28, ఫిబ్రవరి 2009, శనివారం
మనసులోమాట
నేను ఈ రోజు ఉత్పలమాల పద్యము రాద్దామని కూర్చుంటే అది కాస్తా గిత్పలమాల అయినట్టుంది. ఏమైనా తోచింది రాసేశాను. అసలే గిత్పలమాల కాబట్టి ముందుగా నేననుకున్న సందర్భాన్ని, భావాన్ని చెప్పి తరువాత పద్యంచెప్తాను.
సందర్భం : ఒక ధనవంతుని కూతురు, కళా వాచస్పతి .... ప్రేమ జడివానలో తడుస్తుంటారు. అది శ్రీపతి (ధనవంతుని) ఇంట్లో తెలుస్తుంది.
వ్యాఖ్యానం :
మొదటి పద్యము
------------
వాడి దగ్గర డబ్బు లేక , నీ దగ్గర ఉన్న సిరిసంపదలు జూసి నిన్ను ప్రేమించానంటున్నాడు వాడు. వాడు చేసుకొనేది నీ ఆస్థిని అని తండ్రి చెప్పిన మాటలు వినక తన నిర్ణయాన్ని మార్చుకోక పోవడంతో ఇంట్లో పెద్ద గొడవై తనకు వేరే సంబంధము చూస్తారు. అది భరించలేని హృదయేశ్వరి నీ డబ్బు నీ వద్దే వుంచుకో , కాసులను నేను పెళ్ళి చేసుకోలేనని ఇక ఇక్కడ బ్రతకడం వ్యర్థమని శ్రీలక్ష్మి ( హరి వాసము కాదని ) కైలాసగిరి కి వెళ్ళింది. ( శ్రీ , హరాద్రికిన్).
కాసులు లేక నీకలిమిగాంచి చెలియ్యనెవాడు నీధనా
రాసులు బెండ్లియాడ, వివరమ్మునిదేయని బితృమాట రా
కాసి రణమ్ములై, బ్రతుకనీతనువేల,ధనమ్ము నీదెగా,
కాసుల వియ్యమేలనని బ్రాణము తోజనె,శ్రీ,హరాద్రికిన్
రెండవ పద్యము
-------------
అసాధ్యమైన పద్యాలను శోభాయమానమైన నా చెలి ఈశ్వరి చెంత నా కవిత్వ సమూహాలు ఆగకుండా శబ్దామృతాలను కురిపిస్తున్నవి, ఆసమయాన నా దేవేరి భయంకరమైన కలి కాలానికి ( అకాల కరాళ కల్కి ) బలియై శంకరునికి ఆభరణము గా ( బూడిద గా ) వెళ్ళిపోవడంతో భాస్కరుని కవితా ధార ( ఘంటికా వెలుగు ) భాస్కరుని ( భానుని ) లోపల కళ లేక నిక్షిప్తమైపోయింది.
నాకవితా వితానములనారత శబ్ద సుధా రసంబులై
శ్రీకర నీశ్వరీ జెలియ జెంతనసాధ్య బద్యాలుబల్కగా
నాకల శంకరాభరణమయ్యెనకాల కరాళ కల్కికిన్
భాస్కర ఘంటికా వెలుగు భానుని జేరె కళావిహీనమై
ఏదో నోటికొచ్చింది వ్రాశాను, తప్పులుంటే కవివర్యులు సరి చేయగలరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form