27, మార్చి 2009, శుక్రవారం
విరోధి ఉత్పలం
బ్లాగు మిత్రులందరికీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలతో విరోధి ఉత్పలం.
రాత్రి గడించె కోకిలల రాగ సుగీతములెల్ల ధాత్రి లో
కాంతి ప్రతిష్టచేయ, భువికాంతకు పట్టిన చీడలెల్ల నే
సాత్వికవాదినై కరుణ సాగర వాక్యముల్జెప్పి చూచినా,
రాతి మనుష్యులై వినని రాజుల పాలి విరోధి నయ్యెదన్
21, మార్చి 2009, శనివారం
బరహ, లేఖిని లలో API సహాయం
I wanted to share this with rest of the enthusiasts who have their own plans to develop Unicode related software.
My specific interest on ( http://www.unicode.org/charts/PDF/U0C00.pdf ) this chart is, in my web site ( http://www.haaram.com ), there is a need to parse English letters into Telugu letters ( font implementation may vary ) . I am not sure whether http://www.lekhini.org or http://www.baraha.com gives such server side functionality as a service. In other words I am looking for the following functionality. Baraha has an API and I am still validating it.
Private String ParseEnglishToTelugu( string _text)
{
Return _convertedTeluguText;
}
For example
“mIkevarikainaa iTuvaMTi saaPT vEr guriMchi telistE dayacEsi ceppagalaru.”
If we pass this string to the above functions, it should written
"మీకెవరికైనా ఇటువంటి సాఫ్ట్ వేర్ గురించి తెలిస్తే దయచేసి చెప్పగలరు."
I know that Lekhini is JavaScript based software and it seems to me that it identifies the letters on key press events and translate English letter to Telugu. I think this is primarily developed for Telugu typing use. I may be wrong, but if some one come across such functionality in Lekhini, please let me know. I would love to use it in my program with reference to Lekhini.org.
Baraha has many more additions along with API support and the interested techies can take a look at. I am also looking for expertise suggestions from the experts, pros and cons of the above implementation (Baraha and others.. others I don’t know )
http://www.baraha.com/help/sdk/brh_telapi_ref.htm
Similarly for those who has interest can also look at this URL to develop their own parsers.
http://www.unicode.org/charts/PDF/U0C00.pdf
15, మార్చి 2009, ఆదివారం
ఎ.ఐ.జి ... మజా మజా
A.I.G. అమెరికా ను ఒక ఊపు వూపిన కంపెనీ , తరువాత తనే ఒక ఊగు వూగిన కంపెనీ. ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఎలా వినియోగించుకుంటుందో ఈ లింక్ లో చదవండి. చదివాక మీకు ఏమనిపించింది?
http://www.nytimes.com/2009/03/15/business/15AIG.html?_r=1
14, మార్చి 2009, శనివారం
గజిబిజి జిగిబిగి - కవిత
కనులు మూస్తే కవితా తరంగాలు
కనులు తెరిస్తే కదన రాబందులు
రెప్పల చాటున చరించే కలలైనా
పెదవుల మాటున మసలే భావాలైనా
కలైనా, భావనైనా, కదిలే ఆలోచనైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
గుండెల మాటున గునపమైనా
మనస్సు లోపలి మలినమైనా
భాషరాని మూగజీవి రోదనైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
కళాకారుని కుంచెల రంగులైనా
కృతి కర్త ఘంటపు వెలుగులైనా
గాయకుని గాత్ర మాధుర్యమైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
పసిపాప పసిడి నవ్వులైనా
తల్లిప్రేమ లోతులైనా
పండువెన్నెల కాంతులైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
కనులు మూస్తే కవితా తరంగాలు
కనులు తెరిస్తే కదన రాబందులు
12, మార్చి 2009, గురువారం
రైలు ప్రయాణం - ఎండాకాలం - ఉత్పలమాల
ముచ్చట గా మూడోసారి మొదలెట్టిన బ్లాగు మూల పడుతున్న అనుమానమొచ్చి మళ్ళీ ఒక టపా రాద్దామని కంప్యూటర్ ముందు కూర్చున్నా. ౨౦౦౨ లో అనుకుంటా తెలుగు ను కంప్యూటర్ లో చూడాలని విపరీతమైన కోరిక. అందుకు geocities లో ఒక సైట్ open చేసుకొని అందులో నేను కాగితం మీద రాసుకున్న కవితలను scan చేసుకొని image రూపంలో upload చేసి, నాకు నేనే చూసుకొని ఆనంద లోకాల్లో విహరించే వాడిని. 9 నెలలు తిరక్క ముందే geocities లో నా వెబ్సైట్ గల్లంతు. దానితో పాటే నా కవితలు, కాకరగాయలు అన్ని hard disk పాలు.
రెండవ ప్రయత్నంగా నాకు నేనే ఒక వెబ్సైట్ స్ఫేస్ కొనుక్కొని నాకు నచ్చినవి, నచ్చనివి వ్రాసుకొనేవాడిని. ఏమైందో ఎమో గాని సంవత్సరము తిరగక ముందే అది కాస్తా Technical website గా మారడంతో దీనికి డబ్బులు ఎందుకు దండగ అని వెబ్సైట్ ని చంపేసాను.
