12, ఆగస్టు 2011, శుక్రవారం

మొదటి సంవత్సర మానస పుత్రిక :-)

తెలుగు నిఘంటువు లో టైపు చేసిన పదముల పద్ధతిని ( Format ) సరిచూసే ఉపకరణి


చాలా రోజులునాడే చెయ్యాల్సిన పని ఈ నాటికి అయింది. ఈ ఉపకరణి అందుబాటులోకి రావడం వల్ల టైపు చేస్తున్న వారికి, అలాగే ముఖ్యంగా నాకు చాలా ఉపయోగ పడుతుంది. టైపు చేస్తున్న వారికి ఈ ఉపకరణి ద్వారా, తాము ఎక్కడెక్కడ Format సరిగా చేయడం లేదో తెలుస్తుంది. నాకైతే పేజీలను మళ్ళీ సరిచూసే శ్రమా తగ్గుతుంది. దీనిగురించి వివరాల లోకి వెళ్ళేముందు ముందుగా మరొక్కసారి తెలుగునిఘంటువు గురించి.

ఈ సంవత్సరం పాటుగా జరిగిన పనుల పురోగతి ఒక్కసారి పరిశీలిస్తే సూర్యరాయాంధ్రనిఘంటువు లో మొత్తము ఎనిమిది వాల్యూమ్స్ కలిగిన నిఘంటువు. చాలామంది ఈ నిఘంటువునే ఎందుకు ఎన్నుకున్నారు అన్న ప్రశ్నకూడా వేసారు. కారణము మనకు తెలుగులో లభ్యమవుతున్న సమగ్రమైన , అధునాతన మైన నిఘంటువు ఇదే. అధునాతనము అంటే ఓ 70 ఏళ్ళ క్రితం పండితులు ఏరికూర్చిన నిఘంటువు. తరువాత కాలంలో నిఘంటువులు వచ్చాయి కానీ ఈ నిఘంటువులాగా ఇన్ని పదములు కల్గిన నిఘంటువు రాలేదనే చెప్పవచ్చు. రాబోయే కాలంలో మనమున్నా లేకున్నా తెలుగులో ఒక పరిపూర్ణ నిఘంటువుకు శ్రీకారం చుట్టే దిశలో వేసిన తొలి అడుగు ఇది. ఈ నిఘంటువు పూర్తి కాగానే మానవ వనరులు, ఆర్థిక వనరులు అనుకూలిస్తే అందుబాటులో వున్న మిగిలిన నిఘంటువులను కూడా ఔత్సాహికులు ఎవరైనా ముందుకు వచ్చి ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. వచ్చేసంవత్సరము నాటికి http://www.telugunighantuvu.com ఒక data web service ను కూడా తీసుకొని వచ్చే ఆలోచనలో వున్నది.

ఇప్పటివరకూ ఈ నిఘంటువులో 3 volumes పూర్తిగా టైపు చేయడం, website లో వుంచటం జరిగింది. ఈ టైపింగ్ పనుల్లో ఇతోధికంగా సహకారాన్ని అందిస్తున్న అనిల్ కుమార్ గారికి, కంది శంకరయ్య గారికి, దేవి గారికి కవిత గారికి ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే. దయచేసి నాతో పాటు మీరూ వారిని అభినందంచండి. అనిల్ కుమార్ గారు రెండవ వాల్యూమ్ మొత్తాన్ని టైపు చేసారు. పుస్తకాల స్కానింగ్ కు ఐన ఖర్చుతో పాటు ఈ రెండవ వాల్యూమ్ మొత్తము టైపు చేయడానికి ఆర్ధిక సహాయాన్ని అందించినవారు బ్లాగులేని బ్లాగరు ;-) శ్రీ శ్యాం కందాళ గారు. వీరు కాక ఆర్థిక వనరులను అందించిన బ్లాగర్లూ చాలామందే వున్నారు. వీరి పూర్తివివరాలు ఇక్కడ చూడవచ్చు.

అలాగే తెలుగు పై ప్రేమకొద్దీ ఈ కార్యాన్ని మొదలిడిన నాటినుంచి ఈ రోజు వరకూ ఏనాడూ విసుగు చెందకుండా ఉచితంగా టైపు చేస్తున్నవారు దేవి గారు మరియు కవిత. దేవి గారు ఇప్పటివరకూ మొత్తం 720 పేజీలు చేయగా కవిత 700 పేజీలు చేసారు.

