9, ఆగస్టు 2011, మంగళవారం
మా ఇంటికి ఎవరైనా వచ్చి పుస్తకాలు ఎత్తుకుపోకుండా .... గుర్తుకోసమన్నమాట.
అవసరమైన ఓ వస్తువు ఎక్కడపెట్టామో ఎంత వెదికినా కానరావే !!!. నిన్నటినుంచి ఇల్లంతా వెతుకినా కావాల్సినది మాత్రము దొరకలేదు. సరే చివరి ప్రయత్నమని చెప్పి చెల్లా చెదురుగా పడి వున్న నా పుస్తకాల అరమర దగ్గర చేరి వెతకడం మొదలెట్టాను. అసలు పుస్తకాల అరమర కదపాలే కానీ బోలెడన్ని జ్ఞాపకాలు తేనెతుట్టె లాగా మనసును కమ్మివేస్తాయి కదా!. అలా అలా అలా అక్కడెక్కడో విహారం చేస్తూ మధ్యమధ్యలో కాసిని వెఱ్ఱి నవ్వులు నవ్వుకుంటూ వెతకాల్సిన వస్తువు మీద అస్సలు దృష్టిలేకుండా ఆనందంగా నా పని నేను చేసుకుంటున్నా. ఐనా మీరే చెప్పండి, వెధవది ఆ వస్తువు కనిపించకపోతే ఇంకోటి తెచ్చుకుంటే పోతుంది కదా. దానికోసం అసలు పుస్తకాలు సర్దడంలో వున్న ఆనందాన్ని ఆస్వాదించకుండా ఎలా ఉండమంటారు? మొత్తానికి ఓ మూడు గంటల పాటు అలా అలా పుస్తకాలన్నీ తడిమి చూసుకొని ఆ స్పర్శతో కలిగిన అనుభూతిని ఆఘ్రాణిస్తూ సర్దడం మొదలు పెట్టాను. పుస్తకాలు సర్దడము మనము మొదలు పెట్టాలేకానీ ఇంట్లో పిల్లల ఆనందానికి హద్దులుండవు. చిన్న పిల్లలున్న ప్రతిఒక్కరికీ ఈ అనుభవం ఎదురయ్యే వుంటుంది. వాళ్ళు పాపం నిజంగానే సహాయం చేయాలని, మనము ఏమేమి పుస్తకాలు చదివామనే కుతూహలం కొద్దో, లేదా కొన్ని సంవత్సరాల ముందు మన చేతివ్రాత ఎలా వుండేదో చూద్దామన్నో కుతూహలమో లేదా మరో ఉత్సాహమో ఏదైనా కానీ వాళ్ళు ఈ పని చేయడానికి ముందుంటారు. అలాగే మా పిల్లలు కూడా. విడివిడిగా వున్న కాగితాలన్నింటిని ఓ పద్ధతిలో అమర్చి వాళ్ళకిస్తే పేపర్ క్లిప్స్ పెట్టి బాగానే సహాయం చేసారు. ఓ మూడు గంటలయ్యాక మళ్ళీ పుస్తకాలను యధా స్థానంలో పెట్టాలికదా. ఈ సారైనా బాగా సర్దుదామని ఎంతో ఓపికగా ఒక్కో అర సర్దుతుంటే మా పాప ఫొటోలు తియ్యడం మొదలుపెట్టింది. ఇదేదో బాగుంది కదా!!! అసలే నాకు ఏ పుస్తకం ఎవరికిస్తానో గుర్తే వుండదు. ఈ ఆలోచన బాగుంది కదా... అందుకని అన్ని పుస్తకాల పేర్లు బాగా కనిపించేటట్టు ఫొటోలు తీసేసి బ్లాగులో జాగ్రత్త గా భద్ర పరుస్తున్నాను.
