3, సెప్టెంబర్ 2020, గురువారం

తప్పించుకోలేని పని... కానీ ఇది బుఱ్ఱ గోకుడు పని 🙂


ఏమీ పనిలేక బుఱ్ఱ గోక్కుంటూ మీ వెంట్రుకలు మీరే లెక్కపెట్టుకుంటున్నారా? ఐతే రండి మీలాగే ఈ రోజు నేను నా నెత్తి గీరుకుంటూ ఒక వీడియో చేశాను. వచ్చి ఓ అరగంట పల్లీలు తింటూ చూసేయండి.
గత వారం రోజులుగా మా ఇంటికి అమర్చిన Generac generator, green bulb తో పాటు Orange bulb కూడా వెలుగుతుంది. మెయింటెనెన్స్ వాడికి కాల్ చేస్తే వచ్చి చూసినందుకు నూటా ఇరవై డాలర్లడిగాడు.ఇదేమీ పెద్ద సమస్య కాదు కాబట్టి మనమే చేతికి గ్రీజు రాసుకుంటే పోలేదా అని చిన్న ప్రయత్నం. ఎలాగూ పని చేస్తున్నాను కాబట్టి ఓ సారి వీడియో తీసిపెట్టుకుంటే ఎలా వుంటుందని చిన్న ప్రయత్నం.యూట్యూబ్ లో జనాల వ్లాగ్స్ చూసి చూసి ఇలా తయారయ్యానన్నమాట 🙂. Voice over చెయ్యలేదు. పనిచేసేటప్పుడు ఏదనిపిస్తే అదే నాకు నేను చెప్పుకుంటూ మాట్లాడుకున్నాను 🙂. మధ్యలో బేటరీ కోసం ఒక షాపుకు కూడా వెళ్ళొచ్చాను. దాన్ని కూడా రికార్డ్ చెసిపెట్టుకున్నా 🙂
ఆలస్యమెందుకు..మీరూ నావీడియో చూసేసి ఓసోస్ యూట్యూబ్ వ్లాగర్ అంటే ఇంతేనా అని ఒక వీడియోతో జనాల్ని కొట్టండి 🙂.మన దెబ్బకు యూట్యూబ్ ఘనాపాటి లాంటి వ్లాగర్స్ అందరూ తలుపులు మూసుకోవాల్సిందే 🙂



2 కామెంట్‌లు:



  1. ఏదనిపిస్తే అదే నాకు నేను చెప్పుకుంటూ మాట్లాడుకున్నాను :)


    మెంటల్ కేసేమో అనుకోబోతారండోయ్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి పిలకాయా... నువ్వు ముందు ఇలాంటి భయాలనుంచి బయటపడకపోతే వ్లాగ్ చెయ్యలేవు నాయనా :)

      శీఘ్రమేవ వ్లాగ్ ప్రాప్తిరస్తు :)

      ఇట్లు
      భాస్కరానంద తీర్థంకర.

      తొలగించండి

Comment Form