20, మే 2009, బుధవారం

భావి భారతి - నా ఉజ్వల సాంకేతిక భారతి.

నాకు వర్షాకాలం అంటే మహా ఇష్టం. ఏంచక్కా, వర్షం పడి వెలసిన తరువాత దారిన పారే నీళ్ళకు చిన్న చిన్న కట్టలు వేసి జిల్లేడు ఆకులతో చిన్న గొట్టం ( పైపు) చేసి, ఈ ఆనకట్టలలో జిల్లేడు గొట్టం పెడితే ! కరెంట్ ఇంజను నీళ్ళు బావిలోనుంచి నీళ్ళు చిమ్మినట్టు ... ఆహా ఎంత ఆనందమో !! ఇంజనీరింగ్ లో చేసే ఫ్లూయిడ్ మెకానిక్స్ లాబ్ ఈ ప్రయోగంముందు అసలు ప్రయోగమేనా అనిపిస్తుంది.
.
.
.

ఏది ఏమైనా భారతావనిలో 10 వ శతాబ్దికి ముందు కనిపించిన సాంకేతిక పరిజ్ఞానము ఆతరువాత ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిన ఆగిపోవడం ఎలా జరిగిందో అంతుపట్టని చిక్కుప్రశ్న. ప్రపంచములో ఎన్నడులేని విధంగా 14 వ శతాబ్ది తరువాత, గ్రీకుల, రోమనుల విజ్ఞానము ( ? ) ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగిన యూరప్ వాసులను చూస్తే వారి కృషికి అబ్బురపడుతూ, మన లేమికి కారణాలు తెలియక మనసు విలవిలలాడిపోతుంది. నా భావి భారతి ఎప్పటికైనా తిరిగి ఉజ్వల భారతి కాకపోతుందా?



పల్లెల సర్వ జీవ జల ప్రార్థన లెల్ల పయోధి జేరె, తా
తల్లిగ ధాత్రి దప్పికను ధారల దీర్చ దలంచి ఆవిరై
చల్లని గాలులన్ సకల జన్యుల డెందము లెల్ల రంజిలన్
నల్లని మేఘమాయె కడు నచ్చిన రూపము లెత్తి గుంపులన్.


పూర్తిగా ఇక్కడ చదవండి.

17 కామెంట్‌లు:

  1. please visit http://apaksha.blogspot.com and comment..

    Thanks
    apaksha

    రిప్లయితొలగించండి
  2. భాస్కర రామిరెడ్డి,

    మీరు లేవనెత్తిన సందేహాలకు నాకూ సమాధానాలు తెలియవు. కాని, ఏ శాస్త్రసాంకేతిక ఙ్ఞానం లేకుండానే సంవత్సరంలో ఒకరోజు దేవుడి పాదల దగ్గర, మర్నాడు నాభి మీద, ఆ మర్నాడు భగవంతుడి విగ్రహం యొక్క నుదిటిమీద సూర్యకిరణాలు పడేటట్లు[ఉదా: అరసవిల్లి, కార్వేటి నగరం మొదలైనవి] దేవాలయాలు నిర్మించగలరంటారా? అలాగే అంతర్వాహినిగా ఉన్న భూగర్భ జలాలని నందినోట్లో నుండి, వెలువడేలా నిర్మించగలరంటారా?[ఉదా: మహానంది, యాగంటి మొదలైనవి] ఇటీవల బయల్పడిన బెలుం గుహలని చూస్తే అంతర్వాహినిగా ప్రవహించే భూగర్భనదుల ప్రవాహతీరు అర్ధమవుతుంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి, ప్రస్తుతం నాకు గుర్తురావటం లేదు. నేననుకోవటం తప్పని సరిగా మనవారికి శాస్త్రసాంకేతిక ఙ్ఞానం బాగానే తెలుసనే. కాకపోతే అన్ని వేదాలలోనే ఉన్నాయష అనే అహంకారాన్ని మాత్రం నేనూ సమర్ధించను.

