30, జులై 2018, సోమవారం

వీరమాచినేని రామకృష్ణ డైట్ - మొదటి ఆరురోజుల పరిశీలన

నా ఆహారంలో పుట్టినప్పటి నుంచి పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా రాగులు,సొజ్జలు,జొన్నలతో చేసిన సంగటి,అన్నము ప్రధానంగా వుండేది. వాటితో కలిపి తోటలో పండిన కూరగాయలూ. పద్దెనిమిదవ యేట ఇంటర్మీడియట్ చదవడానికి దగ్గరలోని పట్టణానికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకూ బియ్యపు అన్నము ప్రధాన ఆహారం. కొన్ని సంవత్సరాలుగా పొట్ట పెరిగి బాగానే కనిపించే స్థాయికి చేరింది. రెండేళ్ళ నాడు డాక్టరు దగ్గరకెళితే అన్నీ బాగున్నాయి కానీ సుగర్ లెవల్స్ కొంచెం ఎక్కువున్నాయని చెప్పాడు ( 111 ). చెప్పిన కొన్ని రోజులు కొంచెంజాగ్రత్తగా వున్నా మళ్ళీ మామూలే. ఈ సంవత్సరం మార్చిలో వెళితే సుగర్ లెవల్స్ 101 వున్నాయని చెప్పాడు. నేను ప్రత్యేకంగా యేమీ జాగ్రత్తలు తీసుకోలేదు కానీ ప్రతి మీల్ లో నెయ్యి తప్పకుండా వేసుకొని తినేవాడిని. దీనితో కొలస్ట్రాల్ లెవల్ కొంచెం పెరిగింది. 2017లో 194 వున్నది  2018 లో 208 కి వచ్చింది. బహుశా ఈ తేడా నెయ్యి తినడంతో వచ్చిందో లేక రిపోర్ట్ లలో తేడాలో తెలియదుకానీ నా డైట్ లో నిన్నటి వరకూ ఎలాంటి తేడా లేదు. బరువు వుండవలసిన దానికంటే పదిహేను పౌండ్లు ఎక్కువున్నాను.

ఈ మధ్య యూ ట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వీడియో లు చూడటం అంతకు ముందే వీరమాచినేని డైట్ అని ఫేస్ బుక్ లలో చూడటం వల్ల ఇదొక రకమైన డైట్ ప్లాన్ అని సూచాయగా తెలుసు కానీ ఆయన వీడియోలు నేనెప్పుడూ వినలేదు. ఓ నాలుగు రోజుల ముందు ఈయన అసలేమి చెప్తున్నాడో విందామని ఒక పూర్తి నిడివి వీడియో విన్నాను.ఇదేదో బాగుందనిపించి చేద్దామనిపించింది. చేసే ముందు ఎందుకు చేస్తున్నానో కొన్ని గోల్స్ సెట్ చేసుకోవాలి కదా. ఇది చేయడానికి ప్రధాన కారణాలు రెండు.

౧) బరువు పదిహేను పౌండ్లు తగ్గడం ద్వారా పొట్ట యేమైనా తగ్గుతుందేమో చూడటం.
౨) సుగర్ లెవల్స్ ను 80-90 మధ్యకు తీసుకురావడం
౩) కొలొస్ట్రాల్ లెవల్ ఎంత పెరుగుతుందో చూడటం.

సరే పైమూడు మనసులో వుంచుకొని ఈ డైట్ చేయడానికి పూనుకొని కాస్ట్కో కు వెళ్ళి ఈ క్రిందివి కొనుక్కొని వచ్చి నిన్నటి నుంచి చేయ్డం మొదలు పెట్టాను.

Before starting this diet I completely scanned my physical test results that I have for this year and my Kidney and Liver function is normal. It is highly advisable to check your reports before starting this diet.

ఈ డైట్ చెయ్యటం వల్ల తప్పకుండా గ్లూకొజ్ లెవల్స్ తగ్గుతాయి.అలాగే డీ హైడ్రేషన్ కూడా జరుగుతుంది. వీటి రెంటిని కోల్పోవడం వల్ల మొదలుపెట్టిన తొలిరోజుల్లో చాలా ఎక్కువగా బరువు తగ్గుతాము.నేనైతే అంతా సవ్యంగా వుంటే ఒక రెండు వారాలు చేద్దామనుకొంటున్నాను.


వంటింటి స్కేల్ ( వైయింగ్ మిషెన్) మీద మొదటగా డెబ్బై గ్రాముల కొబ్బరి నూనె తూస్తే చిన్న టీ కప్ లో మూడొంతులు వచ్చింది. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. ఏంటి రోజూ ఇంత నూనె నా వొక్కడికీ వాడాలా అని? సరే నిండా మునిగాక చలెందుకులెమ్మని బ్లాక్ టీ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలుపుకొని అతికష్టం మీద తాగాను. ఇలా కాదని మిగిలిన నూనె మొత్తాన్ని చికెన్ లో వేసి ఫ్రై చేశాను. ప్రొద్దుట పూట అల్పాహారం వీకెండ్స్ తప్పితే సాధారణంగా తినే అలవాటు లేదు కాబట్టి మధ్యాహ్నం దాకా ఆకలి వెయ్యలేదు. మధ్యాహ్నం ఒక రెండువందల గ్రాముల చికెన్ ఫ్రై బౌల్ లో వేసుకొని తిన బోతే వెఘతు వేసింది. కొంత తిని మిగిలింది పక్కన పెట్టాను. నిమ్మకాయలు ఎలాగూ మూడు వాడమన్నారు కాబట్టి నీళ్ళలో అప్పుడప్పుడు కలుపుకొని త్రాగాను. దీని వల్ల వుపయోగమేమిటంటే కొబ్బరినూనె తినడం,త్రాగడం వల్ల వాంతి ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు.

