22, జులై 2009, బుధవారం
గృహమే కదా స్వర్గసీమ.. టాగ్ లైన్.. వీడో పిల్లి సంసారి.
ఆ మధ్య హడావిడి అంతా ఇంతా కాదు. అమ్రికా కు వచ్చినప్పటినుంచి సొంతయింటి లాగా ఆ ఇంట్లో రాజభోగాలనుభవించాము. ఒకానొక దుర్మూహార్తాన మా కాలనీ అయ్యవారు ఒక ఉత్తరం ముక్క ఇంటి గొళ్ళానికి తగిలించి వెళ్ళారు. తెరిచి చూద్దుముకదా వచ్చే సంవత్సరం మీరు మాకాలనీ ఇళ్ళలో వుండాలంటే మాకు నెలకో వంద డాలర్లు ఎక్కువ అద్దె చచ్చినట్టు కట్టాల్సిందే అని హుకుం జారీ చేసారు.
ఇల్లు మారడమా? లేక జేబుకు మరో వంద చిల్లు పెట్టుకోవటమా ? అప్పటిదాకా అందంగా ఆకర్షణీయంగా కనిపించిన ఇంట్లో అన్నీ లోపాలు కనిపించడం మొదలెట్టాయి. ఇంతలేసి బోడి ఇంటికి అద్దె 1500 డాలర్లా? చలికాలంలో ఎంత చచ్చిపోయాం ఈ ఇంట్లో .. ఈ హీటర్ దెబ్బకు బ్యాంక్ బాలన్స్ ప్రతినెల మూడొందల డాలర్లు మాడి మసై పోయాయి కదా? అయినా ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎలా వున్నామే అని మా ఆవిడనడిగితే.. "ఏమైంది ఇల్లు బాగానే వుంది కదా " ఇక్కడే వుందామంది. పిల్లలు కూడా వంతపాడారు. హతవిధీ.. ఏమిటీ విపత్కాలం.. ఇంట్లో ఒక్కరికీ నా మనసులో మాట తెలియదా?అధ్యక్షునికే ఇంత అవమానమా?
చూస్తే కార్పెట్ మీద అక్కడక్కడ పసుపు కుంకుమ మరకలు . వాడిచ్చినప్పుడు బాగానే వుంది, " ఓం.. హ్రీం.. హ్రాం ధనార్జన ప్రాప్తిరస్తు" అనడంలో అప్పుడప్పుడు ఏవో చిన్నమరకలు. మరి మడిసన్నాక డబ్బుకోసమన్నా పూజలు చేయాలా వద్దా? అంతేనా వీకెండ్ పార్టీ లో అతిధులు గట్రా వస్తారు గదటండీ... మరి పార్టీ జరిగిన గుర్తుగా ఎవో చిన్న చిన్న గుర్తులు కూడా ఉండాలా వద్దా?
ఇదంతా చదివి మా ఆవిడ ఇల్లు శుభ్రంగా వుంచదేమో అని అనుమానమొచ్చిందా? అయ్యో అలాంటిదేమిలేదండి. చూడాలంటే మీరొక్కసారి మాయింటికి రావాల్సిందే.మీరు వెళ్ళగానే సోఫాలు , కుర్చీలు నీళ్ళుపెట్టి కడిగే రకం.పొరపాటున కడగకముందే మేము మీరు కూర్చున్న కుర్చీలో కూర్చున్నామా..... పెళ్ళైన మొగుళ్ళకు చెప్పాలంటారా? కుర్రకుంకలు మాత్రం పెళ్ళి చేసుకుంటే కానీ తెలియదు.
మూడువోట్లు ఇప్పుడున్న ఇంటికే పడినా.. అధ్యక్ష కుర్చీ నాదే ! అసలే ప్రజాస్వామ్య దేశంలో పుట్టా కాబట్టి , ఓట్లు ఎలా రాబట్టుకోవాలో స్కెచ్ గీయడం మొదలెట్టాను.