తెలుగు బ్లాగుల్లో పద్యానికి జీవం పోసిన పోస్తున్నవారు శ్రీ కంది శంకరయ్య గారు. వీరు ఏకంగా 6 వ సంపుటి మొత్తాన్ని టైపు చేసి ఇప్పుడు 1 వ సంపుటిని టైపు చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఉత్తేజంగా టైపు చేస్తున్న వారు కంది శంకరయ్య ,అనిల్ కుమార్, దేవి, కవిత గార్లు మాత్రమే.

ఇక వీళ్ళందరి మధ్యలో అతికొద్ది పేజీలు మాత్రమే టైపు చేసిన నేను. మొదట్లో నాకు టైప్ చేయడానికి సమయం వుండేది. కానీ రాను రానూ టైపు చేసిన పేజీలు ఎక్కువయ్యే కొద్దీ నా పూర్తి సమయం వాటి Format సరి చేయడానికే సరిపోయింది. దీనితో పాటు parser development,తెలుగు నిఘంటువు web site development, Extracting typed pages and inserting them into database, ఇలాంటి పనులతో అసలు నాకు సమయమే దొరికేది కాదు. అంతే కాక అప్పుడప్పుడు బ్లాగింగ్.

అంతే కాదండోయ్, మరొక పుత్రిక కూడా వుంది నాకు. అదే haaram పనులు. వీటికి తోడు బ్రతకడానికి ఉద్యోగం :-)

ఇంక టైమేది??. అందుకోసమన్నమాట ఇప్పుడు ఈ ఉపకరణి.

ఈ ఉపకరణి ద్వారా 95 percent Format తప్పులను టైపు చేసేవారే సరిచేసుకోవచ్చు. ఇది పని చేసే పద్ధతి.

ముందుగా మీరు టైపు చేసుకున్న పూర్తి పేజీని కానీ లేదాటైపు చేసినంతవరకు పదములను కానీ
ఈ ఉపకరణిలో నున్న Text box లోకి copy/paste చేసి అక్కడున్న "ఎక్కడెక్కడ తప్పులున్నవో చెప్పు" అనే బొత్తాన్ని నొక్కాలి. అప్పుడది Format issues ను చూపుతుంది. చాలా వరకూ అక్కడ వచ్చే errors, self - explanatory.

ఉదా హరణ గా అనిల్ కుమార్ గారు చేసిన ఒక పేజీలో పదాలను ఈ ఉపకరణిలో copy చేసి ఆ బొత్తాన్ని నొక్కితే ఈ క్రింది విధంగా చూపింది. పదములు ఎలా టైపు చేయాలి అన్న పూర్తి వివరణ ఇక్కడ చూడగలరు.

caution : ఈ format ప్రస్తుతము టైపు చేస్తున్న వారికి మాత్రమే అర్థము అవుతుందనుకుంటాను. మిగిలిన వారు లైటుగా తీసుకోండి :-). అంటే తరువాతి భాగం చదివినా మీకు పెద్దగా ఉపయోగ పడేది ఏమీ వుండదని ;-)

సమయాభావం వల్ల వచ్చే errors ను తెలుగులో చూపించలేకపోతున్నాను.


output from the tool :
==============================

Result
It seems you did not start this page with a new word. Please move the very first sentence to the previous page. Always start a page with a new word

