12, అక్టోబర్ 2013, శనివారం

ఫేస్ బుక్ మేలా బ్లాగు మేలా?


రెండూ రెండు వ్యతిరేక దిక్కులు. దేనికదే. కానీ బ్లాగులకు అంత త్వరగా ఆకర్షితులు కారు కానీ ఒకసారి ఫేసు బుక్కు అలావాటైందంటే దానిలోనుండి బయటపడటం కష్టమేమో. 

బ్లాగుల్లో కొద్దో గొప్పో ఆలోచించి తమ భావాలన్నింటిని ఒక వ్యాసంగా వ్రాసేవాళ్ళే ఎక్కువ. అదే ఫేసు బుక్కు లో ఏక్షణం ఆక్షణమే. ఇప్పుడు వ్రాసింది మరో నిమిషంలో పాతబడిపోతుంది. కానీ బ్లాగుల్లో వ్రాసే వ్యాసాలకు సాధారణంగా జీవితకాలం చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి. 

ఇదిగో ఈ మధ్యకాలంలో ఫేసుబుక్ వాడి తెలుగు టైపు చేయాలంటే టచ్ కూడా పోయినట్టుంది. 

ఫేస్ బుక్ ప్రచారానికి బాగా పనికి వస్తుంది. బ్లాగు మన సొంతం.అంటే మన జీవన పరిణామక్రమంలో మన ఆలోచనల డైరీ ఈ బ్లాగు. 

ఫేసుబుక్ లో ఫేకులెక్కువ. బ్లాగుల్లో కొద్దో గొప్పో ఫేకులకంటే ఫేసులకు, వారి వారి రచనలకు విలువ.

ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ యుర్ మైండ్ అంటారు కానీ ఫేసుబుక్ లో మైండ్ తక్కువ ఇండెక్స్ ఎక్కువ :-)

సాధారణంగా ఫేసు బుక్ చూస్తూ 24X7 లో గడిపేస్తుంటాము. బ్లాగులు చదువుతూ మనమేమి వ్రాయాలా అని 24X7 గడిపేస్తుంటాము. బహుశా వీటిరెండింటికీ పెద్ద తేడా ఇదేనేమో!

17 కామెంట్‌లు:

  1. ముఖపుస్తకమైనా,బ్లాగ్ అయినా మన ఆలోచనలు స్నేహితులతో పంచుకునే వాహికలు!అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా అవి వ్యసనంగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది!

    రిప్లయితొలగించండి
  2. బ్లాగ్ మాత్రమే బెస్ట్.ఫేస్ బుక్ నాశనానికి దారే!
    www.ahmedchowdary.blogspot.in

    రిప్లయితొలగించండి
  3. మొదటగా మిమ్మల్ని అభినందించాలి,నిష్పక్షపాతంగా రాశారు.
    ఇకపోతే నేను అహమద్ గారితో ఏకీబవిస్తాను.ఫేకుల నుండి మనల్ని కాపాడుకుందాం.

    రిప్లయితొలగించండి
  4. surya prakash apkari, yes, but facebook seems to be more addictive than blog platform. May be for unknown reasons I like blogs than FB.

    రిప్లయితొలగించండి
  5. ఫేస్ బుక్ అలవోకగా గీకే వ్యక్తిగత దినచర్య లాంటిది!ఫేస్ బుక్ రచయిత యొక్క identity card లాంటిది!ఎవరిదైనా ఏమైనా షేర్ చేసుకోవచ్చు!బ్లాగ్ ఒళ్ళు దగ్గరపెట్టుకొని సీరియస్ గా వ్రాయవలసిన సాహితీ విలువలు ఉండవలసిన కళాఖండం వంటిది!చెక్కిన శిల్పం వంటిది!దీనిని పడిశం పట్టినట్లు ఎడాపెడా ఆపకుండా ఏకధారగా వ్రాయకూడదు!అరుదుగా నదురుగా అపురూపంగా బ్లాగ్ లిఖించాలి!బాగా మూడ్ వచ్చినప్పుడు,చెప్పవలసిన విషయం ఉన్నప్పుడు,ఇక వ్రాయకుండా ఉండలేనప్పుడు బ్లాగ్ రచించాలి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య ప్రకాష్ గారూ, మీరు చెప్పే విదానం చాలా హుందాగా ఉంది. అనూగారి మాటకూడా నిజమే

      తొలగించండి
  6. ఫేస్ బుక్ కి addict అవ్వడానికి వయసుతో సంబంధం లేదు. జాగ్రత్తగా ఫ్రెండ్స్ తో మైంటైన్ చేసేవారూ ఉన్నారు....తమ సొంత అభిప్రాయాలను మంది మీద తోసే మహానుభావులూ ఉన్నారు. ఇక వారు తుమ్మినా, దగ్గినా....ఏ ఫోటో పెట్టినా...అది ఎలా ఉన్నా లైకులే లైకులు. వాళ్ళల్లో చాలామంది కి అసలు పరిచయం ఉందా అనిపిస్తుంది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత పేస్ బుక్ ద్వారానే మా ఫ్రెండ్స్ అందరం కలిసాము.ఇక ఫోన్స్ ఉండగా దాని అవసరం లేదులే అని చాలా సార్లు deactivate చేశా...అంతా గోల. నాకైతే బోర్ కొట్టేసింది fb...చాలా మటుకు ఫేక్ id సే అని మా ఫ్రండ్ కూతురు చెప్పింది.ఒక్కొక్కరికీ మూడు నాలుగు ids ఉన్నాయట...దారుణం కదా. I agree with da view of surya prakash garu.

    రిప్లయితొలగించండి
  7. ఫేస్ బుక్ లో ఫేకులెక్కువ అనే మాట నిజమే!తమ అభిమాన సినీ నటుని బొమ్మ తమ బొమ్మగా పెట్టుకుంటారు!అది వ్యసనంగా పరిణమించేమాటా నిజమే!like మైండెడ్ వారితోనే స్నేహం చేయాలి!మనకంటే జ్ఞానాధికులతో స్నేహం చేస్తే ఎన్నో నేర్చుకోవచ్చు!బ్లాగ్ లో వ్రాస్తే next post ఏమి వ్రాస్తారో అనే ఉత్సుకత తహతహ పెంచేవిధంగా రచనాశైలి ఉండాలి!చదువరికి విసుగు తెప్పించి బోర్ కొట్టి౦చకూడదు!sharp గా ,crisp గా వ్రాయాలి!

    రిప్లయితొలగించండి
  8. Bhaskar Garu,

    I'm sorry to comment on your post for something un-related, I tried sending an email to admin@haaram.com to contact you regarding a project for Telugu Nighantuvu, But the message has failed. is admin@haaram.com properly configured, If not do you have any alternate email id's?

    Thank you.

    రిప్లయితొలగించండి
  9. abhididdigi, hmm... I will check it tomorrow. May be a mail server issue.

    If you want to send messages on telugunighantuvu, please join in
    https://groups.google.com/forum/#!forum/telugunighantuvu

    రిప్లయితొలగించండి
  10. భాష గానీ ఏదన్నా విషయానికి సంబంధించింది గానీ ఐతే....బ్లాగే నయం.

    రిప్లయితొలగించండి

Comment Form