మనలో మనమాట... ఎవరికీ చెప్పకండేం.. ష్ ష్ష్.... ఇందులో సుమారు ఓ ముఫ్ఫై పుస్తకాల దాకా నేను కొన్నవికాదు. కొన్ని ఆ కనకదుర్గమ్మ ఊరోళ్ళు బహుమానంగా పంపారు ;-).మరి కొన్నేమో మా ఊరికి పైయెత్తున్న ఉండే వాళ్ళు చదవడానికని ఇచ్చారు. ఇచ్చి మర్చిపోయారేమో..మళ్ళీ మనమెందుకు గుర్తుచేయడం చెప్పండి. జాతీయం చేసేస్తే పోలే ;-).
ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఎప్పుడన్నా గుర్తొచ్చి అడిగినా అల్లో.. అల్లో ..హలో హల్లోల్లూఓ... రాంగ్ నెంబర్ అని ఓ నాలుగుసార్లు ఫోన్ పెట్టేస్తే విసుగొచ్చి వదిలేయక పోతారా? పక్కన నాలుగు తిట్టుకున్నా ఓకే...:-)
ఇక పుస్తకాల ఫొటోలు
అప్పుడెప్పుడో ఆవేశంగా కొన్న కంప్యూటర్ పుస్తకాల భోషాణం. ఇవన్నీ కొనడం వరకే ఏనాడన్నా కనీసము పుస్తకంలో ఒక్క అధ్యాయమన్నా చదివానో లేదో కూడా గుర్తేలేదు.
కొన్ని ఆంగ్ల పుస్తకాలు
నా వద్ద వున్న అన్నీ తెలుగు పుస్తకాలు ఈ క్రింది చిత్రాల్లో
మరికొన్ని racks books మరొక్కసారి. అసలు ఇంతకీ అరమర సర్దాననుకున్నారా..అబ్బే లేదు. కుక్కతోక వంకర అన్నట్టు..ఓ నాలుగు గంటలు కష్టపడి తుదకు ఈ అరమర చివరిరూపమిది.
ప్చ్..రేపు నేను ఇంట్లో నుంచి బయటపడి ఆఫీసు దారి పట్టేదాకా మా ఆవిడ నా సర్దడం చూడకూడదని మీరు కూడా ఆ భగవంతుడిని వేడుకోండి ;-)
మరి ఉంటానండీ... మా ఇంటావిడ దొరికిందా అని అడుగుతుంది? అసలు ఇంతకు ఇప్పటిదాకా నేను దేనికోసమెతికాను??... ఇప్పుడు ఎంత పులిహోర కలపాలో ఏమో :-)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
హబ్బ! కన్నులకు పండుగ్గా ఉంది పుస్తకాలను చూస్తుంటే.
రిప్లయితొలగించండినా దగ్గరే తక్కువ పుస్తకాలున్నాయి అనుకునే దాన్ని . మీ దగ్గర కూడా ఇన్నే ఉన్నాయిలే అనుకుంటే
" మరికొన్ని racks books మరొక్కసారి"
అనేశారు. హ్మ్...
జూమ్ చేసి పుస్తకాల పేర్లన్నీ చదివి తృప్తి పడిపోయాను.
భలేవారండీ, మీరు మాత్రం ఫోటోలు తీసి మరీ గుర్తు పెట్టుకుంటారా, అవతలి వాళ్ళవయితే మాత్రం జాతీయం చేసేస్తారా! హన్నా!
బలే బలే బావుంది మీ ఐడియా...ఫొటోలు తీసిపెట్టడం..నేనూ ఈ పని చేస్తే సరి!
రిప్లయితొలగించండిఅవునుగానీ "సమగ్ర భారత చరిత్ర - ప్రాచీన యుగం" ఎవరు రాసారో కాస్త చెబుతారా? ఇలాంటి పుస్తకం కోసం నేను వెతుకుతున్నాను చాలారోజులబట్టీ. వివరాలు చెబితే నేను కొనుక్కుంటాను. అలగే "మాయా బజార్" ఎవరు రాసినది?
సమగ్ర బారత చరిత్ర నాదేనని డౌట్ వస్తుందే :)
రిప్లయితొలగించండిఇంతకి అన్నీ చదివేసార?