    రిప్లయితొలగించండి
  3. ఆదిలక్ష్మి గారు, భారత దేశంలో సాంకేతికత లేదు అని నా అభిప్రాయం కాదు. వున్న సాంకేతికతను నిచ్చెనగా వాడుకొని మెరుగులు పరచుకోవడంలో ఎందుకో విఫలమైనామని పిస్తుంది. అదే ఐరోపా వాసులను చూడండి..రీసెర్చ్ అంతా ముందు తరాలనుంచి గ్రహించి కొత్తవాటికి మార్గాలు ఏర్పరచుకొన్నారు. మనకు ౧౦ వ శతాబ్దందాకా పరిఢవిల్లిన విజ్ఞానం ఎందుకో ఆ తరువాత స్మశాన నిశ్శబ్దాన్ని ఆవరించు కొంది. తరువాతి తరాలకు దాన్ని అందించడంలో లోపం పూర్తిగా జరిగిందేమో అని కూడా అనిపించింది.
    మీరు చూపించిన ఉదాహరణలు ఏకాలానికి చెందినవో తెలుసుకోవాలని కోరికగా వుంది. అలాగే మనకు మధ్య భారత యుగంలో రచింపబడి లభ్యమయ్యే సాంకేతిక పుస్తకాలు కూడా ఏమైనా మీకు తెలిస్తే ఉదహరిస్తారా?

    మంచి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఆపేక్ష గారు, ఇలా ప్రచారం చేసుకొనే పద్ధతేదో బాగుంది : )

    అమ్మఒడి లాగా, మంచి కామెంట్లు నాలుగు రాయండయ్యా/ అమ్మా ... బొత్తిగా 2 అంటే రెండే కామెంట్లతో నా టపా వెల వెలా పోతుంది :)

    రిప్లయితొలగించండి
  5. భాస్కర్ గారు

    ఏ శాస్త్ర .సాంకెతిక .జ్ఞానం తొ
    తాజ్ మహల్ ..ప్రపంచ వింత ఇందొ తెలిదు .
    అమ్మఒడి చెప్పినట్లు ,అబ్బుర పరచెవి ఎన్నొ ఉన్నా
    యూరప్ అంతగా ఎదగకపొదానికి ఎన్నొ కారణాఆలు .
    భావి భారతి కచ్హితం గా వెలుగుతుంది

    రిప్లయితొలగించండి
  6. రిషి గారు,
    మీలాగే నేను కూడా అలానే కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. మనకా ఉజ్వల భవిత తప్పక తిరిగి రానున్నదనే నా నమ్మకం. యుగాల ఇతిహాసాలు శోధించినా, శతాబ్దాల చరిత్ర తరిచిచూసినా తార్కాణాలు ఎన్నోవున్నాయి. అవే ఋజువులు ఈ రానున్న పునరావృతానికి.

    రిప్లయితొలగించండి
  8. చాల మంచి టపా . మీ వర్షం నా కళ్ళముందు కనబడింది :) మీరు పదవ శతాబ్ద పూర్వం అంటున్నారు ,నేనయితే ఆర్యులకు పూర్వం అంటాను అంటే సింధు ప్రజలు జీవించిన కాలం (ఇండస్ వాలీ సివిల్య్జసన్ ) అన్నమాట .వారు గడిపిన జీవన విధానం శాస్త్ర ,సాంకేతిక పరిజ్ఞానం మనల్ని ఆశ్చర్య పరచక మానదు .సింధు నది వరద ప్రవాహాన్ని తట్టుకోవడానికి వారు నిర్మించుకున్న్ ఇళ్ళు వాడిన ముడిసరుకు ,వ్యవసాయం చేసే పద్ధతి ,ద్రయినేజి వ్యవస్థ గ్రిడ్స్ గా కట్టిన కాలనీ ,మహిళలు వుపయోగించిన సౌందర్య సాధనాలు చెప్పాలంటే చాట భారతం అవ్వుతుంది ..ఆసక్తి వుంటే " అన్సిఎంట్ ఇండియా " రోమిలా థాపర్ , ఏ.ఎల్ .భాషం "ది వండర్ దట్ వస్ఇండియా "చదవండి . నాగరికత పుడుతూ చనిపోతూ వుంటుందన్నమాట .:) మన మనుష్యుల్లా ...ఏమైనా ప్రపంచమంతా మన నుండి అరువు తీసుకున్నదే అని నమ్ముతాను .