Here are the words that have rupantaras, but you missed expanding these words.
=================================================================================================================
గుఱిచి,కూరిచి. (√గుఱించు?) [క. మధుమధనుఁ డాక్షణంబున, మధుర గుఱిచి కదలి... +హరి. ఉ. 1.169.][మ.అతఁడొక్కించుక నవ్వి నన్ గుఱిచి యిట్లాశ్చర్యధన్యతా,మతికిం గారణ మేమి...+హరి.ఉ.5.25.][సీ. అబ్జాసనుఁడు తన్ను నర్థితో గుఱిచి యజించుట గోరి సృజించె సురల. +హరి. పూ. 2.97.]
గుఱిచే(సే)యు
గుఱుకొను (శ.ర,చి.ని.బ్రౌ.)
గుఱుతి(ర్తి)ంచు%
గుఱుతి(ర్తి)ంచు%
గుఱుతు(ర్తు)పెట్టు
గుఱుపె(వె,ర్పె,ర్వె)ట్టు.
గులిమితె(త్రెడ్డు)డ్డు
గుల్లపఱ(ఱు)చు%
గుళి(లి)క
గువ్వకోలుకొ(ల్కొ)ను,గువ్వకరిగొను. [గీ. కడుపు చుమ్మలుచుట్టఁగాఁ గన్నకన్నె, చిలుక నెడఁబాసి యేరీతి నిలుచువాఁడ, నెక్కడి వివేక మమ మంత్రు లెల్లఁ గదిసి, కువల యేంద్రునితో గువ్వకోలుగొనుచు.][గీ. మాను మీమోహ మని తెల్పి...+శుక. 1.372, 374. ][గీ.గొంట వనియెఁదిలోత్తమ గూర్మిఁ గొసరె, ధాన్యమాలిని పుంజికస్థల యదల్చె, ద్విజకామిను లీరీతిఁ దిరుగువాఱి, గువ్వకోల్కొంచుఁ దమలోన నవ్వుకొంచు. +మనుచ. 3.109. శుక. 2.109.]
గువ్వగుత్తి(క)
గుసగుసలఁబోవు, గుసగుసలువోవు, గుసగుసలాడు. (√గుసగుసలు) [వ...నిన్న మనము విన్నది నిజం బై తోఁ చున్నది చూఁడుఁడు చూడుం డని గుసగుసలంబోవు వారును... +ఉ.రా.6.343.][క. పొసఁగ దది యనుచు మంత్రులు, గుసగుసలం బోవ రాజకుంజరుతోడన్. +శుక. 1.318. విజ. వి.3.37.][సీ. అపుడు వచ్చినవార లౌఁ జెలి యెవతె యీ కొమ్మ యంచును గుసగుసలువోవ. +కువల. 2.29.]
గూఁడుకానుపు(న్పు)
గూఁడుపుట్టువు, గూఁడుకానుపు. (గూఁడు+పుట్టువు.) [గీ. అట్టు లెడలేని కడిమిఁ గయ్యం బొనర్చు,జడ బ్రతుకుగూఁడుపుట్టువు సామిమీదఁ, గినిసి కైదువ కేల నంకించి రక్క,సుండు గాళ్లున ఱెక్కలుఁ జెండివైచె. +ఆచ్చ. రా.ఆర. 75.]
గూటాము,గూటము. (శ.ర.)
గుడారము,గుడారము. (త.కూడారమ్.)[సీ. కొఱలు గుడారము గూడారము గుడారు గూడారనఁగను పట గేహ, నామధేయంబులు.. +ఆం.భా. 2.159.][ద్వి. గూడారములు దెర ల్గొల్లెన ల్వన్ని, వేలము ల్దప్పక విడిసె నుత్సుకత. +పండితా. పర్వ. 350.పొ.కు.సం.11.600.]


Other format errors


Pipe missing : నన్, దఱచుగఁ గ్రమ్ము క్రొంబొగ లనంగ జగంబునఁ బర్వెఁ జీకటుల్. +రసిక. 4.95.]

Pipe missing : గుఱిచి,కూరిచి. (√గుఱించు?) [క. మధుమధనుఁ డాక్షణంబున, మధుర గుఱిచి కదలి... +హరి. ఉ. 1.169.][మ.అతఁడొక్కించుక నవ్వి నన్ గుఱిచి యిట్లాశ్చర్యధన్యతా,మతికిం గారణ మేమి...+హరి.ఉ.5.25.][సీ. అబ్జాసనుఁడు తన్ను నర్థితో గుఱిచి యజించుట గోరి సృజించె సురల. +హరి. పూ. 2.97.]