అన్నము దండిగా తింటున్న శరీరము ఊరుకోదు కదా మళ్ళీ మూడు గంటలకాకలేసింది. మిగిలిన చికెన్ ఫ్రై తినేశాను. సాయంకాలం ఏడు కాగానే మళ్ళీ ఆకలి. కొనుక్కొని వచ్చిన చికెన్ స్టాక్ లో బెల్ పెప్పర్,మష్రూమ్స్ వేసి సూప్ తాగాను. పది గంటలకు మళ్ళీ ఆకలి. రెండు ఆమ్లెట్స్ వేసుకొని తిన్నాను. మధ్య మధ్యలో వాల్ నట్స్, బాదం పప్పు తిన్నాను.

నాకు విటమిన్ డెఫిషియన్సీ   లేదు కాబట్టి విటమిన్ టేబ్లెట్ వాడలేదు. బహుశా ఈ డైట్ వల్ల రావచ్చేమో కాబట్టి ఈ శనివారం నుంచి మొదలు పెడతాను.

ఈ ప్రక్రియలో కల్లా అతి కష్టమైంది కొబ్బరినూనె సేవనం. ఈ డైట్ పాటించే వాళ్ళందరూ దాన్ని వేడినీళ్ళలో ఒక్కసారే వేసుకొని త్రాగడం చేస్తున్నారు కానీ నాకది కష్టంగా వుండటం వల్ల. ఒక ఇరవై నుంచి ముప్పై గ్రాములు బ్లాక్ టీ లో వేసుకొని త్రాగడం ద్వారా మిగిలింది కూరల్లో వాడటం ద్వారా చేద్దామని నిర్ణయించుకున్నాను.

Benefits of using coconut oil


ఈ డైట్ ని స్థూలంగా అధ్యయనం చేస్తే ఇది కీటో డైట్ కు దగ్గర పోలికలున్న డైట్. మనము కార్బోహైడ్రేట్స్ వాడకం తగ్గించి ప్రొటీన్, ఫాట్ వాడకం పెంచుతున్నాము. రోజూ చికెన్ నేను తినలేను కాబట్టి కూరగాయలేమేమి కీటో డైట్ లోకి వస్తాయో గూగుల్ చేశాను.

https://www.ruled.me/best-low-carb-vegetables-ketogenic-diet/

ఈ రోజు రెండవరోజు. మొదటి రోజు కొంచెం తలనొప్పి అనిపించింది. రెండవరోజు వాంతికొస్తున్న ఫీలింగ్ వల్ల నిమ్మకాయ నీళ్ళు త్రాగడంతో సర్దుకుంది.

మొదటి రోజు వున్న బరువుకన్నా ఈ రోజు సుమారు ఒక పౌండ్ తక్కువున్నాను.

మొదటి రోజు బరువు - 151.8
రెండవ రోజు బరువు -  151 ( varieing between 150 and 151)

ఇక ఏ కూరగాయలు వాడొచ్చు ఏవి వాడకూడదన్న దానికి ఒక ఛార్ట్. స్తూలంగా మరీ ఎక్కువ కార్బ్స్ వున్న కూరగాయలను వాడకూడదు.

రెండవ రోజు మధ్యాహ్న భోజనంగా కాలిఫ్లవర్, వంకాయ కలిపి చేసిన కూరా నాలుగొందల గ్రాములు తీసుకున్నాను. ఈ డైట్ మీరు పాటించాలకుంటున్నా, ఒకవేళ పాటించినా మీ అనుభవాలను వ్యాఖ్య ద్వారా పంచుకోంటారని ఆశిస్తున్నాను.76 వ్యాఖ్యలు:

 1. ఈ రోజు(రెండవరోజు) మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిన్న కాలిఫ్లవర్ ఐదుగంటలకల్లా అరిగిపోయింది. ఐదున్నరకు అరుగుల (Arugula ఆకులు) మరియు రెండు కోడిగుడ్లతోటి కూర చేపించుకొని తిన్నాను. ఇప్పుడు తొమ్మిదిన్నరైంది.ఏమీ ఆకలి అనిపించడంలేదు.:) బరువు ఎంతున్నానో రేపు చెప్తాను. ఈ రోజు తలనొప్పి లేదు కానీ వాంతుల ఫీలింగ్ ఒక మూడుసార్లు అనిపించింది. ( ఎక్కువ కొబ్బరినూనె వాడినప్పుడల్లా). ఇలా ఒక వారం రోజులు వాడి రెండో వారం కూడా కంటిన్యూ చేస్తే కొబ్బరినూనె డోస్ తగ్గిద్దామనుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ ప్రయోగ ఫలితాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నా. డాక్టర్ చెకప్ ప్రతి వారం చేయించుకోండి ముందు జాగ్రత్తకై.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. C.B.Rao గారూ, ధన్యవాదాలండీ. నేను పదిరోజులు లేదా రెండు వారాలు చేసి చూద్దామనుకుంటున్నాను. రెండు వారాల తర్వాత డాక్టర్ ను సంప్రదిస్తాను.