ఏమే.. గౌరీ వాళ్ళ ఇల్లు ఇక్కడికి దూరం కదా... అసలే నీకున్న ఒక్కగానొక్క అదీ ఇదీ అయిపోయె.... వాళ్ళింటి దగ్గరకి మారదామా?
"ఎందుకూ వీకెండ్, ఆ డబ్బాముందు పడి సొల్లు కబుర్లు రాసుకోకపోతే మమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్ళొచ్చుగా. అదీగాక ఇక్కడుంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ దగ్గర. వార వారం తాజా కూరగాయలు తెచ్చుకోవచ్చు"
నాకు రైల్వ్య్ స్టేషన్ దగ్గర కదా...
"నాకు లెక్కలు రాకపోయినంత మాత్రాన చెవిలో క్యాబేజీనా? అక్కడికి పోతే రైల్వ్య్ స్టేషన్ దగ్గరైనా, ఆఫీసు ఇంకా దూరం. ట్రైనేమన్నా మీ మామదనుకున్నావా టికెట్ డబ్బులు తగ్గించడానికి?"
ఇంక ఇలా లాభంలేదనుకొని.. పిల్లలవైపు తిరిగా...
హే కిడ్స్, యు వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఓల్డ్ డర్టీ హౌజ్?
" హే..హే...హే ( అరుపులు ), యస్"
మధ్యలో పానకంలో పుడకలాగా " మరి స్కూలో " అని మాఆవిడ అందుకుందో లేదో ...వాళ్ళకి డౌట్ వచ్చేసింది.
"అయితే మాఫ్రెండ్స్?"
ఇలా లాగి లాగి మొత్తానికి నోటీస్ ఇచ్చే టైం దగ్గర పడింది.
సరే ఎలాగూ మారుతున్నాము కదా అని ఓసారి అపార్ట్మెంట్ ఆఫీస్ లో బేరసారాలాడదామని వెళ్ళాను. అప్పుడుగానీ నాకు అమ్రికా వాళ్ళ తిక్క తలకెక్కలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, కొత్తగా వచ్చేవాళ్ళకి రెసిషన్ ప్యాకేజీ అని ఇల్లు ఒక నెల అద్దెలేకుండా ఇస్తారంట.
అంటే పన్నెండు నెలల లీజ్ తీసుకుంటే పదకొండు నెలల అద్దెకడితే సరిపోతుంది.
అంటే వాళ్ళు నెలకి కట్టేది 1375.. అదే ఎప్పటినుంచో వున్నోళ్ళకి 1500.. హేమి లెక్కో ఇది నాకిప్పటికీ అర్థమవలేదు అర్థమవలేదు.. మళ్ళీ లెక్కల్లో నేను ఫష్ట్.. ఎలాగూ ఇంతకాలం వున్నోళ్ళు ఏమి మారతారులే అని ధైర్యమా? మన ఇండియా వాడి సంగతి వీళ్ళకింకా తెలియలేదా?
అంతే ఇంటికి వెళ్ళి కమ్యూనిష్ట్ నయిపోయి అధ్యక్ష హోదాలో అందరి ఓట్లు నేనే రిగ్గింగ్ చేసి "మనము మారుతున్నాం అని కచ్చితంగా చెప్పేసాను". ఆవేసం పట్టలేక అప్పటికప్పుడు నేననుకున్న కమ్యూనిటీ కెళ్ళి ఒక ఇల్లు చూసి లీజ్ పేపర్స్ తీసుకొని ఇంటికి వచ్చా.
ఇంక మారక తప్పదనుకుందో ఏమో.." మా ఆయన బంగారం " అని కప్పునిండా ఒక మాంచి కాఫీ అడగకుండానే ఇచ్చింది. మనసులో ఏదో మూల అలజడి. ఏంటబ్బాఈ ప్రేమ అని!
ఒక సిప్ తాగాను..
"ఇల్లు బాగుందా?"
చూస్తావుగా తొందరెందుకు?
"ఎన్ని బెడ్ రూములు?"
రెండు
"బాత్ రూములెన్ని?"
రెండు
మరో గుక్క కాఫీ చేదుగా దిగింది
"గౌరీ వాళ్ళింటికెంతదూరం ? "
....
