయాలనుకొనే వారి కొరకు విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. అభినందనలు!
పరిమళం గారూ వ్యాఖ్యకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిఫణీంద్ర గారూ మీరు http://dracharyaphaneendra.blogspot.com ఈ బ్లాగులో ఆ రోజుకు మీరు పబ్లిష్ చేసిన వ్యాసాలు 57 మాత్రమే.
భాస్కర రామిరెడ్డి గారు !
రిప్లయితొలగించండినేను wordpress లో ఒక బ్లాగు, blogspot లో రెండు బ్లాగులు నిర్వహిస్తున్నాను. మీకు తెలియనిది కాదు. 112 టపాలు దాటిన నా wordpress బ్లాగులో మీరెన్నో వ్యాఖ్యలు వ్రాసారు. అయినా అదో పెద్ద విషయం కాదు. వదిలేయండి. మీరంత కష్టపడి, పరిశోధించి వ్రాసిన వ్యాసం సమగ్రంగా ఉందని మన్ననలు పొందాలనే నా అభిప్రాయం.
Wonderful work, sir. Thanks a lot.
రిప్లయితొలగించండిRamu
apmediakaburlu.blogspot.com
ఫణీంద్ర గారూ, మీ పద్య బ్లాగు తెలుసు. కానీ పైన ఇచ్చిన వివరాలు ముందు చెప్పినట్టు బ్లాగ్ స్పాట్ లింకులు మాత్రమే. వ్యాఖ్యకు ధన్యవాదాలు సోదరా.
రిప్లయితొలగించండిసీతారాం గారూ నాకు తెలిసి మీ మొదటికామెంట్ నా బ్లాగులో. ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిథాంక్ యు సారూ..మీ ఈ టపా చూసాక..నేను ఫాలో అవలసిన బ్లాగ్స్ లిస్టు ని అప్ డేట్ చేసుకుంటున్న :))
రిప్లయితొలగించండి@Spoorthi, thanks for your comment.నా బ్లాగు కూడా ఫాలో అవుతున్నారన్నమాట ;)
రిప్లయితొలగించండిడియర్ భా.రా.రె.!
రిప్లయితొలగించండిఓ చిన్న సూచన--హారం లో టపాలు అప్ డేట్ అవుతున్నప్పుడు, కొత్త టపా పైన చేరి, క్రింద ఆఖరి టపా బయటికి వెళ్లిపోతున్నట్టుంది.
1. పాత టపాలకి లింకు అయినా పెట్టండి (లేదా)
2. పాత టపాలు పైనా, కొత్త టపాలు క్రిందా వచ్చేలా మార్చండి (లేదా)
3. ఒక టపా చూశాక, స్క్రోల్ బటన్ మళ్ళీ మొదటికి వచ్చేస్తోంది--అలా కాకుండా ఆ బటన్ మనం పెట్టుకున్న చోటే వుండేలా మార్చగలిగితే బాగుంటుంది.
--లేకపోతే, వరుసగా టపాలు చదవడానికి చాలా ఇబ్బంది అవుతోంది.
ప్రయత్నించండి.
కృష్ణశ్రీ గారూ, మీరు చెప్పింది సరిగా అర్థంచేసుకోలేక పోతున్నాను. కొంచెము వివరంగా వ్రాయగలరా?
రిప్లయితొలగించండిడియర్ భా.రా.రె!
రిప్లయితొలగించండిఅంత కాంప్లికేటెడ్ యేమీ కాదు.
ఉదాహరణకి, ఇప్పుడు నా బ్లాగులోని హారం లింకు ద్వారా వెబ్ పేజీ తెరవగానే, మొదట "SCREEN.COM::Great Truths about..." మొదటి టపాగా కనిపిస్తూంది.
ఆఖరి టపా గా, "~Few snapshots by Aparna~::komgA dAni...." కనిపిస్తూంది.
