21, ఫిబ్రవరి 2011, సోమవారం

Yahoo మైల్... ఎక్కడనుంచి వచ్చింది? ఎలా కనుక్కోవాలి.

మన బ్లాగర్స్ లో చాలా మంది, yahoo లేదా gmail address లనుంచి వచ్చే మైల్స్ ఎక్కడనుంచి వచ్చాయో కనుక్కోవడం అసాధ్యమనే అభిప్రాయల్లో వున్నట్లు నాకెందుకో అనిపించింది. అలాగే తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకుంటే బ్లాగర్లు మరికొంచెం జాగ్రత్త పడతారని కూడా :-)

ఇప్పుడు yahoo mail ఎక్కడ నుంచి వచ్చిందో ఎలా కనుక్కోవాలో చూద్దాము.

మనకొచ్చిన యాహూ మైల్ open చేసిన తరువాత కుడివైపు అడుగు భాగంలో Full Headers అని ఒక చిన్న hyperlink వుంటుంది. దాని పైన క్లిక్ చేస్తే ఆ మైల్ ఎక్కడనుంచి వచ్చిందో ఇట్టే కనిపెట్టవచ్చు.



ఉదాహరణ గా నాకొచ్చిన ఒక spam mail యొక్క Details ఇవి.




అదుగో అక్కడ... ఆ ఎర్ర సిరా మరక చూసారా? అదన్న మాట సంగతి.
ఇక ఈ header information ను ఎలా చదవాలో , ఎలా అర్థం చేసుకోవాలో అనేది మనకున్న పరిజ్ఞానము మీద ఆధారపడి వుంటుంది. మరో ముఖ్య విషయం.. ఇది third party server నుంచి వచ్చింది అని గమనించాలి. కాబట్టి మనకు వచ్చే IP address ఆ సర్వర్ ది అయి వుంటుంది. పూర్తి Details కొరకు Encrypted message ను చూసి మీకు అర్థమైతే నాకూ చెప్పండి. :-)

ఇక gmail ఎక్కడనుంచి వచ్చిందో ఎలా తెలుసుకోవాలి?

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

తెలుగు నిఘంటువులో చేరిన మరికొన్ని పదాలు - శోధన

తెలుగు నిఘంటువు లో ఎనిమిదవ సంపుటిని పదిహేను పేజీలు మినహా, పూర్తిగా చేర్చాము . అలాగే నూతనోత్సాహంతో సభ్యులందరూ రెండవ,మూడవ, నాల్గవ,ఆరవ సంపుటులను చేర్చడానికి సంసిద్ధులయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో నిఘంటువు బాధ్యతను తీసుకొని పట్టుదలతో చేస్తున్నారు.

పదాలను శోధించేటప్పుడు వాడుకలో మనము చాలా వరకు ము కారాంతాలకు పూర్ణబిందువును చేర్చి వ్రాస్తాము. అంటే వ్రాస్తాము= వ్రాస్తాం. తెలుగు నిఘంటువు ఇలాంటి పదాలను కూడా గుర్తించి వాని అర్థాలను పాఠకులకు చూపుతుంది. మా తెలుగు నిఘంటువు ను మీరు ఇక్కడ చూడవచ్చు

http://www.telugunighantuvu.com

ముఖ్య గమనికలు

౧) దంత్య చ, జ గుణింతపు అక్షరాలను చూపించే సదుపాయం ప్రస్తుతానికి ఏ ఫాంట్ లో కూడా నాకు కనిపించలేదు. వుందేమో తెలియదు. మీకి తెలిస్తే దయచేసి వ్యాఖ్య ద్వారా తెలియచేయండి.

ఉదా: చాలు అనేపదాన్ని చా%లు గా చూపిస్తున్నాము. ఇక్కడ నిజానికి "చా" దంత్య చ. అనగా ౘ గుణింతపు అక్షరం.

౨) ఒకవేళ మీరు శోధన చేసేటపుడు "స" గుణింత పదాలన్నీ ఒకేసారి చూడాలనుకుంటే వీలుపడదు. కారణం అనేక కారణాల రీత్యా మొదటి 100 ?( or 200 ) పదాలను మాత్రమే చూపిస్తుంది.

౩) అలాగే శోధన అనే చోట తెలుగులో టైపు చేసే టప్పుడు మొదటి 25 పదాలను మాత్రమే చూపిస్తుంది. అనగా మీరు టైపు చేసే అక్షర సమూహాలను బట్టి ఈ పదాలు మారుతూ కనిపిస్తుంటాయి.