ఇదిగో మూడోసారి కొద్దిగా సరైన దారిలో పోతున్నట్టే వుంది. కానీ రోజూ ఉద్యోగము చేయటానికి 8 గంటలు అయితే , ఇంటి నుంచి office కి , Office నుంచి ఇంటికి తిరగడానికి 4 గంటలు. శని, ఆది వారాల్లో మా ఇల్లాలి కి కార్ డ్రైవర్ గా వుద్యోగం చేయడం తో సరిపోతుంది.
రైలు ప్రయాణం ఎలాగు 4 గంటలు తప్పదు కాబట్టి రైల్లో సీటు దొరికిన రోజైనా ఏదో ఒక టపా వ్రాయాలని ఇదిగో మొన్న సోమవారం తెల్లటి పేపరు మీద నల్ల బాల్ పెన్ తో పిచ్చి రాతలు రాస్తున్నాను. ప్రక్కనుంచి ఒక తెలుగు మిత్రుడు
తెలుగు మిత్రుడు : Be a roman in a Rome.
నేను : అలాగే
ఆ తరువాత ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక అటు తిరిగి కూర్చొన్నాడు
ఇంకో రోజు ఇంకో వ్యక్తి
అతను : "why do you waste your time like this?"
నేను : What do you do in travel?
అతను : "I usally call my team and give them the directions."
నేను : What are you?
అతను : ( కొంచెం గర్వంగా ) "I am a project leader / manager in XXXXXXXX ." ( ఇక్కడ కంపెనీ పేరు చెప్పడం లేదు. ఇది పూర్వాశ్రమంలో నేను పనిచేసిన కంపెని ). ఒక్క క్షణం నాకు మార్తాండ గారు గుర్తుకొచ్చారు. ఎంత నిగర్వి ఎంత విద్యాసంపన్నుడు....
నేను : Wowww.. you are so great!!! what are your working hours?
అతను : "9 AM to 6 PM"
నేను : Ohh.. Then why are you calling your team now? Is something important?
అతను : "Well, I have to, 9 – 6 I work at client’s place. Rest of the time I work with offshore to manage the team and project."
నేను : What for?
అతను : ???? "I want to be a successful project manager and this project success is crucial for me to get into next band…"
నేను : Next ?
ఆ వ్యక్తి నన్నొక పిచ్చోడిగా చూసి , మెట్రొపార్క్ station వచ్చిందని లేచి వెళ్ళి పోయాడు.
ఇంకో రోజు ఇంకొన్ని రైలు విశేషాలు చెప్తాగానీ ... ప్రయాణంలో నేను హైదరాబాదు లో వున్న మా అమ్మ, నాన్న లకి ఫొన్ చేస్తే ఎండలు మండి పోతున్నయని చెప్పారు. అప్పుడే ఎండాకాలం వచ్చిందా అని, నా మనసులో సుడులు తిరిగిన భావాలే ఈ పద్య కవిత.
సందర్భం : భూమి మీద ప్రతి ప్రాణికి సూర్యరశ్మి చాలా అవసరం.సూర్యరశ్మి లేకపోతే భూమికి మనుగడ లేదు. ఎండ అవసరమే కానీ ఎండాకాలపు ఎండ తట్టుకోవడం చాలా కష్టం , భూదేవి తో సహా.
ఎండాకాలం వచ్చేముందు భూమి అంతా పచ్చిక బీడులతో , లేత చిగుళ్ళ పచ్చని చెట్లతో , బంగారు వన్నెల పొలాలతో కళ కళ లాడుతుంటుంది, అలాంటి సుందరమైన భూదేవిని ఎలాగైనా అనుభవించాలని సూరి బాబు కి కోరిక కలుగుతుంది.
పద్యభావం: అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఆశ చూపి ( చుక్కలు జూపి ) మోహముతో నన్ను ముద్దుపెట్టుకొని, నా చన్నుల రూపు, రుచి చూసి కామాగ్నిని తట్టుకొనలేక నాతో రమిస్తూ ముఖమంతా గోళ్ళతో గీతలు పడేటట్టు రక్కాడు. ( ఎండాకాలం లో భూమి సూర్యుని వేడికి బీటలు బారడం అతి సహజం. పరిమాణంలో భూమి, సూర్యుడు పెద్దవి కనుక, సూర్యుని గోటి గుర్తులే భూమి కి బీటలు ) . ఇన్ని చేసినా ఆకలి తో వున్న నా బిడ్డల ( సర్వ జీవరాశి ) ను చూసి , వేరే ఎటువంటి ఆలోచన లేక భరిస్తున్నాను.
పద్యము : ఉత్పలమాల
చుక్కల జూపి మోహమున చుంబన జేసె నిశాహరుండు నా
(చి)చక్కని పాల పొంగులు రుచించి తటాలున కామరూపి యై
మక్కువతో రమించి ముఖమంత నఖక్షత ముద్రలేసెపో
చిక్కిన బిడ్డలన్ దలచి చింతన మాని భరింతు మౌనమున్.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)