    రిప్లయితొలగించండి
  9. --ఉష గారు వ్యాఖ్యకి ధన్యవాదలు. శతాబ్దాల చరిత్రలో ఎన్ని ఉదాహరణలున్నా.. మన ఇప్పటి పరిస్థితి మారాలంటే బానిస మనస్తత్వం మాని సత్య శోధనలో మనవైన ప్రయోగాలు ఎంతైనా అవసరము


    --చిన్నిగారు, మీరుకూడా కట్టలేసి నీళ్ళు పారించారా? ఇండస్ సివిలైజేషన్ వెలుగులు ఎలా ఆరిపోయినవో అలాగే భారతావని వెలుగు కూడా గత ౧౦ శతాబ్దాలుగా కొడిగట్టి పోయిందనిపిస్తుంది.
    ఏన్సియంట్ ఇండియా - రోమిలా థాపర్ చదివాను కానీ "ది వండర్ దట్ వాజ్ ఇండియా " చదవలేదు.చూడాలి.
    నాగరికత పుడుతూ చనిపోతూ వుంటుందన్నమాట.. కొటేషన్ బాగుంది.

    రిప్లయితొలగించండి
  10. రోమిల్లా థాపర్ చదివీ కూడా మీరు ఇంకా ఇలా రేషనల్ గా ఆలోచిస్తున్నారంటే.. జోహార్ మీకు! If you know what I mean :)

    రిప్లయితొలగించండి
  11. వర్షం వస్తే మేము చిన్నపుడు కట్టలు కట్టడమే కాదు చిన్న చాపలు (ఫిష్} పట్టడానికి ప్రయత్నించేవాళ్ళం పెద్దోళ్ళ కళ్ళు కప్పి ..మనం అల్లరిలో అబ్బాయిలకేం తీసిపోల :)...వర్షం చాలా ఇష్టం అప్పుడు ఇప్పుడూ ..

    రిప్లయితొలగించండి
  12. ఇప్పుడే తడిచాను వర్షంలో...
    భలేగా ఉందండి!!!!

    రిప్లయితొలగించండి
  13. @Yogi,
    A rational mind is sometimes the queerest mixture of rationality and irrationality on the earth. :)

    రిప్లయితొలగించండి
  14. చిన్ని గారు,
    మీ వ్యాఖ్యకి ఒట్టి ధన్యవాదాలతో సరిపెట్టడం ఎందుకో నచ్చలేదు.అందుకే మీమీదొక సెటైర్.. హాస్యం కోసమేనండి.. నచ్చకపోతే క్షమించండి.. నాలుగు తిట్టండి.తీసివేస్తాను.

    చిన్ని చిన్నప్పుడు అల్లరిలో చిచ్చర పిడుగు కాబట్టి మీ ఒక సోదరుడు మీ నాన్నగారికి ఏమి చాడీలు ( నిజమైనా మనము ఒప్పుకోము గదా ) చెప్తున్నారో చూడండి. మీ కాకి గుడ్డు అమ్లేట్ చదివాలెండి :)

    చేపలు బట్టగ "చిన్న"ది
    మెప్పుగ అమ్మను నిదురన మైమర పించీ
    చప్పున అన్నయ తోడున
    చెప్పులు లేకనె చెరువుకు చేరెను, నాన్నా ! :;)

    రిప్లయితొలగించండి
  15. పద్మార్పిత గారూ,

    మీది కవితా హృదయం కాబట్టి, మీ టపాల్లో కనిపించే భావుకతను చూశాక...

    బ్రాకెట్స్ లోవి చదువుకున్నా మీకు పద్యానికి సరిపోతుంది.

    కం||
    నల్లని మేఘము జూడగ
    అల్లరి మాని (లేక ) కవయిత్రి అర్పిత, నటరా
    జుల్లము ఝల్లన (మెప్పగ), గజ్జెలు
    ఘల్లన, చినుకున చినుకై కదమున ఆడెన్

    రిప్లయితొలగించండి
  16. ఇంతమంది గొప్పవారి ముందు గొప్ప ఏముంటుంది చెప్పండి వ్రాయడానికి....
    ఏదో కుప్పిగంతులతో మిమ్మల్ని అప్పుడప్పుడు నవ్వించడం తప్ప....
    Thanks for accepting my comments in positive way.

    రిప్లయితొలగించండి

Comment Form