   తొలగించు
 3. రెండవ రోజు పూర్తయి, మూడవరోజు ఉదయానికి నా బరువు 149.6 పౌండ్లు

  ప్రత్యుత్తరంతొలగించు

 4. భగవంతుడా ! ఈ అబ్బాయిని రక్షించు

  ఆమెన్ ఓ ఫాదర్ ఇన్ హెవన్ హేవ్ మెర్సీ‌

  హే అల్లా తేరీ‌ రహమ్ హో బచ్చే కో బచావో‌ :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Bro! Do more walking and adopt activity. 12000 steps a day, strength training, cross fit, hiit kind of workouts can make a difference. My triglycerides were high, ldl high and hdl was a bit low. i took salad more than grains. i walked everyday 12000+ steps. every hour i took a break and walked for 10 mins. increased activity. all my counts adjusted automatically.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. please be careful of this diet
  the ketogenic diet is dangerous
  your lipid profile will be messed up
  vrk claims that the lauric acid in coconut oil is the cure all-it isn't
  do something more sensible and increade exercise,try to cut down/eliminate meats and animal products
  plant based diets are much better

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాత, Thanks for your advise, but I do want to experiment this diet for a week or 10 days and go for physicals to see the difference. This is my 3rd day and so far the results are promising though I can't conclude anything until I go for a checkup.

   తొలగించు
 7. ఈ రోజు మూడవరోజు ఉదయం ఒక వంద గ్రాముల చికెన్, మధ్యాహ్నం రెండొందల గ్రాముల కేలీఫ్లవర్, రాత్రికి రెండు కోడిగుడ్లు ఒక బెల్ పెప్పర్, ఒక వంకాయ తో చేసిన కూర డిన్నర్. శనివారం కావడంతో యాక్టివ్ లైఫ్ స్టైల్ నడిచింది. ఉదయమూ,సాయంత్రం కలిసి గంటన్నర నడిచాను. ఇదికాక వీకెండ్ గ్రాసరీ షాపింగ్ నడక అదనం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  2. అనంత్ అంబానీలాగా ప్రొద్దున్నే మూడు గంటలకు లేచి రోజుకి 24 కి మీ (ఇంటినుండి రానూ పోనూ కలిపి) పరిగెత్తితే 108 కేజీలనుండి 70 కేజీలకు మూడు నెలల్లో తగ్గిపోయి మీకిష్టమైనవి మీరు తినవచ్చు.

   ఉ బో స !

   తొలగించు
  3. నీహారిక గారూ, అంత దూరం రోజూ పరిగెత్తగలిగే అవకాశమే వుంటే ఈ కష్టాలెందుకండీ. కానీ విపరీతమైన వర్కౌట్స్ చేస్తే యేమైనా తగ్గుతారేమో కానీ మామూలు ఎక్సరసైజ్ వల్ల నాకు తగ్గినట్టు అనిపించలేదు.

   తొలగించు

 8. ఫాస్డింగ్ కిడ్స్ :)

  ఫ్రైడు చికెన్లను తినుచున్
  సైడు హరిమల చిరుతిండి సైదోడవగన్
  గాడోన్లీ సేవ్ ఫాస్టింగ్
  బోడికలను రామకృష్ణ పుణ్యము గానన్ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ :-)
   చికెన్ నేను ఎక్కువ తినలేను కాబట్టి హరిమల చిరుతిండ్లతోటే లాగిస్తున్నాను.

   తొలగించు
 9. బరువులు పౌండ్లలో చెబుతే భారతదేశంలో కొందరికి అవి కీజీల్లో ఎంతెంతో సులభంగా అర్థం కాకపోవచ్చును.

  సులభోపాయం చెబుతాను.

  పౌండ్లను సగం చేసి పదవవంతు తీసివేస్తే కేజీలు. కేజీల్ని రెంట్టించి పదవవంతు కలిపితే పౌండ్లు.

  ఈ లెక్కల్లో తేడా స్పల్పంగానే ఉంటుంది.

  100 పౌండ్లు అంటే చూదాం. 100/2 = 50. దీనిలో పదవ వంతు 5 తీసివేస్తే 45 కేజీలు అన్నమాట. (నిజానికి 45.3592 కేజీలు)

  45 కేజీలు అంటే చూదాం. 45 x 2 = 90. దీనిలో పదవవంతును కలిపితే 90+9 = 99 పౌండ్లు అన్నమాట. (నిజానికి 99.208 పౌండ్లు)

  ఇలా సులభంగా నోటి లెక్కగానే పౌండ్లను కేజీల్లోనికీ, కేజీలను పౌండ్లలోనికీ మార్చుకోవచ్చును.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మూడవ్రోజు పూర్తయి, నాల్గవరోజు ఉదయానికి నా బరువు 147.6 పౌండ్లు (66.95 kg). అంటే మూడురోజులకు నేను 4.2 పౌండ్లు (1.9 kg) తగ్గాను. I can clearly see my tummy got reduced.
  ఈ రోజు కొంచెం( very light ) కాన్స్టిపేషన్ ఫీల్ అయ్యాను. కాబట్టి ఈ రోజు మీల్ లో హై ఫైబర్ కూరగయలు తీసుకుందామనుకుంటున్నాను. పాలకూర+ముల్లంగి+asparagus