"శ్రీ లక్ష్మి" వాళ్ళింటికెంత దూరం ( నా ఫ్రెండ్)
....
"రైల్వే స్టేషన్ కెంతదూరం?"
.....
"పిల్లల స్కూల్స్ ఎవో కనుక్కున్నావా?"
....
"ఇంటి దగ్గర నిలబడితే స్కూల్ బస్ స్టాప్ కనిపిస్తుందా"
....
"రెంట్ ఎంత?"
1450
"ఎన్ని సెల్ఫ్ లు వున్నాయి?"
....
"వాకింగ్ క్లాజెట్ వుందా?"
....
"స్టౌ గ్యాసా.. ఎలక్ట్రిసిటీనా?"
....
" 1st ఫ్లోరా లేక 2nd ఫ్లోరా ?"
2nd ( In US, ground floor is 1st floor)
"కార్పెటా లేక వుడెన్ ఫ్లోరా?"
కార్పెట్
ఇంకా ఎక్కువసేపు కాఫీ తాగితే ఏమేమి వినాల్సి వస్తుందో నని చేతిలో కాఫీ పక్కనబడేసి ఏదో అర్జెంట్ పనివున్నట్టు బయటకు వెళ్ళాను. గుప్ గుప్ మనిపించడానికి...అప్పుడు కానీ ఇల్లు ఎలా రెంట్ కు తీసుకోవాలో అర్థం కాలేదు.
అంతే మళ్ళీ మా ఆవిడతో కలిసి ఇల్లుచూడ్డానికి పరిగెత్తాను.. ఇప్పుడు కొత్త ఇల్లు మాకు పర్ణశాల లాగా వుంది. రెంట్ ఇంతకు ముందుకేమాత్రం తగ్గలేదనుకోండి. అయితే కొంచెం పెద్ద ఇల్లు. మంచి స్కూల్స్...
మళ్ళీ రెండేళ్ళకి ఇవన్నీ ఎలాగూ అబద్ధాలవుతాయనుకోండి...అప్పటిదాకా గృహమే కదా స్వర్గసీమ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
>>"ఇప్పుడు కొత్త ఇల్లు మాకు పర్ణశాల లాగా వుంది." :):)
రిప్లయితొలగించండిపర్ణశాల ప్రశాంతంగా ఉంటుందంటే నమ్మడం కష్టమే. (Just kidding)
హ హా .. నాగ ప్రసాద్ గారూ.. పర్ణశాల అశాంతి శాల గా మారాలంటే మళ్ళీ మా వాడు రెంట్ పెంచాలి. :)
రిప్లయితొలగించండినేనూ యూ.కే. లో ఉన్నపుడు దొరికిన ఇంటినే అద్దంలా (వీలైనంత శుభ్రంగా) ఉంచేదాన్ని. ఆ ఇల్లు మరీ ఇంగ్లీష్ హౌస్. మూల మూలల్లో చెత్త పీకి పీకి, తుడిచేదాన్ని. ఉపయోగంలో లేని ఫైర్ ప్లేస్ మీద చిమ్నీ లో పావురాల కాపురం. వాటి గుడు గుడులు భరిస్తూ, ఇంట్లోనే బట్టలు ఆరేసి (టంబల్ డ్రయర్ మేమున్నన్నాళ్ళూ పని చేయనే లేదు), చాలా చేశాను. ఖాళీ చేసాకా, క్లీనింగ్ చార్జీలు కట్ చేసారు. శుభ్రంగా ఉంచలేదని సణుగుడు. మర్చిపోలేను.
రిప్లయితొలగించండిసుజాత గారూ మాకు క్లీనింగ్ చార్జీల పేర కార్పెట్ కు పెద్ద బ్యాండే పడుద్దనుకున్నాము కానీ, కిచెన్,బాత్ టబ్స్ క్లీన్ గా వుండటంతో చూసీ చూడనట్టు పోయినట్టున్నాడు. డ్రైయర్,ఎ.సి,హీటర్ లాంటివేకాకుండా మైంటెనన్స్ పరంగా ఇక్కడ పెద్ద ఇబ్బందులుండవు. కమ్యూనిటీ వాళ్ళకి కాల్ చేస్తే వెంటనే వచ్చి బాగు చేసి పోతారు.