Missing or additional square bracket : 1.లక్ష్యము చేయు; ఉద్దేశించు గుఱిచేసి వైచెఁ బయోజకుట్మలముల నొకతె. +కవిరా. 4.95.][గీ. అన్యరాజన్యు గుఱిసేసి యరిగె వాణి. +నైష.5.146.]2.దృష్టాంతముగాఁ జేయు.[సీ. నీచందమున నన్ను నెఱయ సేవించిన మద్భక్తులగుదురు మత్పరులకు, గుఱిసేయ నీవ యోగ్యుండ వైతివి...+భాగ. 7.379.]3.లక్ష్యపెట్టు, సరకుగొను. [సీ. ఇది యెంత లేదు నెమ్మది నిట్టివిఘ్నముల్ గుఱిసేసి మనకేళి మఱవ నేల. +కళా. 3.213.][క..ని, న్నొకయించుకయును గుఱిసే, యక యిమ్మెయిఁ జెనకి తలఁక డతఁడు సెడు మదిన్. +రాఘవ. 4.42.]


Missing book : ద్వి.నెఱతనంబును గల్గు నేర్పరి యనుచు, గుఱుతుగ నలపరాంకుశముఖ్యమునులు, పలికిన దివ్య ప్రబంధరత్నముల, వలన నిచ్చలు విని...ద్వి...పరం. ౩.౨౩౭ పొ.

Missing or additional square bracket : చిహ్నితము చేయు. [(వ్యవ) పుస్తకములో జదువవలసిన భాగములు గుర్తు పెట్టుము.

Missing book : ఉదా: సన్న గులకభూమి. గులక రేగడభూమి

Missing or additional square bracket : అంకురించు; వ్యాపించు; వెలువడు,నిర్గమించు.[వ...మేనం బులకలు గులకరింప... +సురా. 96.(బ్రౌ.పా.)[గీ. మొలకనగవులు మొగమున గులకరింప. +చంద్రా.3.92.][సీ. ఆణిముత్తెపుసరు లల్లనఁ జనియింపఁ గుండలంబులకాంతి గులకరింప. +మల్లుపు. 3.6.][సీ. ముసుఁగు వెట్టిన నేమి ముత్యాలకమ్మల క్రొమ్మించు లీలలు గులకరించె. +క్రీడా.95.]

Missing or additional square bracket : క్షుద్రజలజంతువిశేషము. +హంస. 4.187]

Missing book : క. ఇత్తడి పుత్తడి యగునే, తొత్తుది వగలెన్ని యిడివ దొరసానగునే, యుత్తముకులుఁ డవునా దౌ,లత్తుకు సరి చేరినను గులాము గులామే. (అడిదముసూరన చాటువు.)

Pipe missing : గులిబి, గులిమి. +ఆం.భా.1.134

Missing or additional square bracket : 1.అల్పము. [క. ఇల్లాలు మెలఁగ కున్నను, గుల్లౌ సౌఖ్యంబు పతికిం గొండం తైనన్, ఇల్లాలు మెలఁగుచున్నను గొల్లౌ సౌఖ్యంబు పతికి తోరం తైనన్. +శేష.1.139.]2.బోలు,గట్టిది కానిది.[ఉదా: గుల్లకంటె, గుల్లమురుగులు.పెనుగుల్ల,శంఖము.[సీ. పునుక బెనుగుల్లయును గేలుదమ్ముల నంచలమాడ్కిఁ బాటించువాఁడు. గీ... ముక్కంటియును వెన్నుఁడును ననంగఁ. బొల్చునా వేల్పు కబ్బంబుఁ బ్రోచుఁగాత. +ద్వా. 1.40.]జ: గుల్లకాఁడు, గుల్లకావి, గుల్లకాసు, గుల్లనేఁత, గుల్లపడు, గుల్లపఱచు.

Missing or additional square bracket : 1. కపోతభేదము, అడవిపావురము. (శ.ర, దీనిభేదములు:- కురుకుటగువ్వ, పచ్చగువ్వ, చిటిగువ్వ, రాగువ్వ, ఎలుబొంతగువ్వ, బ్రౌ.) +హంస. 3.13.]2.పక్షి, పిట్ట. [సీ. పిట్ట పక్కి పులుఁగు జిట్ట గువ్వ యనంగఁ బక్షి సామాన్యమై పరఁగుచుండు. +ఆం.భా. 2.96.]జ: గువ్వకరి, గువ్వకరిగొను, గువ్వకుత్తుక, గువ్వ కుతుకవడు, గువ్వలుకొను, గువ్వగుత్తి, గువ్వ గుత్తుక, గువ్వరాయి.

Pipe missing : గువ్వకోలుకొ(ల్కొ)ను,గువ్వకరిగొను. [గీ. కడుపు చుమ్మలుచుట్టఁగాఁ గన్నకన్నె, చిలుక నెడఁబాసి యేరీతి నిలుచువాఁడ, నెక్కడి వివేక మమ మంత్రు లెల్లఁ గదిసి, కువల యేంద్రునితో గువ్వకోలుగొనుచు.][గీ. మాను మీమోహ మని తెల్పి...+శుక. 1.372, 374. ][గీ.గొంట వనియెఁదిలోత్తమ గూర్మిఁ గొసరె, ధాన్యమాలిని పుంజికస్థల యదల్చె, ద్విజకామిను లీరీతిఁ దిరుగువాఱి, గువ్వకోల్కొంచుఁ దమలోన నవ్వుకొంచు. +మనుచ. 3.109. శుక. 2.109.]

Missing book : సీ. గువ్వగుత్తిక యన గువ్వగుత్తి యనంగఁ జనుఁ గపోతాంఘ్రి...+ఆం.భా. ౨.౬౫.(బ్రౌ.పా.)+హంస. ౪.౧౦.

Pipe missing : గుసగుసలఁబోవు, గుసగుసలువోవు, గుసగుసలాడు. (√గుసగుసలు) [వ...నిన్న మనము విన్నది నిజం బై తోఁ చున్నది చూఁడుఁడు చూడుం డని గుసగుసలంబోవు వారును... +ఉ.రా.6.343.][క. పొసఁగ దది యనుచు మంత్రులు, గుసగుసలం బోవ రాజకుంజరుతోడన్. +శుక. 1.318. విజ. వి.3.37.][సీ. అపుడు వచ్చినవార లౌఁ జెలి యెవతె యీ కొమ్మ యంచును గుసగుసలువోవ. +కువల. 2.29.]

Missing or additional square bracket : 1.పరమాత్మ 2.సింహము,మొ.[శ్లో. సింహవ్యాఘ్రవృకా ఋక్షతరక్షుద్వీపిన స్తథా, బభ్రుజంబుకమార్జాలా ఇత్యాద్యస్స్యుర్గుహాశయాః. (కల్ప)

Pipe missing : గూ

Pipe missing : గూఁడుపుట్టువు, గూఁడుకానుపు. (గూఁడు+పుట్టువు.) [గీ. అట్టు లెడలేని కడిమిఁ గయ్యం బొనర్చు,జడ బ్రతుకుగూఁడుపుట్టువు సామిమీదఁ, గినిసి కైదువ కేల నంకించి రక్క,సుండు గాళ్లున ఱెక్కలుఁ జెండివైచె. +ఆచ్చ. రా.ఆర. 75.]

Pipe missing : గూఁడుబండి -ERRORR-1.డేరామేకు.[చ. సమముగ మిట్ట పల్లములు చక్కఁగ జేయుచుఁ జుట్టునీరు వా,టముఁ గని నాల్గువంకల గుడారము లెత్తిరి జీనిపట్టుప,గ్గములు బిగించి గూటములఁ గట్టి న రాతులఁ గూర్చి ముందటం, గొమరగు పైఁడి తీవపనికుట్టుల చప్సరముల్ చెలంగఁగన్. +వాల్మీకి. 3.96.]2.గుంజ. (శ.ర.) 3. వడ్లవాఁడు మాదిగవాఁడు దూదేకులవాఁడు మొదలగువారు ఉపయోగించెడు పనిముట్టు. (శ.ర.బ్రౌ.)

Pipe missing : గూటాము,గూటము. (శ.ర.)

Pipe missing : గుడారము,గుడారము. (త.కూడారమ్.)[సీ. కొఱలు గుడారము గూడారము గుడారు గూడారనఁగను పట గేహ, నామధేయంబులు.. +ఆం.భా. 2.159.][ద్వి. గూడారములు దెర ల్గొల్లెన ల్వన్ని, వేలము ల్దప్పక విడిసె నుత్సుకత. +పండితా. పర్వ. 350.పొ.కు.సం.11.600.]

Pipe missing : గూడారు,గుడారము. +ఆం.భా.2.159.





ఇప్పుడు మీరు చేసిన ఒక పేజీని ఈ ఉపకరణిలో copy చేసి వచ్చిన errors ను జాగ్రత్తగా గమనించండి.


౧) missing book అని వచ్చిన చోట ఆ ఉదాహరణకు పుస్తకము ఇవ్వలేదు అని అర్థం. అంటే ప్రతి ఉదాహరణకు మనకు పుస్తక reference ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది పెద్ద ప్రమాదకరమైన error కాదు కానీ చాలాసార్లు పుస్తక reference ఉన్నా మనం ఈ గుర్తు "#" ఉంచటం మర్చి పోతాము. అలాంటి వాటిని ఇక్కడ చూస్తే చాలా సులభం గా గుర్తించవచ్చు. ఉదాహరణ గా పైనున్న రెండు missing book lines చూడండి.

Missing book : ఉదా: సన్న గులకభూమి. గులక రేగడభూమి

Missing book : ద్వి.నెఱతనంబును గల్గు నేర్పరి యనుచు, గుఱుతుగ నలపరాంకుశముఖ్యమునులు, పలికిన దివ్య ప్రబంధరత్నముల, వలన నిచ్చలు విని...ద్వి...పరం. ౩.౨౩౭ పొ.


దీనర్థం, మొదటి ఉదాహరణలో మనకు reference book లేదు. అదే రెండవ ఉదాహరణలో పుస్తక reference ఉన్నా ఈ గుర్తు "#" ఉంచటం మర్చిపోయాము. కాబట్టి మీ File లో ఆ ఉదాహరణ ఎక్కడవున్నదో వెతికి ఈ గుర్తు "#" వుంచాలి.

౨) ఒకవేళ మీరు పేజీని అర్థాంతరంగా మొదలు పెడితే ఈ error చూపిస్తుంది. అప్పుడు మీరు ఆ పేజీలో మొదటి లైను ను ఇంతకు ముందు పేజీలోకి మార్చాలి

It seems you did not start this page with a new word. Please move the very first sentence to the previous page. Always start a page with a new word


౩) రూపాంతర పదాలను విడతీసి వ్రాయకపోతే ఈ క్రింది Error వస్తుంది

Here are the words that have rupantaras, but you missed expanding these words.

గుఱుతి(ర్తి)ంచు%
గుఱుతి(ర్తి)ంచు%
గుఱుతు(ర్తు)పెట్టు
గుఱుపె(వె,ర్పె,ర్వె)ట్టు.
గులిమితె(త్రెడ్డు)డ్డు
గుల్లపఱ(ఱు)చు%
గుళి(లి)క

పైవాటినన్నంటిని విడివిడి పదాలుగా కామాతో విడగొట్టి వ్రాయాలి

౪) pipe symbol miss చేస్తే ఈ ఎర్రర్ వస్తుంది

Pipe missing : గుఱిచి,కూరిచి. (√గుఱించు?) [క. మధుమధనుఁ డాక్షణంబున, మధుర గుఱిచి కదలి... +హరి. ఉ. 1.169.][మ.అతఁడొక్కించుక నవ్వి నన్ గుఱిచి యిట్లాశ్చర్యధన్యతా,మతికిం గారణ మేమి...+హరి.ఉ.5.25.][సీ. అబ్జాసనుఁడు తన్ను నర్థితో గుఱిచి యజించుట గోరి సృజించె సురల. +హరి. పూ. 2.97.]

ఇక్కడ మీరు పైప్ సింబల్ పెట్టాలి. అంటే పైదాన్ని ఇలా వ్రాయాలి

గుఱిచి,కూరిచి.| (మూ:గుఱించు?) | --
[క. మధుమధనుఁ డాక్షణంబున, మధుర గుఱిచి కదలి... +హరి. ఉ. 1.169.][మ.అతఁడొక్కించుక నవ్వి నన్ గుఱిచి యిట్లాశ్చర్యధన్యతా,మతికిం గారణ మేమి...+హరి.ఉ.5.25.][సీ. అబ్జాసనుఁడు తన్ను నర్థితో గుఱిచి యజించుట గోరి సృజించె సురల. +హరి. పూ. 2.97.]

౫) ఒకవేళ [ ] లో ఏ ఒక్కటి మర్చిపోయినా లేదా opening and closing paranthesis match అవ్వక పోయినా ఈ క్రింది error వస్తుంది

Missing or additional square bracket : 1. కపోతభేదము, అడవిపావురము. (శ.ర, దీనిభేదములు:- కురుకుటగువ్వ, పచ్చగువ్వ, చిటిగువ్వ, రాగువ్వ, ఎలుబొంతగువ్వ, బ్రౌ.) +హంస. 3.13.]2.పక్షి, పిట్ట. [సీ. పిట్ట పక్కి పులుఁగు జిట్ట గువ్వ యనంగఁ బక్షి సామాన్యమై పరఁగుచుండు. +ఆం.భా. 2.96.]జ: గువ్వకరి, గువ్వకరిగొను, గువ్వకుత్తుక, గువ్వ కుతుకవడు, గువ్వలుకొను, గువ్వగుత్తి, గువ్వ గుత్తుక, గువ్వరాయి.

పైదానిలో ఈ వాక్యంలో

(శ.ర, దీనిభేదములు:- కురుకుటగువ్వ, పచ్చగువ్వ, చిటిగువ్వ, రాగువ్వ, ఎలుబొంతగువ్వ, బ్రౌ.) +హంస. 3.13.]

opening bracket " ( " ఇది. closing bracket ఇది " ) ". ఆ తరువాత పెట్టిన " ] " bracket కు closing bracket లేదు. ఇలాంటి సమయాల్లో , ఇది ఉదాహరణ కాదు గనక పైదాన్ని ఇలా వ్రాయాలి.అంతే కానీ పుస్తకాన్ని # గుర్తు లేదా + తో విడతీయమన్నామని ఎక్కడపడితే అక్కడ ఈ గుర్తు వాడరాదు. ఈ గుర్తు కేవలం ఉదాహరణలలో వచ్చే పుస్తకానికి మాత్రమే.

(శ.ర, దీనిభేదములు:- కురుకుటగువ్వ, పచ్చగువ్వ, చిటిగువ్వ, రాగువ్వ, ఎలుబొంతగువ్వ, - బ్రౌ.హంస. 3.13. )




ఇలా వ్రాస్తూ పోతే చాలా పెద్దటపా అవుతుంది. ఇప్పటికే చాలా పెద్దదయింది. దీనికంటే మీరు టైపు చేసిన ఒక పేజీని తీసుకొని ప్రయోగం చేయండి. చాలా సులభంగా అర్థమవుతుంది.

హమ్మయ్య, ఇక నాకు ఈ పని తప్పింది కాబట్టి హాయిగా రోజుకో రెండు టపాలు బ్లాగుతా :-)

సర్వేజనా సుఖినోభవంతు.

- భారారె.

5 కామెంట్‌లు:

  1. ఉపకరణి ప్రయోగించి చూశాను. బాగుంది.అభినందనలు.
    నిఘంటువు శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా అభినందనలు.
    మన నిఘంటువు మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  2. aah..this tool is going to help those of us who are typing a lot. Thanks for developing.

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ. మీ ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు మరొక్కసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు

    వినీల. అవును ఇది టైపు చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది. మనం చాలా జాగ్రత్తగా చేసామనుకుంటాము. కానీ తప్పులు చేయటం మానవ సహజం. వీటిని గుర్తించడానికి బాగా పనికొస్తుంది. మీకు మరికొన్ని పేజీలు పంపాను. ఓసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  4. నేను టైప్ చేసిన కొన్ని పేజీలను ఉపకరణిలో పరీక్షించాను. మంచి ఫలితం వచ్చింది. నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.
    దీనిని ఒక ఫైల్ లాగా సేవ్ చేసి ‘ఆఫ్ లైన్’లో తెరిచి పరీక్షిస్తే పనిచేయలేదు. ఇది ఆన్ లైన్ లోనే పనిచేస్తుందా? అఫ్ లైన్ లో ఉపయోగించే అవకాశం ఉంటే ఎలా ఉపయోగించాలో తెల్పండి.
    నిఘంటు నిర్మాణంలో పాలుపంచుకుంటున్న మిత్రు లందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారూ ఉపకరణి పరీక్షించినందులకు, ధన్యవాదాలు. ‘ఆఫ్ లైన్’ లో పనిఏసే ఉపకరణి విండోస్ లో మాత్రమే పనిచేస్తుంది.

    రిప్లయితొలగించండి

Comment Form