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు ఎంత ఎత్తు ఉన్నారు ?
   మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు?
   కొబ్బరి నూనె త్రాగుతున్నారా ?
   త్రాగితే ఎలా తీసుకుంటున్నారు ?
   కూరల్లో వేసుకునా లేక కూల్ డ్రింక్ త్రాగినట్లా ?
   ఊరికే జెనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనీ :p

   తొలగించు
  2. నీహారిక గారూ జనరల్ నాలెడ్జ్ కేమీ బోలెడు విషయాలు చెప్తాను :)
   నా ఎత్తు 5' 35". ఐదడుగుల నాలుగంగుళాలనుకుంటే ఉండాల్సిన బరువు రేంజ్ 110 to 144 lb లేదా 50 kg to 65Kg. ఈ డైట్ మొదలెట్టకముందు నా బరువు 151.8 పౌండ్లు (68.8 kg).
   నేను ఒక పది నుంచి పదిహేను పౌండ్లు తగ్గాలని ప్రయత్నిస్తున్నాను.
   కొబ్బరినూనె నేను అరవై నుంచి డెబ్బై గ్రాములు ( సుమారు పందొమ్మిది టీ స్పూన్లు) రోజు మొత్తానికి కలిపి వాడుతున్నాను. అంటే వంటల్లో బ్లాక్ టీ లో కలుపుకొని లేదా కూర చేసుకున్నాక నెయ్యి లాగా ఓ మూడు స్పూన్లు వేసుకొని ఇలాగన్నమాట. ఉదయాన ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు సాయంత్రం ఒక మూడునుంచి నాలుగు స్పూన్లు బ్లాక్ టీ లో కలుపుకొని తాగుతున్నాను. మిగతాది కూరలు చేసేటప్పుడు లేదా నెయ్యి లాగా వాడుతున్నాను.

   తొలగించు
  3. మాకు కొబ్బరి నూనె అయితే ఫ్రీగా దొరుకుతుంది కానీ ఇష్టం ఉండదు. కొబ్బరి నూనె బదులు నెయ్యి వాడవచ్చా ? నెయ్యి అయితే ఎన్ని లీటర్లు త్రాగమన్నా నేను త్రాగేస్తాను. పెరుగులో నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది.

   తొలగించు

  4. కూడ దండి . బైదివే మీ స్లిమ్నెస్ కి ుుుుుుుుుుుుుుుు
   యివన్నీ అవసరంలేదనుకుంటా :)


   జిలేబి

   తొలగించు
  5. నిన్నటిదాకా ఇలియానాలాగా ఉండేదాన్నని మురిసిపోయా...నిన్ననే ఒకడు ఇలియానా ని
   "నీ బాడీ ఆక్వార్డ్ గా ఉంది కదా నువ్వేమీ ఫీలవవా ?" అని అడిగాడు.
   ఇలియానా ఫీలవలేదు కానీ నేను బోలెడు ఫీలవుతున్నా...
   నెయ్యి త్రాగితే తగ్గుతానేమో అనీ :(((

   తొలగించు
  6. సి..నే..మా. వాళ్ళ మాటలు, ఇంటర్వ్యూలు సీరియస్ గా తీసుకోవడం ఏమిటండీ మీరు కూడా? అబ్బెబ్బేబ్బే ☺

   తొలగించు
  7. @ *,
   భాస్కర రామిరెడ్డిగారిని రోజూ ప్రోత్సహించాలి.అందరిలా కేవలం విమర్శిస్తూ కూర్చోకుండా స్వయంగా రంగంలోకి దిగారు కదా ?
   ఎవరో ఏదో అన్నారని ఒకరోజు బాధ పడతాను.తర్వాత మర్చిపోతాను. నేనేమైనా ఎర్రగౌను వేసుకుని ఎర్ర తివాచీ మీద నడవాలా ఏమిటీ ?

   తొలగించు
  8. నీహారిక గారూ, మీరు అలా అంటే ఎలాగండీ? ఇలియానా లా తయారయ్యి ఎఱ్ఱ గౌనులో ఎఱ్ఱతివాచీ మీద నడుస్తూ కంటి చూపుతో కుఱ్ఱాళ్ళ మనసులు కొల్లగొట్టాల్సిందే :-)

   తొలగించు
  9. ఏతా వాతా తేలిందేవిటంటే వారం రోజులు కడుపు మాడ్చుకుంటే తగ్గిన బరువు 2 కిలో లు.చిన్నగా వాకింగ్ చేసినా తగ్గుతాము కదండీ ? అనవసరంగా నూనె త్రాగడం అవసరమా ?

   డేటింగ్ అయినా డైటింగ్ అయినా ఇష్టంగా చేయాలి.ఇన్నిరోజులే చేస్తాను తర్వాత మానేస్తాను అంటే కమిట్మెంట్ లేదన్నమాట ! ప్రేమకీ, శరీరానికి వ్యాయామం లేకపోతే జీవితం మీద ఆసక్తి ఉండదు.