రిప్లయితొలగించండిఇల్లు సుభ్రంగా వుంచడం లేకపోవడం ఇక్కడ పూర్తిగా మనిష్టం. ఎవరూ సణగరు కానీ, కార్పెట్/కిచెన్/బాత్ నీట్ గాలేకపోతే చివర్లో మన సెక్యూరిటీ డిపాజిట్ మీద ఆసలు వదులుకోవచ్చు. గోడలు పెద్ద పట్టించుకోరు. ఎలాగూ వాడు మళ్ళీ వచ్చేవాళ్ళకు పైంటింగ్ వేసి ఇస్తాడు.
ఇంతకీ ఇల్లు మారారా? లేక మారబోతున్నారా?
రిప్లయితొలగించండికొత్త అద్దింటికోసం చెసే వేట కంటే ఇల్లు మారటం (మూవింగ్) ఇంకా బాగుంటుంది ఈ దేశంలొ (Unless you hired movers for this).
వీలైతె కాస్త ఆ వివరాలు కూడా పంచుకోండి మాతో... ..
నేను కరెక్టుగా ఒక సంవత్సరం క్రితం ఇల్లుమారేటప్పుడు మా రిక్లైనర్ సోఫా ని కదిలించటం కష్టమై ,అతికష్టమ్మీద స్నేహితుల సహాయంతో దాన్ని మా అపార్త్మెంటు బయటి వరకు తెచ్చి ఇక వల్లకాక, అప్పటివరకూ వేన్ లో వేసిన వస్తువులను కొత్త ఇంటిలో పెట్టి ఆ తరువాత దీని అంతు చూద్దామని అనుకున్నా. తిరిగి వచ్చేసరికి ఆ సోఫా అక్కడ్నుంచి మాయం. నాకేం తెలుసు,మూవ్ అవుతున్నవాళ్ళు తమకు వద్దులే అనుకున్న వస్తువులను సరిగ్గా అక్కడే వదిలి వెళ్తారట.ఎవరో మన భారతీయుడు చంకలు గుద్దుకుంటూ దాన్ని తన స్నేహితుల సహాయంతో మూడో అంతస్తులోఉన్న తన ఇంటికి తరలించేసుకున్నాడు. నేనుండేది గ్రవుండ్ ఫ్లోర్ ( ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడి పరిభాషలో ). ఆయన సారీ చెప్పి , దాన్ని కిందకి తరలించడానికి నా సహాయం కావాలన్నాడు. నా సోఫా కదా, తప్పుతుందా?మళ్ళా దాన్ని అక్కడినుంచి మెట్లమీద కిందకి తెచ్చేసరికి చుక్కలు కనిపించాయి... మరచిపోలేని ఎక్స్ పీరియన్స్ నాకది.. అప్పటినుంచి మూవ్ అనగానే నా వెన్నులో వణుకు ...(అసందర్భమైనా) మీ పోస్టు చదవగానే నాకదే గుర్తొచ్చింది..