కలెక్షన్ బావుందండీ ( సర్దడం కాదులెండి...మురిసిపోతారేమో)
రిప్లయితొలగించండిఈ పుస్తకాలు ఎరువిచ్చినవాళ్ళతో ఇదే చిక్కండీ బాబూ ....ఇచ్చినవాళ్ళు గుర్తుపెట్టుకుని మళ్ళీ అడిగి పటుకుపోవాలికదా ! మరీ అంత మతిమరుపైతే ఎలా .....చూడండి సొంతపుస్తకాలు పెట్టుకోడానికి చోటులేకుండా పోయింది
నా షెల్ఫ్‌లో ఎక్కువగా ఉండేవి మార్క్సిస్ట్-లెనినిస్ట్ & స్త్రీవాద పుస్తకాలే. భౌతిక శాస్త్ర పుస్తకాలు మాత్రం మా అమ్మగారు విజయనగరం & వైజాగ్‌లలో చదువుకునే రోజుల్లో కొన్నవి.
రిప్లయితొలగించండిమీ పుస్తకాల సర్దుడు ఫొటోస్ చూడగానే నాకూ మీ లాగా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. నా దగ్గిర మా అబ్బాయికోసం కొన్నవి కూడా కలిపి చాలా వున్నాయి.ఎన్ని వున్నా ఇంకోటి కొనాలనే వుంటుంది. నేనూ అర్జెంటు గా ఫోటోలు తీసుకుంటాను. నేను నా వాటికి నెంబర్ల స్టిక్కర్స్ అతికించి లిస్టు రాసి పెట్టుకుంటాను, ఎవరు తీసుకెళ్ళినా తెలిసేటట్టు.
రిప్లయితొలగించండిమందాకిని గారూ :) కదా..నాకూ పుస్తకాలను చూస్తే వదలబుద్ధి కాదు. ఉన్న పుస్తకాలే చదవడం లేదని ఈ మధ్య కొనడం తగ్గించాకానీ ఇంతకుముందు ఏ పుస్తకాల దుకాణానికి వెళ్ళినా ఏదో ఒకటి కొనేవాడిని. నా దగ్గరున్న తెలుగు పుస్తకాలన్నీ అవేనండి. ఇంక వేరే అరమరల్లో వున్నవి తెలుగువి కాదు. కాబట్టి మీరి నిశ్చింతగా హమ్మయ్య అని గాలిపీల్చుకోవచ్చు :-)
రిప్లయితొలగించండిమరి మన పుస్తకాలు వేరేవాళ్ళు జాతీయం చేస్తే మనం ఎవరివద్దన్నా జాతీయం చెయ్యకపోతే తక్కెడ సమతూకం ఎలా తూగాలండి మరి. ఏదీ మీ పుస్తకాల పట్టిక ఒక్కసారి బయటపెడ్తే చూసి మేము కూడా కళ్ళను తృప్తి పరచుకుంటాము కదా. అయినా ఈ ఫొటోల్లో పుస్తకాల పేర్లు అన్నీ సరిగా కనిపిస్తున్నట్టు లేదు కదా!
హమ్మా...సౌమ్యా మీకు మాయాబజార్ పుస్తకం ఫొటోలో కనిపించిందా???? మీ కళ్ళలో ఏదో X-Ray device వుండివుంటుందండీ. మీరూ మీలిస్టు బయటపెడ్తే మేము కూడా ఆ బుల్లి బుల్లి అక్షరాలు చదివి లిస్టు రాస్తాం కానివ్వండి :)
రిప్లయితొలగించండిఇక మీరడిగిన సమగ్రభారతచరిత్ర - ప్రాచీనయుగం : ప్రజాశక్తి బుక్ హౌస్ వారి ప్రచురణ. రచయిత కె.కృష్ణారెడ్డి.
అదుగో ఆ పైన కామెంట్లలో ఇదేదే నాపుస్తకం లా వుందే అని అప్పుడే ఎవరికో డౌట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇక ఈ పుస్తకం గూర్చి ఎక్కువ మాట్లాడకూడదు :-)
మాయాబజార్, ఇది సినిమా "మాయాబజార్" నవల కాదు కానీ సినిమాలపై, సినిమా నాయిక,నాయకలు,దర్శకులు..మొత్తంగా సినిమా పరిశ్రమపై వ్యంగ్య, హాస్య రస ప్రధానమైన చిన్న చిన్న కథలు.ఇది ఎమ్బీయ్స్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్వామి చిత్రానంద అనే కలంపేరుతో వ్రాసిన కథల సంపుటి.