   అన్నట్లు నేను "తుమ్హారీ సులు" లో విద్యాబాలన్ టైపు, ఎర్రగౌను నా శరీరానికి నప్పదు. ఈ క్రింది వీడియోలో సుమాంటీలాగా ర్యాంప్ పై నడవడం నాకు నచ్చదు. ట్రెండ్ ని ఇష్టపడతాను కానీ ట్రెండ్ ఫాలో అవను.అబ్బాయిలను పడెయ్యడం ఎవరయినా చేస్తారు. నేను అబ్బాయిలను సెట్ చేస్తాను,అంటే వెధవలను మంచివాళ్ళుగా తయారు చేస్తాను.ఈ ప్రోసెస్ లో కొందరు మంచివాళ్ళు చెడిపోతే నా బాధ్యత లేదు.ఎవరి శరీరాన్ని వాళ్ళు అదుపులో ఉంచుకోవాలి కదా ?
   https://youtu.be/BfFrvhaIZsc

   తొలగించు
  10. నీహారీక గారూ, మీరిక్కడ రెండు విషయాలు గమనించాలి.
   ౧) నేను కడుపు మాడ్చుకోలేదు. ఆకలైనప్పుడు సుభ్రంగా ఈ డైట్ లో తినగలిగిన పదార్థాలన్నీ ఒకటికి మూడు సార్లు తిన్నాను.
   ౨) కమిట్మెంట్ గురించి. మీరు నేను వ్రాసిన టపా అసలు చదివారా? నేను పెట్టుకున్న గోల్స్ రీచ్ అయ్యాక దేనికి కమిట్మెంట్ ఇవ్వాలి? ఇదేమైనా ప్రేమా,పెళ్ళా జీవితాంతం కమిట్మెంట్ యిచ్చి ఇలా మాత్రమే తింటాను, ఇది మాత్రమే తాగుతాను అని శపథాలు చెయ్యటానికి?

   ఇక బరువు తగ్గడం గురించి. మీరు చిన్నగా వాకింగ్ చేస్తూ ఎప్పటిలాగే తింటూ ఒక రెండు నెలలు నడిచి చూసి ఎంతబరువు తగ్గారో చెప్పండి.

   నేను "తుమ్హారీ సులు" చూశాను. అంటే అన్నింట్లో వేలు పెడుతుంటారన్న మాట :) JK

   తొలగించు

  11. >>>>మరో విషయం, దండిగా అన్నము,పప్పు,నెయ్యి, పచ్చళ్ళు తింటున్న శరీరం ఈ డైట్ ను భరించడం కష్టమనిపించింది ఐదవరోజు.ఇంకెంత రెండు మూడు రోజులే కదా అని నన్ను నేను నిగ్రహించుకున్నాను>>>>

   తొలగించు
  12. >>>>అసలైన కష్టమేమిటంటే ఈ డైట్ నుంచి బయటకు వచ్చాక ఈ బరువు పెరగకుండా చూసుకోవడం :)>>>

   ఇన్నిరోజులే చేస్తాను తర్వాత మానేస్తాను అంటే కమిట్మెంట్ లేదన్నమాట !

   తొలగించు
  13. >>>>మరో విషయం, దండిగా అన్నము,పప్పు,

   Yes that was my feeling on 5th day.Is that wrong in your view?

   >>ఇన్నిరోజులే చేస్తాను తర్వాత మానేస్తాను అంటే కమిట్మెంట్ లేదన్నమాట !

   మీరంటున్న కమిట్మెంట్ ఏంటో అర్థం కావడంలేదు. అంటే బరువు పెరగకుండా చూసుకొమ్మనా? లేక వీరమాచినేని డైట్ మానేయడం గురించా?

   తొలగించు
  14. >>>>ఇక బరువు తగ్గడం గురించి. మీరు చిన్నగా వాకింగ్ చేస్తూ ఎప్పటిలాగే తింటూ ఒక రెండు నెలలు నడిచి చూసి ఎంతబరువు తగ్గారో చెప్పండి.>>>
   నా గురించి చెప్పాలంటే నా లైఫ్ స్టైల్ గురించి చెప్పాలి.ఇప్పటికే మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. మీకు తెలుసుకోవాలని ఉంటే చెపుతాను.

   తొలగించు
  15. ఓ తప్పకుండా! దాని మీద ఒక పోస్ట్ వ్రాయండి.

   తొలగించు
 11. నాల్గవ రోజు పూర్తై ఐదవరోజు ఉదయానికి నా బరువు 147 పౌండ్లు. లేచిన వెంటనే చూసుకుంటే 146.2 పౌండ్లు, బ్లాక్ టీ తీసుకున్నతరువాత పౌండ్లు 147 చూపించింది.నాల్గవరోజు ఆహారంగా మధ్యాహ్నము ఒక పాలకూర కట్టలో మూడొంతులు, ఒక ముల్లంగి,రెండు వంకాయలతో కూర (450 gms) మధ్యాహ్నం పన్నెండున్నరకు తిన్నాను. సాయంత్రం ఐదున్నరకు క్యాలిఫ్లవర్ కూర 200 gms తిన్నాను. రాత్రి పదిన్నరకు చికెన్ స్టాక్ సూప్ ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే అటూ ఇటూ తిరుగుతూ బాదంపప్పు, వాల్ నట్స్ తీసుకున్నాను. ఈ రోజు కొంచెం కాళ్ళు చేతులు గుంజినట్టనిపించింది కానీ ఫుడ్ తీసుకొన్న వెంటనే సర్దుకుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. టపా శీర్షికను కూడా దినదినమూ సవరిస్తూ ఉండండి. ఇంకా మొదటి రోజు అంటే ఎలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఆన్లైన్లో yahoo lifestyle లో "8 Mistakes You Made On The Keto Diet" అని ఇందాక ఒక ఫొటోవ్యాసం కనిపించింది.