ఉమాశంకర్ గారు,భలే వుంది మీ అనుభవం.. అయినా అలా ఎలా పెట్టారండీ... :)... ఆ అనుభవాలు మర్చిపోదామన్నా కుదురుతుందా :)
రిప్లయితొలగించండిఇల్లు మారడమూ అయింది, వళ్ళు హూనమవడమూ అయింది. తెలియకుండానే ఇంట్లో ఫర్నిచర్ చాలానే తయారయ్యింది. మారేటప్పుడు కొత్త కంప్యూటర్ టేబుల్ ( కొని మూడునెలలు కూడా అవలేదు ) పడేసి, సోఫా పడేయబుద్ధి కాక తెచ్చుకున్నాము. మేము ఉన్నది ౨న్ద్ ఫ్లోర్, మారింది ౨న్ద్ ఫ్లోర్ కి. అక్కడ నుండి సోఫా, బెడ్లు కొత్త ఇంటిదాకా తొట్టిగ్యాంగ్ సహాయంతో బాగానే తీసుకు వచ్చాను. తీరా తెచ్చాక సోఫాను పైకి తీసుకెళ్ళాలంటే నలుగురము పట్టినా వెళ్ళలేదు.ఇక్కడ మెట్లు కూడా పీనాసిగా కడతారు కదా ( ఇండియాలో కొన్ని అపార్ట్మెంట్ మెట్లలాగా ), సో మధ్యలో ఇరక్కపోయింది. దాన్ని మళ్ళీ కిందకు దించి ట్రాష్ చేసే టప్పటికి ఒక్కొక్కడు నేను దొరికితే తన్నేటట్టున్నాడు. ఈ కష్టాలు చూడలేక మొన్నమారిన మా ఫ్రెండొకరు మువర్స్ పెట్టుకోని మాకు పని తప్పించాడు.
ఇదిగో మీ రిక్లైంనింగ్ సోఫా ఇన్సిడెంట్ చదివాక నాకు మళ్ళీ ఇప్పుడు వణుకు పుడుతుంది. నిన్నంటే నిన్నే, యాష్లే ఫర్నిచర్ లో కంప్లీట్ లివింగ్ రూమ్ సెట్ ఆర్డర్ చేసి వచ్చాను.గత అనుభవంతో ఈ సారి పూర్తి వారంటీ తో ... ఎలాగూ రెండు మూడేళ్ళకు మళ్ళీ మారలి కదా.. తేడా వస్తే break the sofa so that it can't be repaired.When it can't be repaired, they must replace it.
నూతన అద్దె ఇంట ప్రవేశించిన మీకు అన్నియును శుభములు కలుగుగాక!!!
రిప్లయితొలగించండిపద్మార్పిత గారూ, మీ దీవెనెలు ఫలించాయనుకోండి,, ఇంక ఇక్కడ మేము సపరేట్ గా పూజలు చేసి కుంకమార్చనలు చేయక్కరలేదేమో :)
రిప్లయితొలగించండినిన్ననే సీరియస్సుగా ఒక ప్లాన్ చర్చించా ఇంట్లో కానీ వర్కవుట్ అవలేదు. ఫ్యామిలీని కెనడా బోర్డర్లో వుంచి నేను అక్కడికి వీకెండ్ వెళ్ళొస్తే రెంట్, ఆరోగ్య భీమా, డాలర్ కన్వర్షన్ ల వల్ల చాలా డబ్బులు మిగులుతాయి కానీ మా ఇంట్లో ఎవరూ వినిపించుకోలేదు.
రిప్లయితొలగించండిఅన్నాయ్..నివ్వు చెప్పింది నిజమే. నేను, మా ఈ పెద్ద సిటీలో మూడుమైళ్ళ దూరం రెంఝ్ లో ఇల్లు మారాను. నా కార్లో గిర్కీలు కొట్టాను. పది ట్రిప్పులు కొడితే సగం మూవ్ అయ్యింది.
రిప్లయితొలగించండిమా పాత అపార్టుమెంటుది లీజు ఎక్స్టెండు చెయ్యం అంది. కారణం? అని అడిగా. నువ్వు లాని బ్రేకు చేసావ్ అంది. రోజూ ఏదోకటి బ్రేక్ చేస్తూనే ఉంటా, తూచ్, ఏం బ్రేక్ చేసా? లా నా? అన్నా. అవునూ అంది. చూడు పిప్పళ్ళ బస్తా. నేను పనిచేసేదే డిపార్ట్మెంట్ ఆఫ్ లా లో. నాకు లా సెప్పకు రంగుపడుద్ది, ఇంతకీ ఏంలా అన్నా. సింగిల్ బెడ్రూం లో ముగ్గురు ఉన్నారు అంది. దీన్సిగదరగ, ఉంటానికి మాకులేని ఇబ్బంది నీకేందీ, మావోడు బిలో రెండు కదా అన్నా. బెలో గ్రౌండైనా, లా ఈజ్ లా అంది. తస్సదియ్యా మరితే రెండు బబెడ్రూంలు కొట్టూ మారేస్తా అన్న. బాసు నువ్వు లా ని బ్రేక్ చేసావ్. ఇయ్యం పో అంది. ఇల్లు మారా.
