11, జులై 2009, శనివారం

ఊసుపోక పిల్ల గాలి తెమ్మెర


ముంగురులలికిడికి మెల్లన కదిలి
కాటుక కన్నులందము దోచి
సిగ్గు బుగ్గల సింగారము గని
ధరహాస అధరాన నాట్యము లాడి
అల్లన మెల్లన మెల్లగ జారి
చెంగుచాటందము జూసి
సన్నని దారుల సంచారియై
చిన్నదాని వలపులు జూడ
మదిలో కురిసెను వలపుల వాన

వన్నె చిన్నెల గాలిని జూచి
చెలిని తాకిన అణువును జూచి
మురిసి మెరిసే పరమాణువు జూచి
మదిలో రగిలెను మన్మధ తాపం.


చెలియ పంపిన చిలిపి పలుకులె
చిరుగాలి మోసిన మధుర స్పర్శ్యలె
చెలి ఊసులై, శృతి లయ లవగ
నా మది పాడెను వసంత గీతిక.

వలపు వాన హోరులే విరహాగ్ని ధారలై
విరజాజి తలపులే మదినంత తడుపగా
తనువణువణువూ బంధనాలు వీడి
తలపుల వనాన వసంత విహారి యయ్యె.


16 కామెంట్‌లు:

  1. namaskaramu andi,

    chala bagundi alage na blog ki kuda vichhesi mee amulayamina coments ivvagalarani ashisthu
    untanu andi
    http://mirchyvarma.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. విరజాజుల సువాసనలు గాలితెమ్మరలతో కలసి నన్ను తాకినవి!!!!

    రిప్లయితొలగించండి
  3. మీరెంచేస్తే అలాంటి వాన పడిందో.. బాబ్బాబు. కాస్త కనికరించి ఈ చెవిలో ఊదరాదూ ?.. మరీ అలా మీరొక్కళ్ళే తడిసి కులుక్కోపోతే ?

    రిప్లయితొలగించండి
  4. @మిర్చివర్మ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఒక చిన్నమనవి. తెలుగు లో కామెంట్ వ్రాయవచ్చు కదా?

    @పద్మార్పిత : విరజాజుల చిరుగాలి బాగుందన్నందుకు ధన్యవాదాలు.

    @మురళి గారు ధన్యవాదాలండి

    --- ఆత్రేయ గారు, చెప్పాలంటే సిగ్గు కదయ్యా :) , మొన్న పాత్ ట్రైన్ లో ఒక చిన్న అనుభవం. ఎప్పుడూ ప్యాంట్, షర్ట్ లలో చూసి చూసి ఆ ఏముందిలే అనుకునే సమయంలో కంటి ముందొక అచ్చ తెలుగు మెరుపు తీగ. సో, నేను పాత్ ట్రైన్ ఎక్కా కాబట్టి మీరూ రోజూ ఎక్కండి ఇలాంటి వాన ఎప్పుడో ఒకప్పుడు తడుస్తారు ( పిల్ల కి చెప్పులు లేకుండా చూసుకోండి.. షూ అయితే పరవాలేదు )

    రిప్లయితొలగించండి
  5. మీరెక్కిన బోగీలో
    చేరెద నేనును వెదకుచు చెపలాక్షులనున్
    బెరుకపుడుండదు ముందు త
    మరే రక్షణ విషయము మరువరు భారా !!

    మీరు చమక్కులు మస్తు వేస్తారు మిత్రమా.. మీ అమ్మ గారు ఎలా వున్నారు ?

    రిప్లయితొలగించండి
  6. సృజన గారూ, కవిత నచ్చి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఆత్రేయ గారూ !

    చుక్కను చూచున దిమీరు
    రక్షణ కవచము గమీకు రక్షణ నేనా?
    ఎక్కడి న్యాయమి దిసారూ?
    చిక్కిన అక్కడె తినెదము చెప్పుల దెబ్బల్ !

    రిప్లయితొలగించండి
  8. ఆత్రేయ సారూ, కందము లో "సారూ" కు దీర్ఘం ఎక్కువైంది గమనించ గలరు.

    రిప్లయితొలగించండి
  9. ekkaDi nyaayamidi saaruu
    UIU UII IUU ---- kuuda anukunTaa.. ainaa pharlEdu lEndi.. idi spoken kandam kadaa... ilaanTivi aaTallO araTipanDu laanTidi. excused..

    రిప్లయితొలగించండి
  10. ఎక్కడి , న్యాయమి దిసారు లో ఎక్కడి వేరు, న్యాయము వేరు ( సంధి, సమాస పదాలు కాదు) కాబట్టి ఒకదాని ప్రభావము వేరొకదానిమీద వుండదనుకుంటా..పెద్దలెవరైనా చెప్పాలి.

    UII UII IUI
    అందుకని భ భ జ అవుతుందేమో. అయితే బేసి స్థానాలలో స్వేచ్చగా జగణం వాడేసాను :)

    రిప్లయితొలగించండి
  11. 'వన్నె చిన్నెల గాలిని జూచి
    చెలిని తాకిన అణువును జూచి'..........చాల బాగుందండీ

    రిప్లయితొలగించండి
  12. చిన్నిగారూ, మీకు కూడా ఈ కవిత నచ్చిందా? అమ్మాయిలకు నచ్చగూడదే లెక్క ప్రకారం :)

    రిప్లయితొలగించండి
  13. చాల నచ్చింది ....బహుశ నాది అమ్మాయి మనస్తత్వం కాదేమో :)

    రిప్లయితొలగించండి
  14. చిన్నిగారూ మీరిలా అంటే ఇంక నేనేమంటాను.

    రిప్లయితొలగించండి

Comment Form