  "వీరమాచనేని డైట్" కిటో డైట్ నుండి స్ఫూర్తి పొందినదేనా (ఈ విషయంలో నాకేమీ ఐడియా లేదు)? భాస్కర రామిరెడ్డి గారు ప్రస్తుతం డైటింగ్ ప్రయత్నంలో ఉన్నారుగా, వారికి ఆసక్తికరంగా ఉంటుందేమోనని ఈ వ్యాసం లింక్ ఈక్రింద ఇస్తున్నాను.

  8 Mistakes You Made On The Keto Diet  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. ఎవరైనా ఒక మంచి ప్రయత్నం చెయ్యకూడదు, వెంఠనే వచ్చూడ్సి అందులో ఈ లొసుగుంది‌ ఆ‌ బొక్కుందీ అంటూ దీర్ఘాలు తీయడమే ? పదండి పదండి బడుద్ధాయిలారా మీ పనులు చూసుకోండేం :)

   మానాన్నే భారారె మీరు ఏ పరిస్థితులలోను మీ డేటింగ్ నాపకండి మీరే మాకందరికి‌ బక్రా మీరిచ్చేరంటే సర్టిఫికెట్టు ఇలియానాలూ గుండమ్మలూ అందరూ మొదలెట్టేస్తరు‌ :)


   కానివ్వండి. త్వరగా రిజల్ట్ కావాలె :)


   జిలేబి


   తొలగించు
  2. విన్నకోట నరసింహారావు గారూ, మీరిచ్చిన లింక్ చూస్తానండి. వీరమాచినేని గారి డైట్ కీటో డైట్ నుంచి స్పూర్తి పొందిందనే నాకనిపిస్తుంది. కానీ ఆయన దాన్ని ఆంధ్రీకరణ చేసి డైట్ గురించి ఏమాత్రం విషయజ్ఞానం లేని వారికి సైతం అర్థమయ్యేట్టు బండ గుర్తులుతో చెప్తున్నారు.దానివెనుక సైన్స్ కీటో డైట్ కు సంబంధించినదే అని నా అభిప్రాయం.

   తొలగించు
 14. కూల్ ... కూల్ ... “జిలేబి” గారు. కుట్రలాపండి ✋.

  ఆ డైటింగ్ విధానం యొక్క మంచీచెడుల గురించి కాదు యాహూలో వచ్చిన ఆ వ్యాసం. ఆ విధానాన్ని అనుసరించేవారు అనుసరించడంలో దొర్లడానికి ఆస్కారం ఉన్న పొరపాట్ల గురించి ఆ వ్యాసం. అవి సరిజూసుకుని సత్ఫలితాల కోసం ప్రయత్నించడానికి ... అవసరమైతే ... రామిరెడ్డి గారికి ఉపయోగపడుతుందేమోనని లింక్ ఇచ్చాను ... మీరన్నట్లు “వచ్చ్పూడ్సి” ... అంతే ☝️.

  రామిరెడ్డిగారూ గమనించండి, మిమ్మల్ని “బక్రా” గా చూస్తున్నారు “జిలేబి” గారు 🙁 (హ్హ హ్హ, పుల్లలు మేం పెట్టలేమా, “జిలేబి” గారూ 😎? గంటం, తాటాకు చేతిలో ఉన్నాయని పద్యాలు, వచనం చెక్కడమేనా వెంటనే “వచ్చ్పూడ్సి”, హన్నా 😡? అదీగాక రెడ్డిగారి “డేటింగ్” సంగతి మీకెందుకండి, డైటింగ్ గురించి మాట్లాడండి ☝️🙂 )

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. అంతేనంటారా ? :)

   జిలేబి

   తొలగించు
  2. హహహ విన్నకోటగారూ మీరు మరీనూ :).
   జిలేబీ గూర్చి ఎవరికి తెలియదు కనక :-). పుల్లలు పెట్టడం లో మొదటివరుసలో అధ్యక్ష స్థానం జిలేబీ గారిదే కదా :)

   తొలగించు
  3. జిలేబీ గూర్చి ఎవరికి తెలియదు కనక :-)

   తొలగించు
 15. ఐదవరోజు గడిచి ఆరవరోజు ఉదయానికి నా బరువు 145.8 పౌండ్లు. ఐదవరోజు నిద్రలేవగానే ఆకలి అనిపించింది. రెండు కోడిగుడ్లు, సగం కాప్సికమ్, పావు ఉల్లిగడ్డ తో కోడిగుడ్డు ఫ్రై కొబ్బరినూనె తో చేసుకొని తిన్నాను. మధ్యాహ్నం పెద్దగా ఆకలి అనిపించలేదు.నీరసమూ లేదు. చికెన్ స్టాక్ సూప్ మష్రూమ్స్, క్యారెట్ తో చేపించుకొని పన్నెండు గంటలకొకసారి మూడున్నర గంటలకొకసారి తాగాను. రాత్రికి ఒక కీరా దోసకాయ, ఐదు చిన్న చికెన్ ముక్కలు తిన్నాను. ఇంకో రెండు పౌండ్లు తగ్గితే నేను నార్మల్ వైట్ కు చేరుకుంటాను కాబట్టి బహుశా మరో రెండు రోజుల్లో దీనికి స్వస్తి చెప్పొచ్చు.