హదేంటో గానీ మనము స్కెచ్లు గీస్తే ఇంట్లో జనాలకి ఇట్టే తెలిసిపోతుంది.. అందుకే అప్పుడప్పుడు కమ్యూనిజమే నయం అనిపిస్తుంది...
రిప్లయితొలగించండిభాస్కర్.. లా అంటే గుర్తొచ్చింది.. నేను మొదటిసారి సింగిల్ బెడ్ ఇల్లు రెంట్ కోసం తిరుగుతుంటే.. ఎంతమంది పిల్లలు అన్నారు.. ఇద్దరు అని చెప్పా.. నీకివ్వము ఫో అన్నారు. లాజిక్కేందో అర్థమవ్వలా.. అడిగితే పిల్లలకు సెపెరేట్ బెడ్రూం అంట.. వీళ్ళెంకమ్మా.. మాపిల్లలకు అప్పటికి సరిగా డ్రాయర్ వేసుకోడమే రాదు.. వేరేబెడ్రూమేంట్రా అంటే.. వాళ్ళ ప్రైవసీ కోసమంట.. డబల్ బెడ్ తీసుకోని అందరూ ఒకే బెడ్రూంలో వున్నా ఇబ్బందిలేదంటా.. ఇవీ వీళ్ళ రూల్స్. ఇంకోటి.. స్కూల్ లో పిల్లలను జాయిన్ చెయ్యాలంటే ఇద్దరు పిల్లల పేర్లూ లీజు లో వుండాలి. లీజ్ లో ఇద్దరు పిల్లల పేర్లూ వుండాలంటే డబల్ బెడ్ కంపల్సరీ.. వా..వా. వ్వ్వా... :(
రిప్లయితొలగించండిఆస్ట్రేలియా నుండి వచ్చిన వెంటనే ఇల్లు అద్దెకి తీసుకున్నాక, అక్కడి unit/apartment కొంతకాలం అప్రియంగా basement లో డాన్స్ చేసినపుడు, మరికొన్నిసార్లు ప్రియంగా, ఇంటి చుట్టూ వున్న 5 పెద్ద చెట్ల ఆకురాలు కాలంలో, అనిపించేది. ఇపుడు ఆరేళ్ళుగా స్వంత ఇల్లు, గృహమే స్వర్గ సీమ అన్నట్లు ఎన్నో నా కవితలకి అదే నెలవు. కానీ మా పాపకి మాత్రం ఆ అద్దె ఇల్లు ఎంతో ఇష్టం. దాన్ని కూడా కొనగలం అనుకునే సరికి యజమాని గారు ఎవరికో అమ్మివేసారు. మొన్నీ మధ్య బహుశా వందో సారి ఆ ఇంటి చుట్టూ కార్లో రౌండ్స్ అదీ పిల్లదాని బెంగ తీరటం కోసం ఎందుకైనా మంచిదని క్రొత్త ఓనరు గారికి ఓ మాట చెప్పివుంచుదామని ఆగి ఇది సంగతి అని వివరిస్తే వారికి మహావింత ఆ 40 యేళ్ల ఇంటితో ఈ చిన్నారికి ఇదేమి అనుబంధం అని. అదేనేమో బహుశా నాలో నాకు అంతు బట్టని లక్షణం పిల్లలకీ పాకిన అవలక్షణం. మాకు కాదేదీ అభిమానానికికనర్హం. ఇప్పటికీ మా ఇల్లు ఓ డిస్ప్లే హోం మాదిరిగా వుంచటానికి ఒక తల కష్టపడుతుంది, అదేనండి మీరన్న పెళ్ళైన మొగుడు ;) మిగిలిన ముగ్గురం మా ఇష్టారాజ్యం కాముని చిత్తం చందాన మెసులుతాం. కానీ శుభ్రాన్ని శ్వాసిస్తాం కనుక ఎపుడూ కళకళలే మా ఇంట. ఇకపోతే మీ పర్ణశాల ముందు ఏదైనా పొదరింట్లో వచ్చే వీకెండ్ లో “డబ్బాముందు పడి సొల్లు కబుర్లు” రాసుకునే అవకాశం దొరికినపుడు ;) [అయ్యా అవి తమరి మాటలే నేను అరువు పుచ్చుకున్నాను] మీరన్న “కావ్యానికి ద్వితీయ విఘ్నం రాకూడదంట.. త్వరగా రెండో కవిత వ్రాయండి.” మాట నెరవేర్చాను కాస్త ఓ చూపు వేయండి నా చివురు మీద. క్రొత్త నివాసం రసరాగ భరితం కావాలని మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
రిప్లయితొలగించండిపెళ్ళైన మొగుడు??