For any questions, suggestions, mail to us @ telugunighantuvu[AT]googlegroups.com

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

తెలుగు నిఘంటువు మొదటిదశ -( Post updated ) - http://www.telugunighantuvu.com

తెలుగు నిఘంటువు


1) పూర్ణ బిందు స్వరముతో ఇప్పుడు శోధన చేయవచ్చు. అంటే "శైశవం" అనే పదము లేకున్నా శోధించేటప్పుడు ఇలాంటి పదాలను నిఘంటువు "శైశవము" గా గుర్తించి ఆ పదము యొక్క అర్థాన్ని వెతికి తెస్తుంది.

2) Search Functionality : matching top 25 words will be displayed in auto complete text box.

3) If a match exists, first 100 results will be shown to the user.



_________________________________________________________________________________

నాలుగు నెలల క్రితం తెలుగు బ్లాగర్లు ఒక సమూహంగా చేరి మొదలు పెట్టిన తెలుగునిఘంటువు తొలిదశను ఈ రోజు live చేసాము అని చెప్పడానికి మా సమూహంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా వుంది. ఈ ఆనందానికి కారణం మేమేదో ప్రపంచంలో అతిగొప్ప పనిని చేసామన్న భావనైతే ఏమాత్రం లేదు కానీ Active గా 5౦౦ మంది కూడా లేని తెలుగు బ్లాగర్లు ఒక చిన్న గ్రూప్ గా మారి ఈ దిన దినముండే ఒత్తిడిలను తట్టుకొని ఈ మహత్కార్య మొదటి దశను పూర్తిచేసారు అని చెప్పడానికి నిజంగా గర్వ పడుతున్నాను. ఈ నిఘంటువు రాబోయే కాలానికి, ఈ ప్రపంచానికి తెలుగు బ్లాగర్లు ఇచ్చే బహుమతిగా చిరస్థాయిగా నిలవాలని మా గుంపు ఆశ,ఆకాంక్ష. ఈ కార్య సాకార్యానికి కలిసి నడుస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఆర్ధికం గా సహాయం చేసి మాకు అర్ధిక వెసలుబాటును కల్పించిన ప్రతి సహ బ్లాగర్లూ ఇందులో భాగస్వాములే.

ఈ నిఘంటువు మొదటిదశలో వుంది. చాలా పేజీలు ఇంకా నిర్మాణ దశలోనే వున్నాయి.కానీ నిఘంటువుకు కావలసిన శోధనా సౌకర్యము మాత్రం వుంది. ఇందులో ప్రస్తుతానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు 8 వ సంపుటి లో అయినంత వరకూ పదాలను చూపిస్తున్నాము. ఇంకా ఈ ఎనిమిదవ సంపుటిలో దరిదాపు 60 పేజీలను టైపు చేయాల్సి వుంది.Data cleaning process is also going on. శోధన చేయగా వచ్చే ప్రతి పదమూ టైపు చేసిన బ్లాగరుతో అనుసంధానమై వుండి, వారి పేరు, వారి బ్లాగుపేరుని కూడా సూచిస్తుంది. స్వచ్చందంగా ముందుకు వచ్చి డిజిటలైజ్ చేసిన, చేస్తున్న వారికి గుర్తింపు నివ్వడానికి ఇంతకంటే మా వద్ద ఏమీ లేదు.

అలాగే ఈ నిఘంటువు సైటు ప్రచారానికి తోడ్పడగోరు సహ బ్లాగర్లు ప్రతి ఒక్కరూ వారి వారి బ్లాగుల్లో ఈ నిఘంటు లింకును చేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సైట్ కు ఒక మంచి logo కూడా అవసరం. ఎవరైనా చేసి పంపితే ఈ నిఘంటువుకు సహాయపడిన వారవుతారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. this is a digital dictionary by the bloggers for the rest of the digital world.


తెలుగు నిఘంటువు

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఏదో ఊసుపోక ఇలా కూనిరాగాలు తీస్తున్నా.....




అల లాగ కదిలి మదినంత దోచి
ఉలి తోన హృదినంత అందంగ చెక్కి
కన్నీటినంత పిడికిళ్ళ పిండి
నిర్జీవ బిందువుల పారాణి పూతల్తొ

నా ఎదలయలే కల్యాణ రాగాలుగా
హృదయ తంత్రులె మంగళ సూత్రాలుగా
పొదివి పట్టిన జ్ఙాపకాల చెదలె
ఆహ్వాన పెళ్ళి పత్రికలుగా

చిరు దీప కాంతుల్లొ మెరిసేటి సజల నయనాలె
నీకు పన్నీరు పట్టేటి సుగంధ పాత్రలె
మదిలోన కురిసే కన్నీటి ధారలె
పారాణి దారాలె - నా రాణి నీకు.

నేను నీ గతమైతే
నిశీధి వేళల్లో నిశ్శబ్ద తరంగాలు
నిర్వేదమై నిర్వర్ణమై నింగికెగసాయి.