  మరో విషయం, దండిగా అన్నము,పప్పు,నెయ్యి, పచ్చళ్ళు తింటున్న శరీరం ఈ డైట్ ను భరించడం కష్టమనిపించింది ఐదవరోజు.ఇంకెంత రెండు మూడు రోజులే కదా అని నన్ను నేను నిగ్రహించుకున్నాను. కానీ అసలైన కష్టమేమిటంటే ఈ డైట్ నుంచి బయటకు వచ్చాక ఈ బరువు పెరగకుండా చూసుకోవడం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఆరవరోజు పూర్తైంది. ఈ రోజు నాబరువు 145 lb. అంటే ఇప్పటికి 6.8 lb ( 3.08 kg) తగ్గానన్నమాట. నిన్న కొబ్బరినూనె బహుశా ముప్పై ఐదు గ్రాములు తీసుకొని వుంటాను. మా ఆవిడ వంట చేస్తూ నేను కొలిచి పెట్టుకున్న కొబ్బరినూనె ను కూరల్లో అందరికీ వాడేసింది. కాబట్టి నెట్ 30-35 గ్రాములు తీసుకొని వుంటాను. ఇక ఉదయం సగం టమోటా, సగం ఉల్లిగడ్డ రెండు గుడ్ల తో కూరా, మధ్యాహ్నం క్యాబేజీ కూర, సాయంత్రం ఒక కీరా దోసకాయ, రాత్రికి మష్రూమ్స్, క్యారెట్ లతో చికెన్ సూప్ తీసుకున్నాను. మరో పౌండ్ తగ్గితే నేను నార్మల్ వైట్ కు వచ్చేస్తాను. కాబట్టి రెండు రోజుల్లో ఈ డైట్ ఆపేయవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. . . . . మా ఆవిడ వంట చేస్తూ నేను కొలిచి పెట్టుకున్న కొబ్బరినూనె ను కూరల్లో అందరికీ వాడేసింది. . . .

   మీరు ప్రత్యేకంగా తీసిపెట్టుకొన్న కొబ్బరినూనెను ఒక ప్రత్యేకమైన సీసాలో విడిగా ఉంచుకోవాలండీ. ఆ సీసామీద వీరమాచినేని గారి బొమ్మొకటి అతికిస్తిరా ఇంక ఆ సీసాజోలికి (మీరు తప్ప) ఎవ్వరూ పొరపాటున కూడా రారు!

   తొలగించు

  2. అంటే రోజుకో అర్ధ కిలో తగ్గేరన్న మాట

   గ్రేట్ ఇరవై రోజుల్లో పది కిలోలు తగ్గవచ్చు అంటే 55 కిలో లకొస్తారు

   జిలేబి

   తొలగించు
  3. గుడ్ సజషన్ శ్యామలీయం గారూ :) . అలాగే బ్లాగుల్లో,ఫేస్బుక్ లలో, వాట్సాప్ లలో యేదైనా వ్రాసే టప్పుడల్లా మీ బొమ్మొకటి తగిలిస్తే తెలుగు అక్షర దోషాలు లేకుండా పోతాయేమో ఆలోచించండి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడదాము.

   తొలగించు
  4. లేదండి జిలేబి గారూ, ఈ డైట్ ఫాలో ఐన చాలామంది నుంచి వచ్చిన రిపోర్ట్ యేమిటంటే మొదటి వారంలో తగ్గినంత రెండో వారంలో తగ్గుదల వుండదని.

   తొలగించు
  5. హ్హ హ్హ "జిలేబి" గారూ, మీరు కట్టిన లెక్క చిన్నప్పుడు అరిథ్-మెటిక్ లో చదివిన Time and Work లెక్కల్లాగా ఉంది 😀.

   తొలగించు

  6. థాంక్యూ థాంక్యూ థాంక్యూ విన్నకోట వారు ఇంకో వంద రోజులు ఈ ఉణ్ణావిరదం సాగిస్తే జీరో కేజీ కొచ్చేయడం ఖాయమేనంటారా ?


   జిలేబి

   తొలగించు
  7. అదేమో చెప్పలేను గానీ "జిలేబి" గారూ, ప్రయత్నం మరీ అతి అయిపోతే అనోరెక్సియా (anorexia) అనే భయంకరమైన అనారోగ్య కండిషన్ తగులుకునే ప్రమాదం ఉంటుంది 😩😮.

   తొలగించు
 17. మనలోమనమాట "ఉణ్ణావిరదం" అంటే ఏమిటి అర్థం, అది ఏ భాషాపదం "జిలేబి" గారూ😕?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. అబ్బబ్బ !

   ఈ తెలుగు వాళ్లకు తెలుగు నేర్పించట మన్నది మరీ కనాకష్టమై పోతా వుంది !

   నాకూ తెలియదు .

   పదమొచ్చూడ్సె తెలుగులో లేదంటే వేసేసుకుని ఓ వీరత్రాడాయ నమః‌ అనేయండి :)


   చీర్స్
   జిలేబి

   తొలగించు
  2. ఉణ్ణావిరదం అనేది జిలేబీ తెగులు భాషాపదం.

   తొలగించు
  3. అనుమానించాను, ఇప్పుడు మీరు ధ్రువపఱచారు. థాంక్స్ శ్యామలరావు గారూ ☺.

   తొలగించు


  4. ఆహా ఏమి నా భాగ్యము :)


   జిలేబి

   తొలగించు
  5. ఉణ్ణావిరదం అంటే Hunger strike in Tamil.

   తొలగించు

  6. హమ్మయ్య ! ఒక్క ట్యూబులైటు వెలిగె :)


   జిలేబి

   తొలగించు
  7. గూగుల్ వెంటనే చెప్పేసింది.వెలగడమేమిటీ ? అదికూడా తెలియకపోతే నీ ఖర్మే !

   తొలగించు
 18. మీరు నెయ్యి తింటేనే కొలెస్ట్రాల్ రిస్క్ అంటున్నారు. అలా పట్టించుకుంటే ఏమీ తినలేం. మరి మద్యం తాగేవాళ్ళ సంగతి ఏమిటి? కొలెస్ట్రాల్ కంటే ఆల్కహాల్‌తో రిస్క్ ఎక్కువ. బ్రాందీ తాగేవాళ్ళందరూ అర్ధాయువుతో చనిపోతున్నారా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. నెయ్యి బ్రాంది మద్యం కలిపి కొడితే మస్తుగా వుంటుంది పైపెచ్చు ఆరోగ్యంగా వుంటారు ఈ మూడు సమపాళ్ళలో కలిపి రవ్వంత ఉప్పు ( హిమాలయా ఉప్పు బెటర్) కలిపి తీసుకొనదగును


   జిలేబి

   తొలగించు
  2. అలవాటు లేని ఔపోసనలు ఇలాగే ఉంటాయి "జిలేబి" గారూ 😀. బ్రాంది అంటేనే మద్యాలలో ఒకరకం - జనరల్ నాలెడ్జ్ అండీ, జనరల్ నాలెడ్జ్ ☝.

   ఇక ఉప్పు - ఇటీవల కాలంలో రాళ్ళ ఉప్పుని పునరుద్ధరించి ఫాషన్ చేశారు మార్కెట్ ని ప్రభావితం చేసే జనాలు. సరే .. మీరన్నట్లు .. ఉప్పుని మద్యంలో కలిపెయ్యకూడదట ... కొంచెం ఉప్పు ఒక చేతిమీద పోసుకుని, మద్యం ఒక గుక్క తాగి ఆ ఉప్పు కాస్థ నాకాలట. ఎలా తెలుసంటారా? సినిమాల్లో విలన్ మద్యం తాగే సీన్లు చూడలేదేవిటీ 😀😀?

   తొలగించు


  3. ఓహ్ అవునా సినిమా నేను చూడలేదండీ.. :)

   ఈ మధ్య సీను సీను కీ క్రింద మద్య పానము హానికరము పొగ త్రాగుట హానికరము వస్తా వుంటే సినిమాలు చూడ్డం మానేసామండి :)


   జిలేబి

   తొలగించు
  4. ప్రవీణ్ భయ్యా..ఎన్నాళ్ళకెన్నాళ్ళకు బ్లాగులోకంలో కనిపించావు? అంతా క్షేమమేనా? నీ పోస్టూలకు వ్యాఖ్యలకు అడిక్ట్ అయిపోయి గూగుల్ ప్లస్ లో మార్క్సిస్ట్ హెగిలియన్ చదువుతుండేవాడిని.అదీ డిలీట్ చేసి అంతులేకుండా పొయ్యావు :). వ్యవసాయం బాగా సాగుతుందనుకుంటాను.

   నెయ్యి మానెయ్యక్కరలేదండీ. సుభ్రంగా రెండు పూటలా తినెయ్.యేమీ కాదు.మనము బాడీకి సరిపడినంత ఫ్యాట్ ఎలాగూ ఇవ్వటంలేదు.

   తొలగించు
 19. ఏడవరోజు పూర్తయింది. ఇప్పుడు నా బరువు 144.2 lbs. నిన్న సొరకాయ కూర, కేలిఫ్లవర్ కూర, రెండు గుడ్లతో ఆమ్లేట్, కీర దోసకాయ తిన్నాను.ఇక ఈ రోజు తో ఈ డైట్ పూర్తైనట్లే.ఈ ఏడు రోజుల్లో నాకు కడుపులో వికారం తప్పించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు.డైట్ ఆపిన తరువాత కూడా కొబ్బరినూనె తో వంటలు చేసుకొని తిందామని డిసైడ్ అయ్యాము. ఈ వారం రోజులుగా నన్ను ప్రోత్సహిస్తూ, జాగ్రత్తలు చెప్తూ,సరదా సరదా కామెంట్ల తో ఉత్సాహాన్నిస్తూ నా కార్యానికి సహకరిస్తూ వ్యాఖ్యలు వ్రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు


 20. ఏడవ దినమ్ము పూర్తా
  యే! డైటింగు మరి పూర్తయె శుభాసీసుల్
  యీడేర కష్టములు యీ
  నాడే తెలుపండి నాకు నాబ్లాగునకున్ :)

  శుభము కార్డు వేసితిమి‌ :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 21. దీక్ష పూర్తి చేసినందులకు రామిరెడ్డి గారికి అభినందనలు 👏.

  (శ్యామలీయం గారన్నట్లు ఇంక టపా హెడ్డింగ్ “మొదటి వారం రోజులు” అంటే బాగుంటుందేమో?’

  ప్రత్యుత్తరంతొలగించు
 22. ఇప్పడివరకు హరిబబు సురనెనిని పెట్టుకు వేల్లాడిన chirunkeevi Y కి పగేలిపోఎంది.
  GET LOST AND NEVERCOME BACK!"

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form