రిప్లయితొలగించండిభాస్కర్ పెళ్ళైన మొగుడు అంటే.. పెళ్ళికాకుండా కూడా మొగుడవ్వచ్చు కదా.. అలాంటి వారు కాదన్నమాట.. శాస్త్రప్రకారం ముళ్ళపొదలో ఇరుక్కున్నవారు. :)
రిప్లయితొలగించండిఖండిస్తున్నాం మీ మాటలు ఉష అధ్యక్షిణీ ( కరక్టేనా ? :)) . "డబ్బాముందు పడి సొల్లు కబుర్లు" ఇవి నేనన్న మాటలా.. రామ రామ. మీ "ఆడ గుంపు" లో ఓ గృహిణి గారన్నమాటలు. ఏంచేస్తాం వినాలి కదా ..లేకపోతే "పెళ్ళైన ముగుళ్ళ" చేత ఇంట్లో బలవంతపు నిరాహారదీక్షలు చేపించినా చేయించగల సమర్ధులు. ఏదో ఇక్కడున్నాం కాబట్టి బయటకెళ్ళి రొట్టెముక్కలు/ పచ్చగడ్డి తినలేక మాట వింటున్నాం గానీ .. అదే మా స్వస్థలం ( ఆంధ్ర ) అయితేనా ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చేయమా? ( రోజుకో హోటల్ కెళ్ళి )..
రిప్లయితొలగించండిఅన్నట్టు నిన్ననే చదివా మీ ప్రేమకావ్యాన్ని.. కానీ చందరయ్య ,వెన్నెలమ్మ,ఉసిరి కొమ్మ,కొబ్బరాకు,నింగి, నల్ల మబ్బు అని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళారు.. ఇంకా తిరిగి రాలేదు. రాగానే మళ్ళీ ఓ చూపు చూస్తాను.
ఇక సొంత ఇల్లు.. నాకింకా అసలా అలోచనే రాలేదు. హైదరాబాదు వదలడమా లేక ఇక్కడ స్థిరపడటమా.. ఇంట్లో నాకొక్కడికే తిరిగి వెళ్ళాలని అనిపించేది..మిగిలిన వాళ్ళంతా "తిరిగి వెళదామా" అంటే ... ఏమీ వినపడనట్టు నటిస్తారు :) దీనికి కాలమే సమాధానం.
మీరు వేసిన అభాండాలకి తీవ్రమైన అభ్యతరం లేవదీస్తున్నాను. ఎదురుగా వుంటే వేరే వరసగా వుండేది అనుకోండి. "మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..." పాట వినలేదా. అయినా వంట మా వంతు అని ఎవరటా నిర్ణయించింది? ఉద్యోగం మనిషి లక్షణం అయ్యాక ఇంకా ఆ బేధ భావం తగదు సుమా! పైగా అధ్యక్షిణీ నాకో తోక కూడా కట్టారు ;) మెత్తగా చెప్పినా ఇది గట్టిమాటేనండోయ్.
