12, మార్చి 2009, గురువారం

రైలు ప్రయాణం - ఎండాకాలం - ఉత్పలమాల

ముచ్చట గా మూడోసారి మొదలెట్టిన బ్లాగు మూల పడుతున్న అనుమానమొచ్చి మళ్ళీ ఒక టపా రాద్దామని కంప్యూటర్ ముందు కూర్చున్నా. ౨౦౦౨ లో అనుకుంటా తెలుగు ను కంప్యూటర్ లో చూడాలని విపరీతమైన కోరిక. అందుకు geocities లో ఒక సైట్ open చేసుకొని అందులో నేను కాగితం మీద రాసుకున్న కవితలను scan చేసుకొని image రూపంలో upload చేసి, నాకు నేనే చూసుకొని ఆనంద లోకాల్లో విహరించే వాడిని. 9 నెలలు తిరక్క ముందే geocities లో నా వెబ్సైట్ గల్లంతు. దానితో పాటే నా కవితలు, కాకరగాయలు అన్ని hard disk పాలు.

రెండవ ప్రయత్నంగా నాకు నేనే ఒక వెబ్సైట్ స్ఫేస్ కొనుక్కొని నాకు నచ్చినవి, నచ్చనివి వ్రాసుకొనేవాడిని. ఏమైందో ఎమో గాని సంవత్సరము తిరగక ముందే అది కాస్తా Technical website గా మారడంతో దీనికి డబ్బులు ఎందుకు దండగ అని వెబ్సైట్ ని చంపేసాను.

ఇదిగో మూడోసారి కొద్దిగా సరైన దారిలో పోతున్నట్టే వుంది. కానీ రోజూ ఉద్యోగము చేయటానికి 8 గంటలు అయితే , ఇంటి నుంచి office కి , Office నుంచి ఇంటికి తిరగడానికి 4 గంటలు. శని, ఆది వారాల్లో మా ఇల్లాలి కి కార్ డ్రైవర్ గా వుద్యోగం చేయడం తో సరిపోతుంది.

రైలు ప్రయాణం ఎలాగు 4 గంటలు తప్పదు కాబట్టి రైల్లో సీటు దొరికిన రోజైనా ఏదో ఒక టపా వ్రాయాలని ఇదిగో మొన్న సోమవారం తెల్లటి పేపరు మీద నల్ల బాల్ పెన్ తో పిచ్చి రాతలు రాస్తున్నాను. ప్రక్కనుంచి ఒక తెలుగు మిత్రుడు


తెలుగు మిత్రుడు : Be a roman in a Rome.
నేను : అలాగే

ఆ తరువాత ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక అటు తిరిగి కూర్చొన్నాడు

ఇంకో రోజు ఇంకో వ్యక్తి


అతను : "why do you waste your time like this?"

నేను : What do you do in travel?

అతను : "I usally call my team and give them the directions."

నేను : What are you?

అతను : ( కొంచెం గర్వంగా ) "I am a project leader / manager in XXXXXXXX ." ( ఇక్కడ కంపెనీ పేరు చెప్పడం లేదు. ఇది పూర్వాశ్రమంలో నేను పనిచేసిన కంపెని ). ఒక్క క్షణం నాకు మార్తాండ గారు గుర్తుకొచ్చారు. ఎంత నిగర్వి ఎంత విద్యాసంపన్నుడు....

నేను : Wowww.. you are so great!!! what are your working hours?

అతను : "9 AM to 6 PM"

నేను : Ohh.. Then why are you calling your team now? Is something important?

అతను : "Well, I have to, 9 – 6 I work at client’s place. Rest of the time I work with offshore to manage the team and project."

నేను : What for?

అతను : ???? "I want to be a successful project manager and this project success is crucial for me to get into next band…"

నేను : Next ?


ఆ వ్యక్తి నన్నొక పిచ్చోడిగా చూసి , మెట్రొపార్క్ station వచ్చిందని లేచి వెళ్ళి పోయాడు.ఇంకో రోజు ఇంకొన్ని రైలు విశేషాలు చెప్తాగానీ ... ప్రయాణంలో నేను హైదరాబాదు లో వున్న మా అమ్మ, నాన్న లకి ఫొన్ చేస్తే ఎండలు మండి పోతున్నయని చెప్పారు. అప్పుడే ఎండాకాలం వచ్చిందా అని, నా మనసులో సుడులు తిరిగిన భావాలే ఈ పద్య కవిత.సందర్భం : భూమి మీద ప్రతి ప్రాణికి సూర్యరశ్మి చాలా అవసరం.సూర్యరశ్మి లేకపోతే భూమికి మనుగడ లేదు. ఎండ అవసరమే కానీ ఎండాకాలపు ఎండ తట్టుకోవడం చాలా కష్టం , భూదేవి తో సహా.


ఎండాకాలం వచ్చేముందు భూమి అంతా పచ్చిక బీడులతో , లేత చిగుళ్ళ పచ్చని చెట్లతో , బంగారు వన్నెల పొలాలతో కళ కళ లాడుతుంటుంది, అలాంటి సుందరమైన భూదేవిని ఎలాగైనా అనుభవించాలని సూరి బాబు కి కోరిక కలుగుతుంది.


పద్యభావం: అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఆశ చూపి ( చుక్కలు జూపి ) మోహముతో నన్ను ముద్దుపెట్టుకొని, నా చన్నుల రూపు, రుచి చూసి కామాగ్నిని తట్టుకొనలేక నాతో రమిస్తూ ముఖమంతా గోళ్ళతో గీతలు పడేటట్టు రక్కాడు. ( ఎండాకాలం లో భూమి సూర్యుని వేడికి బీటలు బారడం అతి సహజం. పరిమాణంలో భూమి, సూర్యుడు పెద్దవి కనుక, సూర్యుని గోటి గుర్తులే భూమి కి బీటలు ) . ఇన్ని చేసినా ఆకలి తో వున్న నా బిడ్డల ( సర్వ జీవరాశి ) ను చూసి , వేరే ఎటువంటి ఆలోచన లేక భరిస్తున్నాను.పద్యము : ఉత్పలమాల

చుక్కల జూపి మోహమున చుంబన జేసె నిశాహరుండు నా
(చి)చక్కని పాల పొంగులు రుచించి తటాలున కామరూపి యై
మక్కువతో రమించి ముఖమంత నఖక్షత ముద్రలేసెపో
చిక్కిన బిడ్డలన్ దలచి చింతన మాని భరింతు మౌనమున్.

5 వ్యాఖ్యలు:

 1. ఊరించి ఊరించి చివరలో రాసిన పద్యం చక్కగా ఉన్నది.


  " ఒక్క క్షణం నాకు మార్తాండ గారు గుర్తుకొచ్చారు. ఎంత నిగర్వి ఎంత విద్యాసంపన్నుడు.... " :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా చక్కని భావన పద్యంలో. నఖా అని దీర్ఘం ఉంటే, నఖ + అక్షత అని అర్ధం వస్తోంది. నఖక్షతం అనేది సరైన పదబంధం. గణం కలిసేందుకు కూడా మీకు అక్కడ దీర్ఘం అక్కర్లేదు.
  మిగతా టపా కూడా సూపరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ : మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
  @కొత్త పాళీ : మీ సవరణ కు ధన్యవాదాలు

  కొత్తపాళి గారు సూచించిన విధంగా "నఖాక్షత" ను "నఖక్షత" గా మార్చడమైనది.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form