పోయిన సంవత్సరమే భారతీయభాషలన్నిబ్లాగుల కు విస్తరించాలని హారం లో చిన్నపాటి మార్పులు చేయడం జరిగినా పలు కారణాల వల్ల ఇంతవరకూ ఆ పని ముందుకు జరగలేదు. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి తొలివిడత ప్రయత్నంగా తమిళము, కన్నడ, హిందీ భాషలకు విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈ మనవి.
ఉత్సాహవంతులైన బ్లాగర్ల నుంచి "హారం అడ్మినిష్ట్రేటర్స్" కొరకు ఈ అభ్యర్థన. వీరు చేయవలసిన పనులు
౧) ముందుగా ఆయా భాషల బ్లాగుల లింకులను సేకరించడం
౨) సేకరించిన లింక్స్ ను హారంలో కలపడం
౩) టపాలు, వ్యాఖ్యల ను అవసరమైనప్పుడు నియంత్రించడం
౪) ఆయా భాషా బ్లాగుల్లో హారానికి ప్రచారము కలిపించడం
౫) ఇప్పటికే హారంలో వున్న పలు లేబుల్స్ ను ఆయా భాషలలోకి అనువదించడం
౬) హారం యొక్క లోగో ను స్థానిక భాషలో కి మార్చడం
౭) హారంలో ఉన్న పలు విభాగాల పేర్లను ఆయా భాషల్లోకి మార్చడం
పై విషయాలన్నింటిలో అడ్మినిష్ట్రేటర్స్ కు పూర్తి స్వేచ్ఛ ను ఇవ్వడం జరుగుతుంది. పోర్నోగ్రఫి కి స్థానం లేదు. ఇది చేయడం వల్ల మాకేమి లాభమంటారా? హారం తెలుగు బ్లాగుల అడ్మినిష్ట్రేటర్ గా నాకేలాభాలున్నాయో అవే. అంతకంటే ఏమీ లాభముండదని ముందుగా మనవి చేసుకుంటున్నాను.పూర్తి ఇన్ఫాస్ట్రక్చర్, సాంకేతిక సహాయాన్ని నేనే అందించగలను.
హారం-కన్నడ భాష కు అడ్మినిష్ట్రేటరు గా వ్యవహరించడానికి ఒకరు ముందుకు వచ్చారు. ఇక తమిళము, హిందీ మిగిలి వున్నాయి.
ఆసక్తి గల వారు admin@haaram.com కు మైల్ చేయవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form