రిప్లయితొలగించండినేను మాత్రం రాని వారిని వదిలి నేను వెళ్ళిపోవాలనుకున్నపుడు వెళ్ళిపోతాను. ఈ లోపుగా ఏదో మేమే వేసుకున్న ప్లాను ప్రకారం కట్టుకున్న పొదరిల్లిది. http://teluguvala.ning.com/photo/photo/listForContributor?screenName=30cfmn8791wvx
ఎక్కడికి వెళ్ళారో ఓ మాట ఇంట్లో చెప్పి వెళ్ళారా లేదా, మీరు తిరిగి రాకపోతే అది నా కావ్యం తప్పు కాదు, మీ హృదయ స్పందనదే సుమీ!
ఖాళీ చేసాకా, క్లీనింగ్ చార్జీలు మన ఆంధ్రాలో కూడా పెడితే బాగుండు అప్పుడైనా అద్దె ఇంటిని శుభ్రంగా పెట్టుకునే అలవాటు అలవడుతుందేమో మన వాళ్ళకు.
రిప్లయితొలగించండిఉషగారూ, మొత్తానికి అధ్యక్ష స్థానానికి అర్హురాలు మీరు. వంట నేను చేస్తే ఆరోజు ఇంట్లో కచ్చితంగా పస్తులుండాల్సిందే.. అంత ప్రావీణ్యం నాకు :) అయినా ఇంట్లో ఇద్దరూ ఉద్యోగం అంటే చాలా కష్టం కదండీ..
రిప్లయితొలగించండిమీ పొదరిల్లు చూసానండోయ్.. ఫొటో లన్నీ చూసాక ఒక చిన్న తప్పుచేసారనిపించింది.. ఇల్లు లేక్ ఒడ్డున కాకుండా లేక్ మధ్యలో కట్టుకోవాల్సింది. :) Just kidding ... మీ రాజ మహల్ బాగుంది.
ఇదిగో పొద్దునే ఉద్దేగానికి పరుగెత్తాలకదా.. జాబిల్లి మీదనుండి పొద్దుటే దబ్బున ఆఫీస్ లో పడ్డాను.
విజయమోహన్ గారూ, అబ్బో మన ఇండియాలో చేసినట్టు ఇక్కడ గబ్బు గబ్బు చేస్తే ఒక్క పైసా కూడా వెనక్కిరాదు..కాకపోతే గోడలు పెద్దపట్టించుకోరు.. మనమేమో గోడమీద గీత పడకూడదనుకుంటాము.
రిప్లయితొలగించండిమొత్తానికి మీరు అనుకున్నది సాధించారు.. అభినందనలు..
రిప్లయితొలగించండిహి హి హీ.. మురళిగారూ, మరి మొగుడు గారా మజాకా ;), మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచాల బాగుందండీ మీ ఇల్లు మారడం ...
రిప్లయితొలగించండి"ఎందుకూ వీకెండ్, ఆ డబ్బాముందు పడి సొల్లు కబుర్లు రాసుకోకపోతే మమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్ళొచ్చుగా. "
నవ్వలేక చచ్చానండి ....ప్చ్ ...అందరిది ఇదే పరిస్తితన్నమాట.:)
ఏంచేస్తాంలే చిన్ని గారు, మన కష్టాలు బ్లాగు మొఖం చూడనోళ్ళకి కూడా వద్దు :)
రిప్లయితొలగించండిఅంటే, ఇప్పుడే కాదండి.. నేను బ్లాగులు రాయనప్పుడు కూడా డబ్బానే సర్వస్వం. సాఫ్ట్వేర్ వాడి బతుక్కి మొదటి పెళ్ళాం ఈ డబ్బానే.
mii gRhaavastha chaalaa haasya bharitaMgaa unnadi.
రిప్లయితొలగించండి......tirigi tirigii marala
adE ibbaMditO varrI avutuunna vaari vyaakhyalu ......maMchi hasyaMtO vachchaayi kkadaa!
avii,ivii kUDA Eka bigini chadiviMchEsinaayi.
superb!
కోణమానిని గారూ, ఈ చిన్న సరదా టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి