నాకు ఎ.బి.యన్ ఛానల్ లో ఏమి నచ్చినా నచ్చకపోయినా గరికిపాటి నరసింహారావు చేసిన నవజీవనవేదం చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. దీనిని నేను ఆయన భగవద్గీత చెప్తున్నప్పటినుంచి చూస్తున్నాను. సామాజిక వ్యాఖ్యానం కాబట్టి అన్ని విషయాలనూ ప్రస్తావిస్తూ నవజీవనవేదం రెండువేల భాగాలను పూర్తిచేశారు. ఎప్పుడో తప్పించి రాత్రి తొమ్మిదిగంటలకొచ్చే నవజీవనవేదం సాధ్యమైన ప్రతిరోజూ చూసేవాడిని.నిన్నటితో లలితాసహస్రనామ వ్యాఖ్యానంతోపాటి నవజీవనవేదం కూడా పూర్తైపోయింది.మనసు అల్లకల్లోలంగా వున్నప్పుడు గరికిపాటివారివ్యాఖ్యానం మనసుకు స్వాంతననిచ్చేది. గుడ్డినమ్మకాలను తూర్పారపట్టడంతో పాటి జ్ఞానమార్గానికి పెద్దపీట వేసి భగవత్భక్తి నిన్ను నువ్వు మంచిమనిషిగా మార్చుకోవడానికి వుపయోగపడాలని కుండబద్దలు కొట్టేవారు. మొదట్లో ఆయన శ్రావ్యంగా పాడే పద్యాలకు ఆకర్షితుడనయ్యాను. క్రమంగా ఆయన వ్యాఖ్యానానికి వ్యసన పరుడనయ్యాను. నిజానినికి నేను దేవుని గుడులకు వెళ్ళటం బహు తక్కువ. ఇక్కడ సంవత్స్రరంలో ఒక్కసారి గుడిని దర్శించుకోవడం కూడా అరుదే! కానీ దైవభక్తిలేదా అంటే లేదని చెప్పలేను. నాకు దేవుని పూజలతో కొలవడంకంటే దేవునిమీద చెప్పిన సాహిత్యం చదవడం ఇష్టం.అదిపాటైనా లేద పద్యమైనా లేద శ్లోకమైనా. సాహిత్యంలో ఏమి చెప్తున్నారో తెలుసుకోవడంలో మక్కువ. ఆ నా ఆసక్తికి గరికిపాటివారి వ్యాఖ్యానాలు ఇతోధికంగా సహాయపడ్డాయి.అలాంటిది ఈ రోజునుంచి ఈ ధారావాహికలైపోయాయంటే ఏదో వెలితి.
రిప్లయితొలగించండియూ ట్యూబులో మళ్లీ పునఃశ్చరణ చేయండి.
వాటిని ఆడియో ఫైల్స్ గా మార్చుకుని కార్లో పోయేటప్పుడు రోజుకో ఎపిసోడ్ వినండి.మరో పది సంవత్సరాలు సునాయాసంగా దొర్లిపోతాయి. ఆ తరువాత మళ్లీ మొదటి నుండి :)
ఐడియా బావుందా :)
జిలేబి
హహ..సలహా బాగుంది. విన్నదే మళ్ళీ మళ్ళీ వింటాము :)
రిప్లయితొలగించండివారి వాఖ్యానాలకు నేనూ వ్యసనపరుడనే, వారి వల్ల తెలుగు భాష పై మక్కువ ఎక్కువైనది.ముఖ్యముగా ప్రారంబ పద్యాలు ఆమోఘం.....
రిప్లయితొలగించండిఅవునండీ... మొదట్లో నేను సాహిత్యంలో హాస్యం చూసేవాడిని..అలా అలా అలవాటయ్యింది. ప్రవచనాలకు ముందుగా పాడే పద్యాలు ప్రత్యేకమే
తొలగించండి