నేను ఆఖరి టపా చదివాక, మళ్లీ హారం దగ్గరకి వస్తే, మళ్లీ మొదటి టపానే చూపిస్తుంది--క్రిందనించి రెండో టపా--"కథా మంజరి:: ఏది సత్యం.............." చదవాలంటే, స్క్రోల్ బటన్ ద్వారా క్రింది చివర దాకా రావలసి వస్తోంది!
ఇలోగా, యేదైనా టపా విడుదల అయితే, "SCREEN....." రెండోది అయిపోయి, అప్పుడే విడుదలైన టపా మొదటిది అయిపోతోంది.
చివరి టపా "~Few snapshots....." బయటికి వెళ్లిపోయి, "కథా....." చివరి టపా అయిపోతూంది.
అదుగో! రానే వచ్చాయి 2 కొత్త టపాలు--"telugu views::....." అనీ, "మా గోదావరి::........" అనీ!
నిన్న నేను, "శిరాకదంబం::ఆంధ్ర పుణ్యక్షేత్రాలు" చూసి, నిద్రవస్తోందని కట్టేశాను--ఇవాళ ఆ టపాయే కనపడడం లేదు--దాని తరవాత టపా యెలా చూడగలను?
అర్థమయ్యిందనుకుంటా?
మీరు చేయగలిగింది చెయ్యండి--లేకపోతే, మా ప్రాప్తం ఇంతే అనుకుంటాం!
కృష్ణశ్రీ గారూ, మీ వివరణకు ధన్యవాదాలు. అర్థమయింది. త్వరగా చేస్తానని చెప్పలేను కానీ వచ్చే మూడుగు నాలుగు నెలల్లో హారంలో పర్సెనలైజేషన్ ఇంప్లిమెంట్ చేసే ఆలోచన్ వుంది. అప్పుడు ఇలాంటి కష్టాలు వుండవు. కొంచెమ్ ఓపిక పట్టండి.
రిప్లయితొలగించండిశ్రీ భాస్కర రామి రెడ్డి గారూ ! క్షేమమా? మీ యీ కృషికి అభినందనలు.
రిప్లయితొలగించండిఇక పొతే ,మూడు వందల ఎనిమిది రచనలు, తెలుగు కామెంట్లతో ఫొటోలతో మొత్తం నాలుగు వందల ముఫై అయిదు ప్రచురణలు వున్న , ఒక సంవత్సరం రెండు మాసాలు నిరంతరంగా కొనసాగిన "nutakki.wordpress.com" తెలుగు బ్లాగు గిజిగాడిని మరచితిరదేల ?....
....శ్రేయోభిలాషి ,....నూతక్కి రాఘవేంద్ర రావు.
నూతక్కి గారూ నమస్కారము. నేను కుశలమే, మీరు? వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇకపోతే ఇక్కడ ఇచ్చిన బ్లాగు పట్టిక కేవలం బ్లాగ్ స్పాట్ వారివి మాత్రమే అని మనవి. వివరాలు ఇంతకు ముందు కామెంట్స్ లో వ్రాసాను. చూడగలరు.
రిప్లయితొలగించండిదన్యవాదాలు భాస్కర రామిరెడ్డి గారు....!
రిప్లయితొలగించండిమీ గురించి ఈనాడు లో చదివాం. మీ కృషి అభినందనీయం.
ఈ పోస్ట్ నేను ఇప్పుడే చూసాను.
రిప్లయితొలగించండినిజ్జంగా నిజ్జంగా గ్రేట్ వర్క్ భాస్కర రామి రెడ్డి గారు .
ముందు ముందు ఏదో ఒక ప్లేస్ లో నా బ్లాగ్ కూడా ఉంటుందని భావిస్తూ...మీకు మరోసారి అభినందనలు.
శైలబాలగారి కామెంట్ చూసి, లింక్ తెరిస్తే, పాత టపానే!
రిప్లయితొలగించండిమరి 2011 "స్టాట్స్" యెప్పుడు ప్రచురిస్తారు? అసలు .....స్తారా?
యేమైనా మీకు మరోసారి ధన్యవాదాలు.
https://www.blogger.com/profile/12121701681361463485
రిప్లయితొలగించండిఅద్భుతము