
ఊదయ కిరణ రాగాలు
ఛెలియ విసురు సరాగాలు
హృదయ వీణ తంత్రుల
శృతి చెసి వినిపించే
హృదయ కిరణ రాగాలు.
*********************************
కిల కిలల జంట పక్షులు
జరుగు బాటుకై పరుగు లెత్తాయి
కలిసి సాగిన పయనం
కడవరకు సాగెనా?
శుభొదయపు నీరెండ కిరణాలు
దీవించి మనసుల మురిపించేనా?
కాసుల గలగలలు చెవుల పీడించి
మమతలు మాపి కత్తులు దుసెనా?
*********************************
జరుగు బాటుకు పరుగులెత్తే జంట చకోరాలు
కడవరకు సాగే జీవన పయనానికి
సమన్వయపు వారధేసుకుని
సంతోషాల స్వరాలను పంచుకుని
దిక్కులు వేరైనా గమ్యమొక్కటి చేసుకుంటే
తప్పక కలిసే సాగుతుంది రా శ్వాస సరాగాలు
జీవితాల ప్రయాణాలు..
మీ ఉదయ కిరణకాంతులు
రిప్లయితొలగించండినా హృదయాన్ని రాగ రంజితం చేసాయి.