రెండూ రెండు వ్యతిరేక దిక్కులు. దేనికదే. కానీ బ్లాగులకు అంత త్వరగా ఆకర్షితులు కారు కానీ ఒకసారి ఫేసు బుక్కు అలావాటైందంటే దానిలోనుండి బయటపడటం కష్టమేమో.
బ్లాగుల్లో కొద్దో గొప్పో ఆలోచించి తమ భావాలన్నింటిని ఒక వ్యాసంగా వ్రాసేవాళ్ళే ఎక్కువ. అదే ఫేసు బుక్కు లో ఏక్షణం ఆక్షణమే. ఇప్పుడు వ్రాసింది మరో నిమిషంలో పాతబడిపోతుంది. కానీ బ్లాగుల్లో వ్రాసే వ్యాసాలకు సాధారణంగా జీవితకాలం చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి.
ఇదిగో ఈ మధ్యకాలంలో ఫేసుబుక్ వాడి తెలుగు టైపు చేయాలంటే టచ్ కూడా పోయినట్టుంది.
ఫేస్ బుక్ ప్రచారానికి బాగా పనికి వస్తుంది. బ్లాగు మన సొంతం.అంటే మన జీవన పరిణామక్రమంలో మన ఆలోచనల డైరీ ఈ బ్లాగు.
ఫేసుబుక్ లో ఫేకులెక్కువ. బ్లాగుల్లో కొద్దో గొప్పో ఫేకులకంటే ఫేసులకు, వారి వారి రచనలకు విలువ.
ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ యుర్ మైండ్ అంటారు కానీ ఫేసుబుక్ లో మైండ్ తక్కువ ఇండెక్స్ ఎక్కువ :-)
సాధారణంగా ఫేసు బుక్ చూస్తూ 24X7 లో గడిపేస్తుంటాము. బ్లాగులు చదువుతూ మనమేమి వ్రాయాలా అని 24X7 గడిపేస్తుంటాము. బహుశా వీటిరెండింటికీ పెద్ద తేడా ఇదేనేమో!