సీన్ -౧
_________________
సార్, నేను కానిస్టేబుల్ ను మాట్లాడుతుండా సార్...
చెప్పరా...
ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర విజయమ్మ గారికోసం టెంట్లు వేస్తున్నారు సార్. ఏమి చెయ్యమంటారు సార్
ఒక్క నిమిషం లైన్లో వుండరా...
సార్.. నేను సి.ఐ ని సార్..
చెప్పరా..
ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర విజయమ్మ గారికోసం టెంట్లు వేస్తున్నారు సార్. ఏమి చెయ్యమంటారు సార్
ఒక్క నిమిషం లైన్లో వుండరా...
******
సీన్ -౧
_______________________
ఈ లోపు లోటస్ పాండ్ దగ్గర నుండి వెళ్ళే ప్రతి ఫోను ను ట్యాప్ చేస్తున్న అధిష్టానం ఈ విషయపై నిర్ణయానికి అత్యవసర మంత్రివర్గ సమావేశానికి అదేశాన్నించ్చింది. అధిష్టానం మీదనే యుద్ధమా అంటూ లైవ్ వీడియో ద్వారా అత్యవసర మంత్రివర్గ సమావేశమైంది.
అందరి కళ్ళూ ఎఱ్ఱగా వున్నాయి. అధినాయకత్వం చిరునవ్వు నవ్వింది. సమాధానంగా అందరూ చిరునవ్వే నవ్వారు. కానీ పెద సత్తిబాబు మాత్రం గట్టిగా సమర్ధించి మేడం గారి చల్లని చూపులకు పాత్రులవడానికి ఇంతకంటే మంచి సమయం రాదని తన రాజకీయ బుర్రనంతా వుపయోగించి బాగా ఆలోచించి అందరూ నవ్వడమయ్యాక ఘట్టిగా నవ్వారు. అవతలవైపు లైవ్ చూస్తున్న ఎవరో మంత్రి రాని దగ్గును తెచ్చుకోని గట్టిగా దగ్గాడు. సత్తిబాబు కు ఒక్కనిమిషం అర్థం కాలేదు. ఏయ్..ఎవరునువ్వు అంటూ అనుమానంగా అడిగాడు. అవతలి కంఠం పిచ్చోడో నేనే తెలియదా? మాపార్టీ సహాయం లేకుండా మీ సి.యం ఇంతకాలం పదవిలో వున్నాడనుకున్నావా??
ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న చిదంబరం గారు, కళ్ళజోడు తీసి పక్కనున్న గుడ్డతో తుడిచి మళ్లీ పెట్టుకోని హిందూ పేపర్ ను తిరగేసే పనిలో పడ్డాడు. ఎక్కడో 2G scam గురించి రాస్తే అది చదవడంలో నిమగ్నమై పోయాడు.
అధినేత్రి ఇబ్బందిగా కదలడం చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమావేశానికి హాజరైన ఓ నలుగురు మంత్రులు చర్చను మొదలు పెట్టారు.
ఏందిమేడం పిల్లనాయాలు వాడికోసం ఇంత ఇదయిపోతున్నారు. ఇప్పుడే ఏమి చేస్తానో చూడమని ఐ.జి కి ఫోను చేసి అక్కడ టెంట్లు పీకండ్రా అంటూ ఆజ్ఞాపించారు. ఈ టెంట్లు పీకే పని సి.ఐ కి చెప్తే ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తాడో నని ఏకంగా తనే కారులో బయలు దేరాడు.
సత్తిబాబు నీ బుర్ర భలే చురుకబ్బాయ్ అని అధిష్టానం మెచ్చుకుంది. చేతులు నలుపుకుంటూ మేడం మేడం..మరి... మరి...
ఎంటి బాబూ చెప్పు నాదగ్గర నీకు పూర్తి స్వేచ్ఛవుందని తెలుసుగా? ఇది విన్న సి.యమ్ గారు గుర్రుగా చూసారు.
ఏంలేదు మేడం ... ఇప్పుడూ ఇప్పుడూ.. ఈ రోజు వై.యస్సార్. పార్టీ బంద్ చేస్తామన్నారు కదా??
"ఏంటి సత్తి బాబు ఏంటి నువ్వు మాట్లాడేది? వాళ్ళు చెయ్యకముందే నిన్న మనం అధికారికంగా అన్ని సర్వీసులను నిలిపివేసి బంద్ చేసాము కదా " అంటూ సి.యమ్ అడ్డుకున్నాడు.
"కిరణ్.. సత్తిని చెప్పనివ్వూ...."
(లోలోపల కిరణ్.... నామాట వినకపోబట్టే ఇంతదాకా తెచ్చుకున్నారని అసహనంగా ఫీల్ అవుతాడు)
ఏంలేదు మేడం.. ఈ రోజు జగన్ కు ప్రచారం రాకుండా వుండాలంటే ముందుగా కేబుల్ కనక్షన్లను కట్ చేసేద్దాము.
ఎక్కడ నుండో చెవులు తుప్పు వదిలి పోయేసౌండ్ తో విజిల్ సౌండ్ వినపడింది. ఎవరా అని అందరూ అటు చూసారు. మొఖానికి రంగులేసుకోని స్టెప్పులేస్తూ ఎవరో కనిపించారు. అందరూ చప్పట్లు కొట్టారు.
మా శాయశక్తులా మాకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్లందరికీ చెప్పి మావంతు సహాయమందిస్తామని ప్రతిపక్ష పార్టీ హామీ నిచ్చింది.
ఉప్పొంగిన ఉత్సాహంతో మేడం మరో సలహా...
చెప్పు చెప్పు సత్తీ... నువ్వే కాబోయే సి.యం.
స్టెప్పులేస్తున్న చిరు..ఒక్కసారిగా ఆగిపోయాడు.
వింటున్న సి.యం. కండువా భుజానేసుకోని లేచారు.
ఏంలేదు మేడం రాష్ట్రమంతా పవర్ కట్ చేస్తేనో .....????
వెరీ గుడ్ సత్తీ... నువ్వాపని మీదుండు అని లైవ్ వీడియో మీటింగ్ కట్ అయిపోయింది.
సీన్ ౩
_______________________________________
సత్తి బాబు ఊరూరా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర లింకులు పీకడానికి బయలు దేరారు.
ప్రతి పక్షం కేబుల్ లైన్లు పీకే పనిలో పడింది
ఐ.జి. టెంట్లు పీకడానికి బయలుదేరారు.
సామాన్యుడు ఓటెయ్యడానికి పక్కనోడిని కూడా వెంటపెట్టుకోని పోలింగ్ బూత్ కు బయలు దేరాడు.
********************************
ఇక ఒక ఫొటో ఎన్నో అర్థాలను చెబుతుందంటారుకదా...అలాంటి ఫొటోలలో ఇదొక ఫొటో..