చిన్నీ తూచ్ తూచ్.. అసలా ఫొటోల్లో మీకెక్కడన్నా సమగ్ర బారత చరిత్ర కనిపిస్తుందా :-)
రిప్లయితొలగించండిఅది మీ పుస్తకమేనండీ.
ఎక్కడా అన్ని పుస్తకాలు తలకింద పెట్టుకోని నిద్రపోవడంతోటే సరిపోతుంది. ఇంకా చాలా పుస్తకాలు చదవలేదు.
లలితగారూ కలక్షన్ బాగుందన్నందుకు ఆనందపడుతుంటే, ఆ మురిపేన్ని ఇలా సర్దడంతో కలిపేసి మొగ్గలోనే తుంచేస్తారా :-)
రిప్లయితొలగించండిహబ్బే ఏంపర్లేదండీ, మా యింట్లో చాలానే స్థలముంది.పుస్తకాలిచ్చి మర్చిపోయిన వాళ్ళకు మీరిలా మళ్ళీ గుర్తుచెయ్యక్కరలేదు :)). ఇంతకీ నా రేగొడియాలు ఎక్కడిదాకా వచ్చాయి :)))
ప్రవీణ్ నాకు చానా రోజుల్నించి ఈ కోరిక ఉంది. అసలు మీదగ్గర ఎన్ని పుస్తకాలు లేకుంటే మీరిలా రోజుకు నాలుగైదు టపాలు వ్రాయగలుగుతున్నారని. ఇదే సమయం మీదగ్గరున్న పుస్తకాలన్నింటిని ఫొటో తీసి పెట్తే బ్లాగుల్లో హిట్ టపా కాకపోతే చూడు. హారం లో టాప్ ౧౦ లో మిగిలిన ఏటపా కూడా మీపోస్టు కు దరిదాపు ఛాయల్లోకి కూడా రాలేవని నానమ్మకం. పెట్టి చూడండి.గ్యారంటీ నాది :)
రిప్లయితొలగించండిఅనూగారూ, ఆలోచనొస్తే ఆలశ్యం చెయ్యకుండా చేసేయాలండీ. ఇలాంటి పనులు ఆలశ్యం చేస్తే రోజులు అలా అలా గడిచిపోతాయి.త్వరగా పెట్టేస్తే నాదగ్గర లేనివి, నాకాసక్తి కల్గినవి ఏవైనా వుంటే కొనుక్కుంటాను. numberstickers/names good Idea. ఎందుకంటే ఒక్కోసారి తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా అది ఎవరిదగ్గర తీసుకున్నారో గుర్తుండదు. అలాంటప్పుడు పుస్తకం పై పేరు చూసైనా గుర్తుకొస్తుంది.
రిప్లయితొలగించండిమీ టపా చదవగానే నాక్కూడా పుస్తకాల అల్మైరా సద్దాలన్న కోరిక మొలకెత్తింది..
రిప్లయితొలగించండి"అన్నట్టు, ప్రవాసంలో ఉండే తెలుగు వారందరిదగ్గారా తప్పక ఉండే తెలుగు పుస్తకం 'రామాయణ విష వృక్షం'" అని ఆ మధ్యన ఒక మిత్రుడు చేసిన వ్యాఖ్య గుర్తొచ్చింది ఫోటో చూడగానే.. బాగుందండీ కలెక్షన్..
హహహ...అంటే నేను మాయాశశిరేఖను కదండీ....అందుకే మాయాబజార్ నాకళ్లబడింది :)
రిప్లయితొలగించండిఅడిగిన వెంటనే పుస్తకాల గురించి సమాచారం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు! కె.కృష్ణారెడ్డిగారి పుస్తకం సంపాయించడానికి ప్రయత్నిస్తాను.
Thank you Murali and Sowmya.
రిప